క్రిస్టమస్‌ స్పెషల్‌: సాఫ్ట్‌ కుకీస్‌.. బేకరీ స్టైల్‌లో | How To Make Best Soft Christmas Cookies Recipe In Telugu | Sakshi
Sakshi News home page

క్రిస్టమస్‌ స్పెషల్‌: సాఫ్ట్‌ కుకీస్‌.. బేకరీ స్టైల్‌లో

Published Fri, Dec 15 2023 4:50 PM | Last Updated on Fri, Dec 15 2023 4:50 PM

How To Make Best Soft Christmas Cookies Recipe In Telugu - Sakshi

క్రిస్టమస్‌ సాఫ్ట్‌ కుకీస్‌:

 కావలసినవి:
మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా›– టీస్పూను;
ఉప్పు – అర టీస్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు;
బటర్‌ – కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్‌ – రెండు టీ స్పూన్లు.

తయారీ విధానమిలా:
మైదా, వంటసోడా, ఉప్పుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙బటర్‌లో పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు బీటర్‌తో కలపాలి. తరువాత ఈ క్రీమ్‌ను రెండు గంటలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత బటర్‌ క్రీమ్‌లో గుడ్లసొన, వెనీలా ఎసెన్స్, మైదా మిశ్రమం వేసి ముద్దగా కలుపుకోవాలి పిండి ముద్దను రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి
రెండు గంటల తరువాత పిండి ముద్దను రొట్టెల్లా వత్తుకోవాలి ∙ఈ రొట్టెను క్రిస్టమస్‌ ట్రీ, స్టార్స్, బొమ్మల ఆకారంలో కట్‌ చేసి బేకింగ్‌ ట్రేలో పెట్టాలి. కుకీస్‌ ఆకారాన్ని బట్టి ఫుడ్‌ కలర్‌ వేసుకోవచ్చు ∙ఈ బేకింగ్‌ ట్రేను 400 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ వద్ద పదినిమిషాలు బేక్‌ చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్టమస్‌ సాఫ్ట్‌ కుకీస్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement