విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ | Software Company Flips Board In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

Published Wed, Apr 9 2025 5:01 PM | Last Updated on Wed, Apr 9 2025 6:20 PM

Software Company Flips Board In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఎల్‌టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో సుమారు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలలు నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ముప్పు తిప్పలు పెడుతోంది. జీతాలు అడిగితే దుర్భాషలాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు పాటించకుండా పీఎఫ్‌లు కూడా చెల్లించని సాప్ట్ వేర్ కంపెనీ.. ఫేక్ ఇన్వాయిస్‌లు ఆఫర్ లెటర్స్‌తో మోసానికి పాల్పడింది. యాజమాన్యం ఆఫీస్ వదిలి వెళ్లిపోతున్నారని తెలుసుకున్న ఉద్యోగులు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement