iphones
-
Hyderabad: ఘరానా సైబర్ నేరగాడి ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: యజమాని అతడు కాదు... విక్రయించేది–ఖరీదు చేసేదీ కూడా అతగాడు కానేకాదు... అయినప్పటికీ ఈ–కామర్స్ సైట్లో ఫోన్లకు సంబంధించిన పోస్టులు చేసిన వారిని సంప్రదించి డిలీట్ చేయిస్తాడు... ఆపై అవే వివరాలను తాను పోస్టు చేస్తాడు...క్రయవిక్రయాలు చేసే వారిని ఓ ‘ప్లాట్‌ఫామ్’ పైకి తీసుకువస్తాడు..ఆ ఇద్దరినీ కలిపి తాను ‘లాభపడతాడు’. కేవలం ఐఫోన్లనే టార్గెట్‌గా చేసుకుని, ఈ వినూత్న పంథాలో తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని మోసం చేసి రూ.60 లక్షలు స్వాహా చేసిన ఘరానా మోసగాడు మరిశర్ల బాలాజీ నాయుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ఎస్.మోహన్‌కుమార్ ప్రకటించారు. ఇన్స్పెక్టర్ బి.శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్‌లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్... ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన బాలాజీ నాయుడు అక్కడి ఎస్వీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చిన ఇతగాడు తొలినాళ్లల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేశాడు. జల్సాలు, బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్‌కు జీతం డబ్బులు చాలకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరబాట పట్టాడు. ఇందులో భాగంగా వివిధ పేర్లతో సిమ్‌కార్డులు తీసుకునే ఇతగాడు తరచు తన ఫోన్లు మారుస్తూ ఉంటాడు. 2018 నుంచి మోసాలు చేయడం మొదలెట్టిన బాలాజీ ఇప్పటి వరకు 30 ఫోన్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి ఉపకరించే ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్ ఆధారంగా మోసాలు ప్రారంభించాడు. ఆ సైట్/యాప్‌ను ఆద్యంతం గమనించే బాలాజీ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లు పెట్టిన పోస్టుల్ని గుర్తిస్తాడు. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని అందులోని ఫొటోతో పాటు ఇతర వివరాలు కాపీ చేసుకుని భద్రపరుచుకుంటాడు. వారితో తీయించి తాను పోస్టు చేసి... ఆపై ఆ పోస్టు చేసిన వ్యక్తిని సంప్రదించే బాలాజీ ఏమాత్రం బేరసారాలు లేకుండా ఆ ఫోన్ తాను ఖరీదు చేస్తున్నట్లు, త్వరలోనే సంప్రదించి కలుస్తానని చెప్తాడు. అలా వారి నమ్మకాన్ని పొంది ఓఎల్ఎక్స్ నుంచి పోస్టు తీసేలా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్ద ఉన్న ఫొటో, వివరాలతో తానే ఆ ఫోన్ విక్రయిస్తున్నట్లు అదే ఓఎల్ఎక్స్లో పోస్టు చేసే బాలాజీ..తక్కువ రేటు పొందుపరుస్తాడు. ఈ పోస్టును చూసిన వాళ్లల్లో ఆకర్షితులైన వాళ్లు ఫోన్ ద్వారా బాలాజీని సంప్రదిస్తారు. వారితో బేరసారాలు పూర్తి చేసే అతగాడు..ఫలానా చోట తనను కలిసి, నగదు చెల్లించి, ఫోన్ తీసుకువెళ్లాలని సూచిస్తాడు. అదే సమయంలో ఫోన్ అసలు యజమానికి సంప్రదించే బాలాజీ అతడినీ ఆ ప్రాంతానికి రమ్మని, నగదు చెల్లించి ఫోన్ తీసుకుంటానని చెప్తాడు. అలా ఫోన్ యజమాని, తన ప్రకటన చూసి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన వ్యక్తి కలుసుకోవడానికి కొద్దిసేపటి ముందు వారిని మరోసారి సంప్రదిస్తాడు. తాను రాలేకపోతున్నానని, తన సోదరుడు వస్తున్నాడని చెప్పి, ఫోన్ రేటు విషయం చెప్తే అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నావు? అని మందలిస్తారంటూ వారికి చెప్తాడు. ఈ కారణంగానే రేటు విషయం చర్చించ వద్దంటూ ఇద్దరికీ చెప్తాడు. ఇలా ఆ ఇద్దరూ కలిసిన తర్వాత ఖరీదు చేసే వ్యక్తిని బుట్టలో వేసుకుని యజమాని వద్ద ఫోన్ చూసిన వెంటనే నగదు తనకు బదిలీ చేసేలా చేస్తాడు. ఆపై తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుంటాడు. క్రయవిక్రేతలు మాత్రం కొద్దిసేపు ఘర్షణ పడి, అసలు విషయం తెలుసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇలా ఇతగాడు తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని ముంచి రూ.60 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును డప్ఫాబెట్, సారా, రమ్మీటైమ్, రమ్మీ సర్కిల్ వంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టడం, జల్సాలు చేయడం చేసి ఖర్చు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో బాధితులకు నేరుగా ఆయా యాప్స్‌కు సంబంధించిన క్యూర్కోడ్స్ పంపి, నేరుగా డబ్బు వాటికే పంపేలా చేశాడు. ఇతగాడిని కటకటాల్లోకి పంపిన పంజగుట్ట పోలీసులు రెండు ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు స్వాదీనం చేసుకున్నారు. బాలాజీపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 138 ఫిర్యాదులు, తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల పంజగుట్టలో 3, మధురానగర్‌లో మరో 3 కేసులు నమోదు కాగా..మరో 25 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
జోరుగా ఐఫోన్ల ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్‌లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ జోరు చూస్తే భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయ్యే ఐఫోన్ల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2023–24లో కంపెనీ సుమారు రూ.84,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశంలో సాంకేతిక పురోగతి.. వెరశి కంపెనీ భారత్‌లో తన తయారీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బీజింగ్–వాíÙంగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనాలో తయారీకి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి యాపిల్ యొక్క వ్యూహంలో భారత్ కీలక కేంద్రంగా మారింది. కీలకంగా యాపిల్.. ప్రధాన మార్కెట్ అయిన యూఎస్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్‌లో రూ.24,192 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ సరఫరా అయ్యాయి. యూఎస్‌కు ఎగుమతుల పరంగా టాప్–1 సెగ్మెంట్‌గా మొబైల్స్ నిలవడంతోపాటు భారత స్మార్ట్‌ఫోన్ ఎగుమతి రంగానికి ఐఫోన్లు వెన్నెముకగా మారాయి. అయిదేళ్ల క్రితం ఇక్కడి నుంచి యూఎస్‌కు ఎగుమతి అయిన స్మార్ట్‌ఫోన్స్ విలువ రూ.43.6 కోట్లు మాత్రమే. తాజా ఎగుమతి గణాంకాలు యాపిల్ తయారీ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది.యాపిల్ కీలక సరఫరాదారులైన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, భారత్‌కు చెందిన టాటా ఎల్రక్టానిక్స్ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. చెన్నైకి సమీపంలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. ఇది భారత ఐఫోన్ ఎగుమతుల్లో సగం సమకూరుస్తోంది. టాటా ఎల్రక్టానిక్స్ గతేడాది విస్ట్రన్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఏప్రిల్–సెపె్టంబర్ కాలంలో కర్ణాటక ఫ్యాక్టరీ నుండి సుమారు రూ.14,280 కోట్ల విలువైన ఐఫోన్లను టాటా ఎల్రక్టానిక్స్ ఎగుమతి చేసింది.కొనసాగుతున్న పెట్టుబడులు..యాపిల్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం లోపు మాత్రమే వాటా కలిగి ఉంది. షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్లదే ఇక్కడ హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆపిల్ దేశీయంగా గణనీయంగా పెట్టుబడులు చేస్తోంది. బెంగుళూరు, పుణేలో కొత్త స్టోర్లతో సహా రిటైల్ ఉనికిని విస్తరించే ప్రణాళికలతో భారత్‌లో యాపిల్ వృద్ధి పథం ఆశాజనకంగా కనిపిస్తోంది. భారత్‌లో యాపిల్ అమ్మకాలు 2030 నాటికి రూ.2,77,200 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, సులభతర వాయిదా చెల్లింపుల స్కీములు ఇందుకు కారణంగా తెలుస్తోంది.కఠిన కోవిడ్–19 లాక్డౌన్లు, ఆరి్ధక సంక్షోభం కారణంగా మాంద్యంతో చైనాలో యాపిల్ కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా తయారీ సామర్థ్యం పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యాపిల్ ప్రధాన మార్కెట్‌గా చైనాను అధిగమించే అవకాశం భారత్‌కు లేదు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్‌లో రూ.1,17,600 కోట్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఉత్పత్తి సామర్థ్యాలను రెట్టింపు చేసింది. -
ఐఫోన్ యూజర్లూ.. జాగ్రత్త!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ రానేవచ్చింది. ఇది ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ( CERT-In ) పలు యాపిల్ ఉత్పత్తులలో సెక్యూరిటీ లోపాల గురించి హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ఓఎస్, మ్యాక్స్ఓఎస్, విజన్ఓఎస్ సహా అనేక రకాల యాపిల్ సాఫ్ట్వేర్ వెర్షన్లు ప్రభావిత జాబితాలో ఉన్నాయి.యాపిల్ ఉత్పత్తలలో ఈ సెక్యూరిటీ లోపాలను ‘హైరిస్క్’గా సెర్ట్ఇన్ వర్గీకరించింది. వీటిని అలక్ష్యం చేస్తే సున్నితమైన సమాచారానికి అటాకర్లకు అనధికార యాక్సెస్ ఇచ్చినట్టువుతుంది. వారు మీ పరికరంలో ఆర్బిటరీ కోడ్‌ని అమలు చేసే అవకాశం ఉంటుంది. క్లిష్టమైన భద్రతా పరిమితులు పక్కకు వెళ్తాయి. సేవ తిరస్కరణ (DoS) షరతులకు ఆస్కారం కలుగుతుంది. అటాకర్లు సిస్టమ్‌పై నియంత్రణ సాధించేందుకు వీలు కలుగుతుంది. స్పూఫింగ్, క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS) దాడులు జరిపే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలను నివారించడానికి యాపిల్ పరికరాలను సాఫ్ట్వేర్ తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలని యూజర్లకు సెర్ట్ ఇన్ సూచించింది.ప్రభావిత యాపిల్ డివైజెస్ ఇవే..iOS: Versions prior to 18 and 17.7iPadOS: Versions prior to 18 and 17.7macOS Sonoma: Versions prior to 14.7macOS Ventura: Versions prior to 13.7macOS Sequoia: Versions prior to 15tvOS: Versions prior to 18watchOS: Versions prior to 11Safari: Versions prior to 18Xcode: Versions prior to 16visionOS: Versions prior to 2 -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్‌పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్‌బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
హైదరాబాద్ అబిడ్స్‌లో ఐఫోన్స్ పేరుతో భారీ మోసం
-
విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్టులు...
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ యాపిల్ సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు త్వరలో భారత్‌కు రానున్నారు. గత నెలలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతల ఐఫోన్లలో వార్నింగ్ నోటిఫికేషన్లు ప్రత్యక్షమ వడంతో తీవ్ర దుమారం రేగిన తెలిసిందే. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందంటూ వారు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ–ఐఎన్(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) యాపిల్ సంస్థకు నోటీసులిచ్చింది. భారత్‌లోని యాపిల్ సంస్థ ప్రతినిధులు సీఈఆర్టీ–ఐఎన్ నిపుణులను కలుసుకున్నారు. అయితే, ఈ సమస్య వారి సా మర్థ్యానికి మించినదని తేలింది. దీంతో త్వర లోనే అమెరికా నుంచి యాపిల్ సైబర్ సెక్యూ రిటీ ప్రతినిధుల బృందం ఇక్కడికి రానుందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. -
యాపిల్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: విపక్ష ఎంపీల ఐఫోన్లకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్‌ల ఉదంతంలో కేంద్ర సైబర్‌సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం(సీఈఆర్టీ–ఇన్) సంస్థ తన దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ గురువారం చెప్పారు. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఐఫోన్ల దాడికి యత్నించినట్లు ఏమైనా ఆధారాలుంటే సమరి్పంచాలని ఐఫోన్ తయారీసంస్థ యాపిల్‌ను కోరుతూ కేంద్రం నోటీసులు పంపింది. సీఈఆర్టీ–ఇన్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు యాపిల్ సంస్థ సహకరించనుందని కృష్ణన్ చెప్పారు. సీఈఆర్టీ అనేది జాతీయ నోడల్ ఏజెన్సీ. కంప్యూటర్ భద్రతను సవాల్ చేసే ఘటనలు సంభవించినపుడు వెంటనే సీఈఆర్టీ స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. -
మరో నిఘా నేత్రం?
నిత్యం ఏవో కళ్ళు మనల్ని గమనిస్తున్నాయంటే ఎలా ఉంటుంది? చేతిలోని మన చరవాణి సైతం చటుక్కున ప్రత్యర్థిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఫోన్లలోని కీలక సమాచారాన్ని చేజిక్కించుకొనేందుకు ‘పాలకవర్గ ప్రాయోజిత ఎటాకర్లు’ ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ అక్టోబర్ 31న పంపిన అప్రమత్తపు ఈ–మెయిల్స్‌తో అదే జరిగింది. ఐ–ఫోన్లు వాడుతున్న పలువురు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులే కాదు... ప్రపంచమంతా ఉలిక్కిపడింది. వ్యక్తిగత డేటా, గోప్యతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆపిల్ ఐ–ఫోన్ వినియోగదారులు పలువురికి ఇలా పారాహుషార్ సందేశాలు అందడం తేలికైన విషయమేమీ కాదు. సహజంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడుతోందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ అప్రమత్తత నోటిఫికేషన్లు పంపిన టెక్ దిగ్గజం ఆపిల్‌కు నోటీసులిచ్చి, సహకరించాల్సిందిగా కోరారు. ఫోన్లు – కంప్యూటర్ల హ్యాకింగ్, పాలకపక్షాల గూఢచర్యం ఆధునిక సాంకేతిక యుగం తెచ్చిన అతి పెద్ద తలనొప్పి. ఇది అనేక దేశాల్లో గుట్టుగా సాగుతూనే ఉంది. పులు కడిగిన ముత్యాలమని చెప్పుకొనే పాలకవర్గాలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా యన్నది కీలకం. డేటా లీకేజీలు, గూఢచర్య సాఫ్ట్వేర్ వినియోగాలు మనకూ కొత్త కావు. దేశంలో ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వినియోగం సహా పలు ఆరోపణలపై గతంలో విచారణలు జరిగాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగబోవని హామీలూ వచ్చాయి. అన్నీ నీటిమూటలే. పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదని ప్రభుత్వం తోసిపుచ్చినా, కొత్త గూఢచర్య సాఫ్ట్వేర్ల కొనుగోలుకు భారత్ ఉత్సుకత చూపుతుందని విదేశీ పత్రికల్లో విశ్వసనీయ కథనాలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ కొన్ని ఫోన్లను పరిశీలించి, పెగసస్ వినియోగంపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెబుతూనే, ఈ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కుండబద్దలు కొట్టింది. అందుకే, తాజా విచారణపైనా అపనమ్మకం వ్యక్తమైతే తప్పుపట్టలేం. తాజా అప్రమత్త సందేశాలు పంపడానికి కారణాలను ఆపిల్ వివరించిన తీరూ అస్పష్టంగా ఉంది. అది సమగ్రంగా కారణాలను వివరించాల్సింది. అసలు ‘పాలకవర్గ ప్రాయోజిత’ ఎటాకర్లు అనే పదానికి ఆ సంస్థ చెబుతున్న వ్యాఖ్యానం, జనానికి అర్థమవుతున్న టీకా తాత్పర్యం వేర్వేరు. పుష్కలంగా నిధులు, వ్యవస్థీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నవన్నీ ఆ వర్గం కిందకు వస్తాయన్నది ఆపిల్ మాట. ప్రభుత్వ జోక్యం లేనిదే అది అసాధ్యమనేది అందరికీ తెలుసు. అందుకే, తాజా రగడపై అటు భారత అటు ప్రభుత్వం, ఇటు ఆపిల్ క్రియాశీలంగా వ్యవహరించాలి. వినియోగదారుల్ని అప్రమత్తం చేయడమే నేరమన్నట్టు ప్రభుత్వం, ఆపిల్ చెవులు మెలేస్తే దేశంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణమే మిగులుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఆపిల్ ఐ–ఫోన్లు వాడుతుంటే, వారిలో 7 శాతం మన దేశంలోనే ఉన్నారు. తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితమనీ, హ్యాకింగ్ అవకాశం అత్యల్పమనీ, ఆ యా దేశాల ప్రభుత్వాల పక్షాన తాము గూఢచర్యానికి ఎన్నడూ పాల్పడబోమనీ ఆపిల్ కూడా నమ్మకం కలిగించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం తక్షణం సమావేశమై, ఆపిల్ సందేశాలపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఫోన్ల హ్యాకింగ్ వాదనను ‘యాక్సెస్ నౌ’ సంస్థ సమర్థిస్తోందనీ, కోటీశ్వరుడైన అమెరికన్ ఫైనాన్షియర్ జార్జ్ సోరోస్‌కు ఆ సంస్థలో పెట్టుబడులున్నాయి గనక ఆయనకు ఈ హ్యాకింగ్ వివాదంతో సంబంధం ఉందనీ అధికార బీజేపీ ఐటీ విభాగాధిపతి ఆరోపించారు. పాలక వర్గాలపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిరాధారమని నిరూపించి, నిజాయతీని నిరూపించు కోవాలి. అది వదిలేసి బోడిగుండుకూ, మోకాలుకూ ముడిపెడితే ప్రయోజనం శూన్యం. అదే సమ యంలో ఇచ్చిన సమాచారంపై దృష్టిపెట్టకుండా, తెచ్చిన వార్తాహరుడిపై కత్తులు నూరితే కష్టం. ఆపిల్ అప్రమత్తతకు సరిగ్గా ఒక రోజు ముందరే మన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ నుంచి దాదాపు 80 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు లీకయ్యాయి. దీనిపైనా లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఆధార్ వివరాలు నమోదు చేసే ‘యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్వర్ కట్టుదిట్టమైనదే. కానీ, ఇతర మార్గాల్లో వివరాలు బయటకు పొక్కుతున్నాక ఇక గోప్యతకు అర్థమేముంది! వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణపై ఇటీవలే చట్టం చేసిన ప్రభుత్వం సమాచార సేకరణ, నిల్వ, వినియోగంపై కట్టుదిట్టమైన నియమావళి సత్వరం తీసుకురావాలి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టి, పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతను తుంగలో తొక్కాలనుకుంటే అది ఘోరం. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం పెంచి, ఇలాంటి ఉల్లంఘనల్ని ప్రతిఘటించేలా సంసిద్ధం చేయాలి. పాలకపక్షాలు ఈ ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చాలి. పదేపదే ఆరోపణలు వస్తున్నందున వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిష్కార మార్గాల అన్వేషణే కాదు... ఆచరణలోనూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలి. గోప్యత ఉల్లంఘన జరిగినట్టు తేలితే, కఠిన చర్యలు చేపట్టాలి. అలాకాక, రెండేళ్ళ క్రితం నాటి ‘పెగసస్’ లానే దీన్ని కూడా చాప కిందకు నెట్టేయాలని పాలకులు ప్రయత్నిస్తేనే చిక్కు. రాజకీయ రచ్చగా మారుతున్న తాజా వ్యవహారంలో అసలు సంగతి వదిలేసి, కొసరు విషయాలు మాట్లాడుకుంటే ఎన్నటికీ ఉపయోగం లేదు. -
పార్లమెంటరీ ‘చర్చ’ జరగాల్సిందే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఐఫోన్లపైకి ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దాడికి తెగబడ్డారన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రతరం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్‌లు లేఖ రాశారు. స్టాండింగ్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి హెచ్చరిక అలర్ట్‌లు అందుకున్న ఎంపీలతోపాటు ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ ప్రతినిధులనూ చర్చకు పిలవాలని లేఖలో డిమాండ్‌చేశారు. స్థాయి సంఘంలో చర్చకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ‘ యాపిల్ సబ్స్రైబర్లకు సంబంధించిన ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. హ్యాకింగ్ దాడిని ఎదుర్కొన్నాయంటున్న ఐఫోన్లను చెక్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది. ఈ అంశాన్ని స్థాయీ సంఘంలో చర్చించాల్సిన అవసరమే లేదు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రాన్ని వేలెత్తిచూపుతున్నారు: చిదంబరం గతంలో పెగసస్ సాఫ్ట్వేర్ సాయంతో దేశంలో పలు రంగాల వ్యక్తులపై కేంద్రప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణల నడుమ ఐఫోన్ల హ్యాకింగ్ వెలుగుచూడటంతో అందరూ సహజంగానే కేంద్రప్రభుత్వం వైపే వేలెత్తిచూపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘2019లో పలువురు సామాజిక కార్యకర్తలు, విపక్ష సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, జడ్జీల ఫోన్లపై పెగసస్ సాఫ్ట్‌వేర్‌తో కేంద్రం నిఘా పెట్టిందని దేశమంతటా కలకలం రేగడం తెల్సిందే. ఇప్పుడు వందలాది విపక్ష నేతలకు యాపిల్ ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్‌లు వచ్చాయనేది వాస్తవం. కేవలం విపక్ష నేతలకు మాత్రమే ఎందుకొచ్చాయి? హ్యాకింగ్ వల్ల భారీ ప్రయోజనం ఒనగూరేది ఎవరికి ?. ఈ ప్రశ్నలు తలెత్తినపుడు అందరూ అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలవైపే వేలు చూపిస్తారు. ఎందుకంటే అనుమానించదగ్గ సంస్థలు అవి మాత్రమే’ అని చిదంబరం ఆరోపించారు. రక్షణ కలి్పంచండి: లోక్‌సభ స్పీకర్‌కు మొయిత్రా లేఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల దాడుల నుంచి విపక్ష ఎంపీలను రక్షించాలని లోక్‌సభ స్పీకర్ బిర్లాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కోరారు. ఈ మేరకు బిర్లాకు ఆమె లేఖ రాశారు. నిఘాకు రూ.1,000 కోట్లు! ‘అంతర్జాతీయ సంస్థలైన యాక్సెస్ నౌ, సిటిజెన్ ల్యాబ్ వంటి సంస్థలు సెపె్టంబర్‌లోనే ఇలాంటి యాపిల్ సంస్థ జారీచేసే హెచ్చరిక నోటిఫికేషన్ల విశ్వసనీయతను నిర్ధారించాయి. ఇంటెలెక్సా అలయెన్స్ వంటి సంస్థలతో కలిసి నిఘా కాంట్రాక్ట్‌లను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులను పెంచుకుంటోందని ఇటీవలే ‘ది ప్రెడేటర్ ఫైల్స్’ పేరిట ఫైనాన్షియల్ టైమ్స్ ఒక పరిశోధనాత్మక సమగ్ర కథనాన్ని వెలువరిచింది. ఈ నిఘా ఒప్పందాల విలువ దాదాపు 1,000 కోట్లు ఉంటుందని అంచనావేసింది’ అని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత ఏదైనా నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొన్నదీ లేనిదీ కేంద్రం బయటపెట్టాల్సిందేనని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్‌చేశారు. కాగా, అలర్ట్ ఘటనపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్‌వేర్‌తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్‌లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్‌సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్‌కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్‌ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్‌దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్‌గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్‌ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్‌ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్‌గా తీసుకోండి’ -
ఐఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రం క్లారిటీ, ఎంపీలపై మండిపడిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ప్రతిపక్ష ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టుతెలిపారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిస్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రియంక చతుర్వేది, శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీలు పని గట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుంటారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, ఓవైసీ, ఆప్‌కి చెందిన రాఘవ్ చద్దాతో సహా పలువురు విపక్ష ఎంపీ తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. -
యాప్ట్రానిక్స్ స్టోర్స్‌లో ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు
Offers on iPhone 15 series యాపిల్ ఉత్పత్తుల విక్రయ సంస్థ యాప్ట్రానిక్స్ తాజాగా ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లు, వాచ్‌లను దేశవ్యాప్తంగా 56 స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. గుంటూరు, సిద్ధిపేట, విజయనగరం, భీమవరం తదితర నగరాల్లోని స్టోర్స్ కూడా వీటిలో ఉన్నాయి. గుంటూరు, సిద్ధిపేట స్టోర్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేసేవారు రూ. 11,000 విలువ చేసే యాక్సెసరీలు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటును ఎంచుకోవచ్చని తెలిపింది. అదనంగా యాపిల్కేర్ప్లస్, ప్రొటెక్ట్ప్లస్పై రూ. 2,000 మినహాయింపును, ఫోన్‌ను ఎక్సే్చంజ్ చేస్తే రూ. 6,000 వరకు బోనస్ వంటివి పొందవచ్చు. మొత్తం మీద గుంటూరు, సిద్ధిపేట కస్టమర్లు 31 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్
యాపిల్ ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన పాక్స్కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్‌కాన్ ప్రతినిది లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్‌డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్‌కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది గొప్ప బహుమతి అందించేలా మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు, రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు. చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా ఐఫోన్ విక్రయాలకు పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్‌లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!) ఫాక్స్‌కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్ల కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్‌పై భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. -
లేటెస్ట్ ఐఫోన్స్: ఈ ఆఫర్లు తెలుసా మీకు?
iPhone 15 series , Watch Series 9 ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్స్ 15 సిరీస్‌లు లాంచ్ అయ్యాయి. అయితే లాంచ్ అయిన వెంటనే లేటెస్ట్ ఐఫోన్ 15, యాపిల్ వాచ్ 9 సిరీస్ ఉత్పత్తులు భారత మార్కెట్లో అవకాశం ఈ ఏడాది ఐఫోన్ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. లేటెస్ట్ ఐఫోన్లు, యాపిల్ వాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌లో విక్రయించనున్నట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ రెడింగ్టన్ లిమిటెడ్ తెలిపింది. 7,000 పై చిలుకు రిటైల్ స్టోర్స్‌లో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే, 2,800 స్టోర్స్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 3 కూడా లభిస్తాయని వివరించింది. స్మార్ట్‌ఫోన్స్, వాచ్‌ల లభ్యత, ధరల గురించి ఇండియా ఐస్టోర్డాట్కామ్ను సందర్శించవచ్చని కస్టమర్లకు సూచించింది. రూ. 5,000, రూ. 4,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే జీరో డౌన్ పేమెంట్, ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 3,329 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపికలతో సహా వివిధ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లపై రెడింగ్టన్ రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ముందస్తు ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం. అలాగే ఇంగ్రామ్ మైక్రో ఇండియా కూడా 7,000 కంటే ఎక్కువ రిటైల్ ప్రదేశాలలో తాజా ఆపిల్ ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ , ఆరు నెలల నో-కాస్ట్ EMI ఎంపికతో సహా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు లభ్యం. అదనంగా, రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. -
ఆ 4 ఐఫోన్లకు టాటా చెప్పేసిన యాపిల్..
Apple discontinues 4 iPhones: ఐఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ (Apple) ప్రకటించింది. తాజాగా జరిగిన వండర్లస్ట్ ఈవెంట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series)ను లాంచ్ చేసింది. మరోవైపు పలు ఐఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లో అధికారికంగా నిలిపేసింది. నిలిపేసిన ఐఫోన్లు ఇవే.. యాపిల్ నిలిపేసిన ఐఫోన్ మోడల్‌లలో ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 13 మినీ, (iPhone 13 mini), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఉన్నాయి. గత ఏడాది రూ. 1,39,900 ధరతో విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్‌ను అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. అలాగే గతేడాదిలోనే రూ. 1,29,900 ధరతో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో మోడల్‌ను కూడా భారత మార్కెట్లో నిలిపివేసింది. (జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!) ఇక 2021లో రూ. 69,900లకు విడుదలైన ఆపిల్ ఐఫోన్ 13 మినీకి కూడా యాపిల్ వీడ్కోలు పలికింది. నిలిపివేసిన ఐఫోన్లలో మోడల్‌లలో ఐఫోన్ 12 కూడా ఉంది. 2020లో ఐఫోన్ 12 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,900 ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పటికీ ఈ పాత ఐఫోన్ మోడల్‌లపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్, ఫ్టిప్‌కార్ట్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆయా సంస్థలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకూ వీటిని విక్రయిస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇవే.. కాగా యాపిల్ కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 15 (iPhone 15) ప్రారంభ ధర రూ. 79,900. ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ధర రూ. 89,900. ఇక ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లకు ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అధికారిక సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్‌తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు
Apple Wonderlust Event iOS 17 టెక్ దిగ్గజం ‘వండర్ లస్ట్’ పేరుతో యాపిల్ నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. యాపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో సెప్టెంబర్ 12న జరగనున్న 'వండర్లస్ట్' ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు(సెప్టెంబరు 12, మంగళవారం) 15 సిరీస్‌తోపాటు, ఐప్యాడ్లు, కొత్త వాచ్ సిరీస్‌ను అభిమానుల కోసం లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఈ ఈవెంట్లో కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. ముఖ్యంగా భారత యూజర్ల కోసం ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో ప్రత్యేక ఫీచర్లను, watchOS 10 లాంచింగ్ తేదీలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 15 లైనప్‌ను USB-C పోర్ట్‌లతో అందించనుండటం మరో విశేషం కానుంది. ఐవోఎస్17లో ఇండియన్ ఫీచర్లు ఐఫోన్లలో ప్రధానంగా మూడు కొత్త ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్ఫోన్లలో డ్యూయల్ సిమ్ కార్డ్‌లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో డబుల్ సిమ్.ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. బైలింగ్విల్ సిరి అసిస్టెంట్ ద్వారా ఒకటికి మించిన భాషలను టింగ్లీష్, హింగ్లీషు లాగా.. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఆంగ్లంతో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్‌లోనే బిల్టిన్ ట్రాన్సలేషన్ సపోర్టుతో తమిళం, తెలుగు, కన్నడ మలయాళంతో సహా 10 భారతీయ భాషల్లోకి అనువాదానికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, పంజాబీ డిక్షనరీకి iOS 17 బీటా సపోర్ట్ ఉంటుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. సిరీ ప్లీజ్ సెట్ అలారమ్ మ్యూజిక్ ప్లే లాంటి ఆదేశాలను తెలుగులోనే ఇవ్వొచ్చు. IOS 17 ఎప్పుడు విడుదలవుతుంది? గత సంవత్సరం, Apple iPhone 14 ఈవెంట్ తర్వాత ఐదు రోజుల తర్వాత iOS 16 ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, iOS 17 బీటా 8 , పబ్లిక్ బీటా 6 ఇప్పటికే ముగిసింది, కాబట్టి Apple అదే షెడ్యూల్‌ను అనుసరించవచ్చు. iOS 17ని ముందుగానే ప్రయత్నించాలనుకుంటే, బీటాలను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. -
ఐఫోన్ వాడకం నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం!
సాధారణంగా యాపిల్ ఐఫోన్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలంలో చాలామందికి వినియోగించే మొబైల్స్‌లో ఐఫోన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్స్ వాడకూడదని చైనా ఇటీవల ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువ దేశాలు చైనా వస్తువులను వినియోగించడానికి ఒకింత ఆలోచిస్తాయి. కానీ చైనా ఐఫోన్స్ మాత్రమే కాకుండా విదేశీ బ్రాండ్ ఫోన్స్ వినియోగాన్ని నిషేదించింది. భద్రతాపరమైన భయం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే ఈ రూల్ ఎంతవరకు అమలవుతుందనేది తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం కేవలం యాపిల్ ఐఫోన్స్ మాత్రమే వినియోగించకూడదని, ఇతర బ్రాండ్స్ గురించి ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ విషయం మీద యాపిల్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముందు చైనా తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ భద్రత మాత్రమే కాకుండా స్వదేశీ బ్రాండ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా తరువాత యాపిల్ కంపెనీకి పెద్ద మార్కెట్ అయిన చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఐఫోన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఆఫర్!
Apple Mega Sale:యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ఆందిస్తోంది. త్వరలోనే కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో పాపులర్ ఐఫోన్లు భారీ డిస్కౌంట్లో ధరలో లభ్యం. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 , ఐఫోన్ 13,ఐఫోన్ 1, ఐఫోన్ తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ ముఖ్యంగా ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ ఆఫర్ అందుబాటులోఉంది. దీన్ని రూ. 72,999 వద్దే దీన్ని సొంతం చేసుకోవచ్చు. దీని లాంచింగ్ ప్రైస్ రూ.89,990. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద నిబంధనల ప్రకారం రూ. 48,999 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే HDFC కార్డుద్వారా జరిపే కొనుగోళ్లపై 128 జీబీ వేరియంట్‌పై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్సెట్ , 12ఎంపీ డ్యుయల్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర) ఐఫోన్ 14 ఐఫోన్ 14 పై అసలు ధరలో 14శాతందాకా తగ్గింపు. అంటే ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 67,999కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికివస్తే 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఆకట్టుకునే బ్యాటరీ సామర్థ్యం ప్రత్యేకం.. ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఈ సేల్‌లో ఐఫోన్ 13ను రూ. 59,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 12 ను డిస్కౌంట్ తరువాత రూ. 51,999 కొనుగోలు చేయ వచ్చు. ఇక ఐఫోన్ 11 64GB వేరియంట్‌ను కేవలం రూ. 41,999 వద్ద అందుబాటులో ఉంది. -
ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..
కొత్త సిరీస్‌ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్ ఐఫోన్15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది. టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్‌ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max), ఐఫోన్13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్12 (iPhone 12) మోడళ్లను యాపిల్ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్ ఫోన్‌నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్12 మోడల్ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్ 13 భర్తీ చేస్తుంది. యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్15 వేరియంట్, ఐఫోన్15 Plus, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
మేడిన్ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రూ.45,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో రూ.90,000 కోట్లు నమోదయ్యాయి. ఇందులో ఐఫోన్లను తయారు చేస్తున్న యాపిల్ వాటా ఏకంగా 50 శాతం ఉందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. శామ్సంగ్ రూ.36,000 కోట్ల ఎగుమతులతో 40 శాతం వాటా కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే మొబైల్స్ ఎక్స్‌పోర్ట్స్ రెండింతలయ్యాయి. భారత్ నుంచి విదేశాలకు చేరిన ఎలక్ట్రానిక్స్ 58 శాతం అధికమై గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్స్ ఎగుమతుల విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా చేసుకున్న రూ.75,000 కోట్లను అధిగమించడం ఆనందంగా ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు చేరుతున్న మొత్తం ఎలక్ట్రానిక్స్‌లో మొబైల్స్ వాటా 46 శాతంగా ఉంది. -
ఐఫోన్లపై పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు చెందిన ఐఫోన్లు ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్ డివైస్‌లే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్‌లలో క్వాడ్రీమ్ సర్వర్లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) 'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్ దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు ఏదైనా హానికరమైన, ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేయకుండానే జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) కాగా పెగాసెస్ వివాదం నేపథ్యంలో యాపిల్ స్పైవేర్ డిటెక్టర్ టూల్ ‘ఇమేజింగ్’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఫోన్లలో ‘పెగాసెస్ స్పైవేర్’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్‌ను చెక్ చేసి మాల్వేర్ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్డేట్ చేసినసంగతి తెలిసిందే. -
యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!
ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి.. ‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్ దరఖాస్తులో పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్ డిస్ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్లోని రెండు స్క్రీన్లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
ఆన్లైన్లో ఐఫోన్లు ఆర్డర్.. డెలివరీ బాయ్స్ ఫోన్ స్విచాఫ్.. కట్ చేస్తే
బనశంకరి(బెంగళూరు): ఐఫోన్ల పార్శిల్‌తో పారిపోయిన ఇద్దరు డెలివరి బాయ్‌లను మంగళవారం కేంద్ర విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఆరు ఐఫోన్లు, రెండు యాపిల్ వాచీలు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్స్, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 5న సుణకల్ పేటే దుకాణంలో ఆరు ఐఫోన్లు, ఒక యాపిల్ ఫోన్ తస్లీం అనే వ్యక్తి కొనుగోలు చేసి విజయనగర ఇంటి అడ్రస్‌కు పంపడానికి ఓ ఆన్లైన్ డెలివరిని ఆశ్రయించాడు. అరుణ్ పాటిల్ అనే పేరుతో పార్శిల్ చేశారు. అయితే కొద్ది సమయం అనంతరం నయన్ అనే వ్యక్తి ఫోన్ చేసి పార్శిల్ తనకు అందిందని, కొద్ది నిమిషాల్లో పార్శిల్ తీసుకువస్తానని తస్లీంకు ఫోన్ చేశారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో తస్లీం సీఈఎన్ను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి బసవరాజ, మాళప్ప అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి Viral Video: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..! -
ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌పై కచ్చితమైన డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే.