
స్వీట్ పొటాటో పీజా బాల్స్ తయారీకి కావల్సినవి:
చిలగడ దుంపలు – అరకేజీ(తొక్కతీసి ముక్కలు తరగాలి);
మటన్ ఖీమా – అరకప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు;
పీజా సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; గోధుమ పిండి – ముప్పావు కప్పు;
గుడ్లు – రెండు(సొనను బాగా కలిపి పెట్టుకోవాలి); బ్రెడ్ క్రంప్స్ – కప్పు;
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – రుచికి తగినంత.
తయారీ విధానమిలా:
చిలగడ దుంప ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టి, చిదుముకోవాలి. ఇందులో మటన్ ఖీమా, చీజ్ తురుము, పీజా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, బాల్స్‌లా చుట్టి పెట్టుకోవాలి గోధుమ పిండి, గుడ్లసొన, బ్రెడ్ క్రంప్స్‌ను వరుసగా పెట్టుకోవాలి. దుంపల బాల్స్‌ను ముందుగా గోధుమ పిండి, తరువాత గుడ్ల సొన, చివరిగా బ్రెడ్‌క్రంప్స్‌లో ముంచి డీప్ ఫ్రైచేసుకోవాలి ∙బాల్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్‌లోకి మారాక తీసేసి నచ్చిన సాస్‌తో సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment