ఎప్పటికి నీ చేతిని వదలను... | Amitabh Bachchan Post His Daughter Cutest Photo In Instagram | Sakshi
Sakshi News home page

ఎప్పటికి నీ చేతిని వదలను...

Published Sun, May 20 2018 8:59 AM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

Amitabh Bachchan Post His Daughter Cutest Photo In Instagram - Sakshi

కూతురు చిన్నారి శ్వేతతో అమితాబ్‌ బచ్చన్‌

తండ్రి...అంటే బాధ్యత, భరోసా. మనకు ఏ క​ష్టం వచ్చిన నాన్న ఉన్నాడనే నమ్మకం. తండ్రి ఏ స్థాయిలో ఉన్న తన పిల్లలకు మాత్రం నాన్నే. కడవరకూ మన చేతిని వదలనని ప్రమాణం చేస్తాడు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ బీగ్‌ బీ చాలా క్యూట్‌గా చెప్పారు. తాజగా బిగ్‌ బీ తన ఇన్‌ స్టా గ్రామ్‌లో పోస్టు చేసిన ఒక ఫోటోకి తెగ లైక్‌లు, మంచి కామెంట్‌లు వస్తున్నాయి. బిగ్‌ బీ పోస్టు చేసిన ఆ ఫోటోలో ఓ వైపు తన కూతురు చిన్నారి శ్వేతను ఎత్తుకుని, ఆమె చేతిని పట్టుకుని ఉండగా మరో వైపూ ఉన్న ఫోటోలో తండ్రి కూతుళ్లు చేతిలో చేయి వేసుకుని కారిడార్‌లో నడుస్తున్న ఫోటో. ఈ ఫోటోతో పాటు దీనికి బిగ్‌ బీ ఇచ్చిన క్యాప్షన్‌ మరింత ఎక్కువ మంది హృదయాలను కొల్లగొట్టింది. ‘నేను తన చేతిని పట్టుకున్నాను...ఇప్పటికి ఆ చేతిని వదలలేదు...ఇంకేప్పటికి వదలను...నా తొలి సంతోషం శ్వేత’ అని పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోను 3 లక్షల మంది లైక్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement