
ఫ్యాషన్ షోలో మెరిసిన మెగాస్టార్ కూతురు
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతా బచ్చన్ నందా ఓ ఫ్యాషన్లో పాల్గొన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఈ షోలో 42 ఏళ్ల శ్వేత తెల్లని వస్త్రాలు ధరించి తళుక్కున మెరిశారు. ఈ షోలో ఆమె టాపర్గా నిలిచారు.
శ్వేత పాల్గొన్న ఫ్యాషన్ షోను తిలకించేందుకు ఆమె తల్లిదండ్రులు జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ విచ్చేశారు. అభిషేక్ బచ్చన్ కూడా ఈ షోకు వచ్చి సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షోలో శ్వేత నడుస్తున్నప్పుడు అమితాబ్ మొబైల్తో వీడియో తీశారు. షూటింగ్తో బిజీగా ఉన్నా అభిషేక్ తీరిక చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, దర్శకుడు అభిషేక్ కపూర్, ఆమె భార్య ప్రగ్నా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.