పిజ్జాతో రికార్డ్‌ బ్రేక్‌, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా.. | French Chefs Baked Pizza Featuring 1001 Different Types Of Cheese On It | Sakshi
Sakshi News home page

పిజ్జాతో రికార్డ్‌ బ్రేక్‌, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..

Published Fri, Dec 29 2023 4:27 PM | Last Updated on Fri, Dec 29 2023 4:59 PM

French Chefs Baked Pizza Featuring 1001 Different Types Of Cheese On It - Sakshi

పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్‌ రెసిపి. క్యాప్సికమ్‌, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్‌ చేసే ఇటాలియన్‌ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్‌ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్‌ రికార్డ్‌ కోసం ఇద్దరు ఫ్రెంచ్‌ చెఫ్‌లు చీజీ మాస్టర్‌ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు.

వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్‌ఎయిర్‌లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు.

ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్‌ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్‌ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement