ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు డివైజ్‌లు ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో విక్రయానికి వచ్చాయి. ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఐఫోన్లలో ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ చాలా ఖరీదైనదని మనకు తెలుసు. 512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 1,449 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 1,05,513 రూపాయలు. కానీ ఈ వేరియంట్ ధర ఇప్పుడు ఏడింతలకు పైగా పెరిగి పోయింది. అంటే ఏడు లక్షలకు మించిపోయింది. అలా ఎందుకు అంటే లగ్జరీ రష్యన్ బ్రాండు కేవియర్ తెలిసే ఉంటుంది కదా. ఆ బ్రాండు ఐఫోన్లను కస్టమైజ్డ్ చేసి విక్రయిస్తూ ఉంటుంది. తాజాగా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌ను కస్టమైజ్డ్ చేస్తోంది. వెనుకవైపు ఎక్కువగా బంగారపు ప్యానల్‌ను అందిస్తోంది. ఈ ప్యానల్ కోసం 150 గ్రాముల బంగారాన్ని ఉపయోగిస్తోంది. ఇలా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌ను గరిష్టంగా ఐదు బంగారపు మోడిఫికేషన్స్‌లో ఈ లగ్జరీ బ్రాండ్ కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.
కేవియర్ కంపెనీ ప్రవేశపెట్టే ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ మోడల్స్‌లో ఒకటి 1ఎంఎం టైటానియంను వాడుతూ రూపొందించింది. అది బుల్లెట్ ప్రూఫ్‌ను కూడా కలిగి ఉంది. దీని ధర 5,500 డాలర్లు. ఇక రెండోది దానికి గ్లాస్‌కు బదులు కార్బన్‌ను వాడింది. దీని ధర 5,200 డాలర్లు. ఇక మూడో మోడల్‌లో 400 డైమాండ్లను పొందుపరిచింది. వెనుకవైపు ప్యానల్‌లో ఈ డైమాండ్లను అలకరించింది. దీని ధరే 9,890 డాలర్లు అంటే రూ.7,20,663. నాలుగో వేరియంట్‌ను పూర్తి గోల్డ్ ప్లేటింగ్‌తో 5,960 డాలర్లకు అందిస్తోంది. ఈ మోడల్స్‌ను ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా షిప్పింగ్ చేయనుంది కంపెనీ. వారెంటీ కార్డు, యూఎస్‌బీ కేబుల్, ఛార్జర్‌తో ఈ ఫోన్‌ను విక్రయిస్తోంది కేవియర్ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment