Instagram post
-
ఫుడ్ డెలివరీకి ప్లాస్టిక్ కంటైనర్లు ప్రమాదం: జొమాటో సీఈఓ రిప్లై ఇదే..
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, లైఫ్‌స్టైల్ ఎక్స్పర్ట్ 'ల్యూక్ కౌటిన్హో' తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ సర్వేస్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం గురించి తన భయాన్ని తెలియజేసారు. వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ల వాడకం అనారోగ్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లను ఫుడ్ డెలివరీ చేయడానికి ఉపయోగించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరారు.స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు.. బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ డెలివరీలు జరిగేలా చూడాలని విన్నవించారు. మంచి ఆహారాన్ని మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరారు. ప్లాస్టిక్‌లోని వేడి ఆహారాలు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి వెల్లడిస్తూ.. హార్మోన్లు, సంతానోత్పత్తి, ఈస్ట్రోజెన్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ల్యూక్ కౌటిన్హో పేర్కొన్నారు.కౌటిన్హో సందేశానికి దీపిందర్ గోయల్ రిప్లై ఇచ్చారు. ల్యూక్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మేము చేయగలిగినంత తప్పకుండా చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని, తద్వారా కౌటిన్హో కోరుకున్న దిశలో అడుగులు వేస్తానని వాగ్దానం చేసారు. దీపిందర్ గోయల్ రిప్లైకు కౌటిన్హో కృతజ్ఞతలు తెలిపారు. నా మాటలను అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho) -
Niharika Konidela : నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థం ఏంటి? (ఫొటోలు)
-
ఈ డిసెంబర్ 31 సో స్పెషల్! ఎందుకో తెలుసా?
ఏటా డిసెంబర్ 31 తేదీలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అయితే ఈ డిసెంబర్ 31 మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మళ్లీ వందేళ్లకు గానీ ఇలాంటి తేదీ రాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అన్నది గూగుల్ ఇండియా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త ఏడాది 2024 కి స్వాగతం పలుకుతున్నారు. అయితే 2023 డిసెంబర్ 31 తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాలు తేదీ/నెల/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తుండగా, అమెరికా వంటి మరికొన్ని దేశాల్లో నెల/తేదీ/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా అమెరికా ఫార్మాట్లో 2023 డిసెంబర్ 31 తేదీని 12/31/23 గా రాస్తారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే 123123గా కనిపిస్తుంది. అంటే 123 అంకెలు రెండుసార్లు పునారావృతం అవుతాయి. ఇలాంటి క్రమం వందేళ్లకో సారి వస్తుంది. గతంలో 1923 సంవత్సరంలో వచ్చింది. మళ్లీ వందేళ్లకు అంటే 2123 డిసెంబర్ 31న వస్తుంది. 2023 డిసెంబర్ 31 తేదీ ప్రాముఖ్యతను వివరిస్తూ గూగుల్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజువల్‌ను షేర్ చేసింది. ''మీకు తెలుసా: ఇది చివరిసారి 1923లో జరిగింది. మళ్లీ 2123లో జరుగుతుంది'' అని క్యాప్షన్ ఇచ్చింది. ''123123 తేదీకి ఎందుకు అంత ప్రత్యేకత? 12/31/23 తేదీ నూతన సంవత్సర పండుగ. న్యూమరాలజీలో దీనికి ప్రత్యేక అర్థం ఉంది. పునరావృతమయ్యే 123 సీక్వెన్స్‌ల కారణంగా ఇది డబుల్ మెసేజ్‌తో కూడిన రోజు. అందరూ కలిసి ముందుకు సాగడానికి, మంచి భవిష్యత్తును పొందడానికి నిపుణులు దీన్ని ఒక సమయంగా చూస్తారు” అని విజువల్‌లో పేర్కొంది. View this post on Instagram A post shared by Google India (@googleindia) -
యువకుడి సెల్ఫ్ ‘రిప్’ పోస్టు..వెంటనే సూసైడ్
కొచ్చి: ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు బతికుండగానే తనకు తానే శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. అనంతరం కొద్దిసేపట్టికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన కేరళలోని ఆలువాలో చోటు చేసుకుంది. ‘అజ్మల్ షరీఫ్(28) అనే యువకుడు తన ఫొటోకు రిప్(రెస్ట్ ఇన్ పీస్)అని క్యాప్షన్ పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తర్వాత కాసేపటికి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజ్మల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 14 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సరైన ఉద్యోగం రాలేదన్న కారణంగా అజ్మల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి -
హాస్పిటల్ బెడ్‌పై జుకర్‌బర్గ్ - ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) మోకాలికి గాయం కావడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రకారం, ఏఎల్సీ (Anterior Cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో వచ్చే ఏడాది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనటానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీని వల్ల శిక్షణకు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉందని, కోలుకున్న తరువాత మళ్ళీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్‌బర్గ్ వెల్లడించారు. నాపైన ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
'మనీషా, శివాని ఆత్మహత్య'పై.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి..
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు మనీషా, శివాని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు గురువారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. విద్యార్థినుల ఇద్దరి ఫోన్లో కాల్ డేటా ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? వాట్సాప్ చాటింగ్ ఎవరితో ఉంది? మెస్సేజ్‌ల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరిస్తున్నాడని.. వాడు ఎవడో తెలియదని ఆ విద్యార్థులు మాట్లాడినట్లు ఫోన్ రికార్డు వైరల్ కావడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. పరువు పోతుందని ఫోన్లో ఏమైనా ఫొటోలు ఉంటే విద్యార్థులు డిలీట్ చేశారా? అనే కోణంలో ఫోన బ్యాకప్‌ను పరిశీలిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వివరాలను డిలీట్ చేసిన వివరాలను సైబర్ క్రైం విభాగం నుంచి బ్యాకప్ తీసి పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు వచ్చిన ఇన్‌కం, అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ కూడా పరిశీలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బస్సు దిగిన విద్యార్థులు నడుచుకుంటూ ప్రకాశంబజార్కు అటునుంచి రాజీవ్పార్కులోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తే ఇద్దరు విద్యార్థినులు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత పార్కులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సాంకేతికంగా ఉన్న అన్ని ఆధారాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. లోకేషన్ ఆధారంగా.. ఇద్దరు విద్యార్థులకు ఏ ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి? ఆ సమయంలో వీరిద్దరు ఎక్కడ ఉన్నారని ట్రేస్ చేస్తున్నారు. డీపీలో ఫొటోలు పెట్టుకోవద్దు.. దర్యాప్తులో భాగంగా పోలీసులు గురువారం విద్యార్థినుల స్వగ్రామాలకు వెళ్లి విచారించారు. నక్కలపల్లి గ్రామంలో శివాని స్నేహితుల నుంచి, అమ్మనబోలు గ్రామానికి మనీషా క్లాస్మేట్లు, స్నేహితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అయితే, అమ్మాయిలు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో డీపీగా ఫొటోలు పెట్టుకోవద్దని శివాని గ్రామంలోని స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. ఎందుకు పెట్టుకోవద్దని అడిగితే సమాధానం చెప్పలేదని ఆమె స్నేహితులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నక్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ ఎస్సై ఉద్యోగం సాధించడంతో.. డిగ్రీ పూర్తి కాగానే మనం కూడా ఎస్సై ఉద్యోగం సాధించాలని ఇద్దరు విద్యార్థినులు నిర్ణయించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. -
హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్. అలా పండగ విన్నర్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలో ప్రభాస్ 'సలార్'తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇది ఎవరికో కౌంటర్ వేసినట్లు ఉంది. దీంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. పోస్టులో ఏముంది? 'నేను కొందరినీ గమనిస్తుంటారు. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసి సైలెంట్ గా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగనట్లు శిక్షిస్తుంది' అని తాజాగా ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) ఇబ్బంది పెట్టారా? అయితే ఈ పోస్ట్ చూస్తే శ్రుతిహాసన్.. ఎవరికో కౌంటర్ వేస్తున్నట్లు అనిపించింది. అలానే ఈ బ్యూటీ ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారా అనే సందేహం కూడా వస్తోంది. అయితే ఇలా సడన్ గా కర్మ సిద్ధాంతం టైపులో పోస్ట్ పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది. బాయ్ ఫ్రెండ్‌తో గతంలో సిద్ధార్థ్, ఓ ఫారెన్ కుర్రాడితో ప్రేమ వ్యవహారాలు నడిపిన శ్రుతిహాసన్ ప్రస్తుతం శంతను హజరికా అనే కుర్రాడితో రిలేషన్లో ఉంది. అయితే అతడిని ఫ్రెండ్ అని చెబుతుంది తప్పితే బాయ్ ఫ్రెండ్ అని ఎక్కడా అనట్లేదు. అయితే ప్రస్తుతం పెట్టిన కర్మ పోస్ట్ కూడా వీళ్ల రిలేషన్ గురించి ఏమైనా కామెంట్స్ చేసిన వాళ్లకా అనే సందేహం వస్తోంది. ఈ విషయాలపై స్వయంగా శ్రుతిహాసన్ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం బయటకు రాదు. (ఇదీ చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ) -
కోహ్లి రేంజ్ వేరు.. ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు! ఇక రొనాల్డో, మెస్సీ..
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. ఆటలోనే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్ ఆదాయం అందరు సెలబ్రిటీల మాదిరే.. ఫ్యాన్స్‌తో అనుసంధానమయ్యేందుకు వీలుగా కింగ్.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నాడు. మరి మిగతా వాళ్లకంటే వందల రెట్లలో ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లికి ఈ మీడియాల ద్వారా కూడా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్లో ఉంది. వ్యక్తిగత పోస్టులతో పాటు వ్యక్తిగత అప్డేట్లతో అభిమానులను అలరించే ఈ స్టార్ బ్యాటర్‌కు యాడ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు సమకూరుతున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే! రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో అతడు షేర్ చేసే ఒక్కో పోస్టుకు పదకొండున్నర కోట్ల మేర ఆదాయం లభిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజంగా షాకింగ్‌గా ఉంది ఈ విషయం గురించి హోపర్ హెచ్‌క్యూ కో- ఫౌండర్ మైక్ బండార్ మాట్లాడుతూ.. ‘‘ఏడాదికేడాది ఈ రేంజ్లో ఒక్కో పోస్టుకు ఆదాయం పెరుగుతూ ఉండటం షాకింగ్‌గా ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్స్ మిగతా వాళ్లకు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రొనాల్డో, మెస్సీలు మాత్రమే కాదు.. సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసేందుకు సోషల్ మీడియా ఉపయోపడటం విశేషం’’అని పేర్కొన్నారు. ఇక రొనాల్డో, మెస్సీ కాగా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా ద్వారా ఒక పోస్టుకు అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో కోహ్లి 20వ స్థానం(ఇండియాలో నంబర్ 1)లో ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ వరుసగా ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు, 21.49 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ టాప్-2లో కొనసాగుతున్నారు. చదవండి: అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే! -
మంచు లక్ష్మీ మంచిపని.. మనోజ్ పొగడ్తలు!
Manchu Lakshmi Manchu Manoj: మంచు లక్ష్మీ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె చాలా నార్మల్‌గా మాట్లాడినా సరే ఆ కామెంట్స్, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ఫన్నీగానే ఆమెని ట్రోల్ చేస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే ఆమె మంచి పనులు కూడా చాలానే చేస్తోంది. కాకపోతే అవి తక్కువగా హైలెట్ అవుతున్నాయి. అలా ఓ విషయమై ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ మంచు మనోజ్ తెగ పొగిడేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) స్కూల్స్ దత్తత ప్రస్తుతం చాలామంది పిల్లలు సరైన చదువు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై దృష్టి సారించిన మంచు లక్ష్మీ.. టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ని దత్తత తీసుకుంటోంది. గతేడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలని దత్తత తీసుకుంది. ఆయా స్కూల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. అలా ఓ రెండు వారాల ముందు గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలల్ని ఈమె దత్తత తీసుకుంది. తమ్ముడి పొగడ్తలు కొన్నాళ్ల ముందు మంచు లక్ష్మీ చేసిన ఈ మంచి పని గురించి ఆమె తమ్ముడు ఇన్ స్టాలో ఇప్పుడు పోస్ట్ పెట్టాడు. 'మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు' అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) -
చీరలో నభా నటేశ్.. గిటార్‌తో అదాశర్మ
చీరలో నభా నటేశ్ సెక్సీ పోజులు మృణాల్ ఠాకుర్ మెల్టింగ్ పోజులు వెకేషన్లో హీరోయిన్ రీతూవర్మ జైలర్ బ్యూటీ క్యూట్ స్టిల్స్ క్లాస్ లుక్ లో మెహరీన్ ఫ్రాన్స్ లో హన్సిక బ్లాక్ ఔట్ఫిట్లో ప్రియా వారియర్ గిటార్‌తో అదాశర్మ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!
మెగాడాటర్ నిహారిక అధికారికంగా చెప్పనప్పటికీ ప్రస్తుతం భర్తకు దూరంగానే ఉంటుంది. ఈ మధ్యే వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగ్గా.. ఈ వేడుకలో నిహారిక ఉంది తప్పితే, ఈమె భర్త చైతన్య ఎక్కడా కనిపించలేదు. దీంతో వీళిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరూ అంచనాకు వచ్చేశారు. ఇప్పుడు చైతన్య తన ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది? నిహారిక-చైతన్య వివాదం మెగాడాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ముద్దపప్పు ఆవకాయ' సిరీస్ తో చాలా ఏళ్ల క్రితమే నటిగా కెరీర్ ప్రారంభించింది. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ అయింది. 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' తదితర చిత్రాల్లోనూ నటించింది. చిరంజీవి 'సైరా'లో అతిథి పాత్రలో మెరిసింది. 2020 డిసెంబరులో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది. ఓ రెండేళ్లపాటు ఈ జంట బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఇన్ స్టా అకౌంట్స్‌లో ఇద్దరూ కలిసున్న ఫొటోలని డిలీట్ చేశారు. (ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం) విడాకులు నిజమేనా? నిహారికతో పాటు ఆమె భర్త చైతన్య.. తమ ఇన్ స్టా ఖాతాల్లో కలిసున్న ఫొటోలని తీసేశారు. దీంతో విడాకుల న్యూస్ బయటకొచ్చింది. ఓవైపు నిహారిక నటిస్తూ బిజీ అయిపోగా.. చైతన్య బయటఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడు. ఫిబ్రవరి 15న ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ మెడిటేషన్ సెంటర్ లో ఉన్నట్లు ఫొటోలు చూస్తే అర్ధమవుతోంది. పోస్ట్ లో ఏముంది? 'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) (ఇదీ చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!) -
నవీన్-ఉల్-హక్ పై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..
-
ఏడ్చేసిన సీతారామం బ్యూటీ.. ఎందుకో తెలుసా?
బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలే చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది బ్యూటీ. అయితే తాజాగా మృణాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలో మృణాల్ ఠాకూర్ ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఏంటా అని ఆరా తీస్తున్నారు. అయితే గతంలో తనకెదురైన చేదు అనుభవాలను వివరించేందుకే ఆ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సంతోషంగానే ఉన్నానని వివరించింది. మృణాల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రతి ఒక్కరి కథలో కొన్ని చదవని పేజీలు కూడా ఉంటాయి. కానీ నేను వాటిని అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇతరులకు నేర్పాలి.' అంటూ ఏడుస్తున్న ఆ ఫోటోను పంచుకున్నారు. మరో వీడియోను షేర్ చేస్తూ.. 'నాకు కఠిన పరిస్థితులు ఎదురైన రోజుల్లో ఆ ఫోటో తీసుకున్నా. కానీ ఈ రోజు మాత్రం అలా లేదు. చాలా సంతోషంగా ఉన్నా. నేను అనుకున్నది సాధించా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: మృణాల్ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!) కాగా..మృణాల్ 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ అనే టీవీ షోతో తన ద్వారా నటన జీవితాన్ని ప్రారంభించింది. కుంకుమ్ భాగ్యతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2018లో లవ్ సోనియాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్లో సూపర్ 30, బాట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా వంటి చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత మరాఠీ, తెలుగు చిత్రాలలో కూడా కనిపించింది. అయితే దుల్కర్ సల్మాన్ సరసన నటించిన చివరి తెలుగు చిత్రం సీతారామం సూపర్ హిట్ అయ్యింది.మృణాల్ ఇటీవల అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీల చిత్రం సెఫ్లీలో కనిపించింది. ఇవే కాకుండా పూజా మేరీ జాన్, ఆంఖ్ మిచోలీ, తెలుగు నటుడు నానితో కలిసి నటించనుంది. -
నిన్ను చాలా మిస్సవుతున్నా చిన్నమ్మ.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫోటోను పంచుకున్నారు అలేఖ్యా రెడ్డి. అలాగే తారతరత్న పెద్దకర్మ సందర్భంగా భర్త రాసిన వాలెంటైన్స్ డే నోట్‌ను షేర్ చేసి ఎమోషనలయ్యారు. అయితే తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నిషిక రాస్తూ.. 'అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్ బై చెప్తా' అంటూ రాసింది. తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ చూస్తే అమ్మపై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిషిక రాసిన నోట్‌ను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిన్ను చాలా మిస్సవుతున్నానంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. -
Samantha: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ఫిటినెస్ ఫ్రీక్ అనే విషయం తెలిసిందే. సమయం దొరికితే గంటలు గంటలు ఆమె జిమ్‌లోనే గడుపుతారు. అంతేకాదు జిమ్ హేవీ వర్క్అవుట్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేసేది. అయితే ఇటీవల మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ప్రస్తుతం కోలుకుంటోంది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన ఆమె జిమ్‌లో వర్క్ అవుట్స్ చేయడం స్టార్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఫిటినెస్ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో పుల్ అప్స్ చేస్తోన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చదవండి: మాస్ మహారాజా బర్త్‌డే సర్ప్రైజ్.. రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది దీనికి ఆమె.. ‘‘కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపిన ‘హూ ఈజ్ గ్రావిటీ’ బ్యాండ్‌కు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకూ కఠినతరమైన డైట్స్‌లో మనం తినే ఆహారం వల్ల బలం రాదని.. మన ఆలోచనా విధానం పైనా అది ఆధారపడి ఉంటుందన్నది నా అభిప్రాయం’’ అని సమంత రాసుకొచ్చింది. ఇక ఈ తాజా వీడియోపై పలువురు సినీ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అంతేకాదు వెంకటేశ్ కూతురు అశ్రిత కూడా సామ్ పోస్ట్‌పై స్పందించింది. ఆమెకు మరింత బలం చేకూరాలని ఆకాంక్షిస్తూ ఎమోజీలతో కామెంట్స్ చేసింది. చదవండి: కీరవాణికి పద్మశ్రీ వరించడంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ అలాగే సుశాంత్ కూడా కామెంట్స్ చేశాడు. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నువ్వు రెండు చేతులా చేస్తుంది.. నేను ఒక్క చేతితో చేస్తున్నాను. నువ్వు ఫీల్ అవుతానే ఆ వీడియో షేర్ చేయలేదు’ అంటూ చమత్కిరంచింది. కాగా సమంత నటించిన శాకుంతలం మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
‘బాధపడకమ్మా.. నేను నీ వెనకే ఉన్నా’: సమంత ఎమోషనల్ పోస్ట్
చాలా రోజుల సమంత ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్నా ఆమె తన లేటెస్ట్ మూవీ శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో మెరిసింది. కాగా ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజులుగా ఆమె ఇంటికే పరిమితమమైంది. మయోసైటిస్కు చికిత్స తీసుకుంటున్న సమంత మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇక ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ ఆమె యాక్టివ్ అయ్యింది. చదవండి: అఫిషియల్: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! గత వారం రోజులుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సామ్ అభిమానులను కదిలిస్తోంది. స్టార్ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన పెంపుడు కుక్కుల హాష్, సాషాలతో ఒంటరిగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. సమంత సోఫాలో పడుకుని ఉండగా ఆమె పక్కనే హాష్, సాషాలు ఉన్నాయి. సామ్ బోర్లా పడుకుని ఉండగా హాష్ ఆమె నడుంపై కాలు పెట్టి ఉంది. చదవండి: దుమ్ములేపుతున్న వాల్తేరు వీరయ్య.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే! ఈ ఫొటోను సమంత షేర్ చేస్తూ.. ‘బాధపడకు అమ్మా.. నేను నీ వెనుకే ఉన్నా’ అంటూ (హ్యాష్ తనతో చెబుతున్నట్లు) రాసుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్‌ను ఎమోషనల్‌కు గురి చేస్తుంది. కొందరు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ధైరంగా ఉండు సామ్ అంటూ ఆమెను ఓదార్పు ఇస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ అయితే ఈ కఠిన సమయంలో తనవెంట ఎవరూ లేరంటూ వాపోతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ..
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమె. తరచూ తన గ్లామరస్ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకునే అనసూయకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. నెట్టింట ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో.. అంతేస్థాయలో విమర్శకులు కూడా ఉన్నారు. నిత్యం తనని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అనసూయపై దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. చదవండి: ధనుష్ స్వీయ దర్శకత్వంలో క్రేజీ మూవీ, నలుగురు హీరోలతో.. ఇక ఈ ట్రోల్స్‌పై అనసూయ ఘాటుగా స్పందించి వివాదంలో చిక్కుకుంటుంది. ఇలా తరచూ ట్రోల్స్, వివాదాలతో వార్తల్లో నిలిచే ఆమె రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో తను ఓ డిజార్డర్‌తో బాధపడుతున్నానని చెప్పింది. ‘నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను. వారి గురించి పట్టించుకోవకపోవడమే నా రుగ్మత’ అంటూ రీల్ వీడియో షేర్ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. మరోసారి తనని టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి అనసూయ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చిందని ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తమిళనాడు రాజకీయ విభేదాలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు కాగా ‘రంగస్థలం’ చిత్రంలో తన పాత్రతో రంగమ్మత్తగా వెండితెరపై మంచి గుర్తింపు పొందిన అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియా చిత్రం పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్లో మెప్పించిన ఆమె చేతిలో ప్రస్తుతం పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలు ఉన్నాయి. అలాగే గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరెకెక్కితోన్న కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లోనూ ఆమె నటిస్తోందట. ఇందులో అనసూయ వేశ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్‌లు 2016లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం కల్యాణ్ దేవ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. రీసెంట్గా ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో కల్యాన్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. చదవండి: సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కల్యాణ్ దేవ్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అతడు తన గురించి వస్తున్న పుకార్లపై ఎప్పుడు నేరుగా స్పందించ లేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్స్ షేర్ చేస్తూ పరోక్షంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. తన లేటెస్ట్ ఫొటో షేర్ చేస్తూ ఈ పోస్ట్‌కి ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్‌బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా త్వరలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిమ ఎదైనా కీలక ప్రకటన రానుందా? అంటూ కొందరు ఈ పోస్ట్‌పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్‌బై చెప్పుబోతున్నాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ఈ ఫోటోలో క్యూట్‌గా ఉన్న బాబు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ దంపతులు ఎప్పటికీ ప్రత్యేకమే. తెలుగు చిత్రసీమలో రానా ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటారు. బాహుబలి సినిమాతో రానా ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇవాళ ఈ బాహుబలి స్టార్ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రీటిలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి మిహికా బజాజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. రానా చిన్నప్పటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ భర్తకు బర్త్ డే విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అత్యంత అందమైన మనిషిగా మారిన అందమైన బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు! చూడు ఎంత అందంగా ఉన్నాడో! మీరు నా జీవితంలోకి తీసుకువచ్చిన ఆనందానికి ధన్యవాదాలు! నాకు భర్తతో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా బేబీ.. నీ పట్ల నా ప్రేమకు హద్దులు లేవు. ఇప్పుడు నువ్వు నా ప్రేమ జీవితంలో ఇరుక్కుపోయావు. రాబోయే కొత్త ఏడాదిలో మీ కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నా.' అంటూ భర్తకు ఎమోషనల్ విషెష్ చెప్పారు. (ఇది చదవండి: భార్య ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా.. ఏమన్నారంటే?) ఆగస్ట్ 8, 2020 లాక్డౌన్ సమయంలో రానా దగ్గుబాటి, మిహీకా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సమంత రూత్ ప్రభు, రామ్ చరణ్, నాగ చైతన్య, సన్నిహితులు హాజరయ్యారు. రానా దగ్గుబాటి సోదరితో మిహీకా స్కూల్‌కి వెళ్లడంతో ఈ ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడులో కనిపించనున్నారు. ప్రముఖ అమెరికన్ క్రైమ్ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వెంకటేష్ దగ్గుబాటితో కలిసి నటిస్తున్నారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మల దర్శకత్వంలో జెస్సికా హారిసన్, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
సోషల్ హల్చల్: హన్సిక సూఫీ నైట్, మూన్‌లైట్‌లో జాన్వి కపూర్
► ఒంగోలులో యాంకర్ అనసూయ సందడి ► ఎదపై టాటూ, ముక్కు పుడకతో అనుపమ, కొత్త లుక్ వైరల్ ► ప్యారిస్‌లో ఫరియా చక్కర్లు ► మంచులో తడుస్తున్న శృతి హాసన్ ► హన్సిక సూఫీ నైట్, ఆకట్టుకుంటున్న ఫొటోలు ► స్టార్ హోటల్లో బోల్డ్ బ్యూటీ అరియాన గ్లోరీ, గ్లామరస్ ఫొటోలు వైరల్ ► మూన్‌లైట్‌లో కలవమంటున్న బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ► హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి స్టన్నింగ్ లుక్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) -
నాపై దారుణమైన ట్రోల్స్.. గుండె బద్ధలైంది: రష్మిక ఆవేదన
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అయితే అదే తీరుతో ఆమె సోషల్ మీడియా వేదికగా తరచూ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది. రష్మి ఫ్యాన్డమ్ ఎంతుందో.. నెగిటివిటీ కూడా అంతే స్థాయిలో ఉంది. మూవీ, అవార్డు ఫంక్షన్స్‌లో ఆమె తీరుపై నెటిజన్లు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఓవరాక్షన్ చేస్తోందంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు పలు అంశాలపై ఆమె స్పందించే తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తుంటారు. చదవండి: విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటీపై తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని, నటిగా ఎదగడానికి అవి తనకు ఉపయోగమంటూ తన పోస్ట్‌లో పేర్కొంది. అదే విధంగా నిజమైన ద్వేషం వల్ల లాభం ఏంటని ఈ సందర్భంగా ట్రోలర్స్‌ను ఆమె ప్రశ్నించింది. ‘ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. నటిగా కెరీర్ మొదలైన నాటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను. సోషల్‌మీడియాలో తరచూ నాపై వచ్చే ట్రోల్స్, నెగెటివిటీ చాలా బాధపెడుతున్నాయి. అయితే నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ఇక్కడ అందరికి నేను నచ్చనని, అలాగే ప్రతి ఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. నేనూ.. మీరు గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్నా. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా’ అని రాసుకొచ్చింది. అయితే ‘నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తున్నారు. వాటిని చూసి నా గుండె బద్ధలైంది. పలు ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన కొన్ని మాటలను నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా. ఇంటర్నెట్లో వస్తున్న తప్పుడు సమాచారం వల్ల నాకు మాత్రమే కాదు నా సహచరులను కూడా ఇబ్బంది పెడుతోంది. విమర్శలను పట్టించుకోకూడదని అనుకుంటున్నాను. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్ సోషల్‌మీడియా నెగెటివిటీ గురించి మాట్లాడి నేను ఎవరిమీదనో విజయం సాధించానని అనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరిపై నాకు ప్రేమాభిమానం ఉంది. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నటీనటుల నుంచి ఎన్నో విషయాల్లో ప్రేరణ పొందా. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఇంతటి గుర్తింపు తెచ్చుకున్నా’ ఆమె రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎంతో వేదనతో ఆమె చేసిన పోస్ట్ సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, హన్సిక, వెంకి కుడుముల తదితరులను రష్మిక మద్దతుగా నిలిచారు. ‘మా అభిమానం నీకు ఎప్పుడూ ఉంటుంది. ద్వేషం చూపించే వారిని పట్టించుకోవద్దు’ అంటూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
తెగ ఫీలవుతున్న హన్సిక ఫ్యాన్స్
-
సరోగసీ వివాదం.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన నయన్ దంపతులు!
సౌత్ స్టార్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి ఇద్దరు కవలలు జన్మించారంటూ విఘ్నేశ్ శివన్ ఆదివారం(అక్టోబర్ 9న) సోషల్ మీడియా వేదికగ ప్రకటించాడు. ఈ సందర్భంగా నయన్-విఘ్నేశ్ చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఈ జంటకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. వీరు తల్లిదండ్రులు అయిన వ్యవహరంపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. పెళ్లయిన 5 నెలలకే పిల్లలు జన్మించడంతో ఈ జంట సరోగసీని మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సరోగసీ ద్వారానే నయన్ తల్లయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు నయన్ దంపతులు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో వారు భారత చట్టాన్ని ఉల్లంఘించారంటూ నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహరంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. సరోగసీపై నయనతార-విఘ్నేశ్ శివన్‌లు ప్రభుత్వానికి వివరాలు అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు నయన్-విఘ్నేశ్‌లు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నయనతార భర్త విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కోట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపిక పట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అంటూ ఇన్‌స్టాలో స్టోరి షేర్ చేశాడు. మీ గురించి ఆలోచిస్తూ మీ మంచి కోరే వ్యక్తుల పట్ల మీరు శ్రద్ద చూపించండి. అలాంటి వారే మీ వాళ్లు’ అంటూ మరో కోటేషన్ షేర్ చేశాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరోగసీ వివాదంపై నయన్ దంపతులు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారని, వారిపై విమర్శలు చేస్తున్న వారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి -
'కొండంత అండగా నిలబడ్డారు.. కష్టాల్లో తోడున్నారు' అంటూ శ్రీజ ఎమోషనల్
మెగా డాటర్ శ్రీజ కొణిదెల ఈమధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెకేషన్స్‌కి వెళ్లిన శ్రీజ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటకిప్పుడు తన లైఫ్‌లో జరిగిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును షేర్చేసింది. 'నా కష్టసుఖాల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను మాట్లాడినప్పుడు విన్నారు. నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నా' అంటూ శ్రీజ పేర్కొంది. ప్రస్తుతం ఆమె షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
Trisha: ప్రేమలో మరోసారి ఫెయిల్ అయ్యిందా?
సాక్షి, చెన్నై: అందమైన రూపం, చక్కని నటనా ప్రతిభ త్రిష సొంతం. అందుకే మోడలింగ్ రంగం నుంచి కేరీర్‌ను ప్రారంభించి మిస్ తమిళనాడు కీరీటాన్ని గెలుచుకుంది. 2002లో కథానాయికగా పరిచయం అయ్యి నేటికీ ఎవర్గ్రీన్ నటిగా వెలిగిపోతోంది. రెండు దశాబ్దాలుగా కథానాయకగా రాణిస్తున్న బహుభాషా నటి బ్యూటీ. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో దాదాపు అగ్ర నటులందరితోనూ నటించింది. లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అయితే వ్యక్తిగతంగా 40వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమెకు ప్రేమ, పెళ్లి వంటి అంశాలు ఇంకా సెట్ కాలేదనే చెప్పాలి. ఈ వ్యవహారంపై ఇంతకు ముందు నిత్యం వార్తల్లో నానింది. అప్పట్లో ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమ వ్యవహారం నడిచిందని, ఆ తర్వాత ఆ ప్రేమ విఫలం అయిందని టాక్. ఆ తర్వాత వరుణ్ మణియన్ అనే సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ పెళ్లి పీటలు ఎక్కలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే అంశాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ సంచలన నటి ఇటీవల తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన ఒక విషయం సంచలనంగా మారింది. అదేంటో చూద్దాం ‘వక్ర బుద్ధి కలిగిన నీలాంటి వాడితో మాట్లాడకుండటమే ఉత్తమం’అని పేర్కొంది. దీంతో అలా పేర్కొనడానికి కారణం ఏమిటి? ఎవరిని అంతగా ద్వేషిస్తోంది. ప్రేమలో మూడోసారి ఫెయిల్ అయ్యిందా? ఇలాంటి ప్రశ్నలు ఇటు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి: సండే సినిమా: వెండితెరపై జై జవాన్ -
ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్ చేస్తోంది.. నీతూ కపూర్‌పై ట్రోలింగ్
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషి కపూర్ మరణించి రెండేళ్లు కావొస్తుంది. సుమారు రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన 2020 ఏప్రిల్‌లో చనిపోయారు. అయితే తన భర్త మరణం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ట్రోల్ చేస్తున్నారని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ తెలిపారు. రిషి కపూర్ ఇక లేరన్న బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే భర్త చనిపోయాడన్న బాధ లేకుండా ఇలా పోస్ట్‌లు పెట్టడంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది నీతూ కపూర్. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న నీతూ మాట్లాడుతూ 'నేను ఇలా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. నేను నా ఫాలోవర్స్‌ను ప్రేమిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారిని బ్లాక్ చేస్తున్నాను. ఎందుకంటే భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని కొందరు అంటున్నారు. నేను ఏడుస్తూ, బాధపడుతూ, విధవలా ఉండటాన్ని చూడాలనుకుంటున్నవారిని నేను బ్లాక్ చేస్తాను. నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటాను.' అని తెలిపారు. ఇంకా 'ఇలా ఉండటం వల్ల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరు ఏడుస్తూ, మరికొందరూ నవ్వుతూ బాధ నుంచి కోలుకుంటారు. నేను నా భర్తను మరచిపోలేను. అతను ఎప్పుడూ ఇక్కడ నాతో, నా పిల్లలతో జీవితాంతం ఉంటాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. భోజనానికి వచ్చి సగం సమయం అతని గురించే మాట్లాడుతున్నాం. రణ్‌బీర్ ఇప్పటికీ తన మొబైల్ స్క్రీన్‌సేవర్‌లో అతని ఫొటోనే ఉంది. అంటే మేము అతన్ని ఎంతగా మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. కానీ మేము అతన్ని మిస్ అవుతున్నందుకు దిగులుగా లేదు. మేము అతన్ని మిస్ అవడాన్ని కూడా సంతోషంగా భావిస్తాం. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం' అని పేర్కొన్నారు నీతూ కపూర్. View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక అలా కుదరదు!
టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తరువాత ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’కు ఆదరణ పెరిగింది. అయితే కొందరు తమ ఒరిజినల్ కంటెంట్ షేర్ చేస్తుండగా.. మరికొందరు యూజర్లు టిక్‌టాక్ లాంటి ఇతర యాప్స్ లోని వీడియోలను రీసైకిల్ చేసి ‘రీల్స్’కు పోస్ట్ చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించింది ఇన్స్టాగ్రామ్. ఇక కొత్త ఫీచర్ల విషయానికి వస్తే... ట్యాగ్, ఇంప్రూవ్డ్ ర్యాంకింగ్ కోసం ఇన్‌స్టా తాజాగా ప్రాడక్ట్ ట్యాగ్స్, ఎన్హ్యాన్స్డ్ ట్యాగ్స్, ర్యాంకింగ్ ఫర్ ఒరిజినాలిటీ అనే ఫీచర్లను లాంచ్ చేసింది. -
ఇన్‌స్టా పోస్టులన్నీ డిలీట్ చేసిన బుల్లితెర నటి.. కారణం ?
TV Actress Nikki Sharma Deleted Her Instagram Posts: 'సుసురాల్ సిమర్ కా', 'బ్రహ్మరాక్షస్ 2' వంటి సీరియల్స్‌తో తనదైన నటనతో అలరించింది నిక్కీ శర్మ. తాజాగా ఆమె తన అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లోని పోస్టులన్నింటిని డిలీట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పోస్ట్‌లను డిలీట్ చేయడమే కాకుండా నిక్కీ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక మెస్సేజ్‌ను కూడా ఇచ్చింది. నేను ప్రయత్నించాను. కానీ అలసిపోయాను. నా సొంత ఆలోచనల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాను. అని రాసుకొచ్చింది నిక్కీ శర్మ. దీంతో ఆమె అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై 'ససురాల్ సిమర్ కా' నటుడు, నిక్కీ శర్మ మాజీ సహోద్యోగి అభిషేక్ భలేరావ్ స్పందించాడు. నిక్కీ పోస్టులను డిలీట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. 'ససురాల్ సిమర్ కాలో నాతో కలిసి నటించిన నిక్కీ శర్మ తన పోస్టులను తొలగించింది. ఆమె రాసిన మెస్సేజ్ ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో మూడు గంటలకుపైగా ఉంది. నేను ఈమెయిల్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సాధ్యమైనంతవరకు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె అందుబాటులోకి రాలేదు.' అని తెలిపాడు. చదవండి: 'జెంటిల్ మేన్ 2'కి మరో హీరోయిన్.. నిర్మాత ప్రకటన తర్వాత డిలీట్ చేసిన మరొక ట్వీట్లో అభిషేక్ భలేరావు 'ఇందులో పోలీసులు కలుగజేసుకుంటే ఈ విషయం ఎంత దూరం వెళుతుందో అని ఆలోచిస్తున్నాను. అందుకే ఆమెను సంప్రదించేందుకు మాతో కలిసి నటించిన వారందరినీ ట్యాగ్ చేస్తున్నాను.' అని నటీనటులు దీపికా, ధీరజ్‌లను ట్యాగ్ చేశాడు. అయితే నిక్కీ మానసిక స్థితి సరిగా లేదని, ఆమె నిరాశకు గురైనట్లు ఆమె సన్నిహితుల నుంచి వచ్చిన సమాచరమని ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది. అలాగే నిక్కీతో మాట్లాడిన మాజీ నటుల్లో ఒకరికి ఆమె.. తనను తాను చూసుకోగలనని, ఎలాంటి పిచ్చి పనులు చేయనని నిక్కీ చెప్పినట్లు సమాచారం. దీపికా కక్కర్, ధీరజ్ ధూపర్ నటించిన 'ససురాల్ సిమర్ కా' సీరియల్లో రోష్నీ కపూర్ పాత్రలో అలరించింది నిక్కీ శర్మ. -
చివరికి ఆమె ఎలా బతకాలో నేర్చుకుంది.. హీరోయిన్ పోస్ట్
Rhea Chakraborty Said She Learnt How To Live In Present: బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సాధారణ స్థితికి రావడానికి ఒక్కో అడుగు వేస్తోంది. 2020 సంవత్సరంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ల వయసులో మరణించడంతో రియా పలు ఆరోపణలు ఎదుర్కొంది. సుశాంత్ మరణించిన సుమారు రెండేళ్ల తర్వాత ప్రియుడు జ్ఞాపకాలనుంచి బయటకు వచ్చేందుక ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ షిబానీ దండేకర్ వివాహానికి హాజరైంది. ఈ పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమంలో దిగిన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలో రియా ఎల్లో లెహెంగాలో అందంగా కనిపించింది. ఈ ఫొటో షేర్ చేస్తూ 'ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట.. చివరికీ ఆమె ఎలా జీవించాలోనేర్చుకుంది.' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది రియా. ఇక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో సుశాంత్, రియా అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంతో అందంగా ఉన్నావ్ అని ఒకరు, లవ్లీ అంటూ మరొకరు రియాను పొగుడుతున్నారు. కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం సుశాంత్ మరణాన్ని గుర్తు చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
ఎవరా అమ్మాయి!! రతన్ టాటాను అంతమాట అనేసిందేంటీ?
సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడే జరిగినట్లు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ప్రముఖుల విషయాల్లో జరుగుతుంటాయి. ఇటీవల వ్యాపార దిగ్గజం రతన్‌టాటాకి అసోం రాష్ట్రం అత్యున్నత పురస్కారమైన అసోం బైభవ్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 2019లో రతన్ టాటా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇప్పుడే జరిగినట్లు పలువురు ఆ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు. టాటాకు అవార్డు రావడంపై ఇన్ స్టాగ్రామ్‌లో అభినందనలు తెలిపిన నెటిజన్ లలో ఓ అమ్మాయి 'కంగ్రాట్స్ ఛోటూ అంటూ కామెంట్ చేసింది. అంతే ఆ కామెంట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరా అమ్మాయి. రతన్ టాటాని అంతమాట అనేసిందేంటీ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి అసోం బైభవ్ అవార్డ్‌కు ఆ అమ్మాయి చేసిన కామెంట్ కు సంబంధం లేదని కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. 2019 అక్టోబర్ నెలలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేశారో లేదో కేవలం నాలుగు నెలల్లోనే ఆయన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య పదిలక్షల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో రతన్ టాటా తన ఇన్‌స్టా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ 'నా ఇన్‌స్టా పేజీలో ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్ మైలురాయిని దాటింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పుడు ఇంత అద్భుతమైన ఆన్లైన్ కుటుంబం ఉంటుందని ఊహించలేదు.అందరికి ధన్యవాదాలు. మీతో కలిసి ఈ ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నా అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు రతన్ టాటాను అభినందనలతో ముంచెత్తారు. కానీ రేహాజైన్ అనే అమ్మాయి మాత్రం భిన్నంగా అభినందనలు ఛోటూ అంటూ రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైయికి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రతన్ టాటా ఆ ట్రోలింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. యువతి కామెంట్‌కు రతన్ స్పందిస్తూ 'మనలోని ప్రతి ఒక్కరిలో ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ అమ్మాయిని నిందించకండి. గౌరవంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు శాంతించారు. -
జూనియర్ సమంత వెనకున్న ఆ హీరో ఎవరో తెలుసా !
జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న అషు రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాతో తెచ్చుకున్న పాపులారిటీతో బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టి స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వైరల్ అవడమే కాకుండా ఆమెకు 'బోల్డ్ బ్యూటీ' అనే పేరును తెచ్చిపెట్టింది. తాను చేసే పోస్ట్‌లకు యాప్ట్ అయ్యేలా ట్యాగ్‌లైన్ రాస్తూ కూడా రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవల కూడా 'మీ కళ్లల్లోనే వేడి ఉంది' అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్‌లే కాకుండా అప్పుడప్పుడు టూర్లకు కూడా వెళ్తూ ఉంటుంది అషు. ఇటీవల వెకేషన్ నిమిత్తం దుబాయ్ వెళ్లిన అషు 'మేడమ్ టూసాడ్స్' మ్యూజియంను సందర్శించింది. ఈ మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పలు ఫొటోలు దిగిన ఈ భామ తాను అభిమానించే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ మైనపు బొమ్మతో ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ 'సారీ అలియా భట్' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
మరోసారి రెచ్చిపోయిన అషురెడ్డి.. మీ కళ్లలోనే ఉందంటూ బోల్డ్ కామెంట్
అషు రెడ్డి.. సోషల్ మీడియా యూజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ అనంతరం స్టార్‌గా ఎదిగిన అషు, ఆ తర్వాత హాట్‌హాట్‌గా ఫొటోషూట్లకు ఫోజులు ఇచ్చి.. వాటిని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అంతేకాదు తన బోల్డ్ కంటెంట్‌పై వీడియో చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేస్తూ తరచూ ట్రోల్స్ బారిన పడుతోంది. ఇక ఫేం కోసం ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్య్వూ ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి అషు రెడ్డిని బోల్డ్ బ్యూటీ అని కూడా పిలుస్తున్నారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్.. ఈ క్రమంలో తనపై వచ్చే హాట్ కామెంట్స్‌కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చి నెటిజన్లకు కౌంటర్ ఇస్తూ వస్తుంది ఈ భామ. ఈ నేపథ్యంలో అషు తన తాజా ఫొటోషూట్‌ను షేర్ చేసింది. తన ఫొటోలపై నెటిజన్స్ చేసే కామెంట్స్‌ను ముందుగానే గ్రహించిన అషు ట్రోలర్స్‌కు ఆ చాన్స్ ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడిందేమో. అందుకే తన ఫొటోలపై బోల్డ్ కామెంట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసింది. ఈ మేరకు ఆమె ‘హాట్నెస్ నా థైస్‌లో కాదు.. మీ కళ్లలోనే ఉంది’ అంటూ బోల్డ్ క్యాప్షన్‌తో మోకాళ్లపైకి టాప్ ధరించిన ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ అషును ట్రోల్ చేస్తున్నారు. చదవండి: స్పెషల్ సాంగ్‌తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు: సమంత -
నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం
Janhvi Kapoor Shares Cryptic Post About She Has Fever: బీటౌన్‌లో కరోనా మహమ్మారి తగ్గేదే లే అంటూ వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడి ఐసోలేట్ అయ్యారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని తనకు కూడా కరోనా వచ్చిందా అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి. జాన్వీ మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకుని ఉన్న ఫొటో తనకు జ్వరం వచ్చినట్లుగా చెబుతోంది. పోస్ట్‌లో 'మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకున్న జాన్వీ ఫొటో, తాను వేసిన పెయింటింగ్, ఫ్రమ్ ది సోల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ రైటర్స్ పుస్తకంలోని ఒక పేజి, తన పెంచుకునే కుక్కపిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో, తన సెల్ఫీ, ఖుషీ కపూర్ పక్కన పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో' ఉన్నాయి. ఈ పోస్ట్‌కు 'మళ్లీ ఆ సంవత్సరపు కాలం' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కాగా ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్', 'మీరు పెయింటింగ్ చాలా బాగా వేశారు. నాకు చాలా నచ్చింది', 'ముందు బ్రష్ వేసుకోండి. తర్వాత ఫొటోలు దిగితే బాగుంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని -
టీమిండియా క్రికెటర్ ఛాతిపై రజనీకాంత్ టాటూ..
Rajinikanth Birthday: సూపర్ స్టార్ రజనీకాంత్ 71వ జన్మదినం(డిసెంబర్ 12) సందర్భంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వినూత్న శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. తలైవా టాటూను తన ఛాతీ వేసుకుని ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా ఛాతీపై సూపర్ స్టార్‌ను కలిగి ఉన్నాను. మీరు 80వ దశకంలో బిల్లాగా.. 90లలో బాషాగా.. ఇటీవలి కాలంలో అన్నాత్తే (పెద్దన్న)గా అలరించారు.. సూపర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అంటూ తమిళ్లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) భజ్జీ తమిళ్లో ట్వీట్ చేయడంతో ఆ భాషాభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు మురిసిముక్కలైపోతున్నారు. భజ్జీ షేర్ చేసిన ఫోటోను లైకులు, షేర్లతో మోతెక్కిస్తున్నారు. కాగా, హర్భజన్ ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! -
బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ..
Naga Chaitanya Quotes About Green Lights For Life Goes Viral: సమంత-నాగచైతన్య విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ మరింత పెరిగింది. సాధారణంగానే సమంతతో పోలిస్తే నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. తన సినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్ మీడియాలో వేరే పోస్టులు షేర్ చేయడు. తాజాగా చైతూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన 'గ్రీన్ లైట్స్' అనే పుస్తకాన్ని షేర్ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 'లవ్ లెటర్స్ టూ లైఫ్..మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్(జీవితంలో ముందుకు వెళ్లడం, క్యారీఆన్ అనే అర్థం) అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ ప్రేమ, జీవితం లాంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని చైతూ..బ్రేకప్ తర్వాత ఇన్‌స్టాలో తొలిసారి చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) సామ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చై ప్రస్తుతం ఆ ఙ్ఞాపకాల్లోంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. మరోవైపు సామ్ సైతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. -
సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..?
David Warner Shares Pic In CSK Jersey Ahead Of IPL 2021 Final: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మరికాసేపట్లో మొదలుకానున్న ఐపీఎల్-2021 తుది పోరు నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారధి, ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఇందులో వార్నర్ సీఎస్కే జెర్సీ ధరించి తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని దర్శనమిచ్చాడు. సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య జరిగే నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేను కానీ.. ఓ అభిమాని కోరికను కాదనలేక ఈ పోస్ట్‌ను చేస్తున్నానంటూ క్యాప్షన్ జోడించాడు. David Warner supporting CSK tonight and also posted an edit of him and his daughter in CSK jersey. pic.twitter.com/VlVh4D5P1f — Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2021 అయితే, ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వార్నర్ దీన్ని తొలగించడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వార్నర్ నేటి మ్యాచ్ వరకే సీఎస్కే అభిమానిగా ఉంటాడా లేక వచ్చే సీజన్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎస్కే జట్టుకు వెళ్లిపోతాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో వరుస వైఫల్యాల కారణంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్ తొలిదశలో వార్నర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీని న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్కు కోల్పోయాడు. చదవండి: టీ20 క్రికెట్‌కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను -
పీస్ ఆఫ్ హెవెన్: సన్నీ లియోన్ స్టన్నింగ్ ఫోటో
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఒక అందమైన ఫోటోను ఫ్యాన్స్‌ను మరోసారి ఆకట్టుకుంది. ముంబైలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వాగతిద్దాం అంటూ తన అపార్ట్మెంట్ స్నిప్పెట్‌ను షేర్ చేసుకుంది. పీస్ ఆఫ్ హెవెన్ అంటూ ఒక అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు తన ఇంటిలో స్వర్గంలాంటి ఒక భాగాన్ని కలిగి ఉండటం శ్రేయస్కరం అనే క్యాప్షన్ ఇచ్చింది. సన్నీ లియోన్ అక్టోబర్ మాసపు చిరు జల్లుల్ని ఆస్వాదిస్తోంది. తన ఇంట్లోని గ్లాస్ ఫెన్సింగ్లోంచి అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యానికి స్విమ్ సూట్‌తో ఉన్న ఫోటోతో మరింత స్టన్నింగ్ లుక్ యాడ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. కాగా భర్త డేనియల్ వెబెర్, పిల్లలు నోహ్, అషర్, నిషాలతో కలసి సన్నీ లియోన్ముంబైలో నివసిస్తోంది. ఇటీవల తన భర్తతో ఫన్నీ ఛాలెంజ్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మీ ఎన్ఎఫ్టీల(నాన్ ఫంజిబుల్ టోకెన్లు)పైమాట్లాడుకుందామంటూ ట్వీట్ చేసింది.సెలబ్రిటీలకు సంబంధించిన డిజిటల్ ఆస్తులే ఎన్ఎఫ్టీలు. ఈ టోకెన్లతో క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. I wanna hear more about your #NFT collection!! Let's chat: https://t.co/9xjrNoQVTx . . . #SunnyLeone #NFTartwork #NFTGiveaway #NFTcollectibles #NFTartist #bitcoin #ADA #eth #ShibaArmy #Solana #NFTcollectibles https://t.co/RAN8aK83uB pic.twitter.com/Or5yvffX4K — sunnyleone (@SunnyLeone) October 12, 2021 View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్
టాలీవుడ్ జంట సమంత-నాగ చైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. తాము విడిపోతున్నామంటూ చై-సామ్‌లు సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో కొంతకాలంగా వీరి విడాకులపై వస్తున్న ఊహగానాలకు తెరపడింది. ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో భావోద్యేగానికి లోనయ్యింది. విడాకుల ప్రకటనకు ముందే సమంత ఓ పోస్ట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ పోస్టులో ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళ ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. చదవండి: చైతు-సమంత విడాకులపై నాగార్జున స్పందన ఇందులో సామ్ ‘నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు నిపుణులు. కానీ చివరకు వారి పతనం తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం’ అంటూ స్టోరీని ముగించింది. ఇది చూసిన సామ్ అభిమానులంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సమంత అయిష్టంగానే విడాకులు తీసుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ ఆమె ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందనేది మాత్రం స్పష్టం లేదు. అయితే విడాకుల ప్రకటన అనంతరం సమంత పోస్ట్ వార్తల్లో నిలుస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలు చర్చించుకుంటున్నారు. చై-సామ్ పెళ్లినాటి ఫోటోలు చదవండి: #Chaysamdivorce: గుండె పగిలింది.. నాలుగేళ్లకే ఎందుకు ఇలా! -
ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
Shweta Tiwari Hospitalised, Ex-Husband Reacts: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటి శ్వేతా తివారి త్వరగా కోలుకోవాలంటూ ఆమె మాజీ భర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. చాలామంది యాక్టర్స్(నటీనటులు) ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ పొందేందుకు, తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు డైట్ పేరిట తక్కువ తిని, ఎక్కువ వర్కవుట్స్ చేస్తూ తమ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తారు. ఇలానే చేస్తూ పోతే ఏదో ఒకరోజు వారి గుండె అలిసిపోతుంది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఖత్రోన్ కే ఖిలాడి సీజన్11 ఫైనలిస్ట్, హిందీ సీరియల్ నటి శ్వేత తివారి బలహీనత, లో- బీపీ కారణంగా హాస్పిటల్ పాలైంది. షూటింగ్స్‌లో బిజీ ఉండటంతో తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైందని శ్వేత పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా తివారికి, భర్త అభినవ్‌తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ రియాలిటీ షో కోసం కేప్‌టౌన్ వెళ్లేందుకు రెడీ అయిన శ్వేత.. తన కొడుకు రేయాన్ కోసం సరైన ఏర్పాట్లు చేయకుండానే దేశం విడిచి వెళ్తుందంటూ అభినవ్ ఆరోపించాడు. దీంతో తన కొడుకును బలవంతంగా అభినవ్ తీసుకెళ్లేందుకు చూస్తున్నాడంటూ సీసీటీవీ ఫుటేజిని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాగా బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. విభేదాల కారణంగా 2019లో వీరు విడిపోయారు. డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు View this post on Instagram A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) -
పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్
Deepak Hooda In Match Fixing Scanner: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా నిన్న(సెప్టెంబర్ 21) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 పరగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాడు దీపక్ హూడా తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హూడా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో అతను పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైనా సరే తుది జట్టు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్కు ముందు బహిర్గతం చేయకూడదు. ఈ నేపథ్యంలో ఈ పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ తుది జట్టు వివరాలను బయటపెట్టడంపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతన్ని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నిఘా పరిధిలోకి తీసుకువచ్చింది. జట్టు, పిచ్ సంబంధిత వివరాలను బహిర్గతం చేయడం బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అన్నీ తెలిసి కూడా దీపక్ హూడా తుది జట్టు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం నేరమని ఏసీయూ పేర్కొంది. రంజీ జట్టు కెప్టెన్‌గా, గతంలో పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఎంతో అనుభవమున్న హూడా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఈ పోస్ట్‌ను అతను అనుకోకుండా పెట్టాడా లేదా బుకీలకు ఏదైనా హింట్ ఇద్దామని చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని ఏసీయూ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయాల్సి దశలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు చేసిన ఎంసీసీ -
రాజ్‌కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా?
Shilpa Shettys Reaction After Husband Raj Kundra Gets Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. రూ.50వేల పూచికత్తుతో ఆయనకు ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. 'భీబత్సమైన తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనస్సు(రెయిన్బో) ఏర్పడుతుంది' అంటూ ప్రముఖ చైనీస్ అమెరికన్ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్‌ను ఆమె పోస్ట్ చేశారు. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' కాగా 2009లో రాజ్‌కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం రియాలిటీ షోలతో అలరిస్తున్న ఆమె ఇటీవలె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్ అనంతరం ఆర్థికంగా నష్టపోయిన శిల్పాశెట్టి అవమానంతో కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్న శిల్పా కుంద్రాతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు బీటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ రూమర్స్ పటాపంచలైనట్లేనా లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : నాని..ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించావా: సమంత -
సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పందించాడు. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్ ఆఖరి మ్యాచ్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. సిరీస్ డిసైడర్ అయిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని, మిస్ అయిన మ్యాచ్ రీషెడ్యూల్ అవ్వాలని అశిద్దామని భావేద్వేగపూరిత మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. తన హెంగ్రౌండ్(ఓల్డ్‌ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని ఈ 39 ఏళ్ల లాంకషైర్ క్రికెటర్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) ఇదిలా ఉంటే, ఇదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. పాక్షికంగా రద్దైన ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం తేలాల్సి ఉంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో మ్యాచ్ భారత్, మూడో టెస్ట్ ఇంగ్లండ్, నాలుగో మ్యాచ్ టీమిండియా గెలిచాయి. 4 మ్యాచ్‌ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్ ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో ఓసారి 5 వికెట్ల ప్రదర్శన మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో 21 వికెట్లతో ఓలీ రాబిన్సన్ అగ్రస్థానంలో ఉండగా, 18 వికెట్లతో టీమిండియా పేసర్ బుమ్రా రెండో ప్లేస్‌లో నిలిచాడు. చదవండి: అదే జరిగితే ఇంగ్లండ్‌తో సిరీస్ సమం అయినట్టే.. -
నా తప్పే.. క్షమించండి: హర్భజన్ సింగ్
వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్. చూడకుండా పోస్టు పెట్టా... సారీ!... అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు కోరుతున్నాడు. ఖలీస్తాన్ వేర్పాటువాది బింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడంపై ఇంటర్నెట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. దీంతో క్షమాపణలు చెప్పాడు టర్బోనేటర్. ఢిల్లీ: ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంటూ హర్భజన్ సింగ్ నివాళులు అర్పిస్తూ చేసిన పోస్టుపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆపరేషన్ బ్లూస్టార్‌కు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో చంపబడ్డ సిక్కు అమరవీరులకు నివాళులర్పిస్తూ భజ్జీ నిన్న(జూన్ 6న) ఒక పోస్ట్ చేశాడు. అయితే అందులో జర్నెయిల్ సింగ్ బింద్రన్‌వాలే ఫొటో కూడా ఉంది. దీంతో ఒక తీవ్రవాదిని అమరవీరుడిగా ఎలా అభివర్ణిస్తావంటూ హర్భజన్ సింగ్‌ను చాలామంది ట్రోల్ చేశారు. జరిగిన పొరపాటును గుర్తించానని చెబుతూ.. ఈరోజు ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు భజ్జీ. అది కేవలం వాట్సాప్‌లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ అని, తానుచూసుకోకుండా పోస్ట్ చేశానని ట్వీట్ చేశాడు. My heartfelt apology to my people..🙏🙏 pic.twitter.com/S44cszY7lh — Harbhajan Turbanator (@harbhajan_singh) June 7, 2021 ‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్న చేసిన పోస్టుకి క్షమాపణలు. అది వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయిన మెసేజ్. కంటెంట్‌ను అర్థం చేసుకోకుండా.. సరిగ్గా చూడకుండా పోస్ట్ చేశా. కానీ, అందులో ఉన్న ఉద్దేశం నేను గ్రహించలేకపోయా. ఇది ముమ్మాటికీ నా తప్పే. అంగీకరిస్తున్నా. ఆ ఫొటోలోని వ్యక్తుల సిద్ధాంతాలకు నేను కట్టుబడి లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి మద్ధతు ఇవ్వను. నేను సిక్కును. భారతీయుడను. దేశం కోసం పోరాడుతా. వ్యతిరేకంగా కాదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. నా దేశ ప్రజలకు హాని చేసే ఏ విద్రోహ శక్తులకు నేను సహకరించలేదు. సహకరించను కూడా’’ అని చెప్పుకొచ్చాడు హర్బజన్ సింగ్. అయితే నెటిజన్స్ మాత్రం శాంతించడం లేదు. గతంలో షాహిద్ అఫ్రిదీ కోసం డొనేషన్లు సేకరించిన భజ్జీ.. ఇప్పుడు మరోసారి దేశ వ్యతిరేక బుద్ధిని చాటుకున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు హర్భజన్ సింగ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది కూడా. చదవండి: సెలబ్రిటీలకు మాత్రమే రిప్లైలా? -
లాక్డౌన్లో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతీ రచ్చ, పోస్టు వైరల్
డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతీహాసన్ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది శ్రుతీ బర్త్‌డేకి శాంతను పెట్టిన పోస్టులు, ముంబై రోడ్లపై వీరిద్దరూ జంటగా చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. ఇక శ్రుతీ తాజా పోస్టు చూస్తే తప్పకుండా వీరిద్దరూ అవ్బర్డ్స్ అని ఒప్పుకొక తప్పదు. లాక్డౌన్లో శాంతానుతో కలిసి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. శ్రుతీ, తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శాంతనుపై కుర్చోని అతడి బుక్కలు గిల్లుతూ, లాగుతూ నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రుతీ ‘బెస్టీతో లాక్డ్న్’ అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం శ్రుతీ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి రెడీ అయ్యారట. కొంతకాలంగా మ్యూజిక్ కంపోజింగ్ మీద కూడా శ్రుతి బాగా దృష్టిపెట్టిన శ్రుతీ లండన్‌లో కొన్ని షోలు కూడా చేశారామె. తాజాగా శ్రుతి చేస్తున్న మ్యూజిక్ వీడియోలో శాంతను ర్యాప్ పాడనున్నారట. ఇంతకుముందు ర్యాపర్‌గా కొన్ని పాటలు పాడిన అనుభవం శాంతనుకు ఉంది. దీంతో వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి సిద్దమయ్యారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: కొత్త ఇంటికి మారిన బిగ్‌బాస్ భామ అరియాన -
అతడితో సీక్రెట్ డేటింగ్ చేస్తోన్న యాంకర్ వర్షిణి!
నటిగా వెండితెరపై మెరిసిన వర్షిణి.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా సెటిలైపోయింది. వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ అనసూయ, శ్రీముఖి, రష్మీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక గ్లామర్ విషయంలో కూడా వీరందరిక కంటే కాస్తా వర్షిణిదే పైచేయి. తన అమాయకత్వం, చిలిపితనంతో యువతను ఆకట్టుకుంటున్న వర్షిణి సోషల్ మీడియాలో సైతం తరచూ ట్రెడిషినల్, గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆ మధ్య జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ల సరసన యాంకర్‌గా చేసి వారితో లవ్ ట్రాక్‌కు తెరలేపిన ఆమె తాజాగా ఓ ఫొటో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి భజంపై తన తల వాల్చి నిద్రపోతున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అయితే కాసేపటికే ఈ స్టోరిని ఆమె డిలీట్ చేసి అందరికి షాకిచ్చింది. ఇక ఆమె స్టోరిని చూసిన కొత్తమంది స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా వర్షిణి ఆ వ్యక్తి కనిపించకుండా జాగ్రత్త పడగా.. అతడి భుజంపై ఉన్న ఓం అనే టాటును చూసి అతడేవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో వర్షిణి ప్రేమలో పడిందని, సీక్రెట్ డేటింగ్ చేస్తుందంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2017లో వర్షిణికి ఓ డైరెక్టర్‌తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. అది బ్రేక్ అయినట్లు వార్తలు వినిపించిన దానిపై ఇప్పటికి క్లారిటి లేదు. దీంతో ఈ వ్యక్తి ఆ డైరెక్టరేమోనని కూడా మరికొందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే త్రిష పెళ్లి.. వరుడు ఎవరంటే! -
Yuvraj Singh: న్యూలుక్లో అదరగొడుతున్న యువీ
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. యువీ తన న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సరికొత్త లుక్‌లో యువీ పొడవాటి జుట్టుతో పాటు గడ్డంతో కనిపిస్తాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. దీంతో అభిమానులు భారీ ఎత్తున లైక్‌లు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ తాజా పోస్ట్ పై టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. " భాయ్ బాద్ షా లా మారిపోయావ్ " అంటూ ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా తదితరులు కామెంట్ చేశారు. కాగా, తాజాగా ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో యువీ.. తన పూర్వపు ఫామ్‌ను కనబరుస్తూ ఇండియా లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సిరీస్‌లో యువీ.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 170.17 స్ట్రయిక్ రేట్‌తో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో యువీ మొత్తం 17 సిక్సర్లు బాదాడు. టోర్నీ మొత్తంలో యువీనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలవడం విశేషం. వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన వరుసగా నాలుగు సిక్సర్లు బాది.. తన పాత రికార్డును( వరుసగా 6 సిక్సర్లు) మరోసారి సాధించేలా కనిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సైతం యువీ రెచ్చిపోయి ఆడాడు. శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించి, భారత లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
పోస్టు డిలీట్ చేసిన సమంత, ఎందుకంటే?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందుతున్న హీరోయిన్ సమంత. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటోను జత చేసింది. ఈ ఫొటో చూడగానే ఆమె ఫ్యాన్స్ ఓ క్షణం పాటు అవాక్కయ్యారు. అందులో అంత పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? మరేం లేదు, సామ్ సోఫాలో పడుకుంది. కాకపోతే ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే యువకుడి ఒడిలో కాళ్లు పెట్టుకుని మరీ రిలాక్స్ అవుతోంది. ఇతడు సామ్‌కు నాలుగేళ్లుగా స్టైలిష్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల స్నేహానికి గుర్తుగా సామ్ అతడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో యాడ్ చేస్తూ ఐ లవ్యూ అని రాసుకొచ్చింది. (చదవండి: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?: ప్రదీప్ లిప్‌లాక్!) కానీ ఎంత క్లోజ్ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో సమంత చేసిన పనేమీ బాగోలేదని బాహాటంగానే విమర్శించారు. దీంతో నాలుక్కరుచుకున్న సామ్ వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే దాని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సామ్ ఈ ఫొటోను ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయబోయి స్టోరీస్‌లో యాడ్ చేసిందేమోనని ఆమె అభిమాని ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో శాంకుతలం అనే సినిమా చేయనుంది. (చదవండి: అఖిల్‌కు అంతా సెట్ చేసిన సమంత!) -
వర్కింగ్ మదర్ కష్టాలు ఇవే: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన భావాలను పోస్ట్ లుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతుంటారు. మంత్రిగా తాను చేస్తున్న కార్యకలాపాలతోపాటు తన లైఫ్‌లోని పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఓ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో వర్కింగ్ మదర్ జీవిత కష్టాలు ఎలా ఉంటుందో వివరించారు. దీనిని ఫన్నీ కామెంట్‌ను జత చేశారు. స్మృతికి భర్త జుబిన్ ఇరానీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ ఈ పోస్టులో తన కుటుంబాన్ని, పిల్లలను, వర్క్ మీటింగ్స్ మధ్య జీవితాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారో వెల్లడించారు. ‘ఇంటి నుంచి పనిచేసే అమ్మలకు ఆన్లైన్ సమావేశాలను, ఇంట్లో బాధ్యతలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది’. అని పేర్కొన్నారు. దీనికి వర్కింగ్ మామ్స్ అనే హ్యష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే ఇంట్లో నుంచి వర్చువల్ మీటింగ్స్‌కు హాజరవుతున్న మంత్రికి తమ పిల్లలు అరవడం వల్ల అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర మంత్రి పోస్టుపై పలువురు ప్రముఖలు స్పందిస్తున్నారు. ఆమె మల్టీ టాస్కర్ అని ప్రశంసిస్తున్నారు. కాగా ఇటీవల తాజా ట్యూస్డే(మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్‌తో మరోసారి అలరించిన విషయం తెలిసిందే. కోపంతో ఉన్న స్మృతి చిన్ననాటి ఫోటో, ఇప్పటి ఫోటోను షేర్ చేస్తూ.. నన్ను ఆగ్రహానికి గురిచేయొద్దు (డోంట్ యాంగ్రీ మీ) అంటూ ఫ్లాష్‌బ్యాక్ ఫోటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) -
కార్తిక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు అమ్మాయిలు ఫిదా
నటీనటులు ఎప్పుడూ ఒకేలా ఉంటే ఫ్యాన్స్‌కి కూడా బోర్ కొట్టేస్తుందిగా.. అందుకే అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించి కొత్త లుక్‌తో ఒక్క ఫోటో రిలీజ్ అవ్వగానే దానికి కామెంట్లు, షేర్లు వరదల్లా వచ్చి పడుతుంటాయి. అందుకే ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు ఎలా ఎంటర్టైన్ చేయాలా అనే ఆలోచిస్తుంటారు నటీనటులు. బాలీవుడ్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంటుంది. పైగా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే లాక్డౌన్ సమయంలో ఫ్యాన్స్‌కు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడమే కాదు లైవ్‌లు పెట్టి వారితో మాట్లాడేవాడు కూడా. చదవండి: (యశ్‌తో భారీ మల్టీస్టారర్‌కు శంకర్ ప్లాన్) ఇటీవల జుట్టు పెంచుకున్నకార్తీక్ ఆర్యన్ కొత్త మేక్ ఓవర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘కళ్లే మాట్లాడతాయి’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ సన్ కిస్స్‌డ్ సెల్ఫీలో కార్తీక్ సింపుల్‌గా ఒక టీ షర్ట్‌తో ఉన్నా తన డాషింగ్ లుక్ మాత్రం నెటిజన్లను కట్టిపడేస్తోంది. పెరిగిన జుట్టుతో, గడ్డంతో కార్తీక్ మునుపటి కంటే ఎక్కువ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కార్తీక్ ఆర్యన్ చివరగా 2019 డిసెంబర్లో విడుదలైన ‘పతి పత్నీ ఔర్ వో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చదవండి: (13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు) 1978లో సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, రంజితా కౌర్ నటించిన సినిమాకు ఇది రీమేక్. ఇందులో కార్తీక్ భూమీ పెడ్నేకర్, అనన్య పాండేతో జతకట్టాడు. ఈ సినిమా మరీ హిట్ టాక్ సాధించకపోయినా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. కార్తీక్ తర్వాత చిత్రం ‘దోస్తానా2’లో మళ్లీ ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు. ఈ సినిమాలో తనకు జంటగా జాన్వీ కపూర్, లక్ష్య నటించనున్నారు. View this post on Instagram Let the eyes do the talking A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on Nov 5, 2020 at 11:30pm PST -
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్
ముంబై : తన మీద వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ స్పందించారు. ఇటీవల ఇరా తన మానసిక ఆరోగ్యం గురించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇరా చేసిన ఈ పోస్టుపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. దీనిపై ఇరా స్పందిస్తూ ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు. తన పోస్టుపై ఎవరైన అభ్యంతరకంగా కామెంట్ పెడితే తొలగిస్తానని, అదే వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే పెట్టడానికి ధైర్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’ ఇక ఇరా ఖాన్.. ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాల కూతురు అన్న విషయం తెలిసిందే. తను(ఇరా) గత నాలుగేళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. మానసిక ఆరోగ్యం కోసం ఏమైనా చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు. అందుకే తన జర్నీ గురించి చెప్పాలి అనుకుటుంన్నానని, అసలు తనెందుకు ఒత్తిడికి లోనయ్యింది? ఏంటి అనే విషయాలను తెలియజేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దానివల్ల మీకు మానసిక ఆరోగ్యంపై కాస్తైనా అవగాహన వస్తుందేమో" అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు -
నా శరీరమే నా అందం: ఇలియానా
టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. అక్కడ ఆడపదడపా సినిమాల్లో నటించిన గోవా బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో క్రైమ్ డ్రామా ‘ది బిగ్ బుల్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా మళ్లీ అభిమానులను పలకరించారు. తన శరీర సౌష్టవాన్ని గురించి మొదట దిగులు చెందిన ఈ భామ ప్రస్తుతం అదే శరీరం చూసి మురిసిపోతుంది. దీనికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టులో శరీరాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడంలో ఎదుర్కొన్న సొంత అనుభవాలను పంచుకున్నారు. చదవండి: ఇలియానా వెరైటీ లుక్ తన శరీరంలో ఎన్నో లోపాలు ఉన్నట్లు బాధపడిన ఇలియానా ఇప్పడు ఆ లోపాలే ఆమెకు అందాలంటూ పేర్కొన్నారు. ‘నా శరీరాకృతిపై ఎప్పుడూ ఆందోళన చెందుతున్నాను. ఎదుటి వారికి ఎలా కన్పిస్తున్నానో అని బాధపపడేదాన్ని. నా థైస్ చాలా పెద్దగా ఉంటాయని అనిపించేవి. నా హిప్ చాలా వెడల్పుగా ఉంటుందని, నా నడుము సన్నగా ఉండేందని అనుకునేదాన్ని, నా వక్షోజాలు చిన్నగా ఉంటాయని, నా పొట్ట అనుకున్నంతా బాగోదని, భుజాలు బలహీనంగా ఉంటాయని అనిపించేది. పెదాలు అందంగా లేవని, నే ఎక్కువ ఎత్తు ఉండనని బాధపడేదాన్ని. అసలు నేను స్మార్ట్, పర్ఫెక్ట్ కాదని అభిప్రాయపడేదాన్ని.’ అని వెల్లడించారు.. (హైదరాబాద్‌లో 10 రోజులపాటు కంగనా) తన సహజసిద్ధమైన అందాలే తనకు అట్రాక్షన్ అని ఇలియానా తన పోస్టులో వివరించారు. ‘నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నాలోని ప్రతి మచ్చను అందంగా భావిస్తున్నాను. నాలోని అన్ని లోపాలను నా సొంత అందంగా మలుచుకున్నాను. ప్రపంచం అందం అని అనుకునే దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి. ఇతరులకు అందంగా అనిపించే దాని కోసం నేనేందుకు మారాలి. నా అందం నాదే. నాకు నేనుగా నిలబడ్డాను’. అంటూ సుదీర్ఘ పోస్టు చేశారు. కాగా ఇలియానా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ప్రేరేపించేలా ఉన్నాయి. అలాగే ఇలియానా షేప్ అంత అట్రాక్టివ్‌గా ఉండదని కొన్నాళ్ల క్రితం బాడీషేమింగ్ జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough..... I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough. Not realising I was never meant to be perfect. I was meant to be beautifully flawed. Different. Quirky. Unique. Every scar, every bump, every “flaw” just made me, me. My own kind of beautiful. That’s why I’ve stopped. Stopped trying to conform to the world’s ideals of what’s meant to be beautiful. I’ve stopped trying so hard to fit in. Why should I?? When I was born to stand out. #nophotoshop #nobs 📸 @colstonjulian A post shared by Ileana D'Cruz (@ileana_official) on Oct 1, 2020 at 5:51am PDT -
స్మృతి ఇరానీ పోస్ట్.. మేము ఎదురుచూస్తూ ఉంటాం!
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఆమె పోస్టు చేసే మీమ్స్, జోక్స్, జీవిత విషయాలకు సంబంధించివి నెటిజన్లను ఎంతోగానే ఆకర్షిస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్టు పెట్టారు స్మృతి. మనల్ని మనం ఎల్లప్పుడూ ఎలా మెరుగుపరుచుకుంటాం, ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాం అనే విషయాన్ని ఈ పోస్టు ద్వారా వెల్లడించారు. (ఖాళీ కుక్కర్‌ను గ్యాస్ స్టౌపై పెట్టింది ఎవరు?) ఈ మేరకు.. ‘నేను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాను. మీ ఓపికకు ధన్యవాదాలు ’ అని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అయ్యింది. 22 వేల మంది లైక్ చేయగా ఈ పోస్టుపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా సైతం దీనిని లైక్ చేశారు. ‘మేడమ్ ఎంత సమయమైనా తీసుకోండి. మీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం’. అని కామెంట్ చేశారు. మరొకరు.. ‘మీరు ఖచ్చితంగా దేశం కోసం ఉత్తమమైనది నిర్మిస్తారు’. అని పేర్కొన్నారు. (‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’) View this post on Instagram 🤫 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Sep 19, 2020 at 10:19pm PDT -
ధోని న్యూ లుక్‌పై సాక్షి కామెంట్..
దుబాయ్: ఐపీఎల్ లక్షలాది మంది అభిమానుల నిరీక్షణకు తెరదించింది. 436 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎస్ ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు. తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని, గతం కంటే భిన్నంగా ఫిట్‌గా కనిపించాడు. ఆయన ఫిట్నెస్, హెయిర్ స్టైల్ సరికొత్తగా కనిపించాయి. అయితే.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచిన తర్వాత ధోని భార్య సాక్షిసింగ్.. ధోని చేతిలో మైక్ ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో 'ఎంత అందంగా ఉన్నాడో' అంటూ రాసుకొచ్చింది. (సింగం స్టైల్లో.. ధోని న్యూలుక్) సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తరువాత.. లాక్డౌన్లో క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారంటూ ధోనిని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అడిగాడు. సమాధానంగా లాక్డౌన్లో స్వేచ్చగా, ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోనే గడిపినట్లు చెప్పుకొచ్చారు. లాక్డౌన్ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నందుకు మిగతా టీమ్ సభ్యులను కూడా అభినందించారు. (ముంబైపై విజయంతో ధోని కొత్త చరిత్ర) ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనికి ఇదే మొదటి మ్యాచ్. అయితే ధోనికి ఈ మ్యాచ్‌లో పెద్దగా బ్యాట్‌తో పనిచెప్పే అవసరం రాకపోయినప్పటికీ, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్‌లో చాలా పదునుగా కనిపించాడు. అయితే, సెప్టెంబర్ 22న షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌లో తన నుంచి ఓ భారీ ఇన్సింగ్స్‌ను సీఎస్కే అభిమానులు ఆశిస్తున్నారు. -
మిస్టర్ సీ.. జిమ్‌కి వచ్చేసీ... మరి మీరూ?
కోవిడ్ బ్రేక్ వల్ల జిమ్‌కి సెలవు పెట్టారట రామ్‌చరణ్. గురువారం జిమ్‌లోకి ఎంటరై, మళ్లీ వర్కవుట్లు మొదలుపెట్టారు చరణŠ.. ఈ విషయాన్ని ఆయన సతీమణి ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మిస్టర్ సీ (చరణ్‌ను ఆమె అలానే పిలుస్తారు) మళ్లీ జిమ్‌లోకి వచ్చారు. మరి మీరు?’ అని ఓ ఫోటోను షేర్ చేశారామె. రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరో హీరో. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఇందుకోసం తన శరీరాకృతిని కొత్తగా తయారు చేశారు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్లో తన కండలు తిరిగిన దేహాన్ని చూపించారు. అక్టోబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందట! -
కుమార్తెని పరిచయం చేసిన నటి
కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి స్నేహ. చెరగని చిరునవ్వుకి కెరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించారు. నటిగా ఫుల్ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిట్టితల్లి ఫోటోలు ఎక్కడా షేర్ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు స్నేహ. పాప పేరు ఆద్యంత. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. (చదవండి: స్నేహలోని కొత్త కోణం) ‘హ్యాపీ బర్త్‌డే టూ మై సోల్ మేట్.. మై లవర్ బాయ్.. గార్డియన్ ఏంజిల్.. సూపర్ డాడా. ఈ లడ్డులతో(పిల్లలు) నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కుమార్తె ఫోటోలు షేర్ చేశారు స్నేహ. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram Happy birthday to my soul mate my lover boy my guardian angel 😇 n my super dada. Thanx for making my life beautiful with these laddos. Love you somuch. And very happy to introduce our little laddo #Aadhyantaa to all the lovely people who have always blessed us and wished us the best. @prasanna_actor @mommyshotsbyamrita @perfektmakeover A post shared by Sneha Prasanna (@realactress_sneha) on Aug 27, 2020 at 8:50pm PDT -
సూపర్ క్రేజ్.. 1.7 మిలియన్ లైక్స్
కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం దొరకడంతో హీరోలు, హీరోయిన్లు ఇళ్ల దగ్గరే తమకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో టైం పాస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు విజయ్. ఇప్పటికే ఈ ఫోటోను 1.7 మిలియన్ల మంది లైక్ చేశారు. దీనిలో విజయ్ తన పెంపుడు కుక్కలు స్టార్మ్, చెస్టర్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ‘చిల్లింగ్ విత్ దిస్ బాయ్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. గత నెల తొలిసారి స్టార్మ్ ఫోటోను షేర్ చేశారు విజయ్. (అవకాశాలు అంత తేలికకాదు..) View this post on Instagram Chilling with these boys @thestormdeverakonda and @chester.thesamoyed. A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on Aug 23, 2020 at 9:24am PDT ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. -
ఇన్‌స్టాలో ఒక్క పోస్టుకు రూ. 7.59 కోట్లు
హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.. ఒకప్పుడు రెజ్లింగ్‌లో తన సత్తాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అనంతరం సినిమాల్లోనూ ప్రవేశించి స్టార్ నటుడిగా రాణిస్తున్నాడు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న డ్వేన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో 189 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హ్యాపర్ హెచ్‌క్యూ ప్రకారం.. అతడు అడ్వర్టైజ్మెంట్ల కోసం చేసే ఒక్క పోస్టు ద్వారా 7,59,93,050 కోట్ల రూపాయలు(10,15,000 డాలర్లు) ఆర్జిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా డబ్బులు గడించే లిస్టులో డ్వేన్ తొలి స్థానంలో నిలిచాడు. (నాకు కరోనా లక్షణాలు లేవు.. కానీ: కైలీ జెన్నర్) నిజానికి ఈ స్థానంలో టీవీ స్టార్, మేకప్ మొఘల్ కైలీ జెన్నర్ ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 184 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె గతేడాది ఒక్క పోస్టుకు 1.2 మిలియన్ అంటే అక్షరాలా ఎనిమిది కోట్లకు పైగా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కాస్త వెనకబడి ఒక్క పోస్టుకు 7,38,21,820 కోట్లు అందుకుంటూ రెండో స్థానానికి పడిపోయారు. తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (6,65,59,430 కోట్లు), జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియన్ ( 6,42,38,460 కోట్లు), గాయకుడు, గేయ రచయిత అరియానా గ్రాండే (6,38,64,110) ఉన్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జుమాంజి వంటి పలు వరల్డ్ హిట్ చిత్రాల్లో నటించిన డ్వేన్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2019లో అత్యధికంగా సంపాదించే హాలీవుడ్ నటుడిగా నిలిచాడు. (అతడు.. ఆమె.. ఓ అన్న!) -
సమంత ట్రై చేసిన కొత్త ఆసనం చూశారా
సాక్షి, హైదరాబాద్ : ఫిట్నెస్ మంత్రాతో అభిమానులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరోసారి తన యోగాసనంతో ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటీవల సోషల్ మీడియాలో యోగా ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేస్తున్నసమంత తాజాగా భర్త నాగ చైతన్య తో కలిసి వేసిన ఆసనాల ఫోటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. (కొత్త ప్రయాణం) తోటపనితో పాటు, యోగాను కూడా ఇష్టపడతానని చెప్పిన సమంత, భర్తతో కలిసి చేయడం ఇంకా ఎంజాయ్ చేస్తానన్నారు. తొలిసారి శీర్షాసనం కోసం ప్రయత్నించి విజయం సాధించామంటూ శీర్షాసనం ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలి పోర్ట్రయిట్ ఫోటో అంటూ పెంపుడు కుక్క ఫోటోను కూడా ఉంచడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. సమంతా, నాగచైతన్య జంట యోగాలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చేసిన యోగా ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సూపర్ బెస్ట్ ట్రైనర్ అంటూ సంతోష్ గురించి కూడా సమంత ప్రస్తావించారు. -
మైదానంలోకి రోహిత్ శర్మ
ముంబై: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు బ్యాట్ పట్టుకున్నాడు. కోవిడ్–19 నిబంధనల సడలింపులతో తాను మళ్లీ గ్రౌండ్‌కు వచ్చినట్లు అతను వెల్లడించాడు. ‘మళ్లీ మైదానంలోకి రావడం బాగుంది. కొంత సేపు ఆడగలిగాను. చాలా రోజుల తర్వాత నాకు నేనే కొత్తగా కనిపించాను’ అని తన ఇన్‌స్టగ్రామ్ అకౌంట్లో అతను పోస్ట్ చేశాడు. -
రతన్ టాటా ఇన్స్టాగ్రామ్ పోస్ట్.. నెటిజన్లు ఫిదా
ముంబై: ఆన్లైన్లో విద్వేషాలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని నెటిజన్లకు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఇది ఒకరికి ఒకరు సాయంచేసుకోవాల్సిన సమయమని తెలిపారు. కానీ జనాలు ఆన్లైన్ వేదికగా పరస్పర దూషణలతో మనస్సులు గాయపరుచుకుంటున్నారు అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. ‘ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సవాళ్లతో కూడుకున్నది. నెటిజన్లు తొందరపాటు నిర్ణయాలతో, దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకరిని ఒకరు కిందకు లాగే సమయం కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెగిటివిటికి దూరంగా ఉండటంతో పాటు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి' అని పేర్కొన్నారు. ఇది సవాళ్లతో నిండిని సంవత్సరమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి పట్ల మరొకరికి దయ, అవగాహన, సహనం అవసరం అని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం అందరం కలసికట్టుగా.. ఏకతాటి పైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు తాను ఆన్లైన్లో గడిపేది చాలా తక్కువ సమయమన్నారు. ద్వేషం, వ్యతిరేకతలను పక్కన పెట్టి, ఇది అందరికీ మంచి చేసే ప్రదేశంగా మారుతుందని రతన్ టాటా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. (మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన) View this post on Instagram 🤍 A post shared by Ratan Tata (@ratantata) on Jun 20, 2020 at 11:40pm PDT -
నిహారిక పోస్ట్: కాబోయే భర్త అతనేనా?
కొణెదల నిహారిక... మెగా వారసురాలిగా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ మధ్య సినిమాల కంటే ఆమె పెళ్లిపై వచ్చే గాసిప్స్ ద్వారానే నిహారిక ఇంకా ఫేమస్ అయ్యారు. అయితే నిహారిక పెళ్లి త్వరలోనే చేయబోతున్నామని మెగా బ్రదర్ నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ వార్త నిజమేననట్లు నిహారిక ఒక కప్పుపై మిస్ నిహారిక అని పేరును కొట్టేసి, మిసెస్ అని రాసి కొశ్చన్ మార్క్ పెట్టింది. దీంతో పెళ్లి నిజంగానే ఫిక్స్ అయ్యిందని అందరూ భావిస్తున్నారు. (నిహారిక పోస్ట్: పెళ్లి గురించేనా?) అయితే ఈ రోజు (గురువారం) తాజాగా ఒక వ్యక్తిని హగ్ చేసుకొని ఉన్న ఫోటోను నిహారిక తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో అందరూ నిజంగా నిహారిక పెళ్లిని పెద్దలు నిశ్చయించేశారని అనుకుంటున్నారు. అయితే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది మాత్రం ముఖం కనిపించడం లేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అతనే నిహారికకు కాబోయే భర్త అని భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్‌తో, ఇతర హీరోలతో నిహారిక పెళ్లి అని అనేక గాసిప్‌లు సృష్టించారు. అయితే ప్రస్తుతం నిహారిక గుంటూరుకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడు చైతన్యను చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్త ఎంతవరకు నిజమో కొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. (మెగా డాటర్ ఆవకాయ పచ్చడి.. నోరు ఊరిపోవాల్సిందే) View this post on Instagram Peek-a-boo A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 18, 2020 at 4:47am PDT -
‘నువ్వు లేకుండా ఉండలేం.. వచ్చేయ్’
ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మికంగా గుండె పోటుతో గత వారం మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి మరణాన్ని సోదరుడు ధృవ్ సర్జా జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు లేకుండా ఉండలేము.. తిరిగొచ్చెయ్ అంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలో చనిపోవడానికి ముందు చిరంజీవి సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోను రీపోస్ట్ చేస్తూ.. ‘నీవు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను.. నీవు లేకుండా ఉండలేము’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ అభిమానులను కలిచి వేస్తోంది. (చివరి కోరిక తీరకుండానే మరణించిన హీరో) View this post on Instagram Then and now.. we r still the same... what say guys..?? A post shared by Chirranjeevi Sarja (@chirusarja) on Jun 6, 2020 at 1:20am PDT చిరంజీవి మరణం.. ధృవ్ సర్జాను కుంగదీసింది. సోదరుడి అంత్యక్రియల రోజున కూడా ఎంతో విచారంగా.. కుంగిపోయినట్లు కనిపించారు. చిరంజీవికి ధృవ్ సర్జా ఫాం హౌస్ అంటే ఎంతో ఇష్టమని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని సన్నిహితులు తెలిపారు. -
నా శరీరం బాగుంది.. అందుకే: నటి
ముంబై : బాలీవుడ్ బుల్లితెర నటి చారు అసోపా చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతేడాది జూన్‌లో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్‌ను సేన్‌ను చారు అసోపా వివాహం చేసుకున్నారు. ఇటీవల లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న చారు తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాను ఎంతగానో ఇష్టపడే రెడ్ కలర్ క్రాప్ జాకెట్ ధరించి ఇంట్లో ఫోటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాక ఈ డ్రెస్‌తో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసి దానిని కూడా అభిమానులతో పంచుకున్నారు. (పుత్రోత్సాహంలో బాలీవుడ్ హీరో) View this post on Instagram In love with this red sequin jacket @fomo_thelabel #fomo ❤️❤️❤️ A post shared by Charu Asopa Sen (@asopacharu) on Jun 2, 2020 at 6:49am PDT ఇక చారు పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చారు రెడ్ దుస్తుల్లో అదిరిపోయారంటూ అభిమానులు పొగుడుతూంటే మరికొంతమంది ఆమె డ్రెస్సింగ్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. వేషాధారణ సరిగా లేదని ఇలాంటి దుస్తులు ధరించడానికి సిగ్గు లేదా అని మండిపడుతున్నారు. శోభ అనే నెటిజన్ ఏకంగా.. ‘‘ఆ మాత్రం ఆచ్ఛాదన ఎందుకు’’ అంటూ అసభ్యకర కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్లపై చారు ఘాటుగా స్పందించారు. ‘నా శరీరం బాగుంది కాబట్టి నేను దానిని చూపించాలనుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఉంటే మీరు కూడా చూపించవచ్చు’. అంటూ విమర్శలను తిప్పికొట్టారు. చూసే కళ్లను బట్టే ఎదుటివారిపై అభిప్రాయం మారుతుందని పేర్కొన్నారు. కాగా మహాదేవ్, దియా ఔర్ బాతి హమ్, మేరే ఆంగ్నే మెయిన్, మహారక్షక్ వంటి టీవీ షోలలో నటించి మంచి పేరును సంపాదించారు. అలాగే కాల్ ఫర్ ఫన్, ఇంపేషెంట్ వివేక్ వంటి సినిమాల్లోనూ చారు నటించారు. (బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ మృతి) View this post on Instagram Pehli baarish ki Khushi❤️ ❤️❤️ @fomo_thelabel #fomo A post shared by Charu Asopa Sen (@asopacharu) on Jun 2, 2020 at 6:54am PDT -
నటియిత్రి
లాక్ డౌన్ కాలం అందరిలో ఉన్న అజ్ఞాత ప్రతిభను వెలికితీస్తోంది. అందుకు బాలీవుడ్ తారలు అతీతులేం కాదు. తమ భావాలను చక్కగా లోకానికి వెల్లడిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ప్రముఖ నటులంతా కలిసి, తమ తమ ఇళ్ళనుంచే స్ఫూర్తిదాయకమైన వీడియో రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అదెంత వైరల్ అయ్యిందో అందరం చూశాం. ఇప్పుడు ఒక నటి తన మనసులోని భావాలను చక్కగా వెల్లడించారు. మనం ఏం చేస్తే అందరి మనసులనూ ఆకట్టుకోగలమో... మంచిని పంచగలమో తెలియజెప్పారు. బాలీవుడ్ ప్రముఖ నటి దివ్యా దత్తా మనసు చాలా సున్నితమైనది. ఆమెలోనూ ఒక అజ్ఞాత కవయిత్రి అంతర్లీనంగా దాగి ఉంది. నటిగా, మోడల్‌గా మాత్రమే కాకుండా కవయిత్రిగా ఇప్పుడు ప్రపంచానికి తనలోని అక్షరాలకు రూపం కల్పించింది. కరోనా నేపథ్యంలో ఒక పద్యం రాసింది. అందులోని భావాలను తన గొంతులో ఎంతో హృద్యంగా పలికించింది. ‘జబ్ సబ్ ఠీక్ హోగా నా’ అంటూ ఒకసారి అందరి హృదయాలను సన్నగా తట్టి లేపింది. ఈ లలితమైన గీతాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ విపత్తు నుండి బయటపడి అందరం ఆహ్లాదంగా ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. మూడురోజులకొకసారి మనవారందరికీ వీడియో కాల్స్ చేస్తున్నాం. మనం వండిన వంటను ఎలా తయారుచేయాలో వాళ్లకి రెసిపీలు చెబుతున్నాం. మార్కెట్లో ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలియపరుస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. పాత ఆల్బమ్స్ చూస్తూ మన బాల్యాన్ని, మధుర క్షణాలను తీయగా ఆస్వాదిస్తున్నాం. వాటిని చూస్తూ చిన్నప్పుడు తలగడలతో కొట్టుకున్న ఆటలు గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేస్తున్నాం. ఆర్డి బర్మన్ సంగీతం వింటూ ఆనందిస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. వీధి కుక్కలను పలకరిస్తూ వాటికి అన్నం పెడుతున్నాం. మంచి నీళ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మనకు చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. నిత్యం మన పనులను చేయడానికి వస్తున్న పనివారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటే, వారి ముఖాలపై నర్తించే చిరునవ్వులు చూడండి. మనలను కంటికిరెప్పలా కాపాడుతున్న మన ఇంటి వాచ్మ్యా¯Œ ని ‘టీ తాగావా, టిఫిన్ అయ్యిందా, భోజనం చేశావా’ అని కడుపునిండుగా నవ్వుతూ పలకరించండి. ఈ పనులన్నీ అటూ ఇటూ వెళ్తూ చేసేవే. ఇంకా కోకిల స్వరాన్ని వింటూ, అది ఏ భావంతో పాడుతోందో అర్థం చేసుకోండి. కాకుల కోసం నీళ్లు పెట్టండి. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. అంటూ ఎంతో అనుభూతితో రచించిన ఈ పద్యాన్ని, మనసుకి హత్తుకునేలా చదివారు దివ్యాదత్తా. -
మిస్ యు మెయిడ్
‘‘ఆడుతు పాడతు తుడుస్తు ఉంటే అలుపూ సొలుపేమున్నదీ. ఇల్లే శుభ్రం అవుతున్నదీ’’ అని పాడుతున్నారు పాయల్ రాజ్ పుత్. లాక్ డౌన్ కారణంగా పాయల్ ఇంటి సహాయకురాలు (మెయిడ్) రావడం లేదట. దాంతో తన గదిని స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు పాయల్. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి, ‘మిస్ యు మెయిడ్’ అంటూ పక్కన ఉన్న ఫొటోను షేర్ చేశారు. -
మాజీ ఎమ్మెల్యే భార్యకు వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీ చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే భార్యకు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై మంగళవారం ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రాంరంభించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే మాజీ ఎమ్మెల్యే భార్య పేరుతో సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ఐడీని కొందరు దుండగులు క్రియేట్ చేశారు. దీనికి ప్రొఫైల్ పిక్‌గా ఆమె ఫొటోనే వినియోగించారు. ఈ ఐడీ ద్వారా ఆమే స్వయంగా పోస్టులు పెట్టినట్లు అభ్యంతరకరంగా, అసభ్యంగా కొన్ని సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆమె స్నేహితుల, బంధువులకు వెళ్లాయి. కొందరితో ఆమె మాదిరిగా చాటింగ్ కూడా చేస్తున్నారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా!
‘‘మన కోసం మనం చేసుకునే సహాయం ఏదైనా ఉందంటే మన శరీరం, మెదడులో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను గమనించడం.. వాటిని తెలుసుకోవడం... అర్థం చేసుకోవడం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోకి ‘శ్రుతీ చిక్కిపోయిందేంటి? ఆరోగ్య సమస్యలా? దారుణంగా ఉంది’ అంటూ నెటిజన్ల నుంచి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌కు స్పందిస్తూ రాసిన ఓ లేఖను పంచుకున్నారు శ్రుతి. దాని సారాంశం ఈ విధంగా.. ‘‘సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను నేను పెద్దగా పట్టించుకోను. కానీ అదేపనిగా తను లావుగా ఉంది, సన్నగా ఉంది అంటూ చేసే విమర్శలకు స్పందించాలనిపిస్తుంది. ఈ రెండు ఫొటోలు (ఇన్సెట్లో ఉన్న ఫొటో) కేవలం మూడు రోజుల వ్యవధిలో దిగినవి. నేను ఏం చెప్పబోతున్నానో చాలామంది స్త్రీలు అర్థం చేసుకుంటారని, రిలేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనెప్పుడూ నా శరీరంలోని హార్మోన్ల అధీనంలోనే నడుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. వాటిని బ్యాలెన్స్ చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. వాటితో సమన్వయం కుదుర్చుకునే పనిలోనే ఉన్నాను. అది అనుకున్నంత సులువైన పనేం కాదు. ఆ బాధ తేలికైనదేం కాదు. శరీరంలో వచ్చే మార్పులు చెప్పినంత సులువేం కాదు. కానీ ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడం సులువు అనుకుంటున్నాను. ఏ వ్యక్తి అయినా సరే ఏ సందర్భంలోనూ మరో వ్యక్తిని జడ్జ్ చేయకూడదు. అవును.. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. దాంట్లో సిగ్గుపడటానికి ఏం లేదు. ఇది నా జీవితం, నా ముఖం. ప్లాస్టిక్ సర్జరీని నేను ప్రమోట్ చేయను. అది విరుద్ధమైనది అని కూడా అనను. నా ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయం అది. అయితే నన్ను విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నేను కొంచెం కొంచెంగా ప్రతిరోజూ నన్ను నేను మరింత ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మన జీవితంలో గొప్ప ప్రేమకథ మనతోనే అయ్యుండాలి. మీ జీవితం కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. ప్రేమను పంచుదాం’’ అన్నారు శ్రుతీ హాసన్. -
‘ఓసారి వ్యాయామం చేయాలనుకున్నా.. కానీ’
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనగానే గుర్తొచ్చేది ఆమె వాక్చాతుర్యం. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు ఎదో రకంగా మెసేజ్ ఇస్తుంటారు. కుటుంబం, రాజకీయాలకు సంబంధించిన విషయాలతోపాటు ఇతర ఎన్నో అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ.. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా వివరిస్తారు. తాజాగా మరో ఆసక్తికర విషయంతో స్మృతి వార్తల్లో నిలిచారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేశారు. గతంలో స్మృతి వ్యాయమం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఆమెకు కొన్నిసమస్యలు తలెత్తడంతో వెంటనే వ్యాయామాన్ని మానేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..‘‘నేను ఒకసారి వ్యాయామం చేయడం మొదలు పెట్టాను. అ తరువాత నాకు ఎలర్జీ రావడం మొదలైంది. నా చర్మం అంతా ఉబ్బిపోయింది. అలాగే గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. విపరీతమై చెమటతో ఆయాసం వచ్చేది. చాలా ప్రమాదకరంగా అనిపించింది.’’అని హస్యస్పదమైన పోస్ట్ చేశారు. -
సెలబ్రిటీ సిస్టర్స్ పోస్ట్‌కు నెటిజన్ల ఫిదా
న్యూఢిల్లీ : సెలబ్రిటీ సిస్టర్స్ తమ మధ్య ఉన్న ఆప్యాయతలను చాటుకుంటూ తమ ఎమోషనల్ బాండింగ్ ఏపాటిదో తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శ్రీదేవి, బోనీకపూర్‌ల ముద్దుల తనయలు ప్రతి సందర్భంలోనూ తమ మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియాలో చాటుతుంటారు. ఇక ఉన్నత విద్య కోసం సెప్టెంబర్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన జాన్వీ కపూర్ చిట్టి చెల్లెలు ఖుషీ కపూర్ క్రిస్మస్ హాలిడే గడిపేందుకు ముంబైలోని తమ ఇంటికి చేరుకుంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బోనీ కపూర్ తన కుమార్తెను రిసీవ్ చేసుకుని ఇల్లు చేరారో లేదో జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫైనల్లీ అనే క్యాప్షన్‌తో ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఖుషీని పట్టరాని ఆనందంతో జాన్వీ హగ్ చేసుకుంటున్న ఫోటోలు కనిపించాయి. తన అక్కను చాలారోజుల తర్వాత కలుసుకున్న సంతోషంతో ఖుషీ జాన్వీపై వాలిపోయింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఖుషీ మూవీకి సంబంధించిన కోర్సు అభ్యసిస్తోంది. కోర్సు ముగిసిన అనంతరం బాలీవుడ్లో ఆమె ఎంట్రీ ఇవ్వనున్నారు. ఖుషీ 20వ పుట్టిన రోజున సైతం జాన్వీ ఉద్వేగంగా రియాక్టరయ్యారు. ‘నిన్ను చాలా మిస్ అవుతున్నా.. నువ్వే నా ప్రాణ’మంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. -
రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్
ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్(36) ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్‌బాయ్ కెన్నెత్ పెర్రీని రహస్య వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఉన్న పేరును 'మిసెస్ పెట్టీ'గా మార్చారు. అంతేకాక సోమవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. 'ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేశారు. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీను జత చేశారు. ఇక వీడియోలో మిస్టర్ అండ్ మిసెస్ ఉన్న మగ్‌లతో పాటు వధూవరులనే అర్థానిచ్చే రెండు బేస్‌బాల్ క్యాప్‌లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె ఫ్యాన్స్.. ఆ వెంటనే తేరుకొని నిక్కీ మినాజ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మ్యారేజ్ లైసెన్స్ గడువు ముగియనుండడంతో.. ప్రియుడిని ఉన్నపళంగా వివాహం చేసుకొందని.. మళ్లీ రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్‌మీడియాలో గుప్పుమంటున్నాయి. నిక్కీ తాను పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తను.. జూన్ 21న ఒక రేడియోలో అధికారింగా ప్రకటించారు. అందులో ఆమె.. తన బాయ్‌ఫ్రెండ్ మ్యారెజ్ లైసెన్స్ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నాని స్పష్టం చేశారు. గతేడాది నుంచి పెట్టీతో డేట్ చేస్తున్న నిక్కీ.. పెట్టీతో ప్రేమలో ఉన్నట్టు తొలిసారిగా గత డిసెంబర్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించారు. లైంగిక ఆరోపణలతో దోషిగా తేలిన కెన్నెత్ పెట్టీను.. నిక్కీ ఏరికోరి వివాహం చేసుకోవడం గమనార్హం. View this post on Instagram 👰🏽🤵🏽😢🙏🏽🎀 Onika Tanya Maraj-Petty 10•21•19 A post shared by Barbie (@nickiminaj) on Oct 21, 2019 at 8:22pm PDT -
కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో!
మలయాళ నటుడు దిలీప్, అతని భార్య కావ్య మాధవన్ తమ కూతురు మహలక్ష్మీ తొలి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేశారు. తన కుమార్తె మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు కావడంతో.. ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో మహలక్ష్మీ తన తండ్రి దిలీప్, తల్లి కావ్యతో పాటు అక్క (దిలీప్ మొదటి భార్య కూతురు మీనాక్షి), నానమ్మలతో కనిపిస్తుంది. మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు వేడుకలకు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మలయాళ నటిని అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 2017లో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్‌కు మహలక్ష్మీ రెండో భార్య కూతురు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌తో 17 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ వైవాహిక జీవితానికి 2015లో ముగింపు పలికాడు. ప్రస్తుతం 51ఏళ్ల దిలీప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా శుభరాత్రి అనే చిత్రంలో కనిపించిన ఈ నటుడు, తాజాగా జాక్ డెనియల్తో తెర మీద కనిపించనున్నాడు. -
ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్వీర్
భార్య ఏం చేసినా భర్తకు ముద్దుగానే కనిపిస్తుంది. ఈ పదం ప్రస్తుతం బాలీవుడ్లో రొమాంటిక్ కపుల్‌గా పేరు పొందిన రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్‌కు చక్కగా సరిపోతుంది. వీరిద్దరూ తమకు చెందిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఒకరు పోస్ట్ చేసిన ఫోటోలపై మరోకరు కామెంట్లు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపికా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఫోటోషూట్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోపై భర్త రణ్వీర్ స్పందించారు. ‘ఆ చూపులకు అర్థం నాకు తెలుసు. ఇప్పటికైనా ఇంటికి వస్తారా’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే రణ్వీర్ ఇలా కామెంట్ పెట్టడానికి కారణం ఇందులో దీపికా కెమెరావైపు కాస్తా కోపంగా ఉన్నట్లు ఫోజ్ ఇయడమే. అంతేగాక ఇలా దీపికా ఫోటోలపై స్పందించడం రణ్‌వీర్‌కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా దీపికా పెట్టిన అనేక పోస్ట్‌లకు సరదాగా కామెంట్ పెడుతూ వచ్చాడు. కాగా పెళ్లికి ముందు మూడు సినిమాలలో కలిసి నటించిన దీప్‌వీర్ వివాహానంతరం కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపోందుతున్న ‘83’ సినిమాలో భార్యభర్తలుగా తెరమీద కనిపించనున్నారు. 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం వెనక కృషి చేసిన లెంజడరీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. . View this post on Instagram @harpersbazaarus Photographer: @david_roemer Fashion Editor/Stylist: @carrielauren Hair: @earlsimms2 Makeup: @naokoscintu Nails: @robbietomkins Author: @whatisnojan A post shared by Deepika Padukone (@deepikapadukone) on Oct 16, 2019 at 12:12am PDT -
'ఫన్నీ వీడియోను పోస్ట్ చేసిన ధోని'
భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బ్యాట్మన్ వరుసపెట్టి రెండుసార్లు ఔట్ అయినా.. ఒప్పుకోడు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని, మన జీవితంలో ఇలాంటివి ఎక్కడోచోట జరిగిన సందర్భాలు ఉంటాయని ధోని పేర్కొన్నాడు. అంతేకాక సరిగా వెలుతురు లేని కారణంగా బ్యాట్మన్ అవుట్ అయినందుకు ధోని సారీ చెప్పాడు. ఈ వీడియో మన దగ్గర లేకపోయుంటే సదరు బ్యాట్మన్ అవుట్ అయినా.. అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. View this post on Instagram Wen U know what’s coming and start the camera and u get it in the nxt 1min, sorry for the bad light but it’s the lingo that’s fun trial ball, umpires decision last decision.brings back memory from school days.he wd have never accepted this ever happened if v didn’t have this video.all of us have witnessed this at some point of time in cricket.enjoy A post shared by M S Dhoni (@mahi7781) on Sep 24, 2019 at 4:16am PDT 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని ప్రస్తుతం సెలవులు తీసుకుని సరదాగా గడుపుతున్నాడు. అంతకుముందు రెండు నెలల పాటు సైన్యంలో సేవలు అందించాడు. డిసెంబర్ 6న వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌కు ధోని అందుబాటులో ఉండే అవకాశం ఉంది. -
ఐ లవ్యూ, ఐ మిస్ యూ: హీరో కూతురు
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిషాల, తన బాయ్‌ఫ్రెండ్ మరణించి సరిగ్గా ఒక నెల కావడంతో.. ఆమె దివంగత ప్రియుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో తన ఇటాలియన్ బాయ్‌ఫ్రెండ్ ఆమె ఒళ్లో కూర్చొని ఉండగా, చిత్రానికి ‘ఐ లవ్యూ, ఐ మిస్ యూ’ అనే హ్యష్‌టాగ్ జోడించారు. సరిగ్గా నెల రోజుల క్రితం, త్రిషాల తన ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఓ భావోద్వేగపూరిత పోస్టు ద్వారా తెలిపిన సంగతి విదితమే. అందులో తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ‘నా గుండె పగిలింది. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు, నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నేను జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచంలోనే అదృష్టవంతురాలైన అమ్మాయినని భావిస్తున్నాను. నీ దాన్ని అయినందుకు ఎంతగానో మురిసిపోయాను. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావు. ఐ లవ్ యూ. మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు.. నిన్ను ఎంతగా మిస్సవుతానో నాకు మాత్రమే తెలుసు. నేను ఎల్లప్పుడూ నీ దానినే.. బెల్లా మియా. నిన్నటి కంటే ఎక్కువగా నేడు.. నేటి కంటే రేపు మరింత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు. ఇటీవలే ఓ వివాహానికి హాజరయిన ఆమె తన ప్రియుడిని మిస్సవుతోన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘ఈ వారాంతంలో నన్ను నేను చిరునవ్వుతో సిద్ధం చేసుకొని నా మిత్రుని సోదరి వివాహానికి హాజరయ్యాను. తేరుకొవడానికి కొద్దిగా సమయం పడుతుంది, నా వంతు కృషి చేస్తున్నాను. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను, మిస్ అవుతున్నాను. నేను అతన్ని ఎంతలా ఆరాధించానో, అతను కూడా నన్ను అదే రీతిలో ఆరాధించాడు’ అని ఆమె తెలిపారు. త్రిషాల సంజయ్ దత్ మొదటి కుమార్తె. 1989లో న్యూయార్క్‌లో జన్మించారు. ఆమె తల్లి రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ 1996 లో మరణించించారు. కాగా, సంజయ్‌దత్ బయోపిక్ అయిన ‘సంజూ’లో రిచా శర్మ, త్రిషాల గూర్చి ప్రస్తావించలేదు. దానిపై చాలా ఊహాగానాలు బయటకు వచ్చాయి. తన తండ్రి సంజయ్‌తో తన సంబంధం చాలా ‘సాధారణమైనది’ అని ఆమె ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఏఎమ్ఏ సెషన్లో తెలిపారు. -
ఆమె హీరోయిన్గా పనికి రాదు
-
‘ఆమె హీరోయిన్గా పనికి రాదు’
‘మహీర ఖాన్ వయసైపోయింది, హీరోయిన్గా పనికి రాదు’ అంటూ పాకిస్తాన్ ప్రముఖ నటుడు ఫిర్దోస్ జమాల్ ఓ టెలివిజన్ షోలో చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. జమాల్ వ్యాఖ్యలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ ద్వారా సమాధానమిచ్చారు. స్త్రీల పట్ల ద్వేషం మానుకోవాలని ఫిర్దోస్‌కు హితవు పలికారు. మహీర రాసిన ఈ లేఖకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ ప్రముఖ నటుడు ఫిర్దోస్ జమాల్, రయూస్ నటి మహీర ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మహీర ఓ మామూలు మోడల్. వృద్ధ నటి. కేవలం తల్లి పాత్రలకు మాత్రమే సరిపోతుంది’ అని ఇటీవల ఓ టీవీ షోలో వ్యాఖ్యానించారు. ఫైజల్ ఖురేషీ నిర్వహించిన పాకిస్తాని షో ‘సలామ్ జిందగీ’లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి మహీర ఖాన్ తనదైన రీతిలో విమర్శలను తిప్పి కొట్టారు. తన లేఖలో ఎవరి పేరును ప్రస్తావించక పోయినప్పటికి, పరోక్షంగా నటుడు జమాల్ వ్యాఖ్యలను ఉద్దేశించి రాసినట్లుగా స్పష్టమవుతుంది. ‘మనం వర్తమానంలో ఉన్నాము. మనం ఏమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నామనేది మన భవిష్యత్తు. నేను అడగకపోయినా.. నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని తన లేఖలో పేర్కొన్నారు. ‘ఒక ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమను, నన్ను చూసి నేను గర్వపడుతాను. నా ఈ ప్రయాణంలో నేను ఏదైతే సరైనది అనుకున్నానో అదే చేశాను. ఇతరుల ఆలోచనలకు ఎప్పుడూ లొంగలేదు, లొంగను కూడా’ అని తన భావాలను వ్యక్తపరిచారు. అంతేకాకుండా ‘ద్వేషంతో నిండిన ప్రపంచంలో, ప్రేమను పంచుదాం. ఇతరుల అభిప్రాయాలను గౌరవిద్దాం. వ్యతిరేకులపై సహనంతో పోరాడుదాం. మనలాంటి చిత్ర పరిశ్రమ, దేశం మరొకటి లేదనే విధంగా అభివృద్ధి చెందడానికి ఒకరినొకరం నిందించుకోవడం మానేద్దాం’ అన్నారు. నేను ఎక్కడో చదివాను లాటిన్ భాషలో ‘స్టార్డమ్’ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వెంట నిలిచే అభిమానులకు ధన్యవాదాలని అర్థం అని చెబుతూ తన లేఖను మహీరా ముగించారు. View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) on Jul 29, 2019 at 5:00am PDT -
మహిళ ఫొటో పోస్ట్ చేసి అసభ్య కామెంట్
సంతోష్‌నగర్: తన తల్లి పోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి అసభ్యకర సందేశం ఎందుకు రాశావని ప్రశ్నించిన యువకుడిని ఇంటి యజమాని యాసిడ్ పోసి రాడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ ఎ.భోజ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.....సంతోష్‌నగర్‌లోని రాజనర్సింహ్మానగర్ హనుమాన్ వీధికి చెందిన మహ్మద్ సర్వర్ ఖాన్ ఇంట్లో గత కొన్ని నెలలుగా మహ్మద్ అబ్దుల్ ఫారూఖ్ కుటుంబం అద్దెకు ఉండేది. కొన్ని రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా ఫారూఖ్ తల్లికి సంబంధించిన ఫోటోను ఇంటి యజమాని సర్వర్ ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేయడంతో పాటు అసభ్యకర సందేశాన్ని కూడా రాశాడు. గమనించిన ఫారూఖ్ ఈ నెల 7న ఇంటి యజమాని వద్దకు వెళ్లి తన తల్లి పట్ల అలా ఎందుకు రాశావంటూ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సర్వర్ ఖాన్, కుటుంబ సభ్యులు తయ్యబా, ఆసీఫా బేగం, సుమయా తదితరులు ఆగ్రహంతో ఫారూక్ ఒంటిపై యాసిడ్ చల్లి...కారం పోసి....ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఫారూఖ్ అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
వైరలవుతోన్న స్మృతి ఇరానీ మెసేజ్
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ నడుస్తోంది. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇది పరీక్షా సమయమే. ఈ విషయంలో సామాన్యుల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఒకేలా స్పందిస్తారు. ఇందుకు తాను మినహాయింపు కాదంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తొలిసారి ఇంటర్ బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న కొడుకుకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ స్టోరి తెగ వైరలవుతోంది. స్మృతి ఇరానీ తన కుమారుడు జోహర్‌ని ఉద్దేశిస్తూ.. ‘నా తొలి సంతానం నేడు చాలా బాధ్యతయుతమైన పౌరుడిగా, ప్రేమ కల్గిన వ్యక్తిగా ఎదిగాడు. ఈ రోజు తొలిసారి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. తన కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాడు. నాతో ఎప్పుడు ఓ మాట అంటుంటాడు.. అమ్మ నేను నీ కంటే పొడవయ్యాను అని కానీ తనకు తెలియదు.. తల్లి ఆశీర్వాదం బిడ్డ పెరిగేంత వరకూ మాత్రమే కాక జీవితాంతం తోడుంటుందని. సంతోషంగా ఉండు’ అంటూ పోస్ట్ చేసిన ఈ మెసేజ్ నెటిజన్లకు తెగ నచ్చింది. మీ కుమారుడు మీ పేరు నిలబెడతారు మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram This first born of mine has grown up to be a loving & responsible young man. Wrote his first 12 th board exam today, will leave home soon in pursuit of his dreams. Keeps telling me ‘Ma ab aap height mein chote ho gaye mujhse’ . Does not know ‘har Ma ki dua hai ki uska bachcha sirf height mein nahi, balki Jeevan mein usse aage badhe. Khush rahe aur tarraki kare. @zohrirani_21 ❤️#weekendvibes ❤️❤️❤️ A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Mar 2, 2019 at 1:11am PST -
పట్టించుకోవడం లేదని పరువు తీస్తున్నాడు
సాక్షి, సిటీబ్యూరో: కాలేజీలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత భేదాభిప్రాయాలు రావడంతో అతడిని దూరంగా ఉంచింది. దీంతో బాధితురాలిపై పగ పెంచుకున్న ఓ యువకుడు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జలేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివింది. ఆ సమయంలో ఆమెకు సురేశ్‌కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడటంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో పలుమార్లు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత వీరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సురేశ్‌ను దూరంగా ఉంచుతోంది. దీంతో బాధితురాలిపై పగ పెంచుకున్న సురేశ్‌కుమార్ ఆమె ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో తెరిచి వ్యక్తిగత ఫొటోలు పోస్ట్ చేశాడు. అసభ్యంగా బాధితురాలి పరువు తీసేలా నగ్న ఫొటోలు, వీడియోలు ఆప్‌లోడ్ చేసి కుటుంబసభ్యులకు చేర వేశాడు. దీనికితోడు పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండ టంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడు సురేశ్ కుమార్‌ను చందానగర్‌లో అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
‘ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను’
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘ఇవాళ నా రోజు. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ముందు మనం ఈ వ్యాధిపై మనకున్న అపోహలను తొలగించుకోవాలి. అందుకే ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న ఈ కత్తిగాట్లు ఓ గౌరవ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను’ అంటూ తహీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను బాలీవుడ్ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా తెగ లైక్ చేస్తున్నారు. View this post on Instagram Today is my day! Wish you all a happy #worldcancerday and hope each one of us celebrates this day in an embracing way. That we remove any stigma or taboo associated with it. That we spread awareness about it and that we have self love no matter what. I truly embrace all my scars as they are my badges of honour. There is nothing known as perfect. Happiness lies in truly accepting yourself. This was a tough one for me. But this picture was my decision as I want to celebrate not the disease but the spirit with which I endured. To quote my mentor, Diasaku Ikeda, “Leading an undefeated life is eternal victory. Not being defeated, never giving up, is actually a greater victory than winning, not being defeated means having the courage to rise to the challenge. However many times we’re knocked down, the important thing is we keep getting up and taking one step-even a half step- forward” #worldcancerday #breastcancerawareness #breastcancerwarrior #turningkarmaintomission #boddhisatva Thanks @atulkasbekar for this one❤️ A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Feb 3, 2019 at 11:32pm PST మీ మాటలు చాలా మందికి ధైర్యాన్ని ఇస్తాయంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. తహీరా కశ్యప్ తొలిదశ రొమ్ము క్యాన్సర్ (1A)తో బాధపడిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా చాలా సర్జరీలను కూడా చేయించుకున్నారు. ఈ విషయం గురించి తహీరా మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం చాలా కష్టం. ఇక్కడ పర్ఫేక్ట్గా ఏది ఉండదు. మనల్ని మనలా అంగీకరించడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ఈ ఫోటోను నేను పడిన బాధను తెలియజేసే చిహ్నంలా కాక క్యాన్సర్‌పై నా గెలుపుకు గుర్తుగా పోస్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు.