ప్రతీకాత్మక చిత్రం
Kurnool District: ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ ఏకంగా భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నంద్యాలలో గురువారం చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్‌ఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రియాంకానగర్ వీధికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, శివపార్వతికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈశ్వర్‌రెడ్డి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా అప్పుల వాళ్లకు కనిపించకుండా అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు.
చదవండి: సులభంగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్ చూసి ఏం చేశారంటే..
ఈ క్రమంలో శివపార్వతి, అదే ప్రాంతానికి చెందిన నాగరాజు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. బుధవారం రాత్రి ఈశ్వర్‌రెడ్డి ఇంటికి చేరుకున్న సమయంలో వారిద్దరూ చనువుగా కనిపించడంతో ఘర్షణ పడ్డారు. ఈశ్వరరెడ్డి అంతమొందించాలని నాగరాజు అతని ముగ్గురు స్నేహితులను పిలిపించి శివపార్వతితో కలసి కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు రావటంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈశ్వరరెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాధితుడు గురువారం అతని భార్య శివపార్వతి, నాగరాజు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment