ad
-
వేల కోట్ల రూపాయల ఫైన్!
లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్‌లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.గూగుల్ ఈ అప్పీల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్‌లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్‌కు గూగుల్‌కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?ఇదిలాఉండగా, గూగుల్‌లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్‌లకు సంబంధించిన బిడ్‌ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్‌లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు. -
యాపిల్ ఫస్ట్ ఇండియన్ యాడ్ ఇదే.. చూశారా?
ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ రోజు (సెప్టెంబర్ 9) లాంచ్ కానుంది. 'ఇట్స్ గ్లోటైమ్' పేరుతో కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ ఫోన్‌ను కంపెనీ చీఫ్ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.కంపెనీ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌ను ప్రారంభించడానికి ముందే.. యాపిల్ కంపెనీ ఇంటర్నెట్లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీ నటించిన ఈ యాడ్ టెక్ ఔత్సాహికులను, అభిమానులను ఎంతగానో ఆకర్శించింది. ఈ యాడ్ గమనిస్తే.. ఇది ఒక సాధారణ కార్పొరేట్ ఆఫీసులో 1996లో జరిగిన సన్నివేశం అని తెలుస్తోంది.టీవీ1 ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను గమనిస్తే యాపిల్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.Found Apple's 1st (?) Indian ad film for the Power Macintosh, apparently aired on Doordarshan in 1996 — a full twenty years before it started making India-focussed iPhone ads again in 2016. pic.twitter.com/gHx0mzYtkx— Neil (@neilshroff) November 29, 2023యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఈరోజు 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంఛ్ అవుతాయని సమాచారం. ఈ ఫోన్స్ 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు.. బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. -
GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు!
న్యూఢిల్లీ: ప్రకటనల ఆదాయంలో వాటాల కింద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విటర్) నుంచి వ్యక్తులకు వచ్చే ఆదాయం కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్ క్రియేషన్‌ను సర్వీసు కింద పరిగణిస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ట్యాక్స్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో అద్దె ఆదాయం, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతరత్రా ప్రొఫెషనల్ సర్వీసులు వంటి వివిధ సర్వీసుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం రూ. 20 లక్షలు దాటిన పక్షంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎక్స్ ఇటీవల ప్రకటనలపై తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కి కూడా అందించడం ప్రారంభించింది. ఇందుకోసం సదరు సబ్‌స్క్రయిబర్స్ పోస్టులకు గత మూడు నెలల్లో 1.5 కోట్ల ఇంప్రెషన్లు, కనీసం 500 మంది ఫాలోయర్లు ఉండాలి. ఎక్స్ నుంచి తమకు ఆదాయం వచ్చినట్లు పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈమధ్య పోస్ట్ చేశారు. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!
Australia Job Ad: ఏ దేశంలో అయినా డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఈ డిమాండ్‌తో పాటు వేతనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డాక్టర్లకు అద్భుతమైన శాలరీ మాత్రమే కాకుండా, అంతకు మించిన స్పెషలిటీస్ కూడా అందిస్తున్నాయి. ఇటీవల ఒక ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూ. కోటికి పైగా ప్యాకేజీ.. సోషల్ మీడియాలో వెల్లడైన జాబ్ యాడ్ పోస్ట్ ప్రకారం, ఏడాదికి రూ.1.30 కోట్లు జీతం అందిస్తామని, అంతే కాకుండా నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దినాలు, మిగిలిన 20 రోజులు సెలవులు అని తెలిపింది. ఇది జాబ్ అడ్వర్టైజ్మెంట్ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ యూనియన్ ప్రముఖ జర్నల్ BMJలో ప్రచురితమైంది. ఇంకా సైన్ ఇన్ బోనస్ కింద రూ. 2.7 లక్షలు కూడా అందుతాయని తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ మెడికల్ రిక్రూట్మెంట్ సంస్థ బ్లూగిబ్బన్ ఈ యాడ్ రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా నేషనల్ హెల్త్ స్కీమ్‌తో (NHS) కలిసి పనిచేయాలని వెల్లడించింది. ఇది డాక్టర్లకు గొప్ప అవకాశం అనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వం మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే - చూసారా..!) How depressing to see this in the BMJ. It’s hard to say those figures don’t present a compelling argument. It all leads to a big question for the govt: if you don’t address doctors’ very reasonable pay concerns, alongside their conditions and wellbeing, guess where they’re going? pic.twitter.com/24oKKrgfLa — Adam Kay (@amateuradam) May 3, 2023 ముఖ్యంగా యూకేలోని గ్రాడ్యుయేట్ డాక్టర్లను ఆస్ట్రేలియా ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్, ఎమర్జెన్సీ, ఎక్స్పీరియన్స్ వంటివి ఉన్నవారికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కువ శాలరీ కావాలనుకునే డాక్టర్లు ఆస్ట్రేలియన్ అందిస్తున్న ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగంలో చేరేవారికి వసతి సదుపాయం కూడా లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఒక్క యాడ్‌తో సెలబ్రిటీగా మారింది.. ఏం జరిగిందో ఏమో భావోద్వేగ పోస్టు పెట్టి మృతి!
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్‌జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్ట్‌లలో.. తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది. ‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది. స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్రాంతి గదిలో విగతజీవిగా.. ఏడీ అనుమానాస్పద మృతి
సాక్షి, అనంతపురం: పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఎం.రాము (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల విశ్రాంతి గదిలో ఉరికి వేలాడుతుండగా సిబ్బంది మంగళవారం గమనించారు. తలుపులు తెరిచి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తన చావుకు పలువురు కారణమంటూ పేర్లు రాసి ఉన్న లేఖ లభించింది. హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు, కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లాకు చెందిన ఎం.రాముకు భార్య రాణి (ప్రభుత్వ కళాశాల లెక్చరర్), కుమార్తె రిత్విక ఉన్నారు. భార్య, కుమార్తె కర్నూలులో స్థిరపడగా.. రాము మాత్రం పదేళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ప్రస్తుతం డీఆర్డీఏ లైవ్‌స్టాక్ విభాగం డీపీఎంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యాంపు ముగించుకుని విశ్రాంతి గదికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం పశుసంవర్ధక శాఖ కార్యాలయ డ్రైవర్ రామసుబ్బారెడ్డి విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకని మొదటి అంతస్తులోకి వచ్చాడు. చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు) అప్పటికే అక్కడ విశ్రాంతి గది తలుపులు కొంత తెరుచుకుని ఉండటంతో లోపలికి తొంగి చూశాడు. ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతున్న ఏడీని చూసి వెంటనే ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. వన్‌టౌన్ పోలీసులు హుటాహుటిన వచ్చి గదిని పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభించింది. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు పలువురితో సంభాషించినట్లు, గట్టిగా అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయని సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్వతహాగా ఏడీ స్థానికంగా ఎవరితోనూ కలివిడిగా ఉండేవారు కాకపోవడంతో సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తులు, వారి వ్యవహారాల గురించి తెలియదని పేర్కొన్నారు. డ్రైవర్ రామసుబ్బారెడ్డిని ప్రాథమికంగా విచారణ చేశారు. ఏడీ గదికి ఎవరెవరు వచ్చారో.. ఆయన ఏ సమయంలో చనిపోయారో తెలియదని సిబ్బంది తెలిపారు. అయితే తలుపులు తెరిచి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. హత్యా.. ఆత్మహత్యా.. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలుస్తామన్నారు. చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..) ఏడీ సూసైడ్ నోట్లో ఏముందంటే... ‘నా చావుకు కారణం అటెండర్ జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కోట్ల విజయ లవర్ మహేష్. వీరు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినారు. చిక్కబళ్లాపురకు చెందిన నెట్ సెర్ఫ్ వ్యాపార భాగస్వామి మునిరాం, పుట్టపర్తికి చెందిన జియోన్ మెడికల్ షాపు ఓనర్ అశోక్‌కుమార్, ధర్మవరానికి చెందిన మెడికల్ స్టోర్ అశ్వర్థనారాయణ, హరికృష్ణ కల్లూరు స్టాక్ తీసుకుపోయి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. సెమన్ బ్యాంకులో పని చేసే డీసీ హుసేన్, అశోక్‌కుమార్‌లకు నా పేరు మీద ప్రాంసరీ నోటు రాయించి రూ.4లక్షలు ఇప్పించాను. నన్ను మోసం చేసినారు. ధర్మవరంలో 27.50 ఎకరాల భూమి పత్రాలు 925–2022 చెన్నేకొత్తపల్లి’ అంటూ అస్పష్టంగా వివరాలు రాశారు. -
సిక్కిం మరో దేశంగా ప్రభుత్వ ప్రకటన!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం తప్పులో కాలేస్తూ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఇందులో సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఢిల్లీ ప్రభుత్వం హుటాహుటిన తప్పును సరిదిద్దుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్లో వాలంటీర్లుగా చేరాలనుకునేవారి కోసం ప్రకటన విడుదల చేసింది. పలు పత్రికల్లోనూ ఈ యాడ్ అచ్చయింది. అందులో భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కింను కూడా చేర్చింది. దేశంలో అంతర్భాగమైన సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. (ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...) కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి ఇదే అదనుగా భావించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రంగా మండిపడింది. ఈశాన్య ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసిన అర్వింద్ కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది. దీనిపై స్పందించిన ఆప్.. హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రకటన జారీ చేశామని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ప్రకటన సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సదరు ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ దారుణ తప్పుకు కారణమైన సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా సిక్కిం ప్రత్యేక రాష్ట్రంగా 1975 మే 16న అవతరించింది. వారం రోజుల కిందటే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంది. (క్రమశిక్షణతో కొమ్ములు వంచారు) -
సినిమాల్లోకి కోహ్లి..?
ఈ రోజు విరాట్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటోను చూసిని దగ్గర నుంచి అభిమానుల మెదళ్లలో ‘కోహ్లి సినిమాల్లో నటిస్తున్నారా.. ఇంతకు ఏ సినిమా.. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది’ వంటి అనుమానాలు వస్తున్నాయి. అంతేకాక కోహ్లి తన షేర్ చేసిన ఫోటోతో పాటు ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను ’అంటూ కామెంట్ చేశారు. పైగా రిలీజింగ్ డేట్ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఇదే రోజు ఆయన సతీమణి అనుష్క శర్మ నటించిన ‘సూయి ధాగా’ చిత్రం విడుదలవుతోంది. దాంతో ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం.. కోహ్లి సినిమాల్లోకి వస్తున్నారా.. హీరోగానా లేకా తన భార్య అనుష్క చిత్రంలో ఏదైనా గెస్ట్ రోల్లో నటిస్తున్నారా.. అది కాక ఏదైనా షార్ట్ ఫిలింలో నటిస్తున్నారా అంటూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. View this post on Instagram Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie www.trailerthemovie.com A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 20, 2018 at 8:30pm PDT కోహ్లి షేర్ చేసిన ఫోటోలో విరాట్ కోహ్లి ‘ట్రైలర్ ద మూవీ’ అని ఉంది. దీన్ని వాగ్న్ ప్రొడక్షన్ వారు రూపొందిస్తున్నట్లు ఉంది. ఈ ఫోటోలో కోహ్లి సూపర్ హీరో అవతారంలో ఉన్నారు. అంతేకాక ‘పది సంవత్సరాల తర్వాత మరో డెబ్యూ ఇంకా వెయిట్ చేయలేను’ అంటూ కామెంట్ చేశారు. దాంతో పాటు సెప్టెంబర్ 28న విడుదల అవ్వనున్నట్లు తెలిపాడు. వాగ్న్ అనేది ఒక ప్రముఖ చెప్పుట బ్రాండ్. సో కోహ్లి యాడ్ గురించి చెప్పాడా.. లేక తన సిని ఆరంగ్రేటం గురించి చెప్పాడా అన్నది తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడాలి. -
ఆ యాడ్‌ను తొలగిస్తున్నాం..!!
కొచ్చి : ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) డిమాండ్ మేరకు తాము రూపొందించిన యాడ్‌ను అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా బచ్చన్ నందాలతో రూపొందించిన యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉందంటూ బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాడ్‌ను తొలగించనున్నట్లు కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. ‘కేవలం ప్రచారం కోసం రూపొందించిన మా కంపెనీ యాడ్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా మా వ్యాపారంలో కీలక పాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్‌ను తొలగిస్తున్నామంటూ’ ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా నందా తొలిసారి కళ్యాణ్ జువెల్లర్స్ కోసం ఓ యాడ్‌లో నటించారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో కళ్యాణ్ జువెల్లర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. -
జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?
‘బిగ్ బాస్ 11’ మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ‘బిగ్ బాస్ హౌస్’లో ‘మిస్ రైట్’గా పిలుచుకునే హీనా ఖాన్ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, ప్రకటన షూటింగ్ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్లో ‘లీగల్ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్ చానల్ వారు మాత్రం హీనా ఖాన్ అడ్రస్‌తో ఉన్న లీగల్ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హీనా ఖాన్ మ్యూజిక్ వీడియో ‘భసూది’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు. -
అమితాబ్ యాడ్‌పై బ్యాంకర్ల ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఓ యాడ్‌పై బ్యాకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో అమితాబ్‌తో పాటు ఆయన కూతురు శ్వేత బచ్చన్ నందా కూడా నటించారు. ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కల్గించేలా ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) అభిప్రాయపడింది. ఆ కంపెనీపై దావా వేయనున్నట్టు కూడా తెలిపింది. ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ యాడ్ ఉందని ఆరోపించారు. వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ఈ ఆరోపణలను సదరు అభరణాల సంస్థ తోసిపుచ్చింది. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని పేర్కొంది. బ్యాంకర్లు చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు లేఖ రాశారు. -
కూతుళ్లే ఉత్తమం; కితాబిచ్చిన మెగాస్టార్
బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.తాజాగా బిగ్ బీ చేసిన ఒక ట్వీట్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. బిగ్ బీ కుటుంబం నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బిగ్ బీ, తన కూతురు శ్వేతా నందాతో కలిసి ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో నటించారు. ప్రకటనలో కూడా అమితాబ్, శ్వేతా ఇద్దరూ తండ్రి కూతుళ్లుగానే నటించారు. ప్రకటన బంగారు ఆభరణాల కంపెనీకి సంబంధించినదే అయినా భిన్నంగా ఉంటుందంటున్నారు కంపెనీ అధికారులు. ఈ ప్రకటనలో కూతురు శ్వేతాతో కలిసి నటించడం గురించి బిగ్ బీ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. ‘టీ 2870 నాకు చాలా భావోద్వేగమైన సమయం. దీన్ని చూసిన ప్రతిసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లు బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్‌కు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ తండ్రి కూతుళ్ల ప్రకటనకు మంచి స్పందన వస్తుంది. ప్రకటనలో వీరిద్దరి నటనను అభినందిస్తూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. T 2870 - Emotional moment for me .. tears welling up every time I see it .. daughters are the BEST !! pic.twitter.com/7Jes2GDPBo — Amitabh Bachchan (@SrBachchan) July 17, 2018 ప్రస్తుతం బిగ్ బీ బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం 2019, ఆగస్ట్ 15న విడుదల కానున్నట్లు సమాచారం. -
‘మీ అబ్బాయికి సెల్‌ఫోన్ ఇచ్చారా..?’
-
‘మీ అబ్బాయి ఫోన్ వాడుతున్నాడా...?’
గురుగ్రామ్, హర్యానా : స్వలింగ సంపర్కం గురించి ఈ మధ్యకాలంలో మనదేశంలో బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతీయ న్యాయస్మృతిలోని ‘సెక్షన్ 377’తో పాటు మరికొన్ని సెక్షన్లు స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్నాయి. దీంతో సంబంధిత సెక్షన్లలో మార్పులు చేయాలని ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు జరగుతున్నాయి. ‘హోమోసెక్సువల్’/‘గే’/‘లెస్బియన్’గా మారడానికి కారణం హర్మోన్ల ప్రభావమని డాక్టర్లు చెప్తున్న తరుణంలో ఒక ప్రముఖ వార్త పత్రికలో వచ్చిన ప్రకటన ఇప్పుడు అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ప్రకటనలో ‘పెళ్లికి ముందే మీ కుమారుడు లేదా కూతురు ‘గే’ లేదా ‘లెస్బియనా’ అనే విషయం తెలుసుకొండి’ అంటూ ఫోన్ నంబరు కూడా ఇచ్చాడు గుర్గావ్కు చెందిన ఓ నకిలీ వైద్యుడు. ఈ ప్రకటనను కాస్తా ఎవరో ఫేస్బుక్లో పోస్టు చేశారు. దాంతో ఈ డాక్టరు గారి కథేంటో తెలుసుకుందామని ఓ యువతి ప్రకటనలో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో సదరు యువతి తనకు 40 ఏళ్లని, తన కుమారుడికి 17 ఏళ్లని పరిచయం చేసుకుంది. అవతలి వ్యక్తి తనను తాను ‘వైద్యుడి’గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు ‘డాక్టరు’ ఆ మహిళను ఎక్కువ ప్రశ్నలేమి వేయకుండానే ఆమె కొడుకును ‘గే’ అని తెల్చేశాడు. ‘గే అంటే అర్ధం తెలుసు కదా...!’అని సదరు మహిళను ప్రశ్నించాడు. అంతేకాక ‘నీ కుమారుడికి బాగా కోపం వస్తుందా’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు’ అని సమాధానమిచ్చింది. అందుకు ఆ వైద్యుడు ‘అతడు లోపల బాధపడుతున్నాడు. మీ అబ్బాయి గే అనే విషయం అతనికే తెలియదు. అందుకే ఆ విషయం గురించి మీతో చెప్పడం లేదు అన్నాడు.’ అంతేగాక ‘అమెరికాలో దాదాపు 40 శాతం పురుషులు ‘గే’లే’ అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. ఒక వ్యక్తి ‘గే’గా మారాడానికి ఈ వైద్యుడు చెప్పిన కారణం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఫోన్ సంభాషణలో భాగంగా సదరు వైద్యుడు ‘మీ అబ్బాయికి సెల్‌ఫోన్ ఇచ్చారా..?’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘అవున’ అన్నారు. ఇంకేముంది ఆ వైద్యుడు ‘నీ కొడుకు ‘గే’గా మారడానికి కారణం సెల్‌ఫోనే’ అని తెల్చేశాడు. అందుకు ఆ మహిళ ముందు ఆశ్చర్యపోయినా తరువాత అమాయకంగా ‘ఫోన్ వాడకుండా ఉంటే నా కొడుకు మాములుగా మారతాడా...?’ అని ప్రశ్నించింది. అందుకు ఆ డాక్టర్ మీరు హౌస్‌వైఫ్ అయ్యుంటారన్నాడు. తర్వాత ఫోన్ నుంచి విడుదలయ్యే ‘అతినీలలోహిత’ కిరణాల వల్ల పురుషులు ‘గే’ గా మారతారని చెప్పాడు. అందుకు ఆ మహిళ ‘నేనూ ఫోన్లో మాట్లాడుతున్నాను కదా...నేను ‘గే’గా మారతానా అని ప్రశ్నించగా అందుకు ఆ డాక్టర్ అలా ఏం ఉండదు ఎందుకంటే స్త్రీలలో ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా ఒక వేళ పురుషుల్లో కూడా ఈ ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉన్నట్లయితే వారు ‘గే’గా మారే అవకాశం చాలా తక్కువని వారికి పుట్టే పిల్లలు కూడా ‘గే’గా మారే అవకాశం తక్కువని తెల్చేశాడు. అంతేకాక తాను వైద్యం చేసి సదరు మహిళ కొడుకుకు నయం చేస్తానని అందుకు అతని ఫోటో కావాలని అడిగాడు. ‘గే’ నుంచి మాములు మనిషిగా మార్చడానికి కొన్ని ‘శక్తుల కషాయాల’ను ఆ మహిళ కొడుకు శరీరంలోకి పంపించాలని అందుకు ఖర్చవుతుందని తెలిపాడు.ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వరుడి కోసం ఫేస్బుక్లో ప్రకటన.. వైరల్!
న్యూఢిల్లీ : ఇన్ని రోజులు ఫేస్బుక్ అంటే ఫోటోలు, వీడియోలు షేర్ చేయడానికి మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇక మీదట ‘మ్యాట్రిమొనియల్’గా కూడా మారనుందా? కేరళకు చేందిన ఓ యువతి ఫేస్బుక్లో చేసిన పోస్టు చూస్తే నిజమే అనిపిస్తుంది ఎవరికైనా. తనకు వరడు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన చేసింది ఈ యువతి. వివారాల్లోకి వెళ్తే కేరళ మలప్పురంకు చెందిన జ్యోతి కేజీ(28) తనకు వరుడు కావాలంటు పోయిన వారం ఫేస్బుక్ మ్యాట్రిమొని హాష్‌టాగ్‌ను ఉపయోగించి చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం వైరల్ అయ్యింది. జ్యోతి చేసిన ప్రకటనలో ఉన్న వివరాలు...‘నా పేరు జ్యోతి. నా వయసు 28 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు మరణించారు. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతను ముంబైలో సీనియర్ యాడ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. నేను బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేసాను. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్నాను. మీకు తెలిసిన వారిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే నాకు తెలియజేయండి. నేను కులం, జాతకాల గురించి పట్టించుకోను’ అని మలాయాళంలో పోస్టు చేసింది. అంతేకాక ఫేస్బుక్ నెట్వర్కలో ఫేస్బుక్ మ్యాట్రిమొనియల్ ఫీచర్‌ను ప్రారంభించమని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు విన్నపం చేసింది. తనలానే చాలామంది సరైన జీవిత భాగస్వామి వెతుకుతున్నారని, ఒకవేళ ఫేస్బుక్ మెయిన్ నెట్‌వర్క్‌లో ఎఫ్బీ మ్యాట్రిమొనిని ప్రారంభిస్తే తనలాంటి అనేకమంది అవివాహితులకు చాలా మేలు చేసిన వారవుతారని తెలిపింది. చాలామంది సరైన జీవిత భాగస్వామిని పొందడం కోసం మ్యాట్రిమొనిలు, మధ్యవర్తుల బారినపడి మోసపోతున్నారని అందువల్ల ఎఫ్బీ మ్యాట్రీమొనీని ప్రారంభిస్తే వారందరికీ తగిన జీవితభాగస్వామిని ఎన్నుకునేందుకు మార్గం సులువవుతుందని విన్నవించింది. జ్యోతి ఏప్రిల్ 26న చేసిన ఈ పోస్టు వైరల్ అయ్యింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 6 వేల మంది దీన్ని షేర్ చేశారు. జీవిత భాగస్వామి కోసం ఇలా ఫేస్బుక్ ప్రకటన చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కేరళకు చెందిన రంజిష్ మంజేరి అనే ఫోటోగ్రాఫర్ తనకు వధువు కావాలంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటన చేశాడు. -
నీరవ్ మోదీ స్ఫూఫ్ యాడ్ చూశారా?
-
డిజిటల్ ప్రకటనల రంగం రూ.13,000 కోట్లకు!
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ ప్రకటనలపై చేసే వ్యయాలు 2018 డిసెంబర్ నాటికి 35 శాతం వృద్ధితో రూ.13,000 కోట్లకు చేరే అవకాశం ఉందని అసోచామ్, కేపీఎంజీ సర్వే తెలిపింది. స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరుగుతూ ఉండడం, డేటా టారిఫ్‌లు తగ్గిపోవడం డిజిటల్ ప్రకటనల మార్కెట్‌ను విస్తృతం చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. ప్రస్తుతం ఈ మార్కెట్ రూ.9,800 కోట్లుగా ఉంది. 3జీ, 4జీ సేవల విస్తృత వినియోగంతో ఈ మార్కెట్ భారీగా పెరగనుందన్న అభిప్రాయాలు ఈ సర్వేలో వ్యక్తమయ్యాయి. 2016 చివరికి డిజిటల్ ప్రకటనల మార్కెట్ రూ.7,500 కోట్లుగానే ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. 23.5 కోట్ల మంది మొబైల్స్ నుంచి ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్టు తెలిపింది. -
డీఎస్ కుమారుడి ‘ప్రకటన’ కలకలం
► జనమంతా మోదీ వెంట నిలవాలని జాతీయస్థాయి ► పత్రికకు భారీ ప్రకటన ► రాజకీయంగా చర్చనీయాంశం ► ఆ ప్రకటనతో సంబంధం లేదన్న డి.శ్రీనివాస్ సాక్షి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత డి.శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి’’అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీ యాంశమైంది. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీ సీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్ తాజా ప్రకటనతో డీఎస్ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ ఖండించారు. అంటీముట్టనట్లుగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ అవకాశం కల్పించా రు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్.. కొంతకాలంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహ రించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఐదు నెలల క్రితం టీఆర్ఎస్ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంత కాలంగా టచ్‌లో ఉంటోంది. అరవింద్ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్‌షాను కలసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్‌ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు. పార్టీ వీడను: డి.శ్రీనివాస్ ‘‘నా కుమారుడు అరవింద్ ఇచ్చిన ప్రకటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్ఎస్ను వీడేది లేదు. కేసీఆర్ వెంటే ఉంటాను. అరవింద్ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్ కూడా బీజేపీలో చేరతాడని అనుకోవడం లేదు’’ అని డీఎస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
విద్యుత్‌శాఖ ఏడీ ప్రసాద్ బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్‌శాఖ ట్రాన్స్ఫార్మర్ విభాగం ఏడీఈ ప్రసాద్‌ను హిందూపురానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాజశేఖర్‌రావును అనంతపురానికి బదిలీ చేస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీబీఐ వలలో ఎమ్ఎస్ఎమ్ఈ ఏడీ
రూ.3.7లక్షల నగదు, 23లక్షల ప్రామిసరీ నోట్స్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేటు కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేసిన ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో, స్మాల్, అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎల్ఎన్ కుమార్‌ను సీబీఐ వలపన్ని అరెస్ట్ చేసింది. ఖాజాగూడకు చెందిన శైలజ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రతీ ఏటా నిర్వహించే తనిఖీలకు సంబంధించి కంపెనీకి అనుకూలంగా నివేదికిస్తానని చెప్పి ఎస్ఎల్ఎన్ కుమార్ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కంపెనీ యాజమాన్యం ఈ నెల 20న సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సీబీఐ అధికారులు వలవేసి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా కుమార్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు రూ.3.7లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన ప్రామిసరీనోట్లు, చెక్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీ నం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన కుమార్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవే శపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. -
ట్రంప్‌ను విమర్శిస్తూ ఎయిర్‌లైన్స్ యాడ్
అమెరికా అధ్యక్షపీఠ ఎన్నికల ఫలితాలు డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు షాకిస్తూ.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు దూసుకెళ్తున్నాయి. అంచనాలకు తారుమారుగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఊహించని రిజల్ట్స్‌కు ముందుగానే ప్రిపేర్ అయిన రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్ డొనాల్డ్ ట్రంప్ పై ఓ అడ్వర్టైజ్మెంట్ విడుదల చేసింది. ఆ ప్రకటనలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించింది. ''ఒకవేళ అతను గెలిచినా, అమెరికా ప్రయాణానికి మీకు ఎప్పటికీ అనుమతి ఉంటుంది'' అని ఎయిర్‌లైన్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో పాటు, చికాగో, డెట్రాయిట్, న్యూయార్క్‌లకు విమాన రేట్ల ధరలను కూడా తెలిపింది. గత సాయంత్రం ఈ ఎయిర్‌లైన్ సంస్థ చేసిన ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. 2,560 రీట్వీట్స్, 1,874 లైక్స్ అది సొంతంచేసుకుంది. అయితే మొదటినుంచి డొనాల్డ్ ట్రంప్ తను గెలిస్తే, ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా అమెరికాలోకి వచ్చే వలసవాదులపై కూడా తను మండిపడుతున్నారు. వారెవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనీయమని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎయిర్‌లైన్స్ సంస్థ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగ, రాయల్ జోర్డానియన్, జోర్డాన్‌కు చెందిన విమానయాన సంస్థ. అక్కడ ఎక్కువగా ముస్లింలు ఉంటారు. -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది. -
ట్విట్టర్లో వివాదాస్పదమైన యాడ్
ఎలెన్ డిజెనరస్ పిల్లల దుస్తులను ప్రచారం చేసేందుకు గ్యాప్ కిడ్స్ సంస్థ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో పెట్టిన యాడ్ వివాదాస్పదమైంది. యాడ్ జాతి వివక్షతను చూపుతోందని పలువురు విమర్శలు కుప్పించారు. ఓ నల్లజాతి బాలిక నెత్తిపై ఓ తెల్లజాతి బాలిక కుడి మోచేతిని ఆనించినట్లుగా ఫొటో ఉండడం పట్ల అందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఆ యాడ్‌లో ఎక్కువ మంది తెల్లజాతీయులను పెట్టి ఒకే ఒక నల్లజాతి బాలికను చూపడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ‘బాలికలు ఏదైనా సాధించగలరనే పిల్లలను చూడండి’ అనే కాప్షన్‌తో, ‘పరస్పరం సాధికారత సాధించే సామర్థ్యం మా అందరికి ఉంది’ అనే ట్యాగ్‌లైన్‌తో యాడ్ సాగుతుంది. సాధికారత సాధించడమంటే ఇదేనా, తెల్లజాతి బాలిక మోచేతి బరువు మోయడమా? అని ఒకరు, నల్లపిల్ల కాకపోతే ఏమైనా సాధించగమన్న అర్థమా, నల్ల పిల్లలు కేవలం తెల్ల పిల్లల మోచేతులు మోయడానికే పనికొస్తారని చెప్పడమా యాడ్ ఉద్దేశం అంటూ మరొకరు, అసలు యాడ్‌లో ఒక్క నల్ల పిల్లను మాత్రమే ఎందుకు తీసుకున్నారంటూ ఇంకొకరు విరుచుకుపడ్డారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, క్షమాపణలు చెబుతున్నామని, ఎవరని నొప్పించడం తమ ఉద్దేశం కాదని గ్యాప్ కిడ్స్ వెంటనే ఓ ప్రకటనను విడుదల చేసింది. వెంటనే ప్రత్యామ్నాయ యాడ్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. నిజ జీవితంలో ఏదో ఒకటి సాధించిన వాళ్లనే తమ యాడ్‌కు ఎంపిక చేస్తున్నామని కూడా తెలిపింది. -
వారాహీమాత ఆలయం
అరుదైన శాక్తేయ ఆలయాల్లో ఒకటైన వారాహీమాత ఆలయం ఒడిశాలోని పూరీ జిల్లా చౌరాసి గ్రామంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో సోమవంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం కళింగ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో వెలసిన ఈ ఆలయం ఎత్తు 15 మీటర్లకు పైబడే ఉంటుంది. లలితాసన భంగిమలో కనిపించే వారాహీమాతను స్థానికులు మత్స్యవారాహిగా ఆరాధిస్తారు. వరాహ ముఖంతో కుడిచేత మత్స్యం, ఎడమచేత కుంభం ధరించి కనిపించే వారాహిమాత మూలవిరాట్టు ఉగ్రరూపంలో కనిపిస్తుంది. తాంత్రిక పద్ధతిలో ఇక్కడ రోజువారీ పూజలు చేస్తారు. అలాగే అమ్మవారికి అనుదినం చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే, పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో రోజూ జరిగే మహానైవేద్యాలను ఈ ఆలయానికి పంపడం తరతరాలుగా ఆచారంగా కొనసాగుతుండటం విశేషం. వారాహీమాత వెలసిన చౌరాసి గ్రామం సుప్రసిద్ధ సూర్యక్షేత్రం కోణార్క్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వరకు అన్ని ప్రాంతాల నుంచి విమాన, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడకు రోడ్డు మార్గంలో రావాల్సి ఉంటుంది.