భారీగా పెరిగిన లైఫ్‌స్టైల్‌ లాభం | Retail store Lifestyle International FY23 profit jumps to Rs 700 crore - Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన లైఫ్‌స్టైల్‌ లాభం

Aug 23 2023 8:08 AM | Updated on Aug 23 2023 1:48 PM

Retail store Lifestyle International FY23 profit jumps to Rs 700 crore - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్‌ స్టోర్‌ చైన్‌ లైఫ్‌స్టైల్‌ ఇంటర్నేషనల్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 160 శాతం అధికంగా రూ. 700 కోట్ల నికర లాభం ఆర్జించింది. దుబాయ్‌కు చెందిన రిటైల్, ఆతిథ్య రంగ సంస్థ ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌నకు చెందిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం 50 శాతం జంప్‌ చేసింది. రూ. 11,672 కోట్లను తాకింది.

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వివరాల ప్రకారం మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 10,877 కోట్ల కు చేరాయి. కాగా.. అంతక్రితం ఏడాది (2021 –22)లో రూ. 7,806 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 269 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌(భారీ డిపార్ట్‌మెంటల్‌ విభాగం)తోపాటు, గృహాలంకరణ విభాగంలో హోమ్‌ సెంటర్, ఫ్యాషన్‌ చైన్‌లో మ్యాక్స్‌ బ్రాండ్‌ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement