
విశాఖపట్నం,సాక్షి: విశాఖలో (Visakhapatnam) దారుణం జరిగింది. మరో 24 గంటల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు. తప్పించుకునేందుకు పథకం వేశాడు. ఆపై దారుణానికి ఒడిగట్టింది తానేనని నిజం ఒప్పుకున్నాడు
పోలీసుల సమాచారం మేరకు.. పీఎం పాలెం ఉడా కాలనీలో జ్ఞానేశ్వర్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వారిది ప్రేమ వివాహం. జ్ఞానేశ్వర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తుండగా.. భార్య అనుష గర్భవతి. మంగళవారమే డెలివరీ కావాల్సి ఉంది. ఈ తరుణంలో సోమవారం ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదని జ్ఞానేశ్వర్ ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా ఉన్న అనూషను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
భర్త జ్ఞానేశ్వర్ తీరుపై పోలీసులు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తనకు, తన భార్య అనుషకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో భార్య అనుషను గొంతు నులిమి హత్య చేసినట్లు భర్త జ్ఞానేశ్వర్ పీఎం పాలెం పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
