సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది.
విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. 16వ తేదీ రాత్రి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తుమందు ప్రభావం నుంచి కోలుకున్నాక.. కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment