హైదరాబాద్ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. అందుకోసం బుధవారం ఉదయం 9.00 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో చేపట్టిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌పై మంత్రి కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
అలాగే ఈ నెల 8వ తేదీన కేటీఆర్ ముంబై వెళ్లనున్నారు. టాటాగ్రూప్ సంస్థల సీఈవో సైరస్‌మిస్త్రీతో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు, పెట్టుబడులపై మిస్త్రీతో కేటీఆర్ చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత 9వ తేదీన సూరజ్‌ఖండ్‌లో జరుగుతున్న హస్తకళల ప్రదర్శనలో కేటీఆర్ పాల్గొనున్నారు.
నేడు ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్
Published Wed, Feb 3 2016 7:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM
Advertisement
Advertisement