
కాకినాడ: క్రికెట్ బెట్టింగ్‌లో సొమ్ము కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోలనాటి రమణబాబు (33) ఆత్మహత్య చేసుకున్నాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి రమణబాబు వర్క్ ఫ్రం హోంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలవారీ వస్తున్న జీతం ఇంటికి ఇవ్వకుండా బెట్టింగ్‌కి అలవాటు పడి సొమ్ము పోగొట్టుకున్నాడు. అప్పుల బాధతో నర్సీపట్నం– రేగు పాలెం మధ్యలో రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.