Shweta Bachchan Nanda
-
ఆ రహస్యం... అందరూ తెలుసుకోవాల్సిందే!
అమితాబ్, జయబచ్చన్ల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కూతురు శ్వేతా బచ్చన్ నందా ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది. తల్లిదండ్రుల వివాహబంధం గోల్డెన్ జూబ్లీలోకి ప్రవేశించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసింది శ్వేత.‘సుదీర్ఘకాల అన్యోన్య దాంపత్యం వెనుక రహస్యం ఏమిటి?’ అని తల్లిని అడిగింది. జయ బచ్చన్ చెప్పిన జవాబు... ‘లవ్’! ‘ఏ విభేదాన్ని అయినా పక్కన పెట్టే, ఏ కష్టాన్ని అయినా తట్టుకునే శక్తి ప్రేమకు ఉంటుంది’ అని నెటిజనులు కామెంట్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో నేపథ్యంలో నెల వ్యవధిలోనే విడాకులు తీసుకుంటున్న నవదంపతుల నుంచి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగాలూ, ఆప్యాయతల వరకు ఎన్నో అంశాలపై నెటిజనులు లోతుగా చర్చించుకుంటున్నారు. -
అమితాబ్ తనయ శ్వేతా బచ్చన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు
ముంబై: ఇటీవల పట్టభద్రురాలైన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ఇంతలోనే స్వంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించారు. నవ్వ నవేలి నందా బిగ్‌బీ తనయురాలు శ్వేత బచ్చన్ నందా కూతురు. ఆమె న్యూయార్స్‌లోని ఫోర్థామ్‌యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇటీవల పట్టా పొందారు. ‘ఆరా హెల్త్’ ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆరాహెల్త్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్య షేర్ చేశారు. ‘ఆరాహెల్త్’ అనేది మహిళ సాధికారితకు తోడ్పాటు అందించే వేదికని పేర్కొన్నారు. కాగా, నవ్య ప్రారంభించిన ఈ కొత్త వెంచర్లో ఆమెతోపాటు సభ్యులుగా అహిల్యా, మెహతా, మల్లికా సాహ్నీ, ప్రజ్ఞ సాబూలు ఉన్నారు. ‘మేము ఒక సాధారణ సమస్యను పరిష్కరించడానికి కలిసి వచ్చిన స్వతంత్ర యువతులం. మా విభిన్న నేపథ్యాలు, భవాలు కలిగి ఇతర మహిళలను శక్తివంతం చేయడంలో సహాయపడటానికి మాకు స్ఫూర్తినిచ్చాయి’ అంటూ ఆరాహెల్త్ అధికారిక ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు. ఇక నవ్య కొత్త వెంచర్‌ను ఆమె తల్లి శ్వేతా బచ్చన్ ప్రమోట్ చేస్తూ.. ‘ధైర్యవంతమైన యువతులు... ఇప్పటి నుంచి ఎప్పటికీ’ అంటూ కామెంట్ పెట్టారు. View this post on Instagram We are young and independent women who have come together to solve a common problem that has not been given the attention it deserves. Our different backgrounds and experiences have inspired us to help empower other women! Ahilya Mehta @ahilyamehta Mallika Sahney @mallika414 Navya Nanda @navyananda Pragya Saboo @pragyasaboo A post shared by Aara Health (@aarahealth) on May 11, 2020 at 6:36am PDT గత వారం శ్వేతా బచ్చన్ నవ్వ గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసిన సందర్భంగా ముంబైలోని తమ జల్సా నివాసంలో పార్టీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్వేతా పంచుకున్నారు. ‘2020 క్లాస్.. ఈ ఏడాది నవ్వ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పట్టభద్రురాలైంది. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసన ప్రతి ఒక్కరికీ ఒక వేడుక రాదు కాబట్టి మేము నవ్వను ప్రత్యేకంగా ఉంచాలని నిర్ణయించుకున్నాము. ఐ లవ్ యూ బేబీ. నిన్ను చూసిన గర్వపడుతున్నాను’ అంటూ షేర్ చేశారు. -
‘హ్యాపీ బర్త్ డే.. మై బేబీ’
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నేడు 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడి సతీమణి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. అభిషేక్ చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన ఐశ్వర్య.. ‘హ్యాపీ బర్త్ డే మై బేబీ’ అంటూ క్యాప్షన్ జత చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మూడున్నర లక్షలకు పైగా లైకులు రావడంతో పాటు అభిషేక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిషేక్ సోదరి శ్వేతా నందా కూడా అభిషేక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లిద్దరి చిన్ననాటి ఫొటో షేర్ చేశారు. కాగా బిగ్ బీ అమితాబ్- జయా బచ్చన్ల కుమారుడైన అభిషేక్ ‘రెఫ్యూజీ’ సినిమాతో 2000వ సంవత్సరంలో తెరంగేట్రం చేశాడు. హీరోగా కొనసాగుతూనే సపోర్టింగ్ రోల్స్‌తో ఆకట్టుకునే అభిషేక్.. వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమానిగా, ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నైయాన్ ఎఫ్‌సీ జట్టు సహయజమానిగా కొనసాగుతున్నాడు. ఇక అభిషేక్ బచ్చన్ 2007లో ఐశ్వర్య రాయ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. View this post on Instagram 🥰always...My Baby😘HAPPY HAPPY BIRTHDAY BAAABYYY💖✨🤗💝⭐️ A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Feb 4, 2019 at 11:18am PST View this post on Instagram Love you beyond words and reason ♥️ A post shared by S (@shwetabachchan) on Feb 4, 2019 at 11:00am PST -
‘నా కూతురుకి ఆ పరిస్థితి రాకూడదనే’
ప్రస్తుతం బాలీవుడ్లో వారసులు హవా కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన కూతుర్ని మాత్రం సినిమాల్లోకి పంపించనంటున్నారు శ్వేతా బచ్చన్ నందా. సోదరుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్ షో’కు హాజరయ్యారు శ్వేతా బచ్చన్. ఈ సందర్భంగా తన కూతురు నవ్య గురించి మాట్లాడుతూ.. ‘తనకు ఈ రంగం అంటే చాలా ఇష్టం, గౌరవం ఉండి.. సొంతంగా రాణించగలను అనే ధైర్యం ఉంటే ఫర్వాలేదు. అలాకాకుండా కేవలం కొందరు ప్రముఖ వ్యక్తుల కుటుంబానికి చెందిన మనిషిగా తాను ఈ రంగంలోకి వస్తే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. దాని బదులు మరో కెరీర్‌ను ఎంచుకోవడమే ఉత్తమం’ అని అన్నారు. శ్వేత మాట్లాడుతూ.. ‘ఈ రంగం పట్ల నవ్యకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు ఇంకా తెలియదు. తను సిని రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు’ అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పారు శ్వేత. ‘మా కుటుంబంలో తొలి తరం అంతా సినిమాల్లోనే ఉన్నారు. రెండో తరంలో మా అన్నయ్య, వదిన కూడా సినిమాల్లోనే ఉన్నారు. సినిమాలు సరిగా ఆడనప్పుడు వారే పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సినిమా స్టార్ అవ్వడం వల్ల జనాలు మా కుటుంబ సభ్యులు గురించి ఎలా మాట్లాడతారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను’ అన్నారు. ‘ముఖ్యంగా అభి గురించి. అమితాబ్ బచ్చన్ కొడుకు అయినందువల్లే చాలా ఇజీగా సినిమాల్లోకి వచ్చాడు. అంతే తప్ప అతని ప్రయత్నం ఏం లేదు అంటూ తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నేను కూడా తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటాను. అక్కడ జనాలు తన గురించి మాట్లాడే మాటలు చూసి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుడదనే ఉద్దేశంతోనే తనను సినిమాల్లోకి పంపించకూడదని అనునుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు శ్వేత. -
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం
న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్కార్ట్స్ గ్రూప్ చైర్మన్, అమితాబ్ బచ్చన్ వియ్యంకుడు రాజన్ నందా గుర్గావ్ ఆసుపత్రిలో నిన్న రాత్రి చనిపోయినట్టు తెలిసింది. రాజన్ నందా, అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ నందాకు మామయ్య. రాజన్ నందా కొడుకు నికిల్ నందాను శ్వేతా పెళ్లి చేసుకున్నారు. రాజన్ నందా చనిపోయినట్టు తెలియగానే బ్రహ్మాస్త్ర షూటింగ్లో భాగంగా బల్గేరియాలో ఉన్న అమితాబ్ బచ్చన్ భారత్‌కు బయలుదేరారు. రాజన్ నందా కొన్ని గంటల క్రితమే స్వర్గస్తులయ్యారని అమితాబ్ తన బ్లాగ్ పోస్టు ద్వారా వెల్లడించారు. రాజన్ నందా.. ‘మా బంధువు రాజన్ నందన్, నికిల్ తండ్రి, శ్వేత మామగారు మృతిచెందారు. భారత్‌కు బయలుదేరి వస్తున్నా’ అంటూ బిగ్ బి తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. ఎస్కార్ట్స్ గ్రూప్‌కు రాజన్ నందా చైర్మన్‌గా ఉండగా.. నికిల్ నందా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాజన్ నందా, రాజ్ కపూర్ పెద్ద కూతురు రీతు నందాను పెళ్లి చేసుకున్నారు. రాజన్ నందా, రీతు నందాలకు నికిల్, నటాషాలు పిల్లలు. రాజన్ నందా మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేస్తున్నారు. నందా కుటుంబానికి బంధువు అయిన.. రిషి, నీతూ కపూర్ల కూతురు రిద్ధిమా కపూర్ సాహ్ని కూడా రాజన్ నందా మృతి వార్తను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మీరు మాకెప్పుడు లెజెండే. మమల్ని ఎప్పుడూ ప్రేమించినందుకు కృతజ్ఞతలు. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాం అంకుల్. రిప్ అంకుల్ రాజన్’ అని రాజన్ నందాకు నివాళులర్పించారు. 🙏🙏🙏🙏 https://t.co/ASQy6h5yPw — Amitabh Bachchan (@SrBachchan) August 5, 2018 🙏🙏🙏🙏 https://t.co/03bIsAjfqc — Amitabh Bachchan (@SrBachchan) August 5, 2018 -
బాలీవుడ్ మెగా డాటర్ ఫోటోలు
-
ఆ యాడ్‌ను తొలగిస్తున్నాం..!!
కొచ్చి : ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) డిమాండ్ మేరకు తాము రూపొందించిన యాడ్‌ను అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా బచ్చన్ నందాలతో రూపొందించిన యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉందంటూ బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాడ్‌ను తొలగించనున్నట్లు కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. ‘కేవలం ప్రచారం కోసం రూపొందించిన మా కంపెనీ యాడ్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా మా వ్యాపారంలో కీలక పాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్‌ను తొలగిస్తున్నామంటూ’ ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం కలిగించే చర్యలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా అమితాబ్ బచ్చన్, ఆయన కూతురు శ్వేతా నందా తొలిసారి కళ్యాణ్ జువెల్లర్స్ కోసం ఓ యాడ్‌లో నటించారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తడంతో కళ్యాణ్ జువెల్లర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. -
అమితాబ్ యాడ్‌పై బ్యాంకర్ల ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఓ యాడ్‌పై బ్యాకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో అమితాబ్‌తో పాటు ఆయన కూతురు శ్వేత బచ్చన్ నందా కూడా నటించారు. ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కల్గించేలా ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) అభిప్రాయపడింది. ఆ కంపెనీపై దావా వేయనున్నట్టు కూడా తెలిపింది. ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ యాడ్ ఉందని ఆరోపించారు. వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ఈ ఆరోపణలను సదరు అభరణాల సంస్థ తోసిపుచ్చింది. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని పేర్కొంది. బ్యాంకర్లు చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు లేఖ రాశారు. -
కూతుళ్లే ఉత్తమం; కితాబిచ్చిన మెగాస్టార్
బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.తాజాగా బిగ్ బీ చేసిన ఒక ట్వీట్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. బిగ్ బీ కుటుంబం నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బిగ్ బీ, తన కూతురు శ్వేతా నందాతో కలిసి ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో నటించారు. ప్రకటనలో కూడా అమితాబ్, శ్వేతా ఇద్దరూ తండ్రి కూతుళ్లుగానే నటించారు. ప్రకటన బంగారు ఆభరణాల కంపెనీకి సంబంధించినదే అయినా భిన్నంగా ఉంటుందంటున్నారు కంపెనీ అధికారులు. ఈ ప్రకటనలో కూతురు శ్వేతాతో కలిసి నటించడం గురించి బిగ్ బీ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. ‘టీ 2870 నాకు చాలా భావోద్వేగమైన సమయం. దీన్ని చూసిన ప్రతిసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లు బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. అమితాబ్ ట్వీట్‌కు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ తండ్రి కూతుళ్ల ప్రకటనకు మంచి స్పందన వస్తుంది. ప్రకటనలో వీరిద్దరి నటనను అభినందిస్తూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. T 2870 - Emotional moment for me .. tears welling up every time I see it .. daughters are the BEST !! pic.twitter.com/7Jes2GDPBo — Amitabh Bachchan (@SrBachchan) July 17, 2018 ప్రస్తుతం బిగ్ బీ బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం 2019, ఆగస్ట్ 15న విడుదల కానున్నట్లు సమాచారం. -
ఎప్పటికి నీ చేతిని వదలను...
తండ్రి...అంటే బాధ్యత, భరోసా. మనకు ఏ కష్టం వచ్చిన నాన్న ఉన్నాడనే నమ్మకం. తండ్రి ఏ స్థాయిలో ఉన్న తన పిల్లలకు మాత్రం నాన్నే. కడవరకూ మన చేతిని వదలనని ప్రమాణం చేస్తాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ బీగ్ బీ చాలా క్యూట్‌గా చెప్పారు. తాజగా బిగ్ బీ తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్టు చేసిన ఒక ఫోటోకి తెగ లైక్‌లు, మంచి కామెంట్లు వస్తున్నాయి. బిగ్ బీ పోస్టు చేసిన ఆ ఫోటోలో ఓ వైపు తన కూతురు చిన్నారి శ్వేతను ఎత్తుకుని, ఆమె చేతిని పట్టుకుని ఉండగా మరో వైపూ ఉన్న ఫోటోలో తండ్రి కూతుళ్లు చేతిలో చేయి వేసుకుని కారిడార్‌లో నడుస్తున్న ఫోటో. ఈ ఫోటోతో పాటు దీనికి బిగ్ బీ ఇచ్చిన క్యాప్షన్ మరింత ఎక్కువ మంది హృదయాలను కొల్లగొట్టింది. ‘నేను తన చేతిని పట్టుకున్నాను...ఇప్పటికి ఆ చేతిని వదలలేదు...ఇంకేప్పటికి వదలను...నా తొలి సంతోషం శ్వేత’ అని పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోను 3 లక్షల మంది లైక్ చేశారు. I held her hand then .. I hold it now .. and shall ever do so .. Shweta my first born ..❤️🌷😍 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 18, 2018 at 8:57pm PDT -
ఫ్యాషన్ షోలో మెరిసిన మెగాస్టార్ కూతురు
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతా బచ్చన్ నందా ఓ ఫ్యాషన్‌లో పాల్గొన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఈ షోలో 42 ఏళ్ల శ్వేత తెల్లని వస్త్రాలు ధరించి తళుక్కున మెరిశారు. ఈ షోలో ఆమె టాపర్‌గా నిలిచారు. శ్వేత పాల్గొన్న ఫ్యాషన్ షోను తిలకించేందుకు ఆమె తల్లిదండ్రులు జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ విచ్చేశారు. అభిషేక్ బచ్చన్ కూడా ఈ షోకు వచ్చి సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షోలో శ్వేత నడుస్తున్నప్పుడు అమితాబ్ మొబైల్‌తో వీడియో తీశారు. షూటింగ్‌తో బిజీగా ఉన్నా అభిషేక్ తీరిక చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, దర్శకుడు అభిషేక్ కపూర్, ఆమె భార్య ప్రగ్నా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.