Retail Store
-
భారీగా పెరిగిన లైఫ్‌స్టైల్ లాభం
న్యూఢిల్లీ: రిటైల్ స్టోర్ చైన్ లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 160 శాతం అధికంగా రూ. 700 కోట్ల నికర లాభం ఆర్జించింది. దుబాయ్‌కు చెందిన రిటైల్, ఆతిథ్య రంగ సంస్థ ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం 50 శాతం జంప్ చేసింది. రూ. 11,672 కోట్లను తాకింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 10,877 కోట్ల కు చేరాయి. కాగా.. అంతక్రితం ఏడాది (2021 –22)లో రూ. 7,806 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 269 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ లైఫ్‌స్టైల్ స్టోర్స్(భారీ డిపార్ట్మెంటల్ విభాగం)తోపాటు, గృహాలంకరణ విభాగంలో హోమ్ సెంటర్, ఫ్యాషన్ చైన్‌లో మ్యాక్స్ బ్రాండ్ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే. -
తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్‌గా నిలుస్తోంది. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుని మరీఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్, ఐప్యాడ్స్, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది. ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఇండియాలో రెండో స్టోర్‌గా యాపిల్ సాకేత్‌ను ఢిల్లీలో ఏప్రిల్ 20న యాపిల్ సీఈవో టిక్ కుక్ లాంచ్ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్‌ను లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ప్రత్యర్థిబ్రాండ్ల స్టోర్స్ లేకుండా జూలై 2022లో మాల్తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్. -
భారత్‌లో తొలి యాపిల్ స్టోర్.. ఫస్ట్ లుక్ అదిరింది!
భారత్‌లో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ దేశీయంగా రెండు యాపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ తెరవనుంది. ప్రపంచంలోని ఐకానిక్ బ్రాండ్ రీటైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి టిమ్ కుక్ హాజరు కానున్నారు. పలు నివేదికల ప్రకారం.. యాపిల్ సీఈవో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..యాపిల్ రీటైల్ స్టోర్లలో ఉండే 100 మంది సిబ్బంది 18 మంది భాషల్లో మాట్లాడతారని తెలిపారు. సంస్థ దేశంలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తోందని, యాప్ ఎకోసిస్టమ్ ద్వారా 10 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో పరోక్షంగా సహాయపడిందని ఆమె చెప్పారు. యాపిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఆ స్టోర్లలో ఉన్న ఫీచర్లే భారత్‌లో ప్రారంభించబోయే స్టోర్లలో ఉన్నాయి. అయితే స్థానికతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన రెండు స్టోర్లూ భారత వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచేలా దృష్టిసారించింది. ముఖ్యంగా స్టోర్ లోపల గోడల కోసం, కంపెనీ ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి రాయిని కొనుగోలు చేసింది. 4.5 లక్షల కలప ముక్కలు పైకప్పు గోడలను అలంకరించింది.స్టోర్‌లో ఉత్పత్తులు, కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్న గాడ్జెట్లను రిపేర్ చేయడం వంటి సేవలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ..కస్టమర్లు ప్రొడక్ట్‌లను తనిఖీ చేసుకోవచ్చని వాటిని ఎలా ఉపయోగించాలనే అంశంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. -
భారత్‌లో యాపిల్ రీటైల్ స్టోర్.. టిమ్‌కుక్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే భారత్‌లో తొలి రీటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతుంది. దేశంలో ఐఫోన్ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్ తన రిటైల్ స్టోర్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రీటైల్ స్టోర్ ప్రారంభం కంటే ముందే తన ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ‘బంద్రా కుర్లా కాంప్లెక్స్’లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుంది. రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయడం ద్వారా యాపిల్ స్పెషల్ డిస్కౌంట్ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకోసం టిమ్‌కుక్.. జియో వరల్డ్ డ్రైవ్ యాజమాన్యానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకు లోబడే యాపిల్ రీటైల్ స్టోర్ ఏర్పాటు అంగీకరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ షరతు ఏంటంటే? ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో రీటైల్ స్టోర్ ఏర్పాటు కోసం యాపిల్ సంస్థ 20,800 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 11 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. లీజు ఒప్పందం ప్రకారం.. నెలకు రూ.42 లక్షలను అద్దె రూపంలో చెల్లించనుంది. ఈ లెక్కన ఏడాదికి అద్దె రూపంలోనే రూ.5 కోట్లను చెల్లిస్తుండగా.. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అద్దె 15 శాతం మేర పెంపు ఉంటుంది. ఆ మూడేళ్లలో 2 శాతం రెవెన్యూ షేర్, మూడేళ్ల తర్వాత 2.5 శాతం రెవెన్యూ షేర్‌ను అంబానీ సంస్థకు చెల్లించనుంది. అదే సమయంలో కొన్ని కండీషన్లు పెట్టింది. డేటా అనలటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్ట్ ప్రకారం.. రీటైల్ స్టోర్ ఏర్పాటు అనంతరం ఆ ప్రాంతంలో 21 సంస్థలకు చెందిన బ్రాండ్ల యాడ్స్‌ను డిస్ప్లే చేసేందుకు వీలు లేదు. వాటిల్లో అమెజాన్,ఫేస్బుక్, గూగుల్, ఎల్జీ, మైక్రోసాఫ్ట్, సోనీ, ట్విటర్, బోస్, డెల్, డెలాయిట్ , ఫాక్స్‌కాన్, గార్మిన్, హిటాచీ, హెచ్‌పీ, హెచ్‌టీసీ, ఐబీఐఎం, ఇంటెల్, లెనోవో, నెస్ట్, ప్యానసోనిక్, తోషిబా, శాంసంగ్ వంటి సంస్థలు ఉన్నాయి. -
త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!
యాపిల్ సీఈవో టిమ్‌కుక్ భారత్ వస్తారని, ఇక్కడ ఏర్పాటవుతున్న యాపిల్ స్టోర్ ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తారని అంచనా వేస్తూ ఎకనమిక్ టైమ్స్ కథనం వెలువరించింది. ఈ మేరకు టిమ్‌కుక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉంది. కుక్ 2016లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా మోదీతో భేటి అయ్యారు. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయం కుక్ భారత పర్యటన ప్రణాళికను, ముంబై స్టోర్ ప్రారంభ తేదీని ఖరారు చేస్తోంది. కుక్ వెంట యాపిల్ రిటైల్ అండ్ పీపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ ఉంటారని తెలుస్తోంది. టిమ్ కుక్ చివరి సారిగా 2016లో భారత్‌లో పర్యటించారు. బాలీవుడ్ స్టార్స్, టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమయ్యారు. స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. ముంబై నగరంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ నెలాఖరున ప్రారంభించబోతున్న రీటైల్ స్టోర్‌కు సంబంధించిన ఫొటోలను యాపిల్ విడుదల చేసింది. నగరానికి ప్రత్యేకమైన కాళీ-పీలీ ట్యాక్సీ కళాకృతి ప్రేరణతో ముంబై స్టోర్ ముఖభాగాన్ని తీర్చిదిద్దారు. -
సౌందర్య సంరక్షణ విభాగంలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. టిరా పేరిట రిటైల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ముంబైలో తొలి టిరా రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. 100 పైచిలుకు నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్రాండ్‌తో రిలయన్స్ ఇకపై హెచ్‌యూఎల్, నైకా, టాటా, ఎల్వీఎంహెచ్ మొదలైన దిగ్గజాలతో పోటీపడనుందని పేర్కొన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అంతర్జాతీయ, దేశీయ సౌందర్య సంరక్షణ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు టిరా ఉపయోగపడగలదని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా అంబానీ తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ డేటా రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా ప్రకారం దేశీయంగా బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ 2023లో 27.23 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇందులో 12.7 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాల ద్వారా రానుంది. -
యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన తొలి రీటైల్ స్టోర్ గురించి అధికారిక ప్రకటన చేసింది. ముంబైకి చెందిన ఓ ప్రాంతంలో యాపిల్ బీకేసీ పేరుతో ఉన్న ఆ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వెబ్సైట్లో తెలిపింది. కానీ ప్రారంభ తేదీని వెల్లడించ లేదు. ఇక స్టోర్‌ను దేశంలో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలకు నెలవైన ముకేష్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఉండనుంది. అదే ప్రాంతంలో అంతర్జాతీయ బ్యాంకులు సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక ముంబై తర్వాత ఢిల్లీలో ఇలా దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యాపిల్ సంస్థ తన రీటైల్ స్టోర్లను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. పలు నివేదికల ప్రకారం.. ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. లాస్ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ దేశాల తరహాలోనే ముంబై రీటైల్ స్టోర్ ఉన్నట్లు పేర్కొన్నాయి. ముంబై స్టోర్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత సాకేత్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఉన్న ఢిల్లీ యాపిల్ రీటైల్ స్టోర్ ప్రారంభం అవుతుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. యాపిల్ రీటైల్ స్టోర్లతో లాభాలేంటీ? టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన ఉత్పత్తులను విక్రయించింది. ఆ అమ్మకాలు ఆన్లైన్లో లేదంటే థర్డ్ పార్టీల స్టోర్ల నుంచి జరుపుతుంది. ఈ క్రమంలోనే రిటైల్ స్టోర్లు తెరవాలని యాపిల్‌కు ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక త్వరలో ప్రారంభానికి సన్నద్దమవుతున్న ముంబై రీటైల్ స్టోర్‌తో కొనుగోలు దారులు యాపిల్ ప్రొడక్ట్‌లను ఆఫ్‌లైన్‌లో థర్డ్ పార్టీ స్టోర్లతో సంబంధం లేకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చు. తద్వారా యాపిల్ ఉత్పత్తుల ధరల తగ్గే అవకాశం ఉందనే అంచనా నెలకొంది. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? -
చిన్న నగరాలకు రిటైల్ బ్రాండ్ల క్యూ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. పండ్లు, కూరగాయలు, గ్రాసరీ ఏ నిత్యావసరాలైనా సరే నాణ్యమైనవే ఎంచుకుంటున్నారు. ఇదే బహుళ జాతి రిటైల్ కంపెనీలకు వ్యాపార అవకాశంగా మారింది. ఇప్పటివరకు చిన్న పట్టణాలలో నాణ్యమైన రిటైల్ కేంద్రాలు లేకపోవటం కార్పొరేట్ బ్రాండ్లకు కలిసొచ్చింది. ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాలలో పెద్ద కార్పొరేట్ చెయిన్స్, రిటైల్ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే మధ్యకాలంలో ప్రముఖ రిటైల్ బ్రాండ్స్ 120కి పైగా లీజు లావాదేవీలను నిర్వహించాయి. 400 చ.అ. నుంచి 35 వేల చదరపు అడుగులు విస్తీర్ణాలలో ఎఫ్అండ్బీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్‌ను ఏర్పాటు చేశాయి. బిబా, రిలయన్స్ ట్రెండ్స్, ప్యాంటలూన్స్, లెన్స్‌కార్ట్, వెస్ట్‌సైడ్, జుడియో, మ్యాక్స్ వంటి అపెరల్స్, లైఫ్ స్టయిల్ బ్రాండ్స్, స్టార్‌బక్స్, పిజ్జా హట్, కేఎఫ్‌సీ వంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ (క్యూఎస్ఆర్), క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైలర్లు హైస్ట్రీట్‌లో స్టోర్లను ఏర్పాటు చేశాయి. మోర్ రిటైల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ఫైజాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్, ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో స్టోర్ల ఏర్పాటు కోసం 14–30 వేల చ.అ. స్థలాలను లీజుకు తీసుకుంది. తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లో సూపర్ మార్కెట్లు.. కార్పొరేట్ రిటైలర్లు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, గుర్గావ్ ప్రధాన నగరాలతో పాటు లక్నో, అహ్మదాబాద్, చంఢీఘర్, పాటియాలా వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్ వంటి చిన్న పట్టణాలల్లోనూ విస్తరిస్తున్నాయి. హైపర్, సూపర్ మార్కెట్ బ్రాండ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లోని హైస్ట్రీట్‌లో స్థలాలను లీజుకు తీసుకుంటున్నాయి. హైస్ట్రీట్ లీజు లావాదేవీలలో 23 శాతం వాటాతో అపెరల్ బ్రాండ్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఈ తర్వాత 15 శాతం వాటాతో ఎఫ్అండ్బీ బ్రాండ్లు, 12 శాతంతో జువెల్లరీ బ్రాండ్లు నిలిచాయి. పట్టణాల్లో ఎందుకంటే.. ఇప్పటికే హైస్ట్రీట్లలో వినియోగదారులు రద్దీ గణనీయంగా ఉంది. ఇలాంటి చోట్ల రిటైలర్లు విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. తక్కువ సమయం, వ్యయంతో తక్షణమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే వీలుండటం రిటైలర్లు కలిసొస్తుందని అనరాక్ రిటైల్ జాయింట్ ఎండీ అండ్ సీఓఓ పంకజ్ రెంజెన్ తెలిపారు. మెట్రో నగరాలలో కొంతమంది రిటైలర్లు ఖరీదైన హైస్ట్రీట్లలో విస్తరణకు బదులుగా మంచి కనెక్టివిటీ, రోడ్ ఫేసింగ్ సైట్లలో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా టైర్–2, 3 పట్టణాలు బ్రాండ్లకు అధిక ఆదాయ వనరులను అందిస్తున్నాయి. నిధులు, మూలధన పెట్టుబడులున్న రిటైలర్లు పోటీతత్వ ప్రయోజనాన్ని పొందేందుకు, మార్కెట్ వాటాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చదవండి: 2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు -
భారత్‌లో త్వరలో యాపిల్ ఆన్లైన్ స్టోర్
సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా దిగ్గజ కంపెనీ యాపిల్ వచ్చే రెండు నెలల్లోగా భారత్‌లో తన ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టోర్ లాంచ్ ఈ సెప్టెంబర్–అక్టోబర్ మధ్యకాలంలోఉండొచ్చని తెలుస్తోంది. ఆన్లైన్ స్టోర్ ప్రారంభోత్సవం పండుగ సీజన్లో ఉంటుందని.. దసరా, దీపావళి పండుగల డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ చూస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు తెలిపారు. భారత్‌లో ఆన్లైన్ స్టోర్‌ను ఈ ఏడాది చివరిలో, ఫిజికల్ రిటైల్ స్టోర్ వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామని ఈ ఫిబ్రవరిలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో యాపిల్ తన ఉత్పత్తులను థర్డ్ పార్టీ సెల్లర్లు, ఆన్లైన్ మార్కెట్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో విక్రయిస్తోంది. -
ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త
కాలిఫోర్నియా: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారులకు ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తన సొంత ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. అలాగే 2021 నాటికి తొలి ఆపిల్ బ్రాండెడ్ ఫిజికల్ స్టోర్ ఏర్పాటు కానుందని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. తద్వారా భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్లైన్లోనే ఐఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ ప్రస్తుతం తన ఉత్పత్తులను థర్డ్‌పార్టీ రీటైలర్ల ద్వారా విక్రయిస్తోంది. కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాన్ని టిమ్ కుక్ వెల్లడించారు. దేశీయ భాగస్వామితో కాకుండా తామే స్వయంగా స్టోర్‌ను ప్రారంభించాలని చూస్తున్నామని, దీనికి సంబంధించిన అనుమతులను భారత ప్రభుత్వం నుండి పొందాల్సి వుందని కుక్ చెప్పారు. తమ బ్రాండ్‌ను మరెవరో నడపాలని తాను కోరుకోవడంలేదన్నారు. అంతేకాదు తమకు భారత్ చాలా కీలకమై మార్కెట్ అని గట్టిగా విశ్వసించే కుక్ 2020 జూన్, జూలై మధ్య ఇండియాలో పర్యటించనున్నారు. భారత్‌లో వ్యాపారం, తయారీ ప్రణాళికలు, ఎగుమతులు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఆపిల్ దుకాణాల విస్తరణతో సహా పలు అంశాలను ఆయన పరిశీలించనున్నారు. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనల సడలింపుల నేపథ్యంలో 2020 జనవరి, మార్చి మధ్య ఆపిల్ తన మొదటి ఆన్లైన్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించనుందని అంచనాలొచ్చాయి. అయితే లాజిస్టికల్ సమస్యలతో ఈ ప్రయత్నాలను వాయిదా వేసినట్టు పలు అంచనాలు వెలువడ్డాయి. (చదవండి : శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్) కాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ భారతదేశంలో 925,000 ఐఫోన్లను రవాణా చేసిందని పరిశోధనా సంస్థ కెనాలిస్ అంచనా. ఈ సంఖ్య సంవత్సరంలో దాదాపు 200 శాతం పెరిగింది. అయితే దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై కేంద్రం విధించిన భారీ దిగుమతి సుంకం ఆపిల్‌కు భారతీయ స్మార్ట్‌మార్కెట్లో పెద్ద సవాలు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కాంట్రాక్టర్లు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సహకారంతో ఐఫోన్లు అసెంబ్లింగ్ ద్వారా పలు రకాల ఐఫోన్ మోడళ్లను (ప్రస్తుత తరం శ్రేణి మినహా) తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో సొంత దుకాణాలను ప్రారంభించే ముందు సబ్సిడీ, దిగుమతి సుంకాల సడలింపుపై భారత ప్రభుత్వంతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు -
ఐకియా రాక.. ఆలస్యం
హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన గృహోపకరణాల తయారీ దిగ్గజ సంస్థ ఐకియా తన తొలి భారతీయ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతుంది. అయితే ఈ స్టోర్ ప్రారంభం షెడ్యూల్ కంటే 20 రోజులు ఆలస్యం కానుందని తెలిసింది. తొలుత ఈ స్టోర్‌ను ఈ నెల 19న ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. కానీ ఈ స్టోర్‌కు అవసరమైన కొన్ని పనుల్లో జాప్యం జరగడంతో 2018 ఆగస్టు 9కు వాయిదా వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘వినియోగదారులు, కో-వర్కర్ల కోసం అనుకున్న నాణ్యతతో స్టోర్ సిద్ధం చేయడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. దీంతో ప్రారంభాన్ని వాయిదా వేయాలని ఐకియా ఇండియా నిర్ణయించింది’ అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వినియోగదారులకు, కో-వర్కర్లకు సురక్షితమైన అనుభవాన్ని, అత్యుత్తమ సౌకర్యాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జల్ తెలిపారు. నాణ్యత విషయంలో తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటామని, ఐకియా తొలిస్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనుండటం చాలా సంతోషకరమని బెట్జల్ అన్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఈ స్టోర్ ప్రారంభమవుతుంది. దీనిలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, మరో 1,500 మందికి పరోక్షంగా ఉద్యోగాలను కల్పించబోతుంది. ఈ స్టోర్‌లో సగం ఉద్యోగాలను మహిళలకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఐదేళ్ల క్రితం ఈ స్వీడన్ పర్నీచర్ దిగ్గజానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. భారత్‌లో తన స్టోర్లను ఏర్పాటు చేయాలనే రూ.10,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025 కల్లా ఐదు భారతీయ నగరాల్లో 25 స్లోర్లను ప్రారంభించాలని ఐకియా ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్‌లో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని అంచనావేస్తోంది. అదేవిధంగా కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో కూడా రిటైల్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు ఎంఓయూలపై ఐకియా సంతకాలు కూడా పెట్టింది. -
ఐకియాలో మహిళలకు 350 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, సంస్థల స్థాపనకు దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం తెలంగాణ అని, ఇక్కడ సమర్థవంతమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐకియా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తమ రిటైల్ స్టోర్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించనుంది. ఇందులో పనిచేసేందుకు తెలంగాణలోని 350 మంది మహిళలకు అవకాశం కల్పిస్తుంది. వీరికి న్యాక్‌లో 45 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం(ఎంవోయూ)పై నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్(న్యాక్), ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం), ట్రస్ట్ ఫర్ రిటైలర్స్ అండ్ రిటైల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా(ట్రైన్), యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) ప్రతినిధులు సంతకాలు చేశారు. -
షావోమి లవర్స్‌కి గుడ్ న్యూస్!
సాక్షి, హైదరాబాద్: చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమీ ఇండియాలో మరింత విస్తరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఎంఐ హోమ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. ఇప్పటికే బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో ఎంఐ హోమ్ స్టోర్లను ప్రారంభించి కార్యకలాపాలను నిర్వహిస్తున్న షావోమి ఇపుడు హైదరాబాద్ కస్టమర్లకు మరింత చేరువలోకి వస్తోంది. దీంతో హైదరాబాద్ ప్రజలు డైరెక్టుగా రిటైల్ స్టోర్‌కు వెళ్లి షావోమి ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చన్నమాట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సంస్థ ధృవీకరించింది. సెప్టెంబర్ 12వ తేదీన మాదాపూర్ మెయిన్ రోడ్ లో ఈ స్టోర్‌ను ఓపెన్ చేయనుంది. తమ ఉత్పత్తులకు లభిస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాసులకు కూడా మరింత చేరువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఇకపై తమ ఉత్పత్తులను ఆలస్యం, ఔట్ ఆఫ్ స్టాక్ లాంటి ఎలాంటి సమస్యలు లేకుండా వినియోగదారులు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ను పొందవచ్చనీ, స్మార్ట్ఫోన్లు సహా, పవర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్స్, ఫిట్నెస్ బ్యాండ్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ తదితర గ్యాడ్జెట్టు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పింది. కాగా బెంగుళూరులో 3 స్టోర్స్, గురుగ్రామ్, చెన్నైలలో ఒక్కో స్టోర్ ఉండగా తాజాగా నగరంలో ప్రారంభించే స్టోర్‌తో కలిపి షావోకి ఇది 6వది. భారతదేశంలో 11 నగరాల్లో 600 కి పైగా రిటైల్ దుకాణాలు ఉండగా విజయ్ సేల్స్, సంగీత, బిగ్ సి, ఇజోన్ , హాట్ స్పాట్లాంటి పెద్ద రిటైల్ చైన్స్ తో భాగస్వామ్యం ఉంది. గత నెలలో కంపెనీ 30 నగరాల్లో 1,500 మేర రిటైల్ స్టోర్లను పెంచుతామని జైన్ చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 100 ఎంఐ హోమ్ దుకాణాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్న షావోమి . #MiHome is coming to Hyderabad on 12th September at Madhapur Main Road! Pre-book now! Including #MiA1!