pizzas
-
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా?
డామినోస్ మాజీ సీఈవో రిచ్ అల్లిసన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. 2022లో ఆయన కంపెనీని విడిచిపెట్టినప్పుడు ఈ పదవి తనకు జీవితకాల ప్రత్యేక హక్కు అని వ్యాఖ్యానించారు. తాజాగా గత సంవత్సరం డామినోస్ మాజీ సీఈవో ఖర్చులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యక్తిగత పిజ్జా ఖర్చు కోసం దాదాపు 4,000 డాలర్లు (రూ.3లక్షలకు పైగా) చెల్లించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం... డామినోస్ ఎగ్జిక్యూటివ్ పరిహారం కింద 2021 సంవత్సరంలో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసమే అల్లిసన్‌కు కంపెనీ 3,919 డాలర్లు చెల్లించింది. దీంతోపాటు వ్యక్తిగత జెట్, బృంద సభ్యుల బహుమతులు, ఇతర ఖర్చులకు ఆ సంవత్సరానికి అల్లిసన్ మొత్తంగా 7,138,002 డాలర్లు (దాదాపు రూ.59 కోట్లు) అందుకున్నారు. 2020లో మరీ ఎక్కువ.. 2021లో అల్లీసన్ పిజ్జాల ఖర్చు అంతకుముందు సంవత్సరం అంటే 2020తో పోల్చుకుంటే తక్కువే. 2021లో 3,919 డాలర్లు ఖర్చు చేస్తే అదే 2020 కరోనా మహమ్మారి సమయంలో ఆయన పిజ్జా ఖర్చు 6,126 డాలర్లు అంటే రూ.5 లక్షలకు పైనే. డామినోస్ ప్రస్తుత సీఈవో రస్సెల్ వీనర్ కూడా 2021లో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసం 2,810 డాలర్లు ఖర్చు చేశారు. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? అల్లిసన్ డామినోస్ కోసం పదేళ్లకుపైగా పనిచేశారు. ఇందులో నాలుగేళ్లు కంపెనీ సీఈవోగా వ్యవహరించారు. 2022లో ఆయన పదవీ విరమణ పొందారు. అల్లిసన్ సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీని పురోగతి వైపు నడిపించడమే కాకుండా రిస్క్ తీసుకునే వాతావరణాన్ని ప్రోత్సహించారు. -
మిహికా బర్త్ డే.. రానా వెరైటీ గిఫ్ట్
పైళ్లైన తొలి ఏడాదిలో వచ్చే ప్రతి పండుగ భార్యభర్తలకు ఎంతో స్పేషల్. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు మరింత ప్రత్యేకం. వివాహం అయ్యాక వచ్చే జీవిత భాగస్వామి మొదటి పుట్టిన రోజుకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తారు. హీరో రానా దగ్గుబాటి కూడా ఇలానే ఆలోచించారు. భార్య మిహికా బజాజ్ పుట్టిన రోజు సందర్భంగా రానా వెరైటీ ట్రీట్ ఇచ్చారు. సాధారణంగా బర్త్‌డే అంటే ఎవరైనా కేక్ కట్ చేయిస్తారు. కానీ రానా మాత్రం భార్య కోసం అర్థరాత్రి పిజ్జా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రానా. పెళ్లామ్స్ బర్త్‌డే.. మనకు హాలీడే అనే ఫన్నీ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రానా.. తనెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. (చదవండి: కిడ్నీలు ఫెయిల్ అవుతాయన్నారు ) ఇక మిహికా కూడా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. రానాది ఫోర్స్డ్ హాలీ డే అని..తన బలవంతం మేరకు అతడు సెలవు తీసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు తెగ వైరలువున్నాయి. క్యూట్ కపుల్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆగస్టులో మిహికా బజాజ్‌తో రానా పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘హాథీ మేరీ సాతీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో అరణ్యగా విడుదల కాబోతుంది. ఇక దీనితో పాటు విరాట పర్వం షూటింగ్ కొనసాగుతుంది. ఈ చిత్రంలో రానా కామ్రెడ్ రవన్నగా అలరించనున్నారు. -
నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ నేడు(15న) ప్రారంభమైంది. 17న(గురువారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా రూ. 540 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాలను విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, తదితర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
నానమ్మ పిజ్జా సూపర్‌హిట్
ఫిబ్రవరి వరకూ ఆమె ఒక సగటు అమ్మ, నానమ్మ. మే నాటికి అంట్రప్రెన్యూర్ అయిపోయింది. లాక్డౌన్లో తన కొడుకుల ఇళ్లకు పిజ్జా చేసి పంపిస్తే వాళ్లు ఆహా, ఓహో అన్నారు. హోమ్ కిచెన్ పెట్టించారు. ఇప్పుడు వారానికి 300 మంది ఆమె పిజ్జాలు తెప్పించుకుంటున్నారు. 67 సంవత్సరాల ముంబై గృహిణి నవ విజయగాథ ఇది. ముంబై లోఖండ్వాలాలో నివసించే 67 సంవత్సరాల ప్రతిభా కానోయ్‌కు ఒకటే కోరిక. ‘నన్ను ఏదైనా పని చేసి డబ్బు సంపాదించనివ్వండ్రా’ అని. కలిగిన కుటుంబం. భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకులు ముంబైలోనే సెటిల్ అయ్యారు. ఆమె ఇంట్లో పని చేసే వారికే నెలకు పది, పన్నెండు వేలు జీతాలు ఇవ్వాలి. ‘అందరూ పని చేసి డబ్బు సంపాదిస్తున్నారు. నేనొక్కదాన్ని తిని కూచుంటున్నాను. నేను కూడా పని చేసి సంపాదిస్తాను’ అని ఆమె తరచూ అనేది. కాని భర్త, కొడుకులు ‘అంత అవసరం ఏముంది’ అని ఆమె మాట పడనివ్వలేదు. కాని కాలం కలకాలం ఒకేలా ఉండదు. అది కరోనాను తెస్తుంది. మార్చిలో మొదలు ప్రతిభా కానోయ్‌కు నలుగురు మనమలు ఉన్నారు. కొడుకులు తరచూ వాళ్లను బయటకు తీసుకెళతారు. లేదా ఇంటికి బయటి ఫుడ్ తెప్పించి పెడతారు. కాని మార్చిలో లాక్డౌన్ మొదలయ్యాక ప్రతిభా మనసు ఊరికే ఉండలేకపోయింది. ‘అయ్యో... పిల్లలు బయటి తిండిని తెప్పించుకోలేకపోతున్నారే’ అనుకుంది. తన ఇద్దరు కొడుకుల ఇళ్లకు తన ఇంటి నుంచి పిజా తయారు చేసి పంపించడం మొదలెట్టింది. కొడుకులు ఆ పిజా రుచి చూసి ఆశ్చర్యపోయారు. మనమలు అయితే లొట్టలు వేయసాగారు. ప్రతిభా కానోయ్ చేసేది వెజ్ పిజ్జాలు. అలాంటి పిజ్జాలు ముంబైలో తినలేదు అని వారు ప్రశంసించసాగారు. మారిన మనసు తల్లి వంట ప్రతిభను చూశాక కొడుకుల మనసు మారింది. ‘అమ్మా.. హోమ్ కిచెన్ పెట్టిస్తాం. ఇంటి నుంచే నువ్వు వ్యాపారం ప్రారంభించు. సొంతగా సంపాదించు’ అని ఏర్పాట్లు చేశారు. ఇద్దరు చెఫ్‌లు జీతానికి కుదిరారు. డెలివలి బోయ్స్ కూడా. ‘మమ్మీస్ కిచెన్’ అనే పేరుతో మే 2న ప్రతిభా పిజ్జా వ్యాపారం మొదలైంది. కొడుకులే ఆమె ప్రచారకర్తలు అయ్యారు. ‘మా అమ్మ పిజ్జాలు టేస్ట్ చేసి చెప్పండి’ అని ఫ్రెండ్స్‌ను కోరారు. ఫ్రెండ్స్ ఆర్డర్స్ పెట్టారు. ప్రతిభ చేసి పంపే పిజ్జాలను చూసి వహ్వా అన్నారు. రెండు మూడు నెలల్లో ఆమె వ్యాపారం ఎంత బిజీ అయ్యిందంటే ఇవాళ పిజ్జా కావాలంటే నిన్న ఆర్డర్ పెట్టాలి. ఖాళీగా ఎందుకుండాలి? ‘నా భర్త భోజన ప్రియుడు. నాతోపాటు కలిసి వంట చేయడాన్ని ఇష్టపడేవాడు. చిన్నప్పుడు మా అక్క దగ్గర వంట నేర్చుకున్నాను. అలా వంటలో నేను నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడింది. పిజ్జాలో వాడే పదార్థాలు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుంటాను. వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి వినిగర్లో నానబెట్టి ఉపయోగిస్తాను. ఉదయం 9 గంటలకు నేను కిచెన్‌లోకి వెళితే సాయంత్రం వరకూ రోజుకు 30 నుంచి 50 వరకూ డెలివరీలు ఉంటాయి. శని, ఆదివారాలు 100 పైగా ఆర్డర్లు ఉంటాయి. 11 రకాల పిజ్జాలు తయారు చేస్తాం. 400 నుంచి 550 వరకూ చార్జ్ చేస్తాం. నన్ను చూసి కొందరు ఇంత డబ్బుండి ఇదేం పని అనుకోవచ్చు. కాని ఎవరైనా సరే ఎందుకు ఖాళీగా ఉండాలి అంటాను. స్త్రీలు తమ ఆర్థిక స్వాతంత్య్రం తాము చూసుకోవాలి. అలాగే వయసైపోయిందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకుంటే వయసు ఎప్పటికీ అవదు. ఏ వయసులో అయినా జీవితాన్ని ఫుల్‌గా జీవించవచ్చు. 67 ఏళ్ల వయసులో సక్సెస్ సాధించి నా తోటి వయసు వారికి నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే’ అంది ప్రతిభ. ఎప్పుడైనా ముంబై వెళితే ఆమె చేతి పిజ్జాకు ఆర్డర్ పెట్టండి. – సాక్షి ఫ్యామిలీ -
పిజ్జా డెలివరీ అంటేనే భయపడిపోతున్నారు
నోయిడా: సాధారణంగా దొంగలంటే డబ్బుకోసం, విలువైన వస్తువుల కోసం తెగబడుతుంటారు. కానీ, ఆహారపదార్థాలకోసం దొంగతనాలు మాత్రం చాలా అరుదు. దేశంలో దొంగతనాల ఘటనలకు పేరు నోయిడా. ఇక్కడ దొంగతనం పేరుతో వార్తా రాలేదంటే మాత్రం అది కచ్చితంగా రికార్డు అనుకోవాల్సిందే. ఎందుకంటే నోయిడాలో ప్రతి రోజు ఏదో ఒక చోట తప్పనిసరిగా దొంగతనం జరగడం.. అది పత్రికల్లో రావడం పరిపాటి. ఆయుధాలు ధరించి మరీ ఈ దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే, ఇక్కడ తాజాగా జరుగుతున్న దొంగతనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడు ఇక్కడ దొంగల కన్ను పిజ్జాలపై పడింది. అవును వారానికి కనీసం పదుల సంఖ్యలో పిజ్జాలను దొంగలు ఎత్తుకెళుతున్నారట. అయితే, దీనిని పెద్ద నేరంగా పరిగణించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోతుండటం గమనార్హం. కచ్చితంగా ఎన్ని పిజ్జాల దొంగతనానికి గురవుతున్నాయనే విషయం చెప్పలేంగానీ వారానికి కనీసం పన్నెండుకు పైగా పిజ్జాలు మాయమవుతున్నాయని చెప్పగలం అని స్వయంగా పిజ్జా డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. తాము పిజ్జాలు తీసుకెళుతుండగా ఆయుధాలు ధరించి వచ్చి బెదిరించి పట్టుకెళుతున్నారని, అందుకే పిజ్జాలు డెలివరీకి తీసుకెళ్లాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు. -
బర్గర్లు ఎందుకు బ్యాడ్ ఫుడ్ అంటే..!
బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి అంత మేలు చేయవని అందరూ చెబుతుంటారు. పైగా పెరిగే పిల్లల్లో స్థూలకాయం వంటివి తెచ్చి వాళ్ల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తాయని అంటుంటారు. అయితే దీనికి కొన్ని నిర్దిష్టమైన నిదర్శనాలు ఇస్తున్నారు పరిశోధకులు. యునెటైడ్ కింగ్డమ్కు చెందిన శ్వాన్సీ యూనివర్సిటీ నిపుణులు కొన్ని తాజా అధ్యయనాల ఆధారంగా బర్గర్ల వంటివి ఎందుకు చేటు చేస్తాయో వివరిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం... అత్యంత సూక్ష్మమైన కణాలలో కార్బన్ డయాక్సైడ్ వంటి కలుషితమైన పదార్థాల నుంచి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ కాలుష్యాలను విజయవంతంగా హరించే ఆహార పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారన్న ది తెలిసిందే. బర్గర్లు ఇతర జంక్‌ఫుడ్స్‌లో ఈ యాంటీఆక్సిడెంట్స్ పాళ్లు గణనీయంగా తగ్గుతుంటాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ప్రతి ఆహారంలోనూ అవి తగ్గుతూ పోతుంటాయి. దాంతో కణానికి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థం అందకుండా పోతుంటుంది. ఫలితంగా కణం మరింత కాలుష్యభరితం అవుతుంటుంది. అలా కాలుష్యభరితం కావడమే క్యాన్సర్‌కు దోహదం చేస్తుందని వివరిస్తున్నారు ఆ పరిశోధనల్లో పాలుపంచుకున్న నిపుణుడు డాక్టర్ హసన్ హబౌబీ. -
నేను ప్రెగ్నెంట్ కాలేదు!
తేజ నువ్వు-నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి వెళ్లిపోయింది ఈ భామ. అనంతరం కొన్ని హిందీ సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితా హస్సనందానీ త్వరలో తల్లి కాబోతున్నదని, ఆమె గర్భవతి అయిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసకట్టిన ఈ కథనాలపై అనిత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. తాను ప్రెగ్నెంట్ అయినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన ఆమె.. తాను బరువు పెరగడానికి చాక్లెట్లు, పిజ్జాలే కారణమని చెప్పుకొచ్చింది. 'ప్రతి మీడియా సంస్థ నుంచీ నాకు కాల్స్ వస్తున్నాయి. ఏమైనా 'గుడ్ న్యూస్' ఉందా అని అడుగుతున్నారు. ఔను శుభవార్త ఉంది. అదేమిటంటే నేను డైటింగ్ చేయడం లేదు. నేను చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు బాగా తింటున్నాను. నేను అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్నానంటే అందుకు కారణం మా ఆయనతో ప్రేమలో ఉండటమే. నేను గర్భవతిని అయితే ఆ విషయాన్ని మీ అందరికీ గర్వంగా తెలియజేస్తాను' అని అనిత తనదైన స్టైల్లో వివరణ ఇచ్చింది. -
త్రీడీ ప్రింటర్‌తో తాజా పండ్లు!
3డీ ప్రింటర్‌తో రకరకాల వస్తువులనే కాదు.. పిజ్జాలు, బర్గర్లు, ఇతర ఆహార పదార్థాలనూ ప్రింట్ చేసుకోవచ్చన్నది మనకు ఇదివరకే తెలుసు. అయితే పండ్లను కూడా తయారు చేసుకునేందుకు ఉపయోగపడే వినూత్న త్రీడీ ప్రింటర్‌ను కేంబ్రిడ్జిలోని డోవెటైల్డ్ అనే కంపెనీ రూపొందించింది. ఈ ప్రింటర్‌తోపాటు మన దగ్గర ఆయా పండ్ల ఫ్లేవర్లు ఉంటేచాలు.. కావల్సిన ఫలాలు చిటికెలో సిద్ధమైనట్లే. ఉదాహరణకు దానిమ్మ గింజలు తినాలని అనిపించిందనుకోండి.. దానిమ్మ ఫ్లేవర్‌ను ప్రింటర్లో వేసి బటన్ నొక్కితే చాలు ఫ్లేవర్‌ను గిన్నెలో చుక్కచుక్కలుగా పోస్తూ ఈ ప్రింటర్ తాజా గింజలను ప్రింట్ చేస్తుంది. అలాగే యాపిల్, అరటి, ఇతర పండ్లను కూడా తాజాగా తయారు చేసుకోవచ్చు. హోటళ్లలో, ఇంట్లో కూడా ఈ ప్రింటర్ తో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా పండ్లను రుచిచూడొచ్చంటున్నారు దీని రూపకర్తలు. అంతేకాదండోయ్.. పండ్ల రుచి, ఆకారం, సైజులను కూడా మన ఇష్టమొచ్చినట్లు నిర్ణయించుకోవచ్చట. అంటే యాపిల్ పండును మామిడిలా, మామిడి పండును అరటి పండులా కూడా తయారు చేసుకోవచ్చన్నమాట!