అమితాబ్‌ యాడ్‌పై బ్యాంకర్ల ఆగ్రహం | Bankers Angry On Amitabh Bachchan Jewellery Ad | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ యాడ్‌పై బ్యాంకర్ల ఆగ్రహం

Published Thu, Jul 19 2018 9:39 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Bankers Angry On Amitabh Bachchan Jewellery Ad - Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ఓ యాడ్‌పై బ్యాకింగ్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో అమితాబ్‌తో పాటు ఆయన కూతురు శ్వేత బచ్చన్‌ నందా కూడా నటించారు. ఈ యాడ్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై అపనమ్మకం కల్గించేలా ఉందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కన్ఫడరేషన్‌(ఏఐబీవోసీ) అభిప్రాయపడింది. ఆ కంపెనీపై దావా వేయనున్నట్టు కూడా తెలిపింది. ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా మాట్లాడుతూ.. బ్యాంకింగ్‌ వ్యవస్థను దెబ్బతీసేలా  ఈ యాడ్‌ ఉందని ఆరోపించారు. వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కాగా ఈ ఆరోపణలను సదరు అభరణాల సంస్థ తోసిపుచ్చింది. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని పేర్కొంది. బ్యాంకర్లు చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు  లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement