
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో ఎండ దంచికొడుతోంది. అకాల వర్షాలు, పిడుగులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు.. ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడతాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపారు. శనివారం కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా రాత్రి 8 గంటల వరకు కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
As predicted, Raining heavily near Kakinada for last 1 hour. Video by Venkata Ramesh Chandra. pic.twitter.com/yHUPi4C1DI
— Andhra Pradesh Weatherman (@praneethweather) April 5, 2025
Synoptic features of weather inference of Andhra Pradesh dated 05-04-2025 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/XFkFGXu3lK
— MC Amaravati (@AmaravatiMc) April 5, 2025
ఇక, తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఉపరితల ద్రోణి కారణంగా రేపు తెలంగాణలో పటు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Enjoy the weather 🌧️🌧️
Rains⛈️ to continue across TG till April 20 & Hyderabad will get rains occasionally in this period
Temperatures☀️ remains normal/above normal. Mostly No Heatwave is expected #Telangana #Hyderabad https://t.co/Sl4s8Ev2Of— Weatherman Karthikk (@telangana_rains) April 5, 2025