టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ దంపతులు ఎప్పటికీ ప్రత్యేకమే. తెలుగు చిత్రసీమలో రానా ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటారు. బాహుబలి సినిమాతో రానా ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇవాళ ఈ బాహుబలి స్టార్ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రీటిలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి మిహికా బజాజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. రానా చిన్నప్పటి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ భర్తకు బర్త్ డే విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అత్యంత అందమైన మనిషిగా మారిన అందమైన బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు! చూడు ఎంత అందంగా ఉన్నాడో! మీరు నా జీవితంలోకి తీసుకువచ్చిన ఆనందానికి ధన్యవాదాలు! నాకు భర్తతో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా బేబీ.. నీ పట్ల నా ప్రేమకు హద్దులు లేవు. ఇప్పుడు నువ్వు నా ప్రేమ జీవితంలో ఇరుక్కుపోయావు. రాబోయే కొత్త ఏడాదిలో మీ కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నా.' అంటూ భర్తకు ఎమోషనల్ విషెష్ చెప్పారు.
(ఇది చదవండి: భార్య ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా.. ఏమన్నారంటే?)
ఆగస్ట్ 8, 2020 లాక్‌డౌన్ సమయంలో రానా దగ్గుబాటి, మిహీకా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సమంత రూత్ ప్రభు, రామ్ చరణ్, నాగ చైతన్య, సన్నిహితులు హాజరయ్యారు. రానా దగ్గుబాటి సోదరితో మిహీకా స్కూల్‌కి వెళ్లడంతో ఈ ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది.
ప్రస్తుతం రానా దగ్గుబాటి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడులో కనిపించనున్నారు. ప్రముఖ అమెరికన్ క్రైమ్ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వెంకటేష్ దగ్గుబాటితో కలిసి నటిస్తున్నారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మల దర్శకత్వంలో జెస్సికా హారిసన్, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment