
విశాఖపట్నం, సాక్షి: కాపురంలో కలహాలు సహజం. చిన్నచిన్నవాటికే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న రోజులివి. అయితే ఇక్కడో భార్య తన భర్త సరిగ్గా చూడడం లేదని బలవన్మరణానికి పాల్పడబోయింది. మేడ మీద నుంచి దూకుతానంటూ స్థానికులతో పాటు పోలీసులను హడలెత్తించింది. విశాఖ మధురవాడ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తన భర్త సరిగ్గా చూడడం లేదని.. రూ.500 అడిగితే ఇవ్వడం లేదంటూ వాపోయింది. మేడ మీద హల్ చల్ చేస్తూ దూకడానికి ప్రయత్నించింది. ఆ టైంలో అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ భాస్కర్ తెలివిగా ఆమెను కిందకు దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేసినట్లు తెలుస్తోంది.