'రెండు రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా పథకం'
ఢిల్లీ: రాబోవు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ఐటీ శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ పథకంతో సుమారు రెండు కోట్ల మందికి ఉపాధి కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు తనను కలిసిన సంగతి మీడియాకు తెలిపారు. 2.50 లక్షల గ్రామాలను ఆప్టికల్ పైబర్ నెట్ వర్క్ తో అనుసంధానం చేస్తామని రవిశంకర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, జమ్మూలో పాక్షికంగా దెబ్బతిన్న టెలీఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కష్టపడిందన్నారు.