ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రామచంద్రపురం రూరల్(తూర్పుగోదావరి): తన భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారని ద్రాక్షారామ ఎస్సై ఆదివారం తెలిపారు. వివరాలివి... ఉట్రుమిల్లిలో రాజీవ్ గృహకల్ప అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కర్రి వీరవేణికి, మండపేట మండలం అర్తమూరు శివారు చింతలతోటకు చెందిన కర్రి సత్యనారాయణరెడ్డితో 2017లో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల బాబు, 10 నెలల పాప ఉన్నారు. రెండో సంతానంగా బాబు కాకుండా పాప పుట్టడంతో తనను నిత్యం వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
అసభ్య ప్రవర్తనపై మహిళ ఫిర్యాదు
రామచంద్రపురం రూరల్: తాను ఇంట్లో ఉండగా మోర్త చిరంజీవి అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వేగాయమ్మపేటకు చెందిన బొమ్ము లక్ష్మి ఫిర్యాదు చేశారని ద్రాక్షారామ ఎస్సై ఆదివారం తెలిపారు. వివరాలివి... స్వల్పంగా గాయపడ్డ ఆమెను బంధువులు రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.బాధితురాలి ఫిర్యాదుతో పాటు ఆస్పత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment