అశ్లీల ఫోటోపై కుల్దీప్‌ ట్వీట్.. | Kuldeep Yadav apologise for the unsolicited post | Sakshi
Sakshi News home page

అశ్లీల ఫోటోపై కుల్దీప్‌ ట్వీట్..

Published Wed, Feb 21 2018 12:32 PM | Last Updated on Wed, Feb 21 2018 1:42 PM

Kuldeep Yadav apologise for the unsolicited post - Sakshi

తన అధికారిక ఇన్‌స్టాగ్రాం అకౌంట్ హ్యాకింగ్‌కు గురయిందని భారత స్పిన్ బౌలర్ కుల్దీప్‌ యాదవ్ ట్వీట్ చేశాడు. సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ను హ్యాక్ చేసి ఓ అశ్లీల ఫొటోను పోస్ట్ చేశారని, అందుకు తనను క్షమించాలని కోరాడు. తన పాస్‌వర్డ్‌ను మరింత భద్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు.

కుల్డీప్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ హ్యాకింగ్ గురించి తెలియక, తమ అభిమాన క్రికెటర్ ఇలాంటి ఫొటోను పోస్ట్ చేశాడేంటని అభిమానులు అవాక్కయ్యారు. అయితే తనను తప్పుగా అనుకునే అవకాశం ఉందని భావించిన కుల్‌దీప్ వెంటనే వివరణ ఇవ్వడంతో ఆయన ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్లు ఒక డైలమా నుంచి బయటపడ్డారు. దాదాపు 3లక్షల మంది కుల్‌దీప్‌కు ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్లు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement