సాక్షి,న్యూఢిల్లీ : అమెరికా దిగ్గజ కంపెనీ యాపిల్ వచ్చే రెండు నెలల్లోగా భారత్‌లో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టోర్ లాంచ్ ఈ సెప్టెంబర్–అక్టోబర్ మధ్యకాలంలోఉండొచ్చని తెలుస్తోంది. ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవం పండుగ సీజన్లో ఉంటుందని.. దసరా, దీపావళి పండుగల డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ చూస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు తెలిపారు. భారత్‌లో ఆన్‌లైన్ స్టోర్‌ను ఈ ఏడాది చివరిలో, ఫిజికల్ రిటైల్ స్టోర్ వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామని ఈ ఫిబ్రవరిలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో యాపిల్ తన ఉత్పత్తులను థర్డ్ పార్టీ సెల్లర్లు, ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment