
అమితాబ్, జయబచ్చన్‌ల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కూతురు శ్వేతా బచ్చన్ నందా ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది.
తల్లిదండ్రుల వివాహబంధం గోల్డెన్ జూబ్లీలోకి ప్రవేశించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేసింది శ్వేత.‘సుదీర్ఘకాల అన్యోన్య దాంపత్యం వెనుక రహస్యం ఏమిటి?’ అని తల్లిని అడిగింది.
జయ బచ్చన్ చెప్పిన జవాబు... ‘లవ్’! ‘ఏ విభేదాన్ని అయినా పక్కన పెట్టే, ఏ కష్టాన్ని అయినా తట్టుకునే శక్తి ప్రేమకు ఉంటుంది’ అని నెటిజనులు కామెంట్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటో నేపథ్యంలో నెల వ్యవధిలోనే విడాకులు తీసుకుంటున్న నవదంపతుల నుంచి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగాలూ, ఆప్యాయతల వరకు ఎన్నో అంశాలపై నెటిజనులు లోతుగా చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment