భారతదేశంలో తమ ఉనికిని నిరంతరం విస్తరించుకోవడంలో భాగంగా యాపిల్ కంపెనీ తమ నాయకత్వ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. కేవలం మార్కెట్ కోసం మాత్రమే కాకుండా దేశంలో తమ ఉత్పత్తులను తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీ తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, మాజీ ఉపాధ్యక్షుడు హ్యూగ్స్ అస్సేమాన్ పదవీ విరమణ తర్వాత ఇండియా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలలో ఈ మార్పు వచ్చింది. అస్సేమాన్ స్థానంలో భారత అధినేత ఆశిష్ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆశిష్ చౌదరి యాపిల్ ఉత్పత్తుల విక్రయాల అధిపతి మైఖేల్ ఫెంగర్‌కు రిపోర్ట్ చేస్తారు.
నిజానికి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ విక్రయాలకు బాధ్యత వహించే ఇద్దరు వ్యక్తులలో మైఖేల్ ఫెంగర్ ఒకరు . అయితే ఈయన డౌగ్ బెక్‌తో కలిసి నేరుగా టిమ్ కుక్‌కి రిపోర్ట్ చేస్తాడు. ప్రపంచ దేశాల్లో యాపిల్‌కు భారత్ ముఖ్యమైన మార్కెట్. కంపెనీ ఇండియా నుంచి ప్రతి సంవత్సరం మంచి ఆదాయాన్ని గడిస్తోంది.
(ఇదీ చదవండి: హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్‍తో)
యాపిల్ కంపెనీ మరిన్ని అమ్మకాలను పొందటానికి ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి రిటైల్ అవుట్‌లెట్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. భారత పర్యటన సందర్భంగా టిమ్ కుక్ దేశం ప్రాధాన్యతను గురించి ప్రస్తావించారు. ఆపిల్ కంపెనీకి ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి మూడు ముఖ్యమైన సరఫరాదారులు ఉన్నారు.
యాపిల్ సంస్థ భారతదేశంలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లతో పాటు నాన్-ప్రో వేరియంట్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో విరివిగా ఐఫోన్‌ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో చైనాకు ప్రధాన ప్రత్యామ్నాయాన్ని భారతదేశం అందిస్తుందని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment