క్రాబ్స్‌తో కేక్‌ పాపర్స్‌.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? | Crab Cake Poppers Recipe In Telugu | Sakshi
Sakshi News home page

క్రాబ్స్‌తో కేక్‌ పాపర్స్‌.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?

Published Wed, Jan 3 2024 4:56 PM | Last Updated on Wed, Jan 3 2024 4:57 PM

Crab Cake Poppers Recipe In Telugu - Sakshi

కేక్‌ పాపర్స్‌ తయారీకి కావల్సినవి:

పీతల గుజ్జు – అరకేజీ; బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు;
స్ప్రింగ్‌ ఆనియన్‌ తరుగు – పావు కప్పు; ఎర్రక్యాప్సికం తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు;
సెలెరీ తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు; కోషర్‌ సాల్ట్‌ – రుచికి సరిపడా;
కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను; గుడ్డు – ఒకటి; సోయా సాస్‌ – పావు టీస్పూను;
మయనైజ్‌ – పావు కప్పు; ఆవ పొడి – పావు టీస్పూను; మిరియాల పొడి – పావు టీస్పూను;
బ్రెడ్‌ క్రంప్స్‌ – ఒకటింబావు కప్పులు; నూనె – ఒకటిన్నర కప్పులు.
స్పైసీడిప్‌: మయనైజ్‌ – అరకప్పు; నిమ్మరసం – టేబుల్‌ స్పూను;
వెల్లుల్లి రెబ్బ – పెద్దది ఒకటి(సన్నగా తర గాలి); చిల్లీ సాస్‌ – టీస్పూను. 

తయారీ విధానమిలా:
బాణలిలో బటర్‌ వేసి, కరిగిన తరువాత.. స్ప్రింగ్‌ ఆనియన్‌ , క్యాప్సికం, సెలెరీ తరుగు వేసి వేయించాలి ∙ముక్కలన్నీ మెత్తబడిన తరువాత పీతల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి ∙ఇది వేగుతుండగానే.. ఒక గిన్నెలో గుడ్డు సొన, సోయా సాస్, మయనైజ్, ఆవపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ∙కలిపిన వెంటనే వేగుతున్న పీతల గుజుజపెన ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి.

చల్లారాక మీడియం సైజు బాల్స్‌లా చుట్టుకోవాలి. బాల్స్‌ అన్నీ తయారయ్యాక.. బ్రెడ్‌ క్రంప్స్‌లో ముంచి కోటింగ్‌లా పట్టించి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి ∙అరగంట తరువాత నూనెలో గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే క్రాబ్‌ కేక్‌ పాపర్స్‌ రెడీ ∙స్పైసీడిప్‌ కోసం తీసుకున్న పదార్థాలను గిన్నెలో వేసి కలిపి.. వేడివేడి క్రాబ్‌ కేక్‌ పాపర్స్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement