తెలంగాణ ఐటీ శాఖ మంత్రి 'దుద్దిళ్ల శ్రీధర్ బాబు' మాదాపూర్‌లోని టీ-హబ్‌లో '8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ 2024' ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న జరగనుంది. దీనికి డిజైన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు హాజరుకానున్నారు.
8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ 2024 ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజైన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో తెలంగాణ నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాన్‌క్లేవ్ పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందిస్తూ సృజనాత్మకతను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని బలోపేతం చేస్తుందని అన్నారు.
నవంబర్ 9న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమానికి డిజైన్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సలహాదారులతో సహా మొత్తం 250 మంది హాజరయ్యారు.
8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్ 2024 ప్రతినిధి 'రాజ్ సావంకర్' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను హోస్ట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. హాజరైనవారు విభిన్న రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను కలిపే ఏకైక వేదిక, అంతే కాకుండా.. ఇది భవిష్యత్ పురోగతికి కూడా వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment