మిహికా బర్త్‌ డే.. రానా వెరైటీ గిఫ్ట్‌ | Rana Daggubati Hosts Pizza Party for Wife Miheeka on Birthday | Sakshi
Sakshi News home page

Dec 19 2020 12:54 PM | Updated on Dec 19 2020 1:01 PM

Rana Daggubati Hosts Pizza Party for Wife Miheeka on Birthday - Sakshi

పైళ్లైన తొలి ఏడాదిలో వచ్చే ప్రతి పండుగ భార్యభర్తలకు ఎంతో స్పేషల్‌. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు మరింత ప్రత్యేకం. వివాహం అయ్యాక వచ్చే జీవిత భాగస్వామి మొదటి పుట్టిన రోజుకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తారు. హీరో రానా దగ్గుబాటి కూడా ఇలానే ఆలోచించారు. భార్య మిహికా బజాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా రానా వెరైటీ ట్రీట్‌ ఇచ్చారు. సాధారణంగా బర్త్‌డే అంటే ఎవరైనా కేక్‌ కట్‌ చేయిస్తారు. కానీ రానా మాత్రం భార్య కోసం అర్థరాత్రి పిజ్జా క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు రానా. పెళ్లామ్స్‌ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రానా.. తనెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. (చదవండి: కిడ్నీలు ఫెయిల్‌ అవుతాయన్నారు )

ఇక మిహికా కూడా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. రానాది ఫోర్స్డ్‌ హాలీ డే అని..తన బలవంతం మేరకు అతడు సెలవు తీసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లు తెగ వైరలువున్నాయి. క్యూట్‌ కపుల్‌ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఆగస్టులో మిహికా బజాజ్‌తో రానా పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘హాథీ మేరీ సాతీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో అరణ్యగా విడుదల కాబోతుంది.  ఇక​ దీనితో పాటు విరాట పర్వం షూటింగ్‌ కొనసాగుతుంది. ఈ చిత్రంలో రానా కామ్రెడ్‌ రవన్నగా అలరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement