కొత్త సిరీస్‌ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్ ఐఫోన్15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది.
టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్‌ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max), ఐఫోన్13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్12 (iPhone 12) మోడళ్లను యాపిల్ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్ ఫోన్‌నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్12 మోడల్ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్ 13 భర్తీ చేస్తుంది.
యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్‌లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది.
ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్15 వేరియంట్, ఐఫోన్15 Plus, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment