ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ రోజు (సెప్టెంబర్ 9) లాంచ్ కానుంది. 'ఇట్స్ గ్లోటైమ్' పేరుతో కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ ఫోన్‌ను కంపెనీ చీఫ్ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.
కంపెనీ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌ను ప్రారంభించడానికి ముందే.. యాపిల్ కంపెనీ ఇంటర్నెట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీ నటించిన ఈ యాడ్ టెక్ ఔత్సాహికులను, అభిమానులను ఎంతగానో ఆకర్శించింది. ఈ యాడ్ గమనిస్తే.. ఇది ఒక సాధారణ కార్పొరేట్ ఆఫీసులో 1996లో జరిగిన సన్నివేశం అని తెలుస్తోంది.
టీవీ1 ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను గమనిస్తే యాపిల్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.
Found Apple's 1st (?) Indian ad film for the Power Macintosh, apparently aired on Doordarshan in 1996 — a full twenty years before it started making India-focussed iPhone ads again in 2016. pic.twitter.com/gHx0mzYtkx
— Neil (@neilshroff) November 29, 2023
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్
యాపిల్ ఈరోజు 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంఛ్ అవుతాయని సమాచారం. ఈ ఫోన్స్ 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందనున్నట్లు.. బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment