New iPhone
-
ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..
కొత్త సిరీస్‌ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్ ఐఫోన్15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది. టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్‌ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max), ఐఫోన్13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్12 (iPhone 12) మోడళ్లను యాపిల్ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్ ఫోన్‌నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్12 మోడల్ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్ 13 భర్తీ చేస్తుంది. యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్15 వేరియంట్, ఐఫోన్15 Plus, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
ఆ ఐఫోన్ ధర ఏడు లక్షలు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు డివైజ్‌లు ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో విక్రయానికి వచ్చాయి. ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఐఫోన్లలో ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ చాలా ఖరీదైనదని మనకు తెలుసు. 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1,449 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 1,05,513 రూపాయలు. కానీ ఈ వేరియంట్ ధర ఇప్పుడు ఏడింతలకు పైగా పెరిగి పోయింది. అంటే ఏడు లక్షలకు మించిపోయింది. అలా ఎందుకు అంటే లగ్జరీ రష్యన్ బ్రాండు కేవియర్ తెలిసే ఉంటుంది కదా. ఆ బ్రాండు ఐఫోన్లను కస్టమైజ్డ్ చేసి విక్రయిస్తూ ఉంటుంది. తాజాగా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌ను కస్టమైజ్డ్ చేస్తోంది. వెనుకవైపు ఎక్కువగా బంగారపు ప్యానల్‌ను అందిస్తోంది. ఈ ప్యానల్ కోసం 150 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తోంది. ఇలా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌ను గరిష్టంగా ఐదు బంగారపు మోడిఫికేషన్స్‌లో ఈ లగ్జరీ బ్రాండ్ కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. కేవియర్ కంపెనీ ప్రవేశపెట్టే ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ మోడల్స్‌లో ఒకటి 1ఎంఎం టైటానియంను వాడుతూ రూపొందించింది. అది బుల్లెట్ ప్రూఫ్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర 5,500 డాలర్లు. ఇక రెండోది దానికి గ్లాస్‌కు బదులు కార్బన్‌ను వాడింది. దీని ధర 5,200 డాలర్లు. ఇక మూడో మోడల్లో 400 డైమాండ్లను పొందుపరిచింది. వెనుకవైపు ప్యానల్లో ఈ డైమాండ్లను అలకరించింది. దీని ధరే 9,890 డాలర్లు అంటే రూ.7,20,663. నాలుగో వేరియంట్‌ను పూర్తి గోల్డ్ ప్లేటింగ్‌తో 5,960 డాలర్లకు అందిస్తోంది. ఈ మోడల్స్‌ను ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా షిప్పింగ్ చేయనుంది కంపెనీ. వారెంటీ కార్డు, యూఎస్బీ కేబుల్, ఛార్జర్‌తో ఈ ఫోన్‌ను విక్రయిస్తోంది కేవియర్ కంపెనీ. -
అందరి చూపూ కొత్త ఐఫోన్ మీదే!
వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు అందరి చూపూ.. యాపిల్ సంస్థ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ మీదే ఉంది. కొన్ని నెలలుగా యాపిల్ అమ్మకాలు ఆశించిన మేర వృద్ధి సాధించకపోవడంతో ఈ కొత్త ఐఫోన్ యాపిల్ అమ్మకాలకు పునరుత్తేజాన్నిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొంత కాలంగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో యాపిల్ స్టాక్స్ విలువ ఐబీఎమ్‌కు దగ్గరగా రావడం వాల్‌స్ట్రీట్ మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. అయితే గత రెండు వారాలుగా యాపిల్ యాపిల్ షేర్ల విలువ 5 శాతం మేర పెరిగింది. యాపిల్ ఈ నెలలో లాంచ్ చేయనున్న కొత్త ఐఫోన్‌ను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్‌ను ఆకర్షించేలా తక్కువ కాస్ట్‌కు అందించనుందన్న వార్తలు ఈ షేర్ల విలువ పెరగటానికి దోహదం చేశాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల అంచనాలకు అందనంత ఉత్తమమైన ఉత్పత్తులను యాపిల్ సంస్థ తీసుకొచ్చిన సందర్భాలున్నాయని, ఈ సారి కూడా అలాంటి ఆశ్చర్యం తప్పదని ఆపిల్ సంస్థలో 1 మిలియన్‌కు పైగా షేర్లు ఉన్న సైనోవాస్ ట్రస్ట్ కంపెనీ సీనియర్ పోర్ట్ ఫోలియో మేనేజర్ డేనియల్ మోర్గాన్ అన్నారు. మరి మార్కెట్ వర్గాల అంచనాలను యాపిల్ తన కొత్త ఐఫోన్‌తో అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
కొత్త ఐఫోన్స్ ధరల శ్రేణి రూ.62,000-రూ.92,000
న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్ కొత్త ఐఫోన్స్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. వీటి ధరలు రూ.62,000 నుంచి రూ.92,000 శ్రేణిలో ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్స్ 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 3,500 రిటైల్స్‌లో కొత్త ఐఫోన్స్ అమ్మకాలు జరుగుతాయని డిస్ట్రిబ్యూషన్ సంస్థ బీటెల్ టెలిటెక్ పేర్కొంది. ఐఫోన్ 6ఎస్ వేరియంట్ ధర 16 జీబీ మోడల్‌కు రూ.62,000గా, 64 జీబీ మోడల్‌కు రూ.72,000గా, 128 జీబీ మోడల్‌కు రూ.82,000గా ఉంది. ఇక ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధర 6ఎస్తో పోలిస్తే మరో రూ.10,000 అధికంగా ఉంటుంది. -
కొత్త ఐఫోన్ ఆర్డర్లు అదిరే!
శాన్‌ఫ్రాన్సికో: కొత్త ఐఫోన్(6ఎస్, 6ఎస్ ప్లస్)కు ముందస్తు ఆర్డర్లు కళ్లు చెదిరే స్థాయిలో వస్తున్నాయని యాపిల్ కంపెనీ తెలిపింది. గతేడాది కొత్త హ్యాండ్‌సెట్స్‌కు వచ్చిన ముందస్తు ఆర్డర్ల (తొలివారం 10 మిలియన్ యూనిట్లు) రికార్డును తాజా ఐఫోన్ మోడల్ తలదన్నే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రెండు మొబైల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపింది. కాగా, 12 దేశాల్లో ఈ నెల 25న ఈ కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత్‌లో అక్టోబర్ 27న ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్‌లు విడుదల అవుతాయని అంచనా.