పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ తయారీకి కావల్సినవి:
బ్రూట్ షాంపైన్ – ఒకటిన్నర కప్పులు; పంచదార – కప్పు;
లైట్ కార్న్ సిరప్ – టేబుల్ స్పూను; దానిమ్మ రసం – ఒకటీ ముప్పావు కప్పులు;
విప్డ్ప్ క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; దానిమ్మ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానమిలా:
సాస్‌పాన్‌లో షాంపైన్, కార్న్ సిరప్, పంచదార వేసి మీడియం మంట మీద పంచదార కరిగేంత వరకు మరిగించి, దించిన తర్వాత దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి.రెండుగంటల తరువాత మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్ మేకర్‌తో బీట్ చేయాలి.క్రీమ్‌లా మారిన మిశ్రమాన్ని షాంపైన్ గ్లాస్‌లో వేయాలి. పైన విప్డ్ క్రీమ్, దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే పోమోగ్రానేట్ షాంపైన్ సార్బెట్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment