ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన తొలి రీటైల్ స్టోర్ గురించి అధికారిక ప్రకటన చేసింది. ముంబైకి చెందిన ఓ ప్రాంతంలో యాపిల్ బీకేసీ పేరుతో ఉన్న ఆ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది. కానీ ప్రారంభ తేదీని వెల్లడించ లేదు.
ఇక స్టోర్‌ను దేశంలో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలకు నెలవైన ముకేష్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఉండనుంది. అదే ప్రాంతంలో అంతర్జాతీయ బ్యాంకులు సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక ముంబై తర్వాత ఢిల్లీలో ఇలా దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యాపిల్ సంస్థ తన రీటైల్ స్టోర్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.
పలు నివేదికల ప్రకారం.. ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. లాస్‌ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ దేశాల తరహాలోనే ముంబై రీటైల్ స్టోర్ ఉన్నట్లు పేర్కొన్నాయి. ముంబై స్టోర్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఉన్న ఢిల్లీ యాపిల్ రీటైల్ స్టోర్ ప్రారంభం అవుతుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
యాపిల్ రీటైల్ స్టోర్‌లతో లాభాలేంటీ?
టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన ఉత్పత్తులను విక్రయించింది. ఆ అమ్మకాలు ఆన్‌లైన్‌లో లేదంటే థర్డ్ పార్టీల స్టోర్‌ల నుంచి జరుపుతుంది. ఈ క్రమంలోనే రిటైల్ స్టోర్లు తెరవాలని యాపిల్‌కు ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక త‍్వరలో ప్రారంభానికి సన్నద్దమవుతున్న ముంబై రీటైల్ స్టోర్‌తో కొనుగోలు దారులు యాపిల్ ప్రొడక్ట్‌లను ఆఫ్‌లైన్‌లో థర్డ్ పార్టీ స్టోర్‌లతో సంబంధం లేకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చు. తద్వారా యాపిల్ ఉత్పత్తుల ధరల తగ్గే అవకాశం ఉందనే అంచనా నెలకొంది.
చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?
Comments
Please login to add a commentAdd a comment