కేటీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని హఫీజ్ పేట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘1900 కోట్ల రూపాయలతో గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్ల్‌లో ఇంటింటికి మంచినీరు అందిస్తాం. ఎండాకాలంలో కరెంటు, నీటి సమస్య లేకుండా చేస్తాం. హైదరాబాద్ కోటి జనాభాతో 9 వేల కిలో మీటర్ల మహా నగరం. రోడ్ల పునరుద్దరణ వేగంగా జరుగుతున్నాయి. నగర నీటి అవసరాల కోసం శివారులో 56 రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం.
నగరంలో 3100 కోట్లతో త్వరలో అండర గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి కార్పోరేషన్ ద్వారా రోడ్లను బాగు చేస్తున్నాం. ఒఆర్‌ఆర్ చుట్టూ మంచినీరు అందించేందుకు రింగ్ మాన్‌ను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ మంచి నీరు అవసరాల కోసం కేశవాపురం రిజర్వాయర్‌ను సిద్ధం చేస్తున్నాం. కేసీఆర్ ను ఎవ్వరూ ఏమి చేయలేరు. పార్కులను అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 చెరువుల్లో 550 కోట్లతో 40 చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. అపార్ట్‌మెంట్స్ వాళ్లు సీవరెజ్ ట్రేట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. నాలాల్లో అందరూ చెత్త వేస్తున్నారు. నగర వాసులు పరిశుభ్రతపై భాద్యతతో మెలగాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment