French Man Drugs His Wife Every Night Records 51 Men Molesting Her - Sakshi
Sakshi News home page

ప్రతి రోజు భార్యకు డ్రగ్స్‌.. అత్యాచారం చేస్తుండగా 51 వీడియోల రికార్డింగ్‌

Published Thu, Jun 22 2023 6:30 PM | Last Updated on Thu, Jun 22 2023 6:54 PM

French Man Drugs His Wife Every Night Records 51 Men Molesting Her - Sakshi

మనువాడిన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడో భర్త.  జీవితాంతం ఆమెను కంటికి రెప్పగా కాపాడుకోవాల్సిన భర్త.. అత్యంత నీచానికి దిగజారాడు. భార్యకు తెలియకుండా ప్రతిరోజు ఆమెకు డ్రగ్స్‌ ఇస్తూ ఇతరులతో అత్యాచారం చేయించాడు. ఈ షాకింగ్‌ ఘటన ఫ్రాన్స్‌ దేశంలో వెలుగు చూసింది.

వివరాలు.. ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని ప్రోవెన్స్‌ ప్రాంతంలో డొమినిక్ పీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి 50 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఈ క్రమంలో భర్త ప్రతి రోజు రాత్రి భార్యకు యాంటీ యాంగ్జయిటీ డ్రగ్స్‌ ఇచ్చేవాడు. ఆమెకు తెలియకుండా  భోజనంలో కలిపి ఇచ్చేవాడు. భార్య నిద్రలోకి జారుకోవడంతో తనకు తెలిసిన కొంతమంది వ్యక్తులను ఇంటికి పిలిపించి భార్యపై అత్యాచారం చేయించేవాడు. అంతేగాక వారు లైంగిక చర్యలో పాల్గొన్న సమయంలో వీడియోలు రికార్డు చేసి.. వాటిని ఓ యూఎస్‌బీ డ్రైవ్‌లో భద్రపరిచేవాడు. 

ఇలా  2011 నుంచి 2020 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ వ్యవహారం నడిపాడు. మూడేళ్ల కిత్రం 2020లో డొమినిక్‌ పీ దుస్తులు మార్చుకునే గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి మహిళ వీడియోలు చిత్రీకరించినట్లు అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అత్యాచార వీడియోల బండారం  బయటపడింది. అతడు రికార్డు చేసిన వీడియో డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్యపై  92 సార్లు ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 
చదవండి: Imran Khan: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్‌

ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి  అత్యాచారానికి పాల్పడిన 51 మందిని అరెస్ట్‌ చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు.  పట్టుబడిన వారిలో 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు. వీరిలో అగ్నిమాపక సిబ్బంది, లారీ డ్రైవర్లు, స్థానిక కౌన్సిల్ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, జైలు గార్డులు, నర్సులు, పాత్రికేయులు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది మళ్లీ మళ్లీ డొమినిక్‌ ఇంటికి వెళ్లి  అఘాయిత్యాలకు పాల్పడేవారని తేలింది.  

ఆన్‌లైన్‌లో ఓ గ్రూప్‌ ద్వారా డొమినిక్‌ వీరితో మాట్లాడికి ఇంటికి రప్పించేవాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే వాసనలకు తన భార్యకు మెలుకువ రాకుండా ఉండేందుకు ఇంటికి వచ్చేవారిని పొగాడు, పర్‌ఫ్యూమ్‌ వాడొద్దని ముందే చెప్పేవాడని తెలిపారు. అలాగే ఇంటికి దూరంగా ఉన్న స్కూల్‌ వద్ద వాహనం నిలిపి పొరుగువారికి అనుమానం రాకుండా రాత్రి సమయంలో వారిని ఇంటికి రప్పించేవాడని వెల్లడించారు. అకస్మాత్తుగా మనిషి టెంపరేచర్‌ మారకుండా ఉండటానికి ఇంటికి వచ్చిన వారిని వేడి నీటిలో చేతులు కడుక్కోవాలని చెప్పేవాడని పేర్కొన్నారు.

చివరికి వీడియో రికార్డుల గురించి మహిళకు చెప్పడంతో ఆమెపై జరిగిన అఘాయిత్యాల విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా విలపించి ఆందోళనలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె శారీరక సమస్యలను ఎదుర్కొంటోంది. అలాగే విడాకులకు దరఖాస్తు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement