న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ప్రతిపక్ష ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టుతెలిపారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిస్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రియంక చతుర్వేది, శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీలు పని గట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుంటారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, ఓవైసీ, ఆప్‌కి చెందిన రాఘవ్ చద్దాతో సహా పలువురు విపక్ష ఎంపీ తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment