Dishes
-
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
చిన్న బొద్దింకను చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇక పరుగులే! కాని, ఫొటోలో పెద్దసైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని ఆరగిస్తారు. దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి, వియత్నాంలో అందరూ, దీనిని ‘స్టార్ వార్స్’ సినిమాల్లో విలన్ అయిన ‘డార్త్ వాడర్’గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, ఒకటి నుంచి రెండు కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. వియత్నాం ఫుడ్మార్కెట్లో విక్రయిస్తున్న దీనిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘బాతినోమాస్’ జాతికి చెందిన జెయింట్ ఐసోపాడ్ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో రెండు నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు. -
కేరాఫ్ కాంటినెంటల్ : ఇంటర్నేషనల్ చెఫ్‌లతో స్పెషల్ చిట్‌చాట్
కాంటినెంటల్ వంటకాలకు నగరం కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందుతోంది. సాధారణంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాలతో నగరానికి ప్రత్యేక అనుబంధముంది. ఈ మూడు దేశాల వంటకాలు భాగ్యనగరంలో విరివిగా లభ్యమవుతుండడం.. ప్రధానంగా సింగపూర్, మలేషియాలో దక్షిణాది వంటకాలకు మంచి ఆదరణ ఉండడం..చైనీస్ వంటకాలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ‘ది లీలా హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఆగ్నేయాసియా వంటకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ)ను ప్రారంభించింది. ‘త్రీ’ అనే మలయ్ పదం నుంచి పుట్టుకొచ్చిన టీఐజీఏ సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ఏ కాంటినెంటల్ వంటకం నగరానికొచ్చినా కాసింతైనా స్థానిక రుచులకు అనుగుణంగా వాటి ఫ్లేవర్స్, రుచిని మార్చుతారు. కానీ ఇక్కడ ఎలాంటి మార్పూ లేకుండానే స్వచ్ఛమైన ఆగ్నేయాసియా వంటకాలను అందిస్తామని ప్రముఖ సింగపూర్ మాస్టర్ చెఫ్ ఆల్బర్ట్ రాయన్ తెలిపారు. దీని ఆవిష్కరణ సందర్భంగా నగరంలో సందడి చేసిన ప్రముఖ చెఫ్‌లు ఆల్బర్ట్ రాయన్, మలేషియా వంటకాల నిపుణుడు, ప్రముఖ చెఫ్ ‘షా’ సాక్షితో ముచ్చటించారు. వారు పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే.. దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ చెఫ్‌గా వివిధ దేశాల్లో వినూత్న వంటకాలను వండి వడ్డించాను.. కానీ హైదరాబాద్ నగరం ఆహ్వానించినంత ఉన్నతంగా మరే ప్రాంతం లేదని చెప్పగలను. ఆగ్నేయాసియాకు చెందిన పసందైన వంటకాలను చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌కు చేరువ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ) ‘మూడు’ అనే మలయ్ పదంలో భాగంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. నగరంలోని కాంటినెంటల్ రుచుల ఆసక్తికి అనుగుణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో మాత్రమే అరుదైన పసందైన డిషెస్ తయారు చేస్తున్నాం. ఈ వంటకాల్లో ఆయా దేశాల సంస్కృతి, పాకశాస్త్ర పరిపూర్ణ ప్రామాణికత నిర్ధారించడానికి రెస్టారెంట్ నిరి్థష్ట మూలికలు, సుగంధ ద్రవ్యాలను పెంచడం ప్రారంభించింది. చైనీస్, మలయ్, ఇండియన్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్ అద్భుత వంటల వారసత్వం, చిల్లీ క్రాబ్, హైనానీస్ చికెన్ రైస్ వంటి ఐకానిక్ వంటకాలను కలినరీ స్పెషల్‌గా అందిస్తున్నాం. నాసి లెమాక్, రెండాంగ్, సాటే వంటి మలేషియా ప్రత్యేకతలు ఆయా దేశం టేస్ట్ ప్రొఫైల్, పాక శాస్త్ర నైపుణ్యాలను హైలైట్ చేస్తాయి. వీటికి అనుబంధంగా అద్భుతమైన టీలు, ప్రసిద్ధ సామాజిక భోజన సంస్కృతి అయిన ఆరి్టసాన్ డిమ్ సమ్ వంటి క్లాసిక్ కాంటోనీస్ యమ్ చా అనుభవం చేయవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని స్వచ్ఛంగా కలుషితం లేకుండా కొనసాగిస్తున్న నగరం హైదరాబాద్ కావడంవిశేషం. – ఆల్బర్ట్ రాయన్, చెఫ్ దక్షిణాది ప్రేరణతో.. మలేషియాలో దక్షిణాది వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాకి వచ్చినన ఫుడ్ లవర్స్ మామ అని సంబోధిస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొన్ని మలేషియాయా వంటకాలకు మామ కలిపి వాటి పేర్లను తయారు చేశాము. మలేషియాలో చాలా వంటకాలు దక్షిణాది ప్రేరణతో వాటి వైవిధ్యాన్ని, తయారీ విధానాన్ని రూపొందించుకున్నాయి. ఆహారాన్ని ఆస్వాదించడంలో, గౌరవించడంలో దక్షిణాది ప్రజలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదీలు. ఈ నేపథ్యంలో నగరం వేదికగా సింగపూర్, మలేషియా, చైనా సాంస్కృతిక వంటకాలను అందించడం సంతోషంగా ఉంది. – షా, చెఫ్ -
దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్.. విభిన్న రుచుల భాండాగారం మన భాగ్యనగరం. స్థానిక వంటకాలు మొదలు ఖండాంతరాలు దాటిన కాంటినెంటల్ వంటకాలకు నెలవు ఈ భాగ్యనగరం. ఇందులో భాగంగా కొరియన్, మొరాకో వంటకాలు మొదలు ఇటాలియన్, స్పానిష్ వెరైటీల వరకూ నగరానికి క్యూ కడుతున్నాయి. విదేశీ పర్యాటకులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, సినిమా, క్రీడా రంగ ప్రముఖులు నగరానికి వస్తుండటంతో కాంటినెంటల్ వంటకాలకు ఆదరణ పెరిగింది. నగరవాసులు సైతం విభిన్న వంటకాలు, వినూత్న రుచులను ఆస్వాదించడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని ది లీలా హైదరాబాద్ హోటల్ రీన్ చెఫ్ స్టూడియో వేదికగా ప్రసిద్ధ ఫ్రెంచ్–ఇటాలియన్ వంటకాలు సందడి చేస్తున్నాయి. మార్చి ప్రారంభం వరకూ అందుబాటులో ఉండే ఈ ఐకానిక్ రుచులు హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అరుదైన ఫ్రెంచ్–ఇటాలియన్ రుచులను నగరానికి తీసుకొచ్చింది ‘లే సర్క్’. లీలా, రీన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న ‘లే సర్క్’ న్యూయార్క్ వేదికగా ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ రుచులకు గమ్యస్థానం. నగరంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక పాప్–అప్ దశాబ్దాలుగా ప్రపంచ స్థాయి లగ్జరీ డైనింగ్ వేదిక. దక్కన్ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన వేదికగా ఇటాలియన్ సంస్కృతిని ఆహ్వానించడంతో ఫుడ్ లవర్స్ వావ్ అంటున్నారు. హిమాలయాలు, దట్టమైన అడవుల్లో లభించే అరుదైన పుట్టగొడుగులుతో(లక్షల రూపాయలు ఖరీదు చేసే) సహా అరుదైన పదార్థాలు, పుష్పాలతో వడ్డించిన డిషెస్ ఇక్కడ సందడి చేస్తున్నాయి. చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (మాంసాహారం) స్మోక్డ్ అవకాడో, ట్యూనా సాకు టార్పారే – ప్యాషన్ ఫ్రూట్ జెల్ పదార్థంతో కుంకుమపువ్వును ఆకర్షణీయంగా అలంకరించి తయారు చేసిన ఫుడ్ వెరైటీ. రావియోలీ స్టఫ్డ్ విత్ బరోలో బ్రైజ్డ్ డక్ – క్యారెట్ వెలౌట్, అరుదైన రోజ్మేరీ మోరెల్ మష్రూమ్‌తో తయారు చేసిన వంటకం. ఇందులో ‘స్పఘెట్టి, పారెల్స్ ఫోమ్ పొంగుతూ కొత్త రుచిని అందిస్తుంది. పాపియెట్ ఆఫ్ చిలీయన్ సీబాస్ – కరకరమనే బంగాళాదుంపలు, బరోలో సాస్‌తో నోరూరించే క్రీమ్‌తో తయార చేస్తారు. ‘లే సర్క్’ క్లాసిక్ టిరామిసు – కాఫీ జెల్లీ, మస్కార్పోన్ ఎస్పుమా, కాఫీ మెరింగ్యూ సమ్మేళనంతో తయారు చేసే వినూత్న వంటకం. చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (శాకాహారం) డబుల్ కుక్డ్ మోజారెల్లా – బ్రెడ్ క్రిస్టల్, బాసిల్ స్ప్రింగ్, టొమాటో రిలిష్తో తయారు చేసిన శాకాహార వంటకం. హ్యాండ్–కట్ ఫ్రెష్ బ్లాక్ ట్రఫుల్ ఫెట్టూసిన్ – లక్ష రూపాయాలకు పైగా ఖరీదు చేసే అరుదుగా దొరికే మోరెల్ పుట్టగొడుగులను కలిపి పర్మేసన్ ఫండ్యు, బ్లాక్ ట్రఫుల్ షేవింగ్స్ వండుతారు. రోస్టెడ్ బీట్రూట్–బుర్రటా రిసోట్టో – 24కే గోల్డ్ డస్ట్‌గా పిలిచే ముడి పదార్థంతో తయారు చేసే చిరుతిండి. సింఫనీ ఆఫ్ చాక్లెట్ – డార్క్ చాక్లెట్ మౌస్తో ముంచి, మిల్క్ చాక్లెట్‌తో కలిపి, చాక్లెట్ సాయిల్, ఫ్రెష్ బెర్రీస్, చాక్లెట్ ఐస్ క్రీం సమ్మిళితంగా తయారు చేసే ‘లే సర్క్’ సిగ్నేచర్ వంటకం. విభిన్న రుచులు.. అరుదైన, వినూత్న రుచులను ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశాలకు చెందిన వంటకాలకు ఇక్కడ అభిమానులుంటారు. ప్రస్తుతం రెన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న వంటకాలు దేశంలో మరెక్కడా లభించవు. – ప్రముఖ చెఫ్ వశిష్ట, లీలా రీన్ చెఫ్ స్టూడియో -
Republic Day 2025: సర్వ ఆహార సమ్మేళనం..!
‘‘సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకుంటే అనారోగ్యమే. చక్కగా తినాలి... చక్కగా ఎక్సర్సైజ్లు చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం’’ అని ఉష మూల్పూరి(Usha Mulpuri)అన్నారు. నిర్మాతగా తన తనయుడు నాగశౌర్యతో ‘ఛలో, నర్తనశాల, కృష్ణా వ్రింద విహారి’ తదితర చిత్రాలను నిర్మించారు. తొలి చిత్రం ‘ఛలో’ తోనే నిర్మాతగా సక్సెస్‌ని టేస్ట్ చేసిన ఉష ఇప్పుడు తన రెస్టారెంట్ ‘ఉష మూల్పూరి’స్ కిచెన్(Usha Mulpuri's Kitchen)’ ద్వారా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. ఇక గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా కొన్ని వంటకాలు(Recipes) తయారు చేశారు. ఆ వంటకాలు తెలుసుకుందాం. ‘‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్... ఆ మనుషుల ఆరోగ్యం మా బాధ్యత... అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన వంటకాల్లోనూ పోషక విలువలు ఉండేలా చూసుకున్నాను’’ అంటూ దేశభక్తిని చాటుతూ, జెండా రంగులకు తగ్గట్టుగా తాను కూడా రెడీ అయి, కిచెన్‌లోకి ఎంటరయ్యారు ఉష. ముందుగా నాన్ వెజ్ స్టార్టర్ చేశారు.. ‘పండుమిర్చి కోడి వేపుడు, క్రీమ్ చికెన్, కరివేపాకు కోడి వేపుడు’ చేసి, ఆ కాంబోని అందంగా ప్రెజెంట్ చేశారు. ‘‘పండు మిర్చిలో విటమిన్ ఎ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కేన్సర్‌తో పోరాడే ఔషద గుణాలు ఉంటాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ వంటివి ఉంటాయి. కంటికి, జుట్టుకి మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా కరివేపాకు బెస్ట్. అందుకే ఆహారం ఆరంభమే ఆరోగ్యంగా ఆరంభించాలని ఈ స్టార్టర్స్ చేశాను’’ అని వివరించారు ఉష. రైస్ ఐటమ్స్‌లో పుదీనా మాంసం పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, పండుమిర్చి కోడి పులావ్ చేశారు. ‘‘పుదీనాకి మంచి వాసన ఉంటుంది. దాంతోపాటు రుచి కూడా బాగుంటుంది. అలాగే ఆహారం జీర్ణం కావడానికి పుదీనా మంచిది. ఐరన్ పుష్కలంగా ఉన్న పుదీనాని మీరు రోజూ తీసుకోవచ్చు. మనలో చాలామందికి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీలో కొన్ని పుదీనా ఆకులు వేసుకుని, తాగి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ఇక నాన్‌వెజ్ తినేవారికి చికెన్‌లో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో తెలిసిందే’’ అని పేర్కొన్నారామె. మాంసాహారం మాత్రమే కాదు... శాకాహారం కూడా చేశారు ఉష. వెజ్‌లో కరివేపాకు వెజ్ పులావ్, పండుమిర్చి పనీర్ పలావ్, కర్డ్ రైస్ చేశారు.‘‘కరివేపాకు, పండుమిర్చి ఎంత మంచిదో ముందే చెప్పాను. పనీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. నాన్‌వెజ్ తినేవారికి మాంసం రూపంలో ప్రోటీన్లు అందుతాయి. వెజిటేరియన్స్‌కి పనీర్ బెస్ట్. పనీర్‌లో తక్కువ కార్బోహైడ్రేట్స్... ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇక మన ఇండియన్స్‌లో చాలామందికి ఫైనల్‌గా పెరుగన్నం తింటేనే సంతృప్తిగా ఉంటుంది. పెరుగులో కావాల్సినంత కాల్షియం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొట్ట చల్లగా ఉండటానికి పెరుగన్నం కూడా చేశాను’’ అని తెలిపారు ఉష మూల్పూరి. ఎనిమిది పదుల వయసులవాళ్లకూ... ‘‘మనం ఆహారం తీసుకున్నాక పొట్ట బరువుగా ఉండకూడదు. తేలికగా అనిపించాలి. ఫుడ్ బిజినెస్ ఆరంభించాలనుకున్నప్పుడు నా మెయిన్ టార్గెట్ ఇదే. మా రెస్టారెంట్‌కి ఎనభై ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవాళ్లు కూడా వస్తారు. ‘పొట్ట చాలా తేలికగా ఉందమ్మా’ అని వారు చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.సెలబ్రిటీలకూ... ‘‘మా కిచెన్ వంటకాలను ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, కృష్ణారెడ్డి, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు, కోటి, మెగా కృష్ణారెడ్డి, నందినీ రెడ్డిగార్లు వంటివారు ఇష్టపడతారు. మా దగ్గర బ్రొకోలీ కాషూనట్ చిల్లీ గార్లిక్ ఫేమస్. ఇవి ఎక్కువగా తెప్పించుకుంటారు’’ అని చెప్పారు ఉష. అవగాహన పెంచుకోవాలి ‘‘నేను రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. జీతాలిచ్చి మనుషులను పెట్టుకుని, వాళ్లతో చేయించేయొచ్చు. కానీ అందులో పరిపూర్ణత ఉండదు. వంటకు కావల్సినవి కొనడం నుంచి వాటిని సరిగ్గా శుభ్రం చేసి వండటం వరకూ అన్నింటినీ దగ్గరుండి చేయించేదాన్ని. ‘సర్వ మత సమ్మేళనం’ అంటారు... ‘సర్వ ఆహారం సమ్మేళనం’ అంటాను. రెస్టారెంట్ అంటే రకరకాల వాళ్లు వస్తారు. వాళ్లకి తగ్గట్టుగా ఉండాలి కదా. నా కుటుంబ సభ్యులకు వండుతున్నట్లుగా భావించి వంట చేయిస్తాను. వీలున్నప్పుడల్లా అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్లి, అందర్నీ పలకరిస్తుంటాను. ‘మాకు ఇంటికి వచ్చినట్లుగా ఉంది’ అని అంటుంటారు. అందరికీ ‘సాక్షి’ ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అంటూ ముగించారు ఉష.– డి.జి. భవాని (చదవండి: నీ రీప్లేస్మెంట్ రోబో: సు'నీ'శితంగా శస్త్రచికిత్స) -
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్‌లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్‌లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్‌లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్‌లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
ఘుమఘుమల సంక్రాంతి
సత్తుపల్లిటౌన్: తెలుగురాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అయితే, సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులతో పాటు పిండి వంటలూ గుర్తుకొస్తాయి. నోరూరించే పిండి వంటల కోసం చిన్నాపెద్ద ఎదురుచూస్తుంటారు. ఖరీఫ్ పంటల డబ్బు చేతికి వచ్చేవేళ పండుగ సందడి మొదలవుతుంది. వారం ముందు నుంచే ఇంటింటా పిండి వంటలు చేస్తూ మహిళలు, యువతులు బిజీబీజీ అయ్యారు. అరిసెలు, గారెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు, బూందీ లడ్డు, గవ్వలు, సున్నుండలు, చక్రాలు, కారపుపూస ఇలా రకరకాల పిండి వంటల తయారీతో వీధులు ఘుమఘుమలాడుతున్నాయి. ఆధునిక యువతకు వారి అమ్మలు దగ్గరుండి పిండి వంటలు తయారు చేయటం నేర్పిస్తున్నారు. ఇరుగుపొరుగు వారితో కలిసి.. సంక్రాంతి పండుగకు వారం, పదిరోజుల ముందు నుంచే పల్లె, పట్టణంలోని ఇళ్లల్లో పిండి వంటల తయారీ మొదలవుతుంది. వీటిని ఒక్కరే చేయటం సాధ్యం కాదు కాబట్టి ఆడపడుచులంతా ఇరుగుపొరుగు బంధువుల సాయంతో పిండి వంటలు చేస్తారు. ఒకరోజు పక్కింట్లో.. మరోరోజు ఎదురింట్లో కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు తయారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది సమష్టి జీవన విధానానికి తార్కాణంగా నిలుస్తోంది.సంబురంగా చేసుకుంటాం.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరం ఒకచోట కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు చేసుకుంటాం. వీధిలో ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లి పిండి వంటలు చేస్తాం. రకరకాల పిండి వంటలు చేసుకోవటం ఈ పండుగ ప్రత్యేకం. – తోట జానకి, సత్తుపల్లి ఇది అరిసెల పండుగ ఏటా సంక్రాంతి పండుగకి అరిసెలు ఎక్కువగా చేస్తుంటాం. పంటలు చేతికి వస్తాయి కాబట్టి అన్ని రకాల వంటలు చేసుకునే వీలు ఉంటుంది. ఈ పిండి వంటలలో పోషకాలు ఉంటాయి. లడ్డూలు, చక్రాలు వంటివి చేసుకుంటాం. – సుబ్బలక్ష్మా, సత్తుపల్లి -
గోల్డెన్ గ్లోబ్స్ 2025 వేడుక: 24 క్యారెట్ల బంగారంతో వంటలా..!
82వ గోల్డెన్ గ్లోబ్స్(Golden Globes) ఈ నెల జనవరి 6, 2025న లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో అట్టహాసంగా జరిగింది. ఇది స్టార్ స్టడ్స్ అవార్డుల ప్రధానోత్సవం. ఏదైన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) గతేడాది సినిమా, టెలివిజన్లలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో వడ్డించే విందు కూడా అత్యంత గ్రాండ్‌గానే ఉంటుంది. సాదాసీదా చెఫ్‌లు తయారు చేయరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ మెనూలో ఉండే వెరైటీ వంటకాలెంటో చూద్దామా..!.ఈ వేడుకలో వంటకాలను తయారు చేసేది పాక ప్రపంచంలో ప్రముఖ లెజెండ్ అయిన నోబు మత్సుహిసా(Chef Nobu Matsuhisa). ఆయన సాంప్రదాయ జపనీస్ రుచులకు వివిధ పద్ధతుల మిళితం చేసి అందించడంలో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రెస్టారెంట్లో నోబు తన పాక నైపుణ్యాన్ని రుచి చూపించారు ఆహారప్రియులకు. ఇలాటి లగ్జరీయస్ ఈవెంట్‌లోని మెనూ బాధ్యతను చెఫ్ నోబు తీసుకోవడం రెండోసారి. ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2025లోని అతిథులకు చెఫ్ నోబు ..ఎల్లోటైల్ జలపెనో, సిగ్నేచర్ మాట్సుహిసా డ్రెస్సింగ్‌తో సాషిమి సలాడ్, మిసో బ్లాక్ కాడ్, సీవీడ్ టాకోస్ విత్ కేవియర్, సాల్మన్, ట్యూనా, తాయ్ వంటి వాటితో రకరకాల డిష్‌లు తయారు చేశారు. ఈ రుచికరమైన పదార్థాలన్నింటిలో అత్యంత లగ్జరీయస్ రెసిపీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ మెనూలో హైలెట్‌గా గోల్డ్ స్టాండర్డ్ రోల్(Gold Standard Roll) నిలిచింది. దీన్ని ఈ గోల్డెన్ గ్లోబ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారట చెఫ్ నోబు. ఈ అద్భుతమైన రోల్‌ని కింగ్ క్రాబ్, సాల్మన్ ఉపయోగించి తయారు చేశారట. అలాగే 24-క్యారెట్ బంగారు రేకులు(24-karat gold ), కేవియర్తో అలంకరించి సర్వ్ చేశామని తెలిపారు చెఫ్ నోబు. అంతేకాదండోయ్ ఈ వేడుకలో ప్రీమియం షాంపైన్, వైన్‌ను హాయిగా సిప్ చేయొచ్చట. View this post on Instagram A post shared by Golden Globes (@goldenglobes) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
క్యాబేజీతో క్రేజీగా...!
క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తారు. సిబ్లింగ్స్ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?క్యాబేజ్ కుల్చా..కావలసినవి..గోధుమపిండి– పావు కేజీ;నూనె– 2 టీ స్పూన్లు;నీరు – ము΄్పావు కప్పు;ఉప్పు – పావు టీ స్పూన్;స్టఫింగ్ కోసం... క్యాబేజ్ – పావు కేజీ;నూనె – టేబుల్ స్పూన్;పచ్చిమిర్చి – 2 (తరగాలి);వాము – అర టీ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్;జీలకర్ర పొడి– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;ఆమ్చూర్ – అరటీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.– క్యాబేజ్‌ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్ స్టఫింగ్ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.– ఇప్పుడు క్యాబేజ్ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.– స్టఫింగ్ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.గమనిక: ఆమ్చూర్ పౌడర్ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్ తీసుకోవాలి.క్యాబేజ్ డ్రై మంచూరియా..కావలసినవి..క్యాబేజ్ – 200 గ్రాములు (తరగాలి);ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);క్యాప్సికమ్ – 1 (తరగాలి);క్యారట్ – 1 (తరగాలి);షెజ్వాన్ సాస్ – అర టేబుల్ స్పూన్;అల్లం తురుము – టీ స్పూన్; కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్;మిరియాల పొడి– పావు టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;శనగపిండి – 100 గ్రాములు;మైదా – 50 గ్రాములు;మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;నూనె – వేయించడానికి తగినంత;గార్నిష్ చేయడానికి... క్యాబేజ్ తురుము – టేబుల్ స్పూన్;కొత్తిమీర తరుగు – టీ స్పూన్.తయారీ..– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.– ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్ మీద వేయాలి.– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
ఆ ఉత్తరం ఈ దక్షిణం అన్ని రుచులూ అద్భుతః
మన వంటగదికి పొరుగింటి రుచిని అద్దుదాం. కేరళ కొబ్బరితో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం. పెరుగుతో పంజాబీ కడీ చేద్దాం. శనగలతో జైసల్మీర్ చనే కూడా ట్రై చేద్దాం. పిల్లలకు అన్ని రుచులూ అలవాటైతే... పై చదువులకు ఏ రాష్ట్రానికి వెళ్లినా సరే... మన ఇంట్లో భోజనం చేసినట్లే ఉంటుంది.కేరళ పాలాపం..కావలసినవి..బియ్యం– పావు కేజీ;పచ్చి కొబ్బరి తురుము – యాభై గ్రాములు;నీరు– వంద మిల్లీలీటర్లు;చక్కెర – అర స్పూన్;ఉప్పు – అర స్పూన్;బేకింగ్ సోడా– చిటికెడు.తయారీ..బియ్యాన్ని శుభ్రంగా కడిగి మంచినీటలో ఐదు గంటల సేపు నానబెట్టాలి.మిక్సీలో బియ్యంతోపాటు కొబ్బరి తురుము కూడా వేసి తగినంత నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇది ఆపం పిండి ∙బాణలిలో నీటిని పోసి, అందులో పై మిశ్రమాన్ని ఒక కప్పు వేసి గరిటెతో కలుపుతూ మరిగించి దించేయాలి.మిశ్రమం చల్లారిన తర్వాత ఆపం పిండిలో వేసి కలపాలి.ఈ పిండిని ఎనిమిది గంటల సేపు కదిలించకుండా ఉంచాలి. రాత్రి గ్రైండ్ చేసి పెడితే ఉదయానికి పొంగుతుంది.ఇందులో చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేసి గరిటెతో బాగా కలపాలి.మిశ్రమం గరిటె జారుడుగా ఉండాలి. అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసుకోవచ్చు.ఆపం పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పితే పిండి దోశెలాగ విస్తరిస్తుంది.మీడియం మంట మీద కాల్చాలి. కాలే కొద్దీ అంచులు పైకి లేస్తాయి.అట్లకాడతో తీసి ప్లేట్లో పెట్టాలి. దీనిని రెండవ వైపు కాల్చాల్సిన పని లేదు, కాబట్టి తిరగేయకూడదు.ఈ ఆపం అంచులు ఎర్రగా కరకరలాడుతూ మధ్యలో దూదిలా మెత్తగా ఉంటుంది.నూనె వేయాల్సిన పని లేదు. ఆపం పెనం లేకపోతే దోశె పెనం (ఫ్లాట్‌గా కాకుండా కొంచెం గుంటగా ఉండే పెనం) మీద ప్రయత్నించవచ్చు.పంజాబీ కడీ..కావలసినవి..– శనగపిండి మిశ్రమం కోసం: శనగపిండి– కప్పు;పెరుగు– 2 కప్పులు;నీరు– 4 కప్పులు;పసుపు– చిటికెడు.– కడీ కోసం: ఆవనూనె లేదా వేరుశనగ నూనె– టేబుల్ స్పూన్;పసుపు – అర టీ స్పూన్;ఇంగువ– పావు టీ స్పూన్;ఆవాలు – టీ స్పూన్;జీలకర్ర – టీ స్పూన్;మెంతులు – అర టీ స్పూన్;లవంగాలు – 3;ఎండుమిర్చి – 2;కరివేపాకు – 3 రెమ్మలు;ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి);అల్లం– అంగుళం ముక్క (తరగాలి);వెల్లుల్లి– 4 రేకలు (తరగాలి);మిరపొ్పడి– అర టీ స్పూన్;ధనియాల పొడి –2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్;గరం మసాలా– అర టీ స్పూన్;ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు లేదా పచ్చి మామిడి గుజ్జు టేబుల్ స్పూన్;కసూరీ మేథీ (ఎండిన మెంతి ఆకుల పొడి)– 2 టీ స్పూన్.– తడ్కా కోసం: నూనె – టేబుల్ స్పూన్;ఎండుమిర్చి– 2;కశ్మీరీ మిర్చిపౌడర్– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– టేబుల్ స్పూన్‌తయారీ..ఒక పెద్ద పాత్రలో పెరుగు, శనగపిండి వేసి బాగా కలిసేటట్లు చిలకాలి. అందులో పసుపు వేసి, నీరు పోసి మళ్లీ చిలికి అరగంట సేపు పక్కన ఉంచాలి.స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి.అవి వేగిన తర్వాత మిర్చిపౌడర్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి.ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి– పెరుగు మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించిన తర్వాత ఆమ్చూర్ పౌడర్, కసూరీ మేథీ, గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి.బాణలి పెట్టి నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కశ్మీరీ మిర్చిపౌడర్ వేసి వేగిన తర్వాత ఉడికించిన కడీ మిశ్రమాన్ని పోసి చివరగా కొత్తిమీర చల్లితే పంజాబీ కడీ రెడీ.ఇది అన్నంలోకి బాగుంటుంది. పంజాబీ కడీలో నీరు ఎక్కువగా కలిపి పలుచగా చేసుకుని సూప్‌లా కూడా తాగుతారు.వర్షాకాలం, చలికాలం ఈ సూప్ తాగుతుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తేలిగ్గా, హాయిగా ఉంటుంది.జైసల్మీరీ చనే..కావలసినవి..ముడి శనగలు – కప్పు;నెయ్యి – టేబుల్ స్పూన్;ఇంగువ – చిటికెడు;జీలకర్ర– అర టీ స్పూన్;జీలకర్ర పొడి– టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;మిరపొ్పడి – టేబుల్ స్పూన్;పసుపు– అర టీ స్పూన్;గరం మసాలా పొడి– అర టీ స్పూన్;పెరుగు– ఒకటిన్నర కప్పులు;శనగపిండి –3 టేబుల్ స్పూన్లు;కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్.తయారీ..శనగలను శుభ్రంగా కడిగి ఆరింతలుగా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.ఉదయం నీటిని వంపేసి మరోసారి కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి నాలుగు కప్పుల నీటిని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.దించేసిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఒక వెడల్పు పాత్రలో శనగపిండి, పెరుగు, పసుపు, మిరపొ్పడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.పెనంలో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఇంగువ వేయాలి.జీలకర్ర చిటపట పేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి అడుగుపట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.ప్రెషర్‌కుకర్‌లో ఉడికించి సిద్ధంగా ఉంచిన శనగలను నీటితో సహా ఉడుకుతున్న శనగపిండి, పెరుగు మిశ్రమంలో వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ జైసల్మీరీ చనే కర్రీ రోటీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.ఇవి చదవండి: ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? -
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్‌తో తయారు చేస్తారు. ఈ జ్యూస్‌ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్‌కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్‌లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
పోషకాల పిండివంటలు
సంక్రాంతికి మనం రకరకాల పిండివంటలు చేసుకుంటాం. అయితే అవన్నీ ఈ రుతువుకు తగినవనీ, శరీరానికి బలాన్నిస్తాయనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ పండక్కి ఈ పిండివంటలను నిర్దేశించి ఉండచ్చని వీటిలోని పోషకాలను బట్టి తెలుస్తోంది. ఏయే పిండివంటల్లో ఏయే పోషకాలున్నాయో చూద్దాం. అరిసెలు సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. వీటిని పంచదారతో, బెల్లంతో కూడా చేస్తారు కానీ, బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి మంచిది. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఐరన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. కొబ్బరి బూరెలు అరిసెల తరవాత అంతటి ప్రధానమైన వంటకం కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపుపిండి, కొబ్బరి, యాలకుల పోడి, బెల్లం వాడతారు. అరిసెలలో ఉన్న పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఈ కొబ్బరి బూరెల్లో లభిస్తాయి. నువ్వుల ఉండలు పరస్పరం నువ్వుల ఉండలు పంచుకోవడం సంక్రాంతి సంప్రదాయాలలో ఒకటి. మంచి బలవర్థకమైన ఆహారం నువ్వుల ఉండలు. శీతాకాలంలో శరీరం పోడిబారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో ఉండే నూనె శరీరాన్ని కాంతిమంతంగా ఉండేలా దోహదం చేస్తుంది. టీనేజీ బాలికల్లో రక్తహీనతను నివారించడానికి ఉపకరిస్తుంది. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్ ఎ, డి, ఇ, కెలు లభిస్తాయి. దేహదారుఢ్యానికి నువ్వుండలను మించింది లేదు. జంతికలు తియ్యటి పదార్థాలు తిన్న జిహ్వ, ఆ వెంటనే కార కారంగా ఉండే వాటిని తినాలనుకోవడం సహజం. కారపు పిండివంటల్లో జంతికలు లేదా సకినాలు ప్రధానమైనవి. బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు, వాము ఇందులో వాడతారు. శనగపిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను అందిస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు సహకరిస్తాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువ తింటారు. వీటిలో వాడే వాము సుఖ విరోచనానికి తోడ్పడి.. జీర్ణప్రక్రియ చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. సున్ని ఉండలు బలవర్థకమైన ఆహారంలో సున్నిఉండలు మొదటిస్థానంలో ఉంటాయి. మినపపిండి, నెయ్యి, బెల్లం వాడతారు. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, సున్ని, నెయ్యి ద్వారాప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందిస్తాయి. కొత్త అల్లుళ్లకు సున్ని ఉండలు కొసరి కొసరి వడ్డిస్తారు. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అంటే దేనిలోనూ అతి పనికి రాదు. వంటికి మంచిది కదా.. రుచిగా ఉన్నాయి కదా అని మధుమేహులు, శరీర తత్త్వానికి పడని వాళ్లు తగిన మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యకరం అని గుర్తుంచుకోవడం మంచిది. కజ్జికాయలు అరిసెలు అంతగా పడని వారు, అంత శ్రమ తీసుకోలేనివారు కజ్జికాయలు చేసుకుంటారు. ఇవి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండటంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదార లేదా పల్లీలు, పుట్నాలు, నువ్వులతో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు వంటివి కూడా వినియోగిస్తారు. కజ్జికాయల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్ , ఖనిజ లవణాలు అందుతాయి. గారెలు సంక్రాంతికి తప్పనిసరిగా వండుకునే వాటిల్లో గారెలు ఒకటి. కనుము నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. పోట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పోట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పోట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి. -
క్రాబ్స్‌తో కేక్ పాపర్స్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
కేక్ పాపర్స్ తయారీకి కావల్సినవి: పీతల గుజ్జు – అరకేజీ; బటర్ – రెండు టేబుల్ స్పూన్లు; స్ప్రింగ్ ఆనియన్ తరుగు – పావు కప్పు; ఎర్రక్యాప్సికం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; సెలెరీ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కోషర్ సాల్ట్ – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; గుడ్డు – ఒకటి; సోయా సాస్ – పావు టీస్పూను; మయనైజ్ – పావు కప్పు; ఆవ పొడి – పావు టీస్పూను; మిరియాల పొడి – పావు టీస్పూను; బ్రెడ్ క్రంప్స్ – ఒకటింబావు కప్పులు; నూనె – ఒకటిన్నర కప్పులు. స్పైసీడిప్: మయనైజ్ – అరకప్పు; నిమ్మరసం – టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బ – పెద్దది ఒకటి(సన్నగా తర గాలి); చిల్లీ సాస్ – టీస్పూను. తయారీ విధానమిలా: బాణలిలో బటర్ వేసి, కరిగిన తరువాత.. స్ప్రింగ్ ఆనియన్ , క్యాప్సికం, సెలెరీ తరుగు వేసి వేయించాలి ∙ముక్కలన్నీ మెత్తబడిన తరువాత పీతల గుజ్జు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి ∙ఇది వేగుతుండగానే.. ఒక గిన్నెలో గుడ్డు సొన, సోయా సాస్, మయనైజ్, ఆవపొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి ∙కలిపిన వెంటనే వేగుతున్న పీతల గుజుజపెన ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. చల్లారాక మీడియం సైజు బాల్స్‌లా చుట్టుకోవాలి. బాల్స్ అన్నీ తయారయ్యాక.. బ్రెడ్ క్రంప్స్లో ముంచి కోటింగ్‌లా పట్టించి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙అరగంట తరువాత నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే క్రాబ్ కేక్ పాపర్స్ రెడీ ∙స్పైసీడిప్ కోసం తీసుకున్న పదార్థాలను గిన్నెలో వేసి కలిపి.. వేడివేడి క్రాబ్ కేక్ పాపర్స్తో సర్వ్ చేసుకోవాలి. -
స్వీట్ పొటాటో పీజా బాల్స్.. సింపుల్‌గా చేసుకోండిలా
స్వీట్ పొటాటో పీజా బాల్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – అరకేజీ(తొక్కతీసి ముక్కలు తరగాలి); మటన్ ఖీమా – అరకప్పు; చీజ్ తురుము – ముప్పావు కప్పు; పీజా సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; గోధుమ పిండి – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు(సొనను బాగా కలిపి పెట్టుకోవాలి); బ్రెడ్ క్రంప్స్ – కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – రుచికి తగినంత. తయారీ విధానమిలా: చిలగడ దుంప ముక్కల్ని మెత్తగా ఉడకబెట్టి, చిదుముకోవాలి. ఇందులో మటన్ ఖీమా, చీజ్ తురుము, పీజా సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, బాల్స్‌లా చుట్టి పెట్టుకోవాలి గోధుమ పిండి, గుడ్లసొన, బ్రెడ్ క్రంప్స్ను వరుసగా పెట్టుకోవాలి. దుంపల బాల్స్‌ను ముందుగా గోధుమ పిండి, తరువాత గుడ్ల సొన, చివరిగా బ్రెడ్క్రంప్స్లో ముంచి డీప్ ఫ్రైచేసుకోవాలి ∙బాల్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి మారాక తీసేసి నచ్చిన సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. -
క్రిస్మస్ స్పెషల్: ఇటాలియన్ పీచ్ కుకీస్, ఇంట్లోనే చేసుకోవచ్చు
ఇటాలియన్ పీచ్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్ స్పూను; కోషర్ సాల్ట్ – పావు టీస్పూను; బటర్ – అరకప్పు; పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు; వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు; ఎరుపు, పసుపు ఫుడ్ కలర్ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు). పీనట్ బటర్ క్రీమ్: బటర్ – పావు కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీస్పూను; కోషర్ సాల్ట్ – చిటికెడు; పంచదార పొడి – కప్పు; పీచ్ ప్యూరీ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు హ్యాండ్ మిక్సర్‌తో కలపాలి. తరువాత క్రీమ్‌ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ వేసి రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్ చేయాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్‌లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్ ఫ్రూట్ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్ రెడీ అయిన తరువాత అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ∙పీచ్ క్రీమ్కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్ సాల్ట్ లనుగిన్నెలో వేసి హ్యాండ్ మిక్సర్‌తో కలపాలి. ► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్‌తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి. ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్ బేక్ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్క్రీమ్ను వేసి శాండ్‌విచ్‌లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్ పీచ్ కుకీస్ రెడీ. -
కేవలం 15 నిమిషాల్లో గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ
గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ తయారీకి కావల్సినవి: వెనీలా కేక్ మిక్స్ – మూడు కప్పులు; నూనె – ముప్పావు కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – అరటీస్పూను; గ్రీన్ ఫుడ్ కలర్ – టీస్పూను(జెల్); పంచదార పొడి – ముప్పావు కప్పు; హార్ట్ షేప్ క్యాండీస్ – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: కేక్ మిక్స్,నూనె, గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్‌ను, గ్రీన్‌ఫుడ్ కలర్‌ను ఒక గిన్నెలో వేసి ముద్దలా కలపాలి. తరువాత రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙ఇరవై నిమిషాల తరువాత పిండి ముద్దను బయటకు తీసి స్కూప్ పరిమాణంలో పిండిని తీసుకుని ఉండలు చేయాలి. ఈ ఉండలను పంచదార పొడిలో ముంచి కోటింగ్‌లా అద్దాలి.తరువాత ఉండలను బేకింగ్ ట్రేలో పెట్టి, కుకీ షేప్ వచ్చేలా వత్తుకోవాలి ∙కుకీ మధ్యలో హార్ట్ ఆకారంలో ఉన్న క్యాండీని పెట్టి బేకింగ్ ట్రేని అవెన్‌లో పెట్టాలి ∙350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేస్తే గ్రీన్ కేక్ మిక్స్ కుకీస్ రెడీ. -
బేకరీ స్టైల్లో కుకీస్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
స్నీకర్ డూడుల్ కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – మూడు కప్పులు; టార్టారిక్ యాసిడ్ – రెండు టీస్పూన్లు; కోషర్ సాల్ట్ – టీస్పూను; వంటసోడా – ముప్పావు టీస్పూను; బటర్ –కప్పు; పంచదార – ఒకటిన్నర కప్పులు; వెనీలా ఎసెన్స్– టీస్పూను; దాల్చినచెక్క పొడి – టేబుల్ స్పూను తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో మైదా, టార్టారిక్ యాసిడ్, వంటసోడా వేసి కలపాలి ∙అన్నీ కలిసిన తరువాత బటర్, ఒకటింబావు కప్పుల పంచదార వేసి మెషిన్ మిక్సర్‌తో కలపాలి ∙మిశ్రమం క్రీమ్‌లా మారిన తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ∙మిగిలిన పంచదారలో దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙గంట తర్వాత రిఫ్రిజిరేటర్నుంచి తీసిన మిశ్రమాన్ని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని బాల్స్‌లా చేసి దాల్చినచెక్క పొడి అద్ది బేకింగ్ ట్రేలో పెట్టాలి ∙కుకీస్ అన్నీ తయారయ్యాక.. బేకింగ్ ట్రేని 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద, ఇరవై నిమిషాలు బేక్ చేస్తే స్నీకర్ డూడుల్ కుకీస్ రెడీ. -
స్నాక్స్ కోసం.. మైసూర్ బోండాలు, సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు
గోధుమ మైసూర్ బోండాలు కావలసినవి: గోధుమ పిండి – 400 గ్రాములు పెరుగు – ముప్పావు కప్పు , బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా, పంచదార – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, జీలకర్ర– 1 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి – 1 టీ స్పూన్ (సన్నని తరుగు), చిన్నచిన్న కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్లు (తురుము కూడా వేసుకోవచ్చు), కరివేపాకు – 2 రెమ్మలు (సన్నగా తురుముకోవాలి), నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో బేకింగ్ సోడా, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, బోంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గోధుమ పిండి, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలపాలి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుగా, జిగటగా అయ్యేలా చేసుకోవాలి. దాన్ని రెండు గంటల పాటు నానివ్వాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర,, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరిముక్కలు, కరివేపాకు తురుము వేసుకుని రెండుమూడు నిమిషాలు బాగా కలిపి.. కాగుతున్న నూనెలో కొద్దికొద్దిగా బొండాల్లా వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. -
ఒకేసారి రెండు రకాల వంటలు చేసుకోవచ్చు, ధర కూడా తక్కువే
ఒకేసారి రెండు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా ఉన్న ఈ మల్టీ కుకర్‌ను.. యూజర్ ఫ్రెండ్లీ మెషిన్‌గా చెప్పుకోవచ్చు. చిన్నచిన్న అపార్ట్‌మెంట్స్‌లో, ఓపెన్ కిచెన్స్‌లో ఇలాంటి మినీ మేకర్ అందుబాటులో ఉంటే అలుపుసొలుపు లేకుండా ఇట్టే వంట చేసేసుకోవచ్చు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్‌తో పాటు కుడుములు, వాయికుడుములు వంటివెన్నో వండుకోవచ్చు. 3.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో.. గుడ్లు, జొన్న కండెలు, దుంపలు, కేక్స్ వంటివీ ఉడికించుకోవచ్చు. మెయిన్ బేస్ మెషిన్ మీద.. స్టీల్ ట్రేలో మరో వెరైటీని కుక్ చేసుకునే వీలుంటుంది. దీనికి సరిపడా ట్రాన్స్పరెంట్ లిడ్ (మూత) ఉంటుంది. డివైస్ ముందున్న రెగ్యులేటర్ సాయంతో దీన్ని సులభంగా వాడుకోవచ్చు. దీని ధర 80 డాలర్లు(రూ.6,672). -
క్రిస్టమస్ స్పెషల్: సాఫ్ట్ కుకీస్.. బేకరీ స్టైల్లో
క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్: కావలసినవి: మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా›– టీస్పూను; ఉప్పు – అర టీస్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; బటర్ – కప్పు; గుడ్లు – రెండు; వెనీలా ఎసెన్స్ – రెండు టీ స్పూన్లు. తయారీ విధానమిలా: ►మైదా, వంటసోడా, ఉప్పుని ఒక గిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙బటర్లో పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు బీటర్‌తో కలపాలి. తరువాత ఈ క్రీమ్‌ను రెండు గంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత బటర్ క్రీమ్‌లో గుడ్లసొన, వెనీలా ఎసెన్స్, మైదా మిశ్రమం వేసి ముద్దగా కలుపుకోవాలి పిండి ముద్దను రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►రెండు గంటల తరువాత పిండి ముద్దను రొట్టెల్లా వత్తుకోవాలి ∙ఈ రొట్టెను క్రిస్టమస్ ట్రీ, స్టార్స్, బొమ్మల ఆకారంలో కట్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. కుకీస్ ఆకారాన్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ∙ఈ బేకింగ్ ట్రేను 400 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద పదినిమిషాలు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్టమస్ సాఫ్ట్ కుకీస్ రెడీ. -
ఇన్‌స్టంట్‌గా చేసుకునే స్వీట్ కార్న్ గారెలు
స్వీట్ కార్న్– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి: లేత స్వీట్ కార్న్ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి) అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత జీలకర్ర – ఒక టీ స్పూన్,సోంపు – అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానాతో బర్ఫీ.. సింపుల్‌గా, క్షణాల్లో చేసుకోవచ్చు
బనానా జాంగ్రీ బర్ఫీ తయారీకి కావల్సినవి: అరటిపండ్లు – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, మిల్క్ పౌడర్ – 1 కప్పు, బెల్లం తురుము (జాంగ్రీ) – ముప్పావు కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూన్ (అభిరుచిని బట్టి), చిక్కటి పాలు – పావు కప్పు (కాచినవి), జీడిపప్పు, బాదం ముక్కలు – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానమిలా: ఒక పాత్రలో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పోసుకుని.. సిమ్ ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే.. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం కావలసిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
అన్నంలోకి నిమిషాల్లో రుచులు
ఇంట్లో పేరెంట్స్ లేని సమయంలో సింపుల్‌గా చేసుకునే కొన్ని వెరైటీలను చూద్దామిప్పుడు. మ్యాగీ, పాస్తా, శాండ్విచ్, చాకోస్ వంటివన్నీ పిల్లలు.. చిటికెలో చేసుకుని, తినగలిగినవే. నిజానికి ఇదివరకటి పిల్లలైతే అటుకులు, మరమరాలు వంటివి ఇంట్లో ఉంటే చాలు.. వాటితో ఎన్నో వెరైటీలను ఇట్టే చేసుకునేవారు.అటుకులు, బెల్లం కోరు, శనగపప్పు, కొబ్బరికోరు కలుపుకొని తింటే... బలమే కాదు చాలాసేపటి వరకు ఆకలినీ ఆపుతుంది. బెల్లం పాలు కాచుకుని అటుకులు వేసుకుని తినడం, లేదంటే అటుకుల్లో కాస్త ఉప్పు, కారం వేసి దోరగా వేయించుకోవడం వంటివి చిటికెలో చేసుకోవచ్చు. ఇక మరమరాలు తడిపి.. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, టొమాటో ముక్కలు వంటివి వేసి క్షణాల్లో రుచికరమైన స్నాక్‌ని రెడీ చేసుకోవచ్చు. 3 నిమిషాల్లో మజ్జిగ చారు కావాల్సినవి: పెరుగు – పావు కప్పు (కొద్దిగా నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర – కొద్దికొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), పసుపు – పావు టీ స్పూన్ ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము – కొద్దికొద్దిగా.. తయారీ: ముందు కళాయిలో నూనె వేసుకుని.. అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. దానిలో ఉప్పు వేసుకుని, ఎండుమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మిశ్రమాన్ని పలుచగా చేసుకున్న పెరుగులో కలిపి బాగా తిప్పాలి. అందులో కొత్తిమీర తురుము కూడా వేసుకుని అన్నంలోకి తింటే అదిరిపోతుంది. తాలింపు వేసే సమయంలో, వేడి పాత్రను పట్టుకునేప్పుడు జాగ్రత్తలు అవసరం. 5 నిమిషాల పచ్చడి కావాల్సినవి: పచ్చిమిర్చి – 5, చింతపండు – అర నిమ్మకాయ సైజ్ (గింజలు లేకుండా తీసి, కడిగి, నానబెట్టుకోవాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉల్లిపాయ – చిన్నది (నాలుగైదు ముక్కలు చేసుకోవాలి), నూనె – 1 టీ స్పూన్ (కాచాల్సిన పనిలేదు) తయారీ: పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని.. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, మరోసారి మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని.. కొత్తిమీర తురుము, నూనె వేసుకుని, వేడి వేడి అన్నంతో తింటే సూపర్బ్‌గా ఉంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు.. పెద్దలు అందుబాటులో లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఈ పచ్చడి చేసుకోవచ్చు. 10 నిమిషాల లోపు కర్రీ కావాల్సినవి: ఉల్లిపాయ–1(చిన్నగా తరగాలి), టొమాటోలు – 6 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 2, ఉప్పు – సరిపడా, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ పైనే, కారం – 2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా – 1 టీ స్పూన్ చొప్పున, నూనె – 2 టేబుల్ స్పూన్లు పైనే.. తయారీ: ముందుగా చిన్న కుకర్‌లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేగించుకుని.. టొమాటో ముక్కలు వేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం మగ్గించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి గ్లాసున్నర వాటర్ పోసి.. మూతపెట్టి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఐదు నిమిషాల్లో పూర్తి అవుతుంది. కాస్త చల్లారాక.. మూత ఓపెన్ చేసి.. అందులో కరివేపాకు వేసుకుని, ఇంకాస్త గ్రేవీలా అయ్యేందుకు.. చిన్నమంటపై కాసేపు మగ్గించుకోవచ్చు. ఆ సమయంలో గరిటెతో ఇంకాస్త మెత్తగా చేసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే మాదిరి టొమాటో ముక్కల బదులు బంగాళదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఇలా చాలా కూరగాయలతోనూ ఈ వంటకాన్ని చేసుకోవచ్చు. -
కమ్యూనిటీ కిచెన్: వంట చేసే పనిలేదు, ఇంటికే భోజనం వచ్చేస్తుంది
పది కుటుంబాలకు నలుగురు వండి పెడతారు. రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండీ వండీ వండీ అలసిపోయేవారూ ఉద్యోగాల వల్ల టైమ్ లేని వారు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నవారు ఇదేదో బాగుందే అనుకుంటున్నవారు కేరళలో కమ్యూనిటీ కిచెన్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. అంటే పది కుటుంబాలు కలిసి ఓ నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ మహిళలు ఆ పది కుటుంబాలకు వంట చేసి పంపిస్తున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతున్న ట్రెండ్. 'ప్లాన్ చేస్తే పోయేదేమీ లేదు వంట చేసే బాధ తప్ప’ అంటున్నారు కేరళ వాసులు. ‘వంట గది వద్దు. వంట మీద ఆదాయం ముద్దు’ అనే నినాదం కూడా ఇస్తున్నారు. ఇదంతా గత ఒకటి రెండేళ్లలో జరిగిన మార్పు. కేరళలోని పొన్నాని’ అనే టౌన్లో ఇద్దరు స్నేహితుల కుటుంబాలకు వచ్చిన ఆలోచన ‘సహకరణ కిచెన్’ (కమ్యూనిటీ కిచెన్) ఉద్యమానికి కారణం అయ్యింది. వంట చేసి పెడతారా? పొన్నానిలో రమేష్ వలియిల్ అనే బ్యాంక్ ఎంప్లాయే రోజూ వంట కోసం భార్య పడే బాధలు చూసేవాడు. ఉదయాన్నే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్ వండి బాక్స్ కట్టివ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లకు ఆమె జబ్బు పడింది. డాక్టర్లు వంట చేయవద్దన్నారు. ఏం చేయాలో రమేష్‌కు ΄పాలుపోలేదు. మరోవైపు అదే ఊళ్లో ఉన్న కలీముద్దీన్, అతని భార్య మాజిద అడ్వకేట్లు. ఉదయాన్నే ఇంటికొచ్చే క్లయింట్లను చూసుకోవాలా వంట గొడవలో ఉండాలా అనేది సమస్య అయ్యింది. ఈ కుటుంబాలు రెండూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక తమకెవరైనా వండిపెట్టే వాళ్లుంటే బాగుండు అనుకున్నారు. అది కూడా ఇంటికొచ్చి కాదు. ఎక్కడైనా వండి పెట్టి అందించే వారు కావాలి. అందుకని వారే ఇద్దరు స్త్రీలను వెతికారు. వారికోసమని ఒక ఖాళీ స్థలం వెతికి షెడ్ వేశారు. తమ కుటుంబాలతో పాటు మరో ఎనిమిది కుటుంబాలను కలిపారు. మొత్తం పది కుటుంబాల కోసం అలా కమ్యూనిటీ కిచెన్ మొదలయ్యింది. వంట బాధ నుంచి పెద్ద ఉపశమనం లభించింది. మొదటి రోజే మెను రోజూ ఉదయాన్నే 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తయారయ్యి ఈ పది కుటుంబాల గడపలకు చేరేవి. వంట చేసే మనుషులకు ఇలా చేరవేసే మనుషులు తోడయ్యారు. వంట ఖర్చు అన్ని కుటుంబాలు సమానంగా పంచుకున్నా నెలకు వంట చేసి పెట్టేవారికి మంచి గిట్టుబాటుగానే ఉంది. కాకుంటే వీళ్లు ఉదయాన్నే నాలుగ్గంటలకంతా లేచి వంట మొదలుపెట్టాలి. మెనూ వాట్సాప్ గ్రూప్‌లో మొదటిరోజు పోస్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, పుట్టు, ఆపమ్, ఉప్మా లాంటివి ఉంటాయి. భోజనంలో నాలుగు రకాల కూరలు చికెన్, ఫిష్ ఉంటాయి. ఈ కుటుంబాల వాళ్లు ఫోన్లు చేసి వాట్సప్ కాల్స్ చేసి వంటను అజమాయిషీ చేస్తారు. మసాలాలు ఏవి వేయాలో చెప్తారు. అంతా ఆరోగ్యకరమైన తిండి లభించేలా చూస్తారు. లాభాలు ఎన్నో వంట తప్పితే మొదట చాలా టైము అందరి దగ్గరా మిగులుతోంది. ‘ఇంతకుముందు పిల్లలు స్పెషల్‌గా ఏదైనా చేసిపెట్టమంటే రోజువారి వంటతో ఓపిక లేక చేసేదాన్ని కాదు. ఇప్పుడు చేసి పెడుతున్నాను’ అని ఒక తల్లి చెప్పింది. ‘పది ఇళ్ల వంట వల్ల అయ్యే ఇంధనం, వచ్చే చెత్త కంటే కమ్యూనిటీ కిచెన్ వల్ల అయ్యే ఇంధనం, మిగిలే చెత్త తక్కువ. డబ్బు ఆదా అవుతుంది కూడా’ అంది మరో గృహిణి. అదీగాక దీనివల్ల మరో నలుగురికి పని దొరకడం మంచి విషయంగానే చూస్తున్నారు. ఊరూరూ వ్యాపించాయి మలబార్ జిల్లాలోని పొన్నాని నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ వెంటనే పక్క జిల్లా అయిన కోళికోడ్‌కు వ్యాపించింది. ప్రస్తుతం మలప్పురం, బలుస్సేరి, కన్నూర్, చెవరంబలమ్... ఇలా ఒక్కో ఊరిలో కమ్యూనిటీ కిచెన్లు వెలుస్తున్నాయి. సూత్రం ఒకటే– నలుగురు కలిసి కిచెన్ నడుపుతారు. కేవలం పది లేదా 11 కుటుంబాలకు వండుతారు. ఈ సంఖ్య వల్ల పెద్ద పెద్ద వంట పాత్రలు, భారీ పొయ్యి, ఎక్కువ శ్రమ, సిబ్బంది అవసరం తప్పుతోంది. ఇద్దరు ముగ్గురు గృహిణులు కలిసి తమ ఇళ్లలోనే వండి బాక్సులు పంపిస్తున్నారు. ఇవి సక్సెస్ అవుతున్నాయి కూడా! మహిళలే... వండాలా? ఈ కిచెన్ల మీద ఒకటి రెండు విమర్శలు ఉన్నాయి. అవేమిటంటే ‘కమ్యూనిటీ కిచెన్స్‌లో కూడా ఆడవాళ్లే వండాలా’ అని ప్రగతివాదులు అంటుంటే ‘ఇంట్లో వంట మానేసి ఈ వేషాలా’ అని మగ దురహంకారులు అంటున్నారు. విమర్శలు ఎలా ఉన్నా ఏదో ఒకరోజు ఇళ్లలో వంట చేయడం కంటే ఇలాంటి కిచెన్ల మీద అందరూ ఆధారపడే రోజు తప్పక వస్తుంది. మంచిదే. -
మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది, సూప్ చేసుకొని తాగేయండి
మష్రుమ్ సూప్ తయారీకి కావల్సినవి మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క, మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ , మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు తయారీ: ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. -
ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోండిలా..
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. -
గోధుమ బిస్కట్స్.. చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు
గోధుమ బిస్కట్స్ తయారీకి కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు పంచదార పొడి – ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), ఉప్పు – కొద్దిగా, కుకింగ్ సోడా – చిటికెడు పుచ్చగింజలు – 1 టీ స్పూన్ సోంపు – 1 టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు, నెయ్యి, నీళ్లు – పావు కప్పు చొప్పున నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు, కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్లా చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్‌ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్‌ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్‌ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్‌తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్‌గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్‌కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్‌లెస్ కేక్’ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్‌లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్‌ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
చిక్కుడు కాయ పప్పు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
చిక్కుడు కాయ పప్పు తయారీకి కావల్సినవి: చిక్కుడు కాయలు – పావు కేజీ; పెసరపప్పు – అరకప్పు; పసుపు – పావు టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – అరకప్పు; ఎండుమిర్చి – నాలుగు; జీలకర్ర – టీస్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు;ఉప్పు – తగినంత ఆవాలు – పావు టీస్పూను; నూనె – తగినంత; మినప్పప్పు – టీస్పూను; తయారీ విధానమిలా: పెసరపప్పుని కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. దీనిలో కప్పునీళ్లు, పసుపు, 1/2 టీస్పూను ఉప్పు వేసి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. చిక్కుడు కాయలను కడిగి ఈ నూనె తీసి ముక్కలు చేసుకోవాలి. తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేయాలి. ఉడికిన పెసరపప్పులో.. చిక్కుడు ముక్కలు, నూరుకున్న మసాలా పేస్టు, ఉప్పువేసి కలపాలి. ఒక పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక మిగతా కరివేపాకు వేసి వేయించి అందులో పప్పు మిశ్రమాన్ని కలిపితే చిక్కుడుకాయ పప్పు రెడీ. అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా బావుంటుంది. -
అరటికాయతో కారం పొడి.. అన్నంలోకి సూపర్ ఉంటుంది
అరటికాయ కారం పొడి తయారీకి కావలసినవి: అరటికాయలు – మూడు; పసుపు – 1/2 టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; పచ్చిశనగ పప్పు – టీస్పూను; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండుమిర్చి – ఐదు; మిరియాలు – టీస్పూను; ఎండు కొబ్బరి తురుము – నాలుగు టీస్పూన్లు; కరివేపాకు – ఐదు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఆవాలు – అరటీస్పూను. తయారీ విధానమిలా: స్టవ్ వెలిగించి మీడియం మంట మీద అరటికాయలను కాల్చాలి. చక్కగా కాలాక మంట మీద నుంచి తీసి చల్లారాక తొక్కతీసేసి, సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిపెట్టి టీస్పూను మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి తురుము, మూడు రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేగాక, చల్లారనిచ్చి పొడిచేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనె వేయాలి. ∙వేడెక్కిన తరువాత మిగిలిన మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. చిటపటలాడాక అరటికాయ తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలిపి మూతపెట్టి, సన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనిస్తే అరటికాయ పొడి రెడీ. -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్‌ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్‌తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్‌లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్‌కి అప్పగించేయండి! -
ఒడిశా పాపులర్ డిష్:హబీషా దాల్మా..సింపుల్‌గా, టేస్టీగా
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి: పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు; టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు; ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి. ► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి. -
వ్యర్థాల నుంచి రుచికరమైన వంటలు తయారు చేస్తున్న పాపులర్ చెఫ్
వంట అందరూ చేస్తారు కానీ, ఎక్కువమంది తినేట్టు, నచ్చేటట్లు చేసిన వారు మాత్రమే చెఫ్‌గా మారతారు. మరింత రుచికరంగా... ఘుమఘుమలాడేలా వినూత్నంగా ఆహారాన్ని తయారు చేసిన వారు పాపులర్ చెఫ్‌గా పేరు తెచ్చుకుంటారు. ఇలా పాపులర్ అయిన అతికొద్దిమంది చెఫ్‌లలో ఒకరే దవీందర్ కుమార్. ప్రొఫెషనల్ చెఫ్‌గా యాభై ఏళ్లు పూర్తి చేసుకుని వేస్ట్ టు ప్లేట్’ ఐడియాతో ఇండియాలోనే గాక ప్రపంచంలోని చెఫ్‌లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెఫ్ డీకేగా పేరొందిన దవీందర్ కుమార్ ఢిల్లీ యూనివర్శిటీలో కామర్స్ డిగ్రీ పూర్తయ్యాక ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలనుకున్నారు. అప్పట్లో పెద్దగా ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో లేవు. తన స్నేహితుడు ఒబెరాయ్ హోటల్లో పనిచేస్తుండడంతో తను కూడా హోటల్లో చేరాలనుకున్నాడు. ఇంట్లో ఎవరికీ ఇష్టలేకపోయినప్పటికీ ‘ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్’లో చేరాడు. మూడేళ్ల కిచెన్ మేనేజ్మెంట్ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత.. ఒబెరాయ్ హోటల్లో పర్మనెంట్ ఉద్యోగి అయ్యాడు. దీంతో దవీందర్ చెఫ్ ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ భాషపై ఉన్న ఆసక్తితో ఫ్రెంచ్ వంటకాలను సైతం నేర్చుకునేవాడు. ఆసక్తి మరింత ఎక్కువ కావడంతో పారిస్‌లోని టెక్నిక్ డీ హోటలియర్లో రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. తనకిష్టమైన వంటలన్నీ నేర్చుకుంటూ, మరోపక్క చెఫ్‌గా రాణిస్తూ ఒబెరాయ్ గ్రూప్‌లో 12 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తరువాత 1985లో ‘లీ మెరిడియన్’లో టీమ్ సభ్యుడిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెరిడియన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్గానేగాక, ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్ కలినరీ ఫోరమ్‌కు (ఐసీఎఫ్)కు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొక్కలతో... చెఫ్‌గా ఎంతో అనుభవం ఉన్న దవీందర్ కుమార్ ఒకరోజు టీవీలో వరల్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న ఆహారంలో మూడు వంతులు తినకముందే వ్యర్థంగా పోతుంది. ఒక్కో హోటల్లో పండ్లు, కూరగాయల నుంచి తయారు చేసే వంటకాల్లో కనీసం ఐదు నుంచి పది శాతం వ్యర్థంగా పోతుంది’’ అని చెప్పారు. ఇది చూసిన దవీందర్‌కు వ్యర్థాల నుంచి కూడా ఆహారం తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. అదే వేస్ట్ టు ప్లేట్. అనుకున్న వెంటనే పన్నెండు రెస్టారెంట్లు, ఐదు ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి పండ్లు, కూరగాయ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు. అలా సేకరించిన వాటిని శుభ్రం చేసి రంగు, రుచికి తగ్గట్టుగా వేరు చేసి, పోషకాలతో కూడిన డిష్‌లను తయారు చేసి కస్టమర్లకు వేడి వేడిగా వడ్డించారు వీటిని తిన్నవారు ఇష్టపడడంతో వేస్ట్ టు ప్లేట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఫుడ్ వ్యర్థాల్లో కూరగాయ, పండ్లతొక్కలు, కొమ్మలు, కాడలు, విత్తనాలు కూడా ఉన్నాయి. స్పెషల్ మెనూ.. వ్యర్థాల నుంచి తయారు చేసే రుచికరమైన వంటలతో ఏకంగా స్పెషల్ మెనూని అందిస్తున్నాడు చెఫ్ డీకే. ఈ మెనూలో పనసపండు విత్తనాలు, బాదం హల్వా, సెలేరి, పాలకూర సలాడ్, యాపిల్ పల్ప్ పై, బ్రాకలీ, పుదీనా కాడల ముక్కల చట్నీ, జ్యూస్ తీయగా మిగిలిపోయిన బీట్రూట్తో రసం, క్యారట్ తొక్కల సలాడ్వంటివి ఉన్నాయి. ఈ డిష్‌లు రుచిగా, శుచిగానేగాక పుష్కలంగా పోషకాలు ఉండేలా వడ్డించడం విశేషం. View this post on Instagram A post shared by Chef Davinder Kumar (@chefdavinderkumar) కుక్ బుక్స్.. కొత్త వంటలని కనిపెట్టడమేగాక తను చేసే వంటలతో చాలా కుక్బుక్స్ను రాశాడు చెఫ్ డీకే. ఈ బుక్స్‌లో ‘కబాబ్ చట్నీ అండ్ బ్రెడ్’, జస్ట్ కబాబ్: ఫర్365 కబాబ్స్ అండ్ లీప్ ఇయర్’, సూప్స్, ఫోర్ సీజన్స్, సీజనల్ సలాడ్, సెకండ్ మీల్స్ వంటివి ఉన్నాయి. పుస్తకాల్లో కొన్నింటికి గౌరవ సత్కారాలు కూడా అందుకున్నారు. లీ మెరిడియన్ పదో వార్షికోత్సవం సందర్భంగా 7500 కేజీల కేక్‌ను తయారు చేసి లిమ్కాబుక్ రికార్డుల్లో నిలిచారు. అంతర్జాతీయ మెడల్స్‌తో పాటు, గోల్డెన్ హ్యాట్ చెఫ్ అవార్డు, భారత పర్యాటక మంత్రిత్వ శాఖతో బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా అవార్డు, జాతీయ టూరిజం అవార్డులను అందుకున్నారు. View this post on Instagram A post shared by Trends9 (@trends9official) -
స్వీట్ పొటాటోతో బిస్కెట్స్.. మీరెప్పుడైనా ట్రై చేశారా?
స్వీట్ పొటాటో బిస్కెట్స్ తయారీకి కావల్సినవి: చిలగడ దుంపలు – పావు కేజీ; పాలు – ముప్పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; కార్న్ స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; వంటసోడా – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటింబావు టీస్పూన్లు; బటర్ – అరకప్పు. తయారీ విధానమిలా: ►చిలగడ దుంపలను ఉడికించి తొక్కతీసి చిదిమి, అందులో పాలుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్‌లో కార్న్ స్టార్చ్, పంచదార, మైదా, వంటసోడా వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. ► ఇప్పుడు బటర్, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో చిలగడ దుంప చిదుము వేసి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పెట్టి ముప్పావు అంగుళం మందంలో ఉండేలాగా, సమంగా ఒకటే మందంలో ఉండేటట్లు సర్దాలి. ► ఇప్పుడు చాకుతో ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి. పిండి చేతులకు అతుక్కుంటూ ఉంటే పొడి పిండి (మైదా) చల్లుకోవాలి. ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 360 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారితే స్వీట్ పొటాటో బిస్కెట్స్ రెడీ ∙గాలి చొరబడని డబ్బాలో నిల్వచేస్తే మూడు నెలలు పాడవకుండా ఉంటాయి. -
కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు
కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. తినాయ్(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి: కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. తయారీ విధానమిలా: ►కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు దోరగా వేయించాలి. ► కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి. ►బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్‌లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. -
ఆరేంజ్ జ్యూస్‌తో హల్వా.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఆరెంజ్ హల్వా తయారీకి కావల్సినవి: ఆరెంజ్ – 3 (జ్యూస్ తీసుకుని, వడ కట్టుకోవాలి) మొక్కజొన్న పిండి – అర కప్పు పంచదార – 1 కప్పు (నీళ్లు పోసుకుని లేతగా పాకం పట్టుకోవాలి) దాల్చినచెక్క పొడి – చిటికెడు ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ నట్స్ తరుగు – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో నిమ్మరసం, దాల్చినచెక్క వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఆరెంజ్ మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని వేసుకుని, నట్స్ తరుగు జల్లుకుని చల్లారనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. -
క్రిస్పీ చికెన్ నూడుల్స్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది
నూడుల్ చికెన్ తయారీకి కావల్సినవి: బోన్ లెస్ చికెన్ – అర కిలో (సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి) నూడుల్స్ – 2 కప్పులు (ఉడికించి, కాస్త చల్లార్చినవి) గుడ్డు – 1,చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ – పావు కప్పు+1 టేబుల్ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా – అర టేబుల్ స్పూన్ చొప్పున టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా చికెన్ ముక్కల్లో చిల్లీ సాస్, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, కారం, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, గుడ్డు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికించిన నూడుల్స్‌లో కార్న్ పౌడర్ వేసుకుని అటూ ఇటూ గరిటెతో కలిపి.. ఒక ప్లేట్లో కొన్ని నూడుల్స్ పరచుకుని.. ఒక్కో చికెన్ ముక్కను అందులో పెట్టి చుట్టుకోవాలి. పుల్ల గుచ్చి.. ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకుని, దోరగా వేయించుకోవాలి. -
పిల్లలకు ఇష్టమైన బనానా మోదక్.. ఇలా ట్రై చేయండి
బనానా మోదక్ తయారికి కావలసినవి: గోధుమ పిండి – కప్పు; అరటిపండ్లు – రెండు; బెల్లం – మువు కప్పు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను; అటుకులు – రెండు టేబుల్ స్పూన్లు; సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీస్పూను; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి తురుము, అటుకులు, సూజీరవ్వను మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టులా గ్రైండ్ చేయాలి ∙ఈ పేస్టుని పెద్దగిన్నెలో వేసి... గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి అన్ని కలిసిపోయేలా చక్కగా కలపాలి ∙ఇప్పుడు ఈ పిండిని మోదక్‌లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని మరుగుతోన్న నూనెలో వేసి డీప్ ఫ్రైచేయాలి ∙మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రె చేస్తే బనానా మోదక్ రెడీ. -
పాలపొడితో దీపావళి కోసం స్పెషల్ స్వీట్.. చేసుకోండిలా
షీర్ పీరా తయారికి కావల్సినవి: పంచదార – కప్పు; పాల పొడి – రెండు కప్పులు; బాదం పలుకులు – టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను; పిస్తా పలుకులు – టేబుల్ స్పూను; కిస్మిస్ – టేబుల్ స్పూను; యాలకులు – నాలుగు; నెయ్యి – టేబుల్ స్పూను; గార్నిష్ కోసం.... పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను (పెద్దసైజువి). తయారీ విధానమిలా: డ్రైఫ్రూట్స్ పలుకులు సన్నగా పొడవుగా ఉండేలా తీసుకోవాలి. మందపాటి బాణలిలో పంచదార, కప్పు నీళ్లుపోసి మంటమీద పెట్టాలి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.తీగపాకం వచ్చినప్పుడు సన్నమంటమీద ఉంచాలి ∙ఇప్పుడు పాల పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.పాలపొడి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ∙ దగ్గర పడుతున్నప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, కిస్మిస్ ముక్కలను వేసి కలపాలి ∙చివరిగా యాలకులను పొడిచేసి వేయాలి ∙ప్లేటుకును నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి ∙ప్లేటంతా సమంగా పరుచుకుని పైన కొద్దిగా పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు చల్లాలి ∙స్పూను పెట్టి పైన కూడా సమంగా వత్తుకుని ప్లేటుని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙రెండు గంటల తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్‌చేసి సర్వ్ చేసుకోవాలి. -
సాయంత్రం టీలోకి బెస్ట్ ఆప్షన్.. మక్ పారా ఫ్లవర్స్
మక్ పారా ఫ్లవర్స్ తయారికి కావల్సినవి: మైదా– 2 కప్పులు, పంచదార పొడి– అర కప్పు, మిరియాల పొడి– అర టీస్పూన్, ఉప్పు– కొద్దిగా నూనె– 3 టేబుల్ స్పూన్లు,చిక్కటి పాలు– సరిపడా (కాచి చల్లారిన వి) నూనె– డీప్ ఫైకి సరిపడా, లవంగమొగ్గలు– కొన్ని(అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, మిరియాలపొడి, పంచదార పొడి, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దల్లా చేసుకుని.. 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం నచిన విధంగా ఫ్లవర్‌లా చేసుకోవచు. లేదా అభిరుచిని బట్టి ఒక ఫ్లవర్‌పై మరో ఫ్లవర్ ఉంచి, మధ్యలో ఒక్కో లవంగమొగ్గ గుచ్చి, కదలకుండా పెట్టుకోవచ్చు. అనంతరం వాటిని నూనెలో డీప్ ఫై చేసుకుంటే సరిపోతుంది. -
స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపి.. పోహా వెజ్ కట్లెట్
పోహా వెజ్ కట్లెట్ తయారికి కావల్సినవి: అటుకులు – కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; క్యాప్సికం తరుగు – రెండు టీస్పూన్లు; క్యారట్ తురుము – రెండు టీస్పూన్లు; పచ్చిబఠాణి – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టీస్పూను; చాట్ మసాలా – టీస్పూను; కారం – టీస్పూను; పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను; కార్న్‌ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ ముక్కల పొడి – కప్పు; ఉప్పు – రుచికి సరిపడా;నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: ►అటుకులను శుభ్రంగా కడిగి పదినిమిషాలు నానబెట్టుకోవాలి ∙పదినిమిషాల తరువాత నానిన అటుకుల్లో తొక్కతీసిన దుంపలు, బఠాణి, క్యాప్సికం, క్యారట్, కొత్తిమీర తరుగు వేయాలి ∙ ► పచ్చిమిర్చి పేస్టు, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి ముద్దలా కలపాలి ∙పిండిని ఉండలుగా చేసి, కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ∙కార్న్‌ఫ్లోర్‌లో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ► ఒక్కో కట్లెట్ను కార్న్‌ఫ్లోర్ పేస్టులో ముంచి, తరువాత బ్రెడ్ ముక్కల పొడిని అద్దాలి ∙బ్రెడ్ ముక్కల పొడి అద్దిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి ∙గోల్డెన్ కలర్లోకి మారాక తీసి సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్‌గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
కోకోనట్ మిల్క్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ మిల్క్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – అర లీటరు, పాలు – పావు లీటరు, పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్ పిస్తా, బాదం తురుము – గుప్పెడు(అభిరుచిని బట్టి మరిన్ని, నేతిలో వేయించుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత కాసేపటికి నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి.. మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో కొబ్బరిపాలు, పంచదార కలపాలి. కోవాలా అయ్యే వరకు మరిగించాలి. దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ మిశ్రమం మొత్తం వేసుకుని.. బాదం పిస్తా పలుకులు చల్లాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. లేదంటే నచ్చిన విధంగా క్రీమ్స్‌తో గార్నిష్ చేసుకుని బర్త్‌డే కేక్‌లా తయారుచేసుకోవచ్చు. -
పాలక్ మేథీ పూరీ..ఇలా చేస్తే లొట్టలేసుకొని తింటారు
పాలక్ మేథీ పూరీ తయారీకి కావల్సినవి: జీలకర్ర – టేబుల్ స్పూను; సోంపు – టేబుల్ స్పూను; వాము – టీస్పూను; నువ్వులు – టేబుల్ స్పూను; ధనియాల పొడి – టేబుల్ స్పూను; రెండు కప్పులు; శనగపిండి – పావు కప్పు; పసుపు – అరటేబుల్ స్పూను; ఉప్పు – రుచికి సరిపడా; కారం – టేబుల్ స్పూను; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి – మూడు; అల్లం తరుగు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలకూర తరుగు – రెండు కప్పులు; మెంతికూర తరుగు – కప్పు; గోధుమ పిండి –రెండు కప్పులు తయారీ విధానం: జీలకర్ర, సోంపు, నువ్వులు, వాము, ధనియాల పొడి, పచ్చిమిర్చి; అల్లం తరుగు, కరివేపాకుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలకూర, మెంతికూర తరుగుని గిన్నెలో వేయాలి. దీనిలోనే గోధుమపిండి, శనగపిండి, కారం, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేడినీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలపాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా మందంగా వత్తుకోవాలి ∙గుండ్రని గిన్నె లేదా చిన్న గ్లాసుతో పూరీని చిన్న చిన్న చెక్కల్లా కట్ చేయాలి ∙అన్నీ రెడీ అయ్యాక క్రిస్పీగా మారేంత వరకు డీప్ ఫ్రై చేస్తే రుచికరమైన పాలక్ మేథీ పూరీ రెడీ. -
కర్ణాటక పాపులర్ స్వీట్ రెసిపి మండిగె.. టేస్ట్ అదిరిపోతుంది
మండిగే తయారీకి కావల్సినవి: బొంబాయి రవ్వ – రెండు కప్పులు; గోధుమ పిండి – కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు – అరకప్పు; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ విధానం ఇలా: పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూను నెయ్యివేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. దీనిపైన మూతపెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి. బెల్లంలో మిగిలిన నెయ్యి, పచ్చకర్పూరం వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి ∙20 నిమిషాల తరువాత పిండిముద్దను ఉండలుగా చుట్టి, చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని,పైన రెండు టీస్పూన్ల బెల్లం మిశ్రమం వేసి చపాతీ అంతా పరచాలి. బెల్లం పరిచిన చపాతీపై మరో చపాతీని వేసి చ΄ాతీకర్రతో ఒకసారి వత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద వేసి రెండు వైపులా క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. ఇలా కాలిన మండిగేను రెండు మూడు మడతలు వేసి సర్వ్ చేసుకోవాలి. -
పిల్లల కోసం రుచికరమైన సమోసా.. చేప తో
కావలసినవి: చేప సొన – పావు కిలో (జాగ్రత్తగా ఉండికించి, చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి) కారం – 2 టీ స్పూన్లు గరం మసాలా – 1 టీ స్పూన్ కార్న్ – అర కప్పు (ఉడికించినవి) పసుపు – అర టీ స్పూన్ సోంపు పౌడర్ –1 టీ స్పూన్ ఉప్పు – తగినంత మిరియాల పొడి – అర టీ çస్పూన్ ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి) గుడ్డు – 1 గోధుమపిండి – కప్పు మైదాపిండి – 2 కప్పులు ధనియాల పొడి – 2 టీ స్పూన్లు నీళ్లు – సరిపడా కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సోంపు పౌడర్, మిరియాల పొడి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి మొత్తం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని ఉడికించి.. చివరిలో చేప సొన జోడించి.. గరిటెతో బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో.. గోధుమపిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని.. మెత్తగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండి మిశ్రమంతో చిన్నచిన్న చపాతీలు ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకుని పెట్టుకున్న కార్న్ కొద్దిగా, చేప సొన మిశ్రమం కొద్దిగా నింపుకుని.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. (చదవండి: ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..) -
బెంగాల్ పాపులర్ స్వీట్ లవంగ్ లతిక ఎప్పుడైనా ట్రై చేశారా?
లవంగ్ లతిక తయారీకి కావల్సినవి: మైదా – ముప్పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; పంచదార – కప్పు; లవంగాలు – పన్నెండు; నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా. స్టఫింగ్ కోసం: కోవా తురుము – ముప్పావు కప్పు; బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – అరకప్పు; వేడిపాలు – అరటీస్పూను; కుంకుమ పువ్వు రేకులు – పావు టీస్పూను; పంచదార పొడి – పావు టీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానమిలా: మైదాలో టేబుల్ స్పూను నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ∙పంచదారలో ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి మీడియం మంట మీద తిప్పుతూ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ∙స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి.నానిన పిండిముద్దను ఉండలుగా చుట్టుకోవాలి. ఈ ఉండలను పూరీల్లా వత్తుకుని మధ్యలో రెండు రెండు టీస్పూన్ల స్టఫింగ్‌ను వేయాలి ∙ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా రెండు పక్కలా పూరీని మూయాలి పూరీని తిరగేసి తెరచి ఉన్న మరోవైపుని కొద్దిగా తడిచేసి మూసివేయాలి. మడత ఊడి΄ోకుండా లవంగం గుచ్చాలి ఇలా అన్ని లతికలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు సలల కాగుతోన్న నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి ∙చక్కగా వేగిన లతికలను టిష్యూపేపర్ మీద వేసుకోవాలి వీటిని తినాలనుకున్నప్పుడు పంచదార సిరప్‌ను వేడిచేసి దానిలో లతికలను వేసి పదిహేను నిమిషాలు ఉంచి, ఆ తరువాత సర్వ్ చేయాలి. -
మిల్లెట్స్‌తో హెల్దీగా కుకీస్.. పిల్లలు ఇష్టంగా తింటారు
ఊదల కుకీస్ తయారీకి కావల్సినవి: మైదా – 1 కప్పు, ఊదల పిండి – ఒకటిన్నర కప్పులు, బాదం పప్పు పొడి – ముప్పావు కప్పు సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ – 100 గ్రా. చొప్పున చిక్కటి పాలు – కొద్దిగా, చాక్లెట్ క్రీమ్ – 1 కప్పు (చిప్స్ లేదా బిట్స్‌ని ఓవెన్లో కరిగించి పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: మొదట పెద్ద బౌల్ తీసుకుని పటికబెల్లం పొడిని జల్లెడ పట్టుకోవాలి. అందులో సాల్టెడ్ బటర్, పీనట్ బటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఊదల పిండి, బాదం పప్పు పొడి వేసుకుని చేత్తో ముద్దలా కలపాలి. అవసరాన్ని బట్టి.. సరిపడా గోరు వెచ్చని పాలు పోసి కలుపుకోవచ్చు. దీన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత చేత్తో బిస్కట్స్లా ఒత్తుకుని, ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 170 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 లేదా 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అనంతరం... కరిగిన చాక్లెట్ క్రీమ్‌లో ముంచి తీసి, పైన చాక్లెట్ కోన్ సాయంతో నచ్చిన షేప్‌లో డిజైన్స్ వేసుకుని.. కాసేపు ఆరనిచ్చి సర్వ్ చేసుకోవాలి. -
సగ్గుబియ్యం టిక్కీ.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
సగ్గుబియ్యం టిక్కీ తయారీకి కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు; వేయించిన పల్లీలు – కప్పు; బంగాళ దుంపలు – రెండు; అల్లం – రెండు అంగుళాల ముక్క; పచ్చిమిర్చి – రెండు; జీలకర్ర – టీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మకాయ – అరచెక్క; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: సగ్గుబియ్యాన్ని దోరగా వేయించి, చల్లారాక పొడిచేసి పెట్టుకోవాలి ∙పల్లీలను బరకగా గ్రైండ్ చేసి సగ్గుబియ్యం పొడిలో కలపాలి. బంగాళ దుంపలను తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా తరగాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి గ్రైండ్ చేయాలి. నలిగిన మిశ్రమాన్నీ, సగ్గుబియ్యం పొడిలో వేసి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మచెక్కను పిండి రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత పిండిని టిక్కీల ఆకారంలో వత్తుకుని డీప్‌ఫ్రై చేస్తే సగ్గుబియ్యం టిక్కీలు రెడీ ∙కొత్తిమీర చట్నీతో ఈ టిక్కీలు చాలా రుచిగా ఉంటాయి. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
చపాతీతో క్రిస్పీ రోల్స్.. వెరైటీగా చేసుకోండిలా
క్రిస్పీ రోల్స్ తయారీకి కావల్సినవి: చపాతీలు – మూడు ; కొత్తిమీర తరుగు – అరకప్పు ; ఉడికించిన బంగాళ దుంపలు – రెండు; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – రెండు టీస్పూన్లు ; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – ఒకటి; చాట్ మసాలా – ఒకటిన్నర టీస్పూన్లు; గోధుమ పిండి –అర కప్పు; బియ్యప్పిండి – స్పూను; కార్న్‌ఫ్లోర్ – మూడు టీ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►చపాతీలను సన్నగా పొడవుగా తరిగి, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమంపై కొద్దిగా నీళ్లుచల్లి మరోసారి కలపాలి ∙ఇప్పుడు మెత్తగా మారిన చపాతీ మిశ్రమంలో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరగాలి. ► బంగాళదుంపలు తొక్కతీసి చిదుముకోవాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా; పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఛాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ► ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని దుంప మిశ్రమాన్ని రోల్స్‌గా చుట్టుకోవాలి గోధుమపిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలపాలి ∙ఇప్పుడు దుంపరోల్స్ను గోధుమపిండిలో ముంచి, తరువాత చపాతీ మిశ్రమాన్ని రోల్‌కు అద్దాలి. ► ఇప్పుడు రోల్‌ను మరుగుతోన్న నూనెలో వేసి, గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీయాలి ∙ఇలా రోల్స్ అన్నింటిని వేయిస్తే క్రిస్పీ రోల్స్ రెడీ. -
బనానా – ఓట్స్‌తో వెరైటీగా కజ్జికాయలు.. ఓసారి ట్రై చేయండి
బనానా – ఓట్స్ కజ్జికాయలు తయారీకి కావల్సినవి: అరటిపండు గుజ్జు – 1 కప్పు ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – పావు కప్పు పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు సోయా పాలు – పావు కప్పు నూనె – 4 టేబుల్ స్పూన్లు మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించి.. అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. -
మటన్ కీమాతో పాలక్ సమోసా.. భలే రుచిగా ఉంటాయి
కీమా పాలక్ సమోసా తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు వేసి, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, పాలకూర గుజ్జు– ఒకటిన్నర కప్పులు (చపాతి ముద్ద కోసం), ఫుడ్ కలర్ – ఆకుపచ్చ రంగు (అభిరుచిని బట్టి పాలకూరలో కలిపి పెట్టుకోవాలి), ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారెట్ తురుము, మిరియాల పొడి, కీమా, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసుకుని.. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... భలే రుచిగా ఉంటాయి. -
క్యారట్‌తో వెరైటీగా పరియాళ్ చేసుకోండిలా
క్యారట్ పరియాళ్ తయారీకి కావల్సినవి: క్యారట్ ముక్కలు – కప్పున్నర; నూనె – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – పావు టీస్పూను; జీలకర్ర – పావు టీస్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి చీలికలు – మూడు; ఉప్పు – అరటీస్పూను; పసుపు – అర టీస్పూను; ఇంగువ – చిటికడు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు. తయారీ విధానమిలా: ∙క్యారట్ ముక్కలను మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ∙మందపాటి బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి ∙వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చివేసి చిటపటలాడనివ్వాలి ∙ఇవి వేగాక కరివేపాకు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి తిప్పాలి ∙ఐదునిమిషాలు మగ్గాక పసుపు, ఇంగువ వేసి కలపాలి ∙ఇప్పుడు ఉడికించిన క్యారట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి తురుము వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి ∙నూనె పైకి తేలిన తరువాత దించేసి సర్వ్‌చేసుకోవాలి. -
పాన్ కేక్స్ నుంచి చికెన్ వరకు.. నిమిషాల్లో కుక్ అవుతాయ్
సౌకర్యవంతమైన మల్టీ కుక్వేర్ల సరసన చేరింది ఈ హార్డ్–బాయిల్డ్ స్టీమర్. ఇందులో వండివార్చుకోవడం భలే తేలిక. ఈ మెషిన్ లో గుడ్లు, జొన్నకండెలు, దుంపలు, కుడుములు వంటివన్నీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివీ వేసుకోవచ్చు. అలాగే చికెన్ వింగ్స్, చిల్లీ చికెన్, గ్రిల్డ్ ఫిష్, క్రిస్పీ ప్రాన్స్ ఇలా చాలానే చేసుకోవచ్చు. కేక్స్, కట్లెట్స్ వంటివాటికీ పర్ఫెక్ట్ ఈ కుక్వేర్. దీని అడుగున, స్టీమింగ్ బౌల్‌లోనూ వాటర్ పోసుకుని.. ఎగ్ ట్రే మీద ఆహారాన్ని లేదా గుడ్లను పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్ని.. అడుగున నీళ్లు పోసుకుంటే స్టీమర్‌గా వాడుకోవచ్చు. నూనె వేసుకుంటే గ్రిల్‌గానూ మార్చుకోవచ్చు. వేగంగా, మంచిగా కుక్ అవ్వడానికి వీలుగా పెద్ద బౌల్ లాంటి మూత ఉంటుంది. దాంతో హోల్ చికెన్ వంటివీ కుక్ అవుతాయి. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. -
దానిమ్మతో కేక్ టేస్ట్ అదిరిపోతుంది.. వీకెండ్లో ట్రై చేయండి
దానిమ్మ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు దానిమ్మ గింజలు – అర కప్పు పైనే కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు అరటి పండు గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు పాలు – పావు లీటర్ పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో పాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటి పండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాతరంగా ఒత్తుకుని.. గట్టిపడనివ్వాలి. వాటిపై దాల్చిన చెక్క పొడి, దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. -
గోంగూరతో మిర్చి.. బజ్జీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
గోంగూర బజ్జీ కావలసినవి: తాజా గోంగూర – కప్పు; సెనగపిండి – కప్పు; బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు; కారం – టీస్పూను; పసుపు –పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – పావు కేజీ. తయారీ విధానమిలా: ∙గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙సెనగపిండిలో బియ్యప్పిండి, ఇంగువ, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. చివరిగా టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి ∙ఇప్పుడు గోంగూర ఆకులను ఈ పిండిలో ముంచి మరుగుతోన్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి ∙నూనె ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే బజ్జీలను టిష్యూ పేపర్ మీద వేసి, నూనెను పేపర్ పీల్చుకున్న తరువాత సర్వ్ చేసుకోవాలి. -
కోకోనట్ చికెన్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది
కోకోనట్ చికెన్ తయారీకి కావల్సినవి: చికెన్ – అర కిలో మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి కోరు – అర కప్పు నూనె – సరిపడా, ఉప్పు – తగినంత మిరియాల పొడి – కొద్దిగా కారం – 1 టీ స్పూన్ గుడ్లు – 3 తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు కొట్టి, 2 టీ స్పూన్ల కొబ్బరి పాలు పోసుకుని, బాగా గిలగ్గొట్టి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లోకి కొబ్బరి కోరు తీసుకోవాలి. ముందుగా ఒక్కో చికెన్ ముక్కను మొక్కజొన్న పిండిలో వేసి బాగా పట్టించాలి. తర్వాత దాన్ని గుడ్డు మిశ్రమంలో ముంచి వెంటనే కొబ్బరి కోరు పట్టించాలి. అనంతరం వాటిని నూనెలో దోరగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే.. ఈ కోకోనట్ చికెన్ ముక్కలు భలే రుచిగా ఉంటాయి. -
వీకెండ్ స్పెషల్: క్యారట్ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
క్యారట్ చట్నీ తయారీకి కావల్సినవి: నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత; క్యారట్ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; మినపప్పు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను; ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ. తయారీ విధానమిలా: ∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్. -
క్యారట్‌తో మూంగ్‌దాల్ సలాడ్, ఓసారి ట్రై చేయండి
పచ్చిగా, కచ్చాపచ్చాగా, ఉడికించి... ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారట్.aఅందుకే కరకరల క్యారట్‌ను మరింత రుచిగా ఇలా కూడా వండుకోవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... క్యారట్ మూంగ్‌దాల్ సలాడ్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; పెసరపప్పు –పావు కప్పు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు; నిమ్మరసం – రెండు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను. తయారీ విధానమిలా: పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.నానిన పప్పులో నీళ్లు వంపేసి పప్పుని పెద్ద గిన్నెలో వేయాలి ∙ఈ పప్పులో క్యారట్ తురుము, కొబ్బరి, పచ్చిమిర్చి తురుము, నిమ్మరసం, ఉప్పువేసి చక్కగా కల΄ాలి ∙చివరిగా కొత్తిమీర తరుగుతో వేసి సర్వ్‌చేసుకోవాలి. -
అలోవెరాతో ఐస్‌క్రీమ్.. ఎప్పుడైనా తిన్నారా?
అలోవెరా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి) పుదీనా ఆకులు – 8 మిల్క్‌మెయిడ్ – అర కప్పు, మ్యాపుల్ సిరప్ – 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు (ఇవి మార్కెట్లో దొరుకుతాయి), ఫుడ్ కలర్ – గ్రీన్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్ క్రీమ్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్‌మెయిడ్, మ్యాపుల్ సిరప్, కొద్దిగా ఫుడ్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. -
సాయంత్రం స్నాక్స్ కోసం బ్రకోలితో మఫిన్స్ ట్రై చేయండి
బ్రకోలి మఫిన్స్ తయారీకి కావల్సినవి: బ్రకోలి తరుగు – కప్పు; ఎర్రక్యాప్సికం – ఒకటి; క్యారట్ – ఒకటి; ఉల్లిపాయ – ఒకటి; గుడ్లు – ఎనిమిది; ఛీజ్ – ముప్పావు కప్పు; ఉప్పు – టీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; తయారీ విధానమిలా: క్యాప్సికం, ఉల్లిపాయ, క్యారట్‌ను సన్నగా తరగాలి ∙పెద్ద గిన్నెలో బ్రకోలి తరుగు, క్యారట్, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలను వేసి చక్కగా కలపాలి. ఈ ముక్కలను మఫిన్ ట్రేలో సమానంగా వేసుకోవాలి ∙ఇప్పుడు గుడ్లసొనను ఒకగిన్నెలో వేసి, ఉప్పు, మిరియాల పొడి పోసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి మఫిన్ ట్రేలో వేసిన బ్రకోలి మిశ్రమంపై గుడ్లసొనను పోసుకోవాలి ∙అన్నింటిలో పోశాక ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే బ్రకోలి మఫిన్స్ రెడీ. -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్‌గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్‌లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
పనస పండుతో పాఠోలి స్వీట్, టేస్ట్ అదిరిపోద్ది
పనస పాఠోలి తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; పనసపండు తురుము – ఒకటిన్నర కప్పులు (తొనలను సన్నగా తురమాలి); పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; అరటి ఆకులు – పాఠోలీకి సరిపడా. స్టఫింగ్ కోసం: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలుకలు పొడి – అరటీస్పూను. పనసపండుతో పాఠోలి.. తయారీ విధానమిలా: ►బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.మందపాటి బాణలిలో బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేసి మరిగించాలి. ► బెల్లం కరిగి నురగలాంటి బుడగలు వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి తురుము వేయాలి. పాకంలో గరిట పెట్టి కలియతిప్పుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ► నీరంతా ఇంకిపోయినప్పుడు అర టీస్పూను యాలకుల పొడి కలిపి చల్లారనివ్వాలి. ► ఇప్పుడు నానిన బియ్యంలో నీళ్లు తీసేసి బ్లెండర్లో వేయాలి ∙దీనిలోనే పనసపండు తురుము, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి ∙ఇప్పుడు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి. ► రుబ్బుకున్న బియ్యం పేస్టుని అరటి ఆకులపైన మందపాటి పొరలాగా వేసుకోవాలి. పొర మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి ► చల్లారిన బెల్లం కొబ్బరి తురుముని పొరపైన మధ్యలో వేయాలి ∙ఇప్పుడు అరటి ఆకుని నిలువుగా మడిచి ఆవిరి పాత్రలో పెట్టుకోవాలి ∙ఈ ఆకులను ముఫ్పై నిమిషాల పాటు ఆవిరిమీద ఉడికిస్తే పనస పాఠోలీ రెడీ. -
వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి
ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం.... సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు; పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి. ► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి. ► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్‌వాటర్ వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఇలా చేయండి
రైస్ పకోడా ఎలా చేయాలంటే.. కావల్సిన పదార్థాలు: అన్నం – 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి – పావు కప్పు చొప్పున కారం – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్ ధనియాల పొడి – 1 టీ స్పూన్ , కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అన్నం వేసుకుని.. మెత్తగా పప్పు రుబ్బు కర్రతో ఒత్తుకుకోవాలి. అనంతరం దానిలో శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు.. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం కాగే నూనెలో.. పకోడీల్లా దోరగా వేయించుకుని.. సర్వ్ చేసుకోవాలి. -
ఎక్కువ టైం లేదా? క్షణాల్లో గుడ్డుతో ఇలా వండేసుకోండి
ఎగ్ పనియారం తయారీకి కావల్సినవి: గుడ్లు – నాలుగు; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – ఒకటి; క్యాప్సికం – ఒకటి; క్యారట్ – ఒకటి; బంగాళ దుంప – ఒకటి; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – అరటీస్పూను; పసుపు – చిటికెడు; గరంమసాలా – పావుటీస్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; నూనె – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►క్యారట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ, బంగాళ దుంపలను సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ► బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగనివ్వాలి. బాగా వేడెక్కిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ► ఉల్లిపాయ వేగాక క్యారట్, బంగాళ దుంప ముక్కలు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గాలి. ► తరువాత క్యాప్సికం ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి ∙ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుసు, గరంమసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ► ముక్కలన్నీ చక్కగా మగ్గాక కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలిపి దించేయాలి ∙ఒకగిన్నెలో గుడ్లసొన, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి ► ఇప్పుడు చల్లారిన ముక్కల మిశ్రమం గుడ్లసొనలో వేసి కలపాలి. ► పనియారం ప్లేటులో నూనెవేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టాలి. ► సన్నని మంటమీద మూడు నిమిషాలు కాల్చాలి. తరువాత రెండోవైపు తిప్పి నిమిషం పాటు కాల్చితే వేడివేడి ఎగ్ పనియారం రెడీ. -
వెరైటీగా గుడ్డుతో బాదం బర్ఫీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ బాదం బర్ఫీ తయారీకి కావల్సినవి: గుడ్లు – 7, పంచదార, కోవా – 250 గ్రాముల చొప్పున, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు , బటర్ – 4 టేబుల్ స్పూన్లు (కరిగించాలి), బాదం – 40 పైనే (మిక్సీలో పొడి చేసుకోవాలి), నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా గుడ్లను మిక్సీలో పగలగొట్టి వేసుకుని.. బాగా మిక్సీ పట్టుకోవాలి.అందులో పంచదార, కోవా, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, కరిగించిన బటర్, బాదం పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం బౌల్ తీసుకుని.. దాని అడుగున బాగా నెయ్యి రాసి.. గుడ్లు–పంచదార మిశ్రమం వేసుకుని.. ఓవెన్లో పెట్టుకోవాలి. సుమారు 170 డిగ్రీల సెల్సియస్‌లో 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని మీ అభిరుచిని బట్టి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
చికెన్ ఖీమా బుర్జి.. చపాతీలోకి చాలా బావుంటుంది
చికెన్ ఖీమా బుర్జి తయారికి కావల్సినవి: చికెన్ ఖీమా – పావుకేజీ; గుడ్లు – మూడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – రెండు; మిరియాలపొడి – టేబుల్ స్పూను; గరం మసాలా – టీస్పూను; పసుపు – అరటీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; ఆవాలు – టీస్పూను; మినప గుళ్లు – టీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినపగుళ్లువేసి వేయించాలి ∙ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ∙ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఖీమా, కొద్దిగా ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ∙ సగం ఉడికిన ఖీమాలో పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఖీమా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఖీమా ఉడికిన తరువాత గుడ్లసొనను వేసి రెండు నిమిషాలు పెద్ద మంట మీద తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. గుడ్ల సొన చక్కగా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అన్నం, చపాతీ,రోటీలకు ఇది మంచి సైడ్ డిష్. -
పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి
పొటాటో పాప్ కార్న్ తయారీకి కావల్సినవి: బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చాట్ మసాలా – పావు టీ స్పూన్, కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. -
రొయ్యలతో ఘీ ఇడ్లీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
రొయ్యలతో ఇడ్లీ కావలసినవి: రొయ్యలు – పావు కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, పసుపు దట్టించి ఉడికించుకోవాలి. చల్లారాక ముక్కలుగా చేసుకోవాలి) ఇడ్లీపిండి – 4 కప్పులు (ముందుగా సిద్ధం చేసుకోవాలి) బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున గరం మసాలా – 1 టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా రొయ్యల ముక్కల్ని నేతిలో వేయించాలి. అందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, గరం మసాలా వేసి.. దోరగా వేగాక.. తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ ప్లేట్ తీసుకుని.. ప్రతి గుంతలో మినప్పిండి మిశ్రమం కొద్దికొద్దిగా వేసుకుని.. ఆపై చిన్న గరిటెతో కొద్దిగా రొయ్యల మిశ్రమాన్ని పెట్టుకుని.. అది కనిపించకుండా మళ్లీ మినప్పిండితో కవర్ చేసుకుంటూ ఇడ్లీ గుంతలు నింపుకోవాలి. ఇంతలో మరో స్టవ్ మీద.. కళాయిలో నెయ్యి వేసుకుని.. ధనియాల పొడీ వేసి.. ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇడ్లీలు ఆవిరిపై ఉడికిన తర్వాత.. సర్వ్ చేసుకునే ముందు ప్లేట్లోకి తీసుకుని.. వాటిపై ధనియాల–నెయ్యి మిశ్రమాన్ని వేసుకుని.. కొత్తిమీర తురుము గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. -
"కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88..
"గోకులాష్టమి" లేదా "కృష్ణాష్టమి" ఈ నెల సెప్టెంబర్ 7న పలెల్లోనూ, నగరాల్లోనూ కనుల పండుగగా జరిగింది. ఆయా ప్రాంతాల సంప్రదాయాన్ని అనుసరించి వేడుకగా చేసుకున్నారు ఈపండుగను. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. జ్ఞానానికి ప్రతీకగా, జీవుల కష్టాల నుంచి బయటపడేలా చేసే భగవద్గీత వంటి మహోన్నత గ్రంథాన్ని అందిచిని గురువుగా.. "కృష్ణం వందే జగద్గురుం" అని మారుమ్రోగిపోయేలా కృష్ణుడి పుట్టిన రోజుని వేడుకగా చేసుకున్నారు. చిన్ని కృష్ణా, వెన్నదొంగ, కన్నయ్య, రావయ్య మా ఇంటికి రమ్మంటూ రంగవల్లులతో కృష్ణుని పాదాలను వేసి మరీ ఆహ్వానిస్తూ బంధువార సపరిమేతంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. అలాగే కృష్ణుడు జన్మస్థలమైన గుజరాత్లో మరింత వీనుల విందుగా జరిగింది. తగ్గేదేలే అన్నట్లుగా భక్తులు ఈ పండుగను నూతనోత్సహంతో చేసుకోవడమే గాక తమ చిన్నారులను కన్నయ్యలుగా మార్చి సంబరపడ్డారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో తమదైన రీతిలో ఈ వేడుకను చేసుకుంటే..మంగళూరుకి చెందిన ఓ మహిళ అందరూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా పండుగను సెలబ్రేట్ చేసుకుంది. కృష్ణ భక్తి అంటే ఏంటో..దానికున్న శక్తి ఏంటో చాటి చెప్పింది. మంగళూరుకి చెందిన ఓ మహిళ కృష్ణుడు జన్మ తిథి అష్టమి కలిసి వచ్చేలా 88 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టి ఔరా! అనిపించింది. కృష్ణుడుపై ఉన్న అపారమైన భక్తి ఎంతటి సాహసానికైనా లేదా ఎంతటి అనితరసాధ్యమైన పనికి అయినా పురికొల్పి చేయగలిగే శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి ఆమె ఓ ఉదాహరణ. అందుకు సంబంధించని ఫోటోని ఓ కార్డియాలజిస్ట్ వైద్యుడు కామత్ నెట్టింట షేర్ చేశారు. ఆ మహిళ తన పేషెంట్ అని, ఆమెకు కృష్ణుడిపై ఉన్న భక్తి తేటతెల్లమయ్యేలా ఎంతలా శ్రమ ఓర్చి మరీ ఆ కన్నయ్యకు ఇలా విందు ఏర్పాటు చేసింది. కృష్ణునికి నివేధించే ఛపన్ భోగ్లో ఉండే వంటకాలకు మించి చేసిందని ప్రశంసించారు. ఆమెను చూసినా, ఆమె కృష్ణ భక్తిని చూసినా తనకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. ఆమె గతేడాది కృష్ణాష్టమి రోజున తాను చేసిన పిండి వంటల రికార్డును ఆమే బ్రేక్ చేసిందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు ఓ లుక్కేయండి. Proud of her and her devotion to lord Krishna. She is my patient. She has again broken her previous record. 88 dishes were prepared last night for Gokulashtami. #janamashtami pic.twitter.com/SDoh3JKTvM — Dr P Kamath (@cardio73) September 7, 2023 (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!) -
వీకెండ్ స్పెషల్: ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా, టేస్ట్ మామూలుగా ఉండదు
ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా తయారీకి కావల్సినవి: ఉడికించిన గుడ్లు – ఆరు; మటన్ ఖీమా – అరకేజీ; కారం – టీస్పూను; పసుపు – పావు టీస్పూను; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; మిరియాల పొడి – టీస్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చిమర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; బ్రెడ్ ముక్కల ΄÷డి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె –డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేయాలి. ► దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బ్రెడ్ ముక్కల పొడి, టేబుల్ స్పూను నూనె వేసి మెత్త్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక మాదిరి పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి. ► ఇప్పుడు ఉడికించిన గుడ్ల పెంకు తీసేయాలి ∙ఖీమా ఉండను తెరిచి గుడ్డును లోపలపెట్టి ఖీమా మిశ్రమంతో కోఫ్తాలా వత్తుకోవాలి. ► ఇలా ఆరు గుడ్లను కోఫ్తాలా తయారు చేసుకున్నాక, సన్నని మంటమీద డీప్ఫ్రైచేయాలి. ► కోఫ్తా బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించితే ఎగ్‌మటన్ నర్గీసి కోఫ్తా రెడీ . ► కోఫ్తాను మధ్యలో రెండు సగాలుగా కట్ చేసి నచ్చిన సాస్‌తో సర్వ్‌చేసుకోవాలి. -
బ్రేక్‌ఫాస్ట్‌లో సింపుల్‌గా అప్పం.. ఇలా చేసుకోండి
అప్పం తయారీకి కావలసినవి: పొట్టు తీసిన పెసరపప్పు – కప్పు ; మినపపప్పు – అరకప్పు ; సోంపు – అరటీస్పూను; అల్లం – అంగుళం ముక్క ; క్యారట్, బీట్ రూట్, ప్రెంచ్ బీన్స్, బేబీ కార్న్, పచ్చి బఠాణి – అన్నీ కలిపి కప్పు; ఉప్పు – రుచికి సరిపడా ; నూనె – వేయించడానికి తగినంత. తయారీ విధానమిలా.. ►పప్పులను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి . ►నానిన పప్పుల్లో అల్లం, సోంపు కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ►ఇప్పుడు రుబ్బిన పిండిలో కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►గుంత పునుగుల ప్లేట్లకి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్రమాన్ని అప్పల్లా వేయాలి కొద్దిగా నూనె వేసి రెండువైపులా చక్కగా కాల్చుకుంటే హెల్దీ అప్పం రెడీ. -
క్యారెట్–కోకోనట్ ఢోక్లా.. చేసుకోండి ఇలా
క్యారెట్–కోకోనట్ ఢోక్లా తయారీకి కావల్సినవి: క్యారెట్ తురుము – 1 కప్పు సగ్గుబియ్యం – పావు కప్పు (పిండిలా చేసుకోవాలి) బియ్యప్పిండి – పావు కప్పు, కొబ్బరి పాలు – అర కప్పు నీళ్లు – సరిపడా, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు – కొద్దికొద్దిగా (అన్నింటినీ ఒక టీ స్పూన్ నూనెలో పోపు పెట్టుకోవాలి) తయారీ విధానమిలా: ►ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో క్యారెట్ తురుము, బియ్యప్పిండి, సగ్గుబియ్యం పిండి, కొబ్బరి పాలు, చిటికెడు ఉప్పు వేసి సుమారు రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరోసారి బాగా కలిపి.. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అందులో నిమ్మరసం జోడించాలి. ► ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని, దానికి కొద్దిగా నూనె రాసి, దానిలో ఆ మిశ్రమాన్ని వేసుకుని చదునుగా చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి, పోపు పెట్టిన కరివేపాకు, ఆవాల మిశ్రమాన్ని వాటిపై వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అనంతరం కట్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి. -
ఇలాంటి స్వీట్ చేస్తే ఎవరైనా బీట్రూట్ని ఇష్టంగా తింటారు
బీట్రూట్ – మిల్క్ సందేశ్ తయారీకి కావల్సినవి: బీట్రూట్ – 2 (ముక్కలు కట్ చేసుకుని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) పాల పొడి – పావు కప్పు నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పంచదార పొడి – ముప్పావు కప్పు తయారీ విధానమిలా: ముందుగా స్టవ్ మంటను సిమ్‌లో పెట్టుకుని.. పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో బీట్రూట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో పాలపొడి, పంచదార పొడి వేసుకుని.. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు మూడు నిమిషాలకొకసారి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ దగ్గర పడేదాకా అలానే ఉండికించాలి. దగ్గర పడిన తర్వాత ఒక పాత్రకు నెయ్యి రాసి.. దానిలో వేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చిన్నచిన్న ఉండలుగా తీసుకుంటూ.. వాటిని నచ్చిన షేప్‌లోకి మలిచి సర్వ్ చేసుకోవాలి. -
మరమరాలకు ఫుల్ క్రేజ్.. కేరాఫ్ అడ్రస్‌గా మారిన కట్టంగూర్
టైంపాస్‌కు ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే గుర్తొచ్చేవి మరమరాలు. గుప్పెడు మరమరాలకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నూనె, కారం, వేయించిన పల్లీలు వేసి కలుపుకుని తింటే ఆ అనుభూతి చెప్పనలవి కాదు. ఇంటికొచ్చే అతిథులకు సైతం కరకరలాడే మరమరాలను స్నాక్స్‌గా అందించవచ్చు. ఇప్పుడు మరమరాలతో రకరకాల రెసిపీలు తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు.. పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలోనూ మరమరాలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు సైతం వీటిని నేరుగా తినొచ్చు. వీటి తయారీకి కేరాఫ్‌గా నిలుస్తోంది కట్టంగూర్. కట్టంగూర్‌లో 80 సంవత్సరాల క్రితం కుటీర పరిశ్రమగా మరమరాల తయారీ ప్రారంభమైంది. పద్మశాలీలు ప్రారంభించిన ఈ కుటీర పరిశ్రమను గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు చేపట్టారు. మొదట్లో సుమారు 50 కుటుంబాల వారు బట్టీల ద్వారా మరమరాలు తయారు చేసేవారు. 30 సంవత్సరాల నుంచి బట్టీల స్థానంలో మిషన్లు (రోస్టర్లు) వచ్చాయి. అయితే.. రానురాను ముడి సరుకుల ధరలు పెరగడం, పెద్దగా లాభాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు మరమరాల పరిశ్రమకు దూరమయ్యాయి. బట్టీల విధానం ఉన్నప్పుడు.. అంటే 1995 సంవత్సరం వరకు కట్టంగూర్‌లో సుమారు వంద బట్టీలు ఉండేవి. ఒక్కో ఇంట్లో రెండు బట్టీలను కూడా నడిపారు. అయితే, దుమ్ము, పొగ కారణంగా మరమరాల పరిశ్రమలు గ్రామానికి దూరంగా వచ్చాయి. ప్రస్తుతం పది మిల్లులు ఉన్నాయి. వీటిలో రోస్టర్, ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మిల్లుల్లో మరమరాలు తయారవుతున్నాయి. సిద్దిపేటలోనూ మనవారే.. కట్టంగూర్కు చెందిన వారే సిద్దిపేటలో మరమరాల పరిశ్రమను విస్తరించారు. ఆ జిల్లాలో మొక్కజొన్న పంట ఎక్కువగా ఉంటుంది. అక్కడ మక్కల అటుకులు, పోహ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. దానికి అనుబంధంగా 15 మరమరాల మిల్లులు కూడా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెటింగ్ కట్టంగూరులో తయారైన మరమరాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, మహారాష్ట్రలో మార్కెటింగ్ చేస్తున్నారు. కట్టంగూర్ నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకు సరఫరా ఉంటుంది. 50 శాతం తెలంగాణలో మార్కెటింగ్ జరిగితే.. మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి 50 శాతం విక్రయం ఉంటోంది. వివిధ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్‌లో విక్రయాలు జరుపుతుంటారు. మహారాష్ట్రలో దీపావళి పండుగ సమయంలో మరమరాల వినియోగం అధికంగా ఉంటుంది. అంతటా మరమరాల ధర సమానంగానే ఉంటున్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ చార్జీలతో కలిసి వాటి ధర నిర్ణయిస్తారు. దూర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నప్పుడు రవాణా చార్జీలు కూడా కలుపుతారు. మరమరాలను కర్నాటక రాష్ట్ర ప్రజలు ఉదయం అల్పాహారంలో ఎక్కువ తీసుకుంటారు. తెలంగాణలో చూస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరమరాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ జిల్లాలోని ప్రతి చిన్న గ్రామంలోనూ మరమరాలు దొరుకుతాయి. మరింత ప్రోత్సాహం అవసరం 1010 రకం ధాన్యం క్వింటా రూ.2500 ఉందని.. ధాన్యం ధర పెరగడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. రోస్టర్‌లో వాడుతున్న సముద్రపు ఇసుక టన్ను ధర రూ.2500 పలుకుతుంది. ఇసుకను మచిలీపట్నం నుంచి తెప్పించుకుంటున్నారు. క్వింటా మరమరాల ఉత్పత్తికి 10 కిలోల సముద్రపు ఇసుక అవసరం. ఒక క్వింటా మరమరాలు తయారయ్యే ప్రక్రియకు.. వేడి నీళ్ల కోసం మండించే కట్టె పొట్టు, ఇసుక, ఉప్పుకు కలిపి రూ.250 ఖర్చు వస్తుంది. దీనికి ధాన్యం ధర అదనం. ప్రభుత్వం సహకారం అందించాలి మరమరాల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కావాలి. ధాన్యం సంవత్సరంలో మూడు నెలలే ఉంటుంది. మా పరిశ్రమకు సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని ఒకేసారి కొనుగోలు చేయాలంటే ఎంతో ఆర్థిక భారం అవుతుంది. ఐకేపీ కేంద్రాల ద్వారా సబ్సిడీపై ధాన్యం సరఫరా చేయాలి. బ్యాంకుల ద్వారా ఓడీ సౌకర్యం కల్పించాలి. ఈ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది. మరి కొందరు మరమరాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారు. – గంజి వెంకన్న, మరమరాల మిల్లు యజమాని, కట్టంగూర్ ధాన్యం కేటాయించాలి ఐకేసీ ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయిస్తున్న విధంగా.. మాకు కూడా ధాన్యం కేటాయించాలి. మేము అందుకు నగదు చెల్లిస్తాం. పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు చిన్న తరహా పరిశ్రమల కింద సబ్సిడీ రుణాలు ఇస్తున్నా.. వ్యాపారానికి కూడా రుణం ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా ఓడీ ఇవ్వాలి. విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి. మా పరిశ్రమలకు 24 విద్యుత్ సౌకర్యం కల్పించాలి. – రాపోలు వెంకటేశ్వర్లు, మరమరాల తయారీదారుడు, కట్టంగూర్ -
పండగొస్తుంది.. తియ్యటి వేడుక చేసుకుందాం, చమ్చమ్తో
చమ్‌చమ్ తయారీకి కావలసినవి వెన్నతీయని ఆవుపాలు – నాలుగు కప్పులు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; మైదా – టేబుల్ స్పూను; చక్కెర – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఎనిమిది కప్పులు; యాలకులు – రెండు; నెయ్యి – టీస్పూను; పాలు – పావు కప్పు; క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు; పాలపొడి – అరకప్పు; కుంకుమ పువ్వు కలిపిన పాలు – రెండు టేబుల్ స్పూన్లు; చక్కెరపొడి –టేబుల్ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; ట్యూటీఫ్రూటీ –మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా: ► పాలను చక్కగా కాయాలి..కాచిన పాలల్లో నిమ్మరసం వేసి విరగగొట్టి.. పన్నీర్‌ను వేరు చేసి పక్కనపెట్టుకోవాలి. ► అరగంట తరువాత పన్నీర్ మిశ్రమంలో మైదా వేసి ముద్దలా కలపాలి ∙ముద్దను పొడవాటి రోల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు పంచదారలో ఎనిమిది కప్పులు నీళ్లుపోసి 10 నిమిషాలు మరిగించాలి. ► తరువాత యాలకులు, పన్నీర్ రోల్స్‌ను వేసి పదిహేను నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి ∙బాణలిలో నెయ్యి, పావు కప్పు పాలు పోసి మరిగించాలి. ► రెండు నిమిషాల తరువాత క్రీమ్ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, పంచదార పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిశ్రమం బాగా చిక్కబడినప్పుడు దించేస్తే కోవా రెడీ. ► ఇప్పుడు సుగర్ సిరప్‌లో ఉడికించిన రోల్స్‌ను బయటకు తీసి మధ్యలో నిలువుగా గాటు పెట్టి చల్లారిన కోవా మిశ్రమాన్ని స్టఫ్చేసి గాటుని మూసేయాలి. ► ఈ రోల్స్‌కు కొబ్బరి తురుము అద్ది, పైన టూటీఫ్రూటీపెట్టాలి ∙ఇలా అన్నీ రోల్స్‌ను చేస్తే చమ్‌చమ్ రెడీ. -
క్యారట్, క్యాప్సికంతో చట్నీ.. ఇడ్లీ, దోశల్లో మంచి కాంబినేషన్
క్యారట్ క్యాప్సికమ్ చట్నీ తయారీకి కావల్సినవి: క్యారట్లు – పెద్దవి రెండు; క్యాప్పికం –పెద్దది ఒకటి; అల్లం – అంగుళన్నర ముక్క; పచ్చిమిర్చి –ఐదు; జీలకర్ర –టీస్పూను; ధనియాలు –టీస్పూను; ఆవాలు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివే΄ాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; చింతపండు గుజ్జు – రెండు టీస్పూన్లు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►క్యారట్, క్యాప్సికం, అల్లంను సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.జీలకర్ర, ధనియాలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ► బాణలిలో మూడు టీస్పూన్ల నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి, అల్లం, క్యారట్, క్యాప్పికం ముక్కలు వేసి వేయించాలి. ► కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి. ► వేయించిన ధనియాలు, జీలకర్ర మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి ∙ఇవి నలిగిన తరువాత ఉడికించిన క్యాప్సికం క్యారట్ ముక్కలను వేయాలి. ► చింతపండు గుజ్జు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ► మిగిలిన టీస్పూను నూనె వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత శనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ► చివరిగా ఇంగువ వేసి దించేయాలి ∙ఈ తాంలిపుని పచ్చడిలో కలిపితే క్యారట్ క్యాప్సికం చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ, రోటీల్లో ఇది మంచి కాంబినేషన్. -
చాక్లెట్ ట్రఫెల్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
చాక్లెట్ ట్రఫెల్స్ తయారీకి కావల్సినవి: బాదం పప్పు – కప్పు; ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; కర్జూరాలు – పదిహేను; బాదం బటర్ – ము΄్పావు కప్పు; డార్క్ చాక్లెట్ ముక్కలు – పావు కప్పు; కొబ్బరి నూనె – అరటీస్పూను; బరకగా దంచిన పిస్తా పలుకులు – పావు కప్పు; బాదం పలుకులు – పావు కప్పు; నల్లని పొరతీసి తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు; స్ట్రాబెరీ పొడి – పావు కప్పు. తయారీ విధానమిలా: ►కర్జూరాలను ఒకసారి కడిగి పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి ∙బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించి మిక్సీజార్‌లో వేయాలి. ► నానబెట్టిన కర్జూరాలను నీరు లేకుండా తీసి మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి ∙సగం నలిగిన మిశ్రమంలో బాదం బటర్ వేసి గ్రైండ్ చేయాలి. ► అవసరాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙ఇప్పుడు గ్రైండ్ అయిన మిశ్రమాన్ని బయటకు తీసిన నచ్చిన పరిమాణంలో లడ్డుల్లా చుట్టుకోవాలి. ► బాదం, పిస్తా పలుకులను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙చాక్లెట్ముక్కల్లో కొబ్బరి నూనెవేసి అవెన్‌లో 45 సెకన్లు ఉంచాలి. చాక్లెట్ కరిగిన తరువాత పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు ముందుగా చేసుకున్న లడ్డులాను ఒక్కోక్కటి ఎండుకొబ్బరి తురుము, పిస్తా, బాదం, స్ట్రాబెరీ పొడులు, చాక్లెట్ మిశ్రమంలో ముంచి అద్దుకుంటే ట్రఫెల్స్ రెడీ. రిఫ్రిజిరేటర్లో నిల్వచేసుకుంటే ఇవి పదిరోజుల పాటు తాజాగా ఉంటాయి. -
క్యారట్ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు
క్యారట్ లడ్డు తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – రెండు కప్పలు; ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – కప్పు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – అరటీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుమ – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: రెండు స్పూన్ల నెయ్యివేసి కొబ్బరి తురుముని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి. కొబ్బరి వేగిన తరువాత క్యారట్ తురుము వేసి మీడియం మంట మీద పదినిమిషాలు వేయించాలి. ఇప్పుడు బాదం పలుకులు, కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత రోజ్ వాటర్. యాలకుల పొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ మగ్గనివ్వాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుని,పైన కొద్దిగా పచ్చికొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. -
తాటి చాక్లెట్ పాన్కేక్ ..సింపుల్ రెసిపి ఇలా చేసుకోండి
తాటి చాక్లెట్ పాన్కేక్ తయారీకి కావల్సినవి: తాటిపండు గుజ్జు – ఒకటిన్నర కప్పులు కోకో పౌడర్ – 1 కప్పు, మైదాపిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు పంచదార – 2 కప్పులు చిక్కటి పాలు – సరిపడా(కాచి చల్లార్చినవి) ఉప్పు – చిటికెడు, నెయ్యి – చాలినంత తయారీ విధానమిలా: ముందుగా తాటì పండు గుజ్జు, కోకోపౌడర్, కొబ్బరి తురుము, పంచదార కొద్దికొద్దిగా పాలు మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఆ మిశ్రమంతో పాటు.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, కోకో పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నెయ్యి వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ చేసుకుని.. ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. వాటిపై చాక్లెట్ క్రీమ్, ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
శ్రావణమాసం స్పెషల్.. టేస్టీ హల్వా చేసుకోండి ఇలా
క్యారెట్–ఖర్జూరం హల్వా తయారీకి కావల్సినవి: ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి) క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు కొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి, పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్ కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఫుడ్ కలర్– క్యారెట్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ►ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ► కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ► ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి. ► ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
సొరకాయతో 'సొరాటా'.. పేరు డిఫరెంట్ ఉన్నా, టేస్ట్ బావుంటుంది
సొరాటా తయారీకి కావల్సినవి: సొరకాయ లేదా గుమ్మడి తురుము – మూడు టేబుల్ స్పూన్లు; శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; అల్లం తరుగు – టేబుల్ స్పూను; పసుపు – ముప్పావు టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; నెయ్యి – టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో సొరకాయ తురుము, శనగపిండి, పుదీనా, అల్లం తరుగులు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి ∙ఈ ముద్దను ఉండలుగా చేసి పరాటాల్లా వత్తుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సొరాట రెడీ. -
సాఫ్ట్ అండ్ హెల్తీ.. మొలకల డోక్లా, సింపుల్‌గా ఇలా చేసుకోండి
మొలకల డోక్లా తయారికి కావల్సినవి: శనగ మొలకలు – కప్పు; పాలకూర తరుగు – అరకప్పు; శనగపిండి –రెండు టేబుల్ స్పూన్లు; రాక్‌సాల్ట్ – టీస్పూను; నూనె – టేబుల్ స్పూను; నువ్వులు – టీస్పూను ; ఇంగువ – అరటీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ విధానమిలా: ►మొలకలు, పాలకూరను మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని..శనగపిండి, రాక్ సాల్ట్ వేసి కలపాలి. ► ఈ మిశ్రమాన్ని ప్లేటులో పోసి ఆవిరి మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. ► బాణలిలో నూనెవేసి కాగిన తరువాత నువ్వులు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ► ఇప్పుడు ఉడికిన డోక్లాపై ఈ తాలింపుని వేసి, నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి సర్వ్ చేసుకోవాలి. -
చిరుజల్లుల్లో... క్రిస్పీగా సూజీ టోస్ట్, ఎలా చేయాలంటే
చల్లని సాయంకాలం ఓ మాదిరిగా పడుతోన్న వర్షం చినుకులు చూస్తు టీ తాగితే ఆ అనుభూతే వేరు. పొగలు గక్కే టీని సిప్ చేస్తూ క్రిస్పీగా, కారకారంగా ఉండే వేడివేడి స్నాక్స్ మరింత ఆనందాన్ని ఇస్తాయి. పకోడీ, బజ్జీ,సమోసాలు ఎప్పుడూ తినేవే కాబట్టి ఈసారి వంటిల్లు చెబుతోన్న స్నాక్స్‌తో టీని సిప్ చేసి చూడండి. సూజీ టోస్ట్ తయారీకి కావలసినవి: బ్రెడ్ స్లైస్‌లు – ఆరు, సూజీ రవ్వ – అరకప్పు; పెరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – టేబుల్ స్పూను; ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో తరుగు – టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కారం – టీస్పూను; బటర్ – టోస్టు వేయించడానికి సరిపడా; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: బ్రెడ్ స్లైలు తప్పించి మిగతా పదార్థాలన్నింటిని గిన్నెలో వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చిక్కగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్మీద మందంగా పరుచుకోవాలి. ఇలా స్లైసులన్నింటికి రాశాక, నాన్‌స్టిక్ పాన్‌పై బటర్ వేసి రెండు వైపులా చక్కగా కాల్చాలి. టోస్టు బంగారు వర్ణంలో, క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి. -
క్షణాల్లో ఓట్స్ స్మూతీ.. సింపుల్ రెసిపి
ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సినవి: ఓట్స్ –మూడు టేబుల్ స్పూన్లు; వేయించి పొట్టుతీసిన పల్లీలు – పావు కప్పు ; అవిసెగింజలు – టేబుల్ స్పూను; సబ్జాగింజలు – టీస్పూను; దాల్చిన చెక్క – అరంగుళం ముక్క; కర్జురాలు – నాలుగు; బాగా పండిన అరటి పండు – ఒకటి. తయారీ విధానమిలా: ►ఓట్స్‌ను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో వేయాలి. దీనిలో కప్పు నీళ్లుపోయాలి. ► పల్లీలు, అవిసె, సబ్జా గింజలు, దాల్చిన చెక్క, కర్జూరాలు, అరటిపండు ముక్కలు కూడా వేయాలి. ► వీటన్నింటిని చక్కగా గ్రైండ్ చేస్తే స్మూతీ రెడీ. -
ఆరోజులే వేరు.. పండగ వస్తే ఇంటిల్లిపాది పిండివంటలు, ఆ హడావిడే వేరు
మా చిన్నతనంలో ఎవరింట్లో అయినా పెళ్లికి వెళితే ముందుగా ఎదురుచూసేది, "పెళ్ళి ఉప్మా" కోసం. ఎందుకంటే, నాటి - మేటి "పెళ్ళి ఉప్మా" రుచి అల్లాంటిది !పచ్చటి అరిటాకులో తెల్లటి ఉప్మా వేడి వేడిగా వేయించుకుని, చట్నీ కూడా లేకుండా, నోరు కాలిపోతున్నా, ఆబగా తినేసి, మళ్ళీ మళ్ళీ వెళ్ళి, సిగ్గు లేకుండా...అదే... సిగ్గు పడకుండా...వేయించుకుని, ఆ కాలిన నోటితోనే, వేడి వేడి కాఫీని,గాజు గ్లాసుతో చప్పరిస్తే వుండేదీ..ఆహా ఏమి రుచీ... తినగా మైమరచీ అనేలా. ఆ ఒక్కటీ అడగొద్దు.. ఇప్పుడూ పెళ్ళిళ్ళకి వెళుతున్నాం. ఖరీధైన, పేరుమోసిన క్యాటరింగ్ సర్వీసులు. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని, టోపీలు పెట్టుకొని, ప్లాస్టిక్ ప్లేట్లలో ఉప్మాతో పాటు, నాలుగు రకాల టిఫిన్లు, మూడు రకాల చట్నీలు వేసి, స్పూన్లు వేసి మరీ మనమీదకి విసిరేస్తున్నారు. కానీ, ఏమిటో టిఫిన్ చెయ్యడం(అంటే వండడం కాదండి, తినడం)మొక్కుబడి అయిపోయింది.ఓ చేత్తో తింటూనే.. ఇంకో చేత్తో ఓ అరడజను మాత్రలు మింగాలిగా !"వేళకి మాత్రలు వేసుకు చావండి...లేపోతే ఛస్తారు"... అన్నారుగా డాట్టర్లు !) అందుకు తింటున్నాం ! తగ్గేదే లే... ఇంకోటి గమనించారా...ఇప్పుడు హొటల్ కి వెళ్ళి, మెనూ కార్డుని ఛడా - మడా చదివేసి, "ప్లేటు ఇడ్లీ...వేడిగా వుండాలి, గట్టి చట్నీ, కారప్పొడీ - నెయ్యీ వేసి పట్రా..." అని ఆర్డరు ఇచ్చేస్తున్నాం కానీ, రెండో ప్లేటు తినే దమ్ములేవీ ?అసలు హోటల్లో టిఫిన్ తినేదే వాడు వేసే చట్నీలు, సాంబార్ కోసం.అదే కొంపలో అయితే, నాలుగో...ఆరో ఇడ్లీలు అవలీలగా ఆవకాయ్ తో పట్టేస్తాం ఏంటి ?ఇంక హొటల్లో మసాలా దోశలు, పూరీ - కూరలు, గారీ - సాంబార్ లు అయితే...తెలుసుగా...ఒక ప్లేటుకే..పొట్ట "హౌస్ ఫుల్" బోర్డు పెట్టేస్తుంది !మరదే...ఇంట్లో అయితే..."తినే వాడికి ఒడ్డించే వాళ్ళు లోకువ" అన్నట్టు,"ఇంకా తే.. ఇంకా తే" అనుకుంటూ కుంభాలు కుంభాలు పట్టించేస్తూనే ఉంటాం. అస్తమానూ, "హమారే జమానే మే..." అనుకుంటూ, అప్పట్లో మనం, గోంగూర పచ్చడి, కొత్త చింతకాయ్ పచ్చడి లాంటి "ఇష్ట భోజ్యార్ధ సిధ్యర్ధం" ఎదురు చూసి,ఎదురు చూసి, కోరిక సిద్ధించగానే, పడికట్టుగా బాసింపట్టు వేసుక్కూర్చుని, రెండు, మూడు వాయిలు లాగించేసేవాళ్ళమని, ఇప్పటి 'ప్లేటు మీల్స్' వాళ్ళకి చెబితే ఏం లాభం ? ప్చ్ !"అర్ధం చేసుకోరూ...." వాళ్ళు...అన్నిటికీ మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నామనుకుంటున్నారు ! "చద్దన్నం - మజ్ఝాన్న భోజన పధకం - రాత్రి తిండి" అనే ముప్పొద్దుల 'ఉదర పోషణ' కార్యక్రమాలు ఉండేవని, మధ్య మధ్యలో ఆడుకుని వచ్చి, చిరుతిళ్ళకోసం, "ఏదైనా పెట్టు" అంటూనే వుండేవాళ్ళమని, అందుకు గృహిణులు వంటింటినే అంటిపెట్టుకుని బతికేసేవారని, చెబితే, ఇప్పటి వారికి, "ఆసచర్యం...ఆసచర్యం" !అదీకాక, రాత్రి పలహారాల బ్యాచి, విభాగాలు వేరే ఉండేవని కూడా చెబితే...వీళ్ళు నమ్మట్లేదు ! ఏం చేస్తాం ?ఇంక పండగలు - పబ్బాలు వస్తే, తెల్లారుకట్ల లేచి, ఇంటిల్లిపాదికీ నలుగెట్టి తలంట్లు, నవకాయ పిండివంటలతో వంటలు, పైపెచ్చు, ప్రత్యేక పిండివంటలు చేసి - చేసి, గృహిణులు అలిసిపోయి, పులిసిపోయినా... పాపం, "పండగ బాగా జరిగింది" అని పదిసార్లు చెప్పుకుని, మురిసిపోయేవాళ్ళే కానీ, ఏనాడూ,"మేం ఇంత పని చేశాం... అంత పని చేశాం" అని దెప్పడం ఎరుగుదుమా ? "హౌ గ్రేట్ !" అదే ఇప్పుడైతే...తెలుసుగా...? ఫ్రిజ్‌లోంచి స్పెషల్ ఐటమ్స్ రెడీ..పండగొస్తోందని మనవాళ్ళకి తెలిసేలోపే,స్వగృహా ఫుడ్స్ వాళ్ళు, మనందరి ఇళ్ళలోకీ కావలసినన్ని స్వీట్లు - హాట్లు,శ్రేష్టమైన నూనెల్తో తయారు చేయించేసి, ప్రత్యేక స్టాల్స్ వేసి, రోడ్డుమీద పెట్టేస్తున్నారుగా !వస్తూ వస్తూ, దారిలో నాలుగైదు రకాలు, తలో అర కేజీ తూపించుకుని వచ్చేస్తే, పండగ అయిపోయినట్టే !ఆ రోజుల్లో మగమహారాజులం మాత్రం, వంటింటి ఛాయలకి వెళ్ళకుండా, (భోంచెయ్యడానికి తప్ప) కొత్తబట్టలు వేసుకుని, భుక్తాయాసంతో అలిసిపోయేవాళ్ళం ! ఇంక తద్దినాలు, పితృ కార్యాలూ వస్తే, వందల కొద్దీ గారెలకి రుబ్బురోళ్ళలో పిండి రుబ్బడం దగ్గర్నుంచీ, నాలుగు రకాల కూరలు, పచ్చళ్ళు, పరవాన్నాలూ కూడా చేసి, సాయంత్రం ఏ నాలుగింటికో భోజనాలు చేసిన స్త్రీ మూర్తుల సహనాన్ని, ఓపికల్ని,"ఏమని వర్ణించనూ..." ఇప్పుడు అన్నిటికీ అంటే పుట్టిందగ్గిర్నించీ.. చివరిదాకా జరిపించే షోడశ కర్మలకీ... కాంట్రాక్టులు వచ్చేశాయి కాబట్టి, అలా...ఓ గంటసేపు రాఘవేంద్ర మఠానికి కార్లో వెళ్ళి, "మమ" అనుకుంటే...సరిపోతోంది ! అవన్నీ వాళ్లకేం తెలుసు? ఈ మధ్య ఫేసు బుక్కుల్లో "గత కాలము మేలు, వచ్చుకాలము కంటెన్" అనుకుంటూ, రోడ్డుమీద గోళీలు, గూటీ బిళ్ళ ఆడుకున్న ఫోటోలు, కిరసనాలు లాంతర్లు, పాత మర్ఫీ రేడియోల ఫోటోలు తెగ షేర్ చేసేస్తూ, మురుసిపోతున్నారు కానీ, ఒక గంట కరెంటు, ఒక పది నిమిషాలు నెట్టు లేకుండా ఊహించుకోడానికే భయపడిపోతారు ! ఆ విరామ సమయంలో...పాత కాలం నాటి తాటాకు విసినికర్రలు వాడుకుంటూ, తొక్కుడుబిళ్ళ ఆడుకోచ్చుగా ? "ఆ ఒక్కటీ అడక్కు" అంటున్నారు.అమ్మమ్మలు, తాతలు కథల్లో బాగుంటారు కానీ, వాళ్ళు ఇప్పుటిదాకా బావుంటే, కూచుని లేవడానికి మనకే ఓపికల్లేవు, వాళ్ళనేం చూస్తాం...వాళ్ళకేం చేస్తాం ? "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపిగురుతులూ..."అని చెప్పిన ఆత్రేయే, అనుకున్నామని జరగవు అన్నీ...అనుకోలేదని...ఆగవు కొన్నీ...జరిగేవన్నీ మంచికనీ.. అనుకోవడమే..మనిషి పనీ... !"అనికూడా అన్నాడు !కాబట్టి, అలాగే అనుకుంటే, ఓ పనైపోతుంది !శుభం భూయాత్ ! -
స్పెషల్ డేస్ కోసం ప్రత్యేకంగా ఖీర్.. ఇలా చేసుకోండి
స్వీట్ పొటాటో ఖీర్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప – 300 గ్రాములు (తొక్క తీసేసి.. దుంపల్ని తురుములా చేసుకోవాలి) పాలు – 1 లీటరు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 3 కుంకుమపువ్వు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు కస్టర్డ్ మిల్క్ – అర కప్పు, నట్స్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లకు పైనే (గార్నిష్‌కి) తయారీ విధానమిలా... ముందుగా పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని, అందులో చిలగడదుంప తురుము వేసుకుని చిన్నమంట మీద గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం మరో పాత్రలో పాలు వేడి చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు, ఏలకులు వేసుకుని తిప్పుతూ ఉండాలి. పాన్‌లో వేయించిన చిలగడదుంప తురుమును.. పాలల్లో వేసుకుని, చిన్న మంట మీద.. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి. అనంతరం పంచదార వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని నట్స్ ముక్కలను అందులో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు మిగిలిన నట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. -
కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి
బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు... ఓట్స్ బీట్రూట్ పన్నీర్ పరాటా తయారీకి కావల్సినవి: వేయించిన ఓట్స్ – కప్పు; బీట్రూట్ ప్యూరీ – కప్పు; పన్నీర్ తరుగు – అరకప్పు; గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను; కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో ఓట్స్, బీట్రూట్ ప్యూరీ, పనీర్ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి. పరాటాలను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్‌చేసుకోవాలి. -
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ టేస్ట్ అదిరిపోద్ది.. ట్రై చేయండి
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ తయారీకి కావల్సినవి బ్రెడ్ స్లైసెస్ – 4 (నలువైపు బ్రౌన్ కలర్ ముక్కను తొలగించి.. మిగిలిన ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి) యాపిల్ ముక్కలు – అర కప్పు చిక్కటి పాలు – 2 కప్పులు పంచదార – పావు కప్పు (పెంచుకోవచ్చు) డ్రైఫ్రూట్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి) కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ విధానమిలా ముందుగా బౌల్లో పాలు పోసుకుని గరిటెతో తిప్పుతూ కాచుకోవాలి. పంచదార, కుంకుమ పువ్వు వేసుకుని తిప్పుతూ సగం వరకూ మరిగించుకుని చల్లారబెట్టాలి. తర్వాత యాపిల్, బ్రెడ్ పౌడర్‌ను మిక్సీలో వేసుకుని.. ఒకసారి మిక్సీ పట్టి.. అందులో చల్లార్చిన పాలను పోసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కుల్ఫీ మేకర్లో వేసుకుని.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. -
మష్రూమ్స్‌తో లాలీపాప్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?
మష్రూమ్ లాలీపాప్స్ తయారీకి కావల్సినవి: పుట్టగొడుగులు – అర కప్పు (వేడి నీళ్లల్లో ఉడికించి, శుభ్రం చేసుకుని మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, బఠాణీ, స్వీట్ కార్న్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున(ఉడికించినవి), పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందు ఒక బౌల్ తీసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తురుము, ఉడికించిన పుట్టగొడుగుల గుజ్జు, బఠాణీ, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. ఒక్కో ఉండకు ఒక్కో ఐస్‌క్రీమ్ పుల్ల గుచ్చి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం టమోటా సాస్ లేదా కొత్తిమీర చట్నీలో ముంచి సర్వ్ చేసుకోవచ్చు. -
ఇది తింటే ప్రోటీన్..మీల్మేకర్తో మొలకల టిక్కా..
మీల్మేకర్ మొలకల టిక్కా తయారీకి కావల్సినవి: మీల్మేకర్ – ఒకటిన్నర కప్పులు; పెసర మొలకలు – అరకప్పు; పాలకూర – చిన్నకట్ట ఒకటి; అల్లం – అంగుళం ముక్క; బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు; శనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు; ధనియాల ΄÷డి – ఒకటిన్నర టీస్పూను; జీలకర్ర పొడి – టీస్పూను; రాక్ సాల్ట్ – అరటీస్పూను; కొత్తిమీర, పుదీనా తరుగు – అరకప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టిక్కి వేయించడానికి సరిపడా. తయారీ విధానమిలా: ముందుగా వేడినీటిలో మీల్ మేకర్ వేసి పదినిమిషాల పాటు నానబెట్టాలి. నానిన మీల్ మేకర్‌ను మూడుసార్లు నీటితో కడగాలి చివరిగా మీల్ మేకర్‌లోని నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙పాలకూరను శుభ్రంగా కడిగి, మరుగుతోన్న నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. రెండు నిమిషాల తరువాత తీసి చల్లని నీటిలో వేసి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీజార్‌లో పుదీనా, కొత్తిమీర, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ నలిగిన తరువాత పెసర మొలకలు వేసి గ్రైండ్ చేయాలి. చివరగా... నీళ్లు పోయకుండా మీల్మేకర్, పాలకూర వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ధనియాల పొడి, బియ్యప్పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. పదినిమిషాల తరువాత పిండిమిశ్రమాన్ని టిక్కిల్లా చేసుకోవాలి ∙మీడియం మంటమీద నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు టిక్కీలను కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి. -
వర్షాకాలంలో బెస్ట్ స్నాక్స్.. క్రిస్పీ మసాలా మత్రీ చేసుకోండి ఇలా
క్రిస్పీ మసాలా మత్రీ తయారికి కావల్సినవి గోధుమ పిండి – రెండు కప్పులు; వాము – అరటీస్పూను; కసూరీ మేథి – రెండు టేబుల్ స్పూన్లు; కారం – అరటేబుల్ స్పూను; గరం మసాలా – అరటేబుల్ స్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను ; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా: గోధుమ పిండిలో వాము, కసూరీ మేథి, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో టేబుల్ స్పూను నెయ్యివేసి మరోసారి కలపాలి ∙ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగ కలపాలి. మిగిలిన టేబుల్ స్పూను నెయ్యిని కార్న్‌స్టార్చ్‌లో వేసి పేస్టులా కలపాలి. పిండి ముద్దను మందపాటి గుండ్రని చెక్కల్లా వత్తుకోవాలి. ఈ చెక్కలపైన కార్న్ పేస్టురాయాలి. చెక్కలను మీడియం మంటమీద క్రిస్పీగా మారేంత వరకు డీప్ప్రై చేసుకుంటే మసాలా మత్రీ రెడీ. -
కోకోనట్ ఓట్స్ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
కోకోనట్ ఓట్స్ కేక్ తయారీకి కావల్సినవి: కొబ్బరి పాలు – పావు లీటర్, కొబ్బరి తురుము – 1 కప్పు ఓట్స్ పౌడర్ – ఒకటిన్నర కప్పులు,బియ్యప్పిండి – పావు కప్పు బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు, నీళ్లు – 2 కప్పులు తయారీ విధానమిలా.. ముందుగా స్టవ్ ఆన్ చేసి.. పాత్రలో కొబ్బరిపాలు, పంచదార వేసి.. పంచదార కరిగేవరకూ తిప్పుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం గరిటె సాయంతో ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్ వేసుకుని కొద్దికొద్దిగా కొబ్బరి పాల మిశ్రమాన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో బియ్యప్పిండి, కొబ్బరి తురుము వేసి మరోసారి కలుపుకోవాలి. తర్వాత కేక్ తయారు చేసే పాత్రకు అడుగున నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమం వేసి.. ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. అభిరుచిని బట్టి క్రీమ్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. -
స్నాక్స్ కోసం..చీజ్ కార్న్ రోల్స్ ఇలా చేసుకోండి
చీజ్ కార్న్ రోల్స్ రెసిపికి కావల్సినవి బంగాళ దుంపలు – మూడు; కార్న్ గింజలు – అరకప్పు; చీజ్ – అరకప్పు; వెల్లుల్లి తురుము – టీస్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను; బ్రెడ్ స్లైసులు –నాలుగు; కారం – అరటీస్పూను; గరం మసాలా – పావు టీస్పూను; ఛాట్ మసాలా – అరటీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా.. బంగాళ దుంపలు, కార్న్ గింజలను విడివిడిగా ఉడికించాలి ∙బంగాళ దుంపల తొక్క తీసి చిదుముకోవాలి ∙దీనిలో కార్న్ గింజలు, వెల్లుల్లి తురుము, కార్న్‌స్టార్చ్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బ్రెడ్‌స్లైసులను వేసి అన్నీ కలిసిపోయేలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలకు వేలితో రంధ్రం చేసి చీజ్‌ను సన్నగా తురిమి పెట్టాలి తరువాత రంధ్రాలని మూసేసి రోల్స్ ఆకారం లో వత్తుకోవాలి ∙ఇలా అన్ని ఉండలను రోల్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి, సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. -
అరటిపండుతో నిమిషాల్లో స్వీట్ తయారీ.. చేయండిలా
అరటిపండు మైసూర్ పాక్ తయారికి కావల్సినవి: శనగపిండి – కప్పు; నెయ్యి – కప్పు; ఎర్ర అరటి పండ్లు – రెండు; చక్కెర – కప్పు. తయారీ విధానమిలా శనగపిండిని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. అరటిపండ్లు తొక్కతీసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి.వేగిన పిండిలో కొద్దిగా నెయ్యి వేసి పేస్టులా కలిపి దించేయాలి. చక్కెరలో కప్పు నీళ్లుపోసి మరిగించాలి.తీగపాకం వచ్చిన తరువాత శనగపిండి పేస్టు, అరటిపండు ప్యూరిని వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా దగ్గరపడినప్పుడు దించేసి, నెయ్యిరాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కట్ చేస్తే బనానా పాక్ రెడీ. -
చెర్రీ చాక్లెట్ బాల్స్.. ఒక్కసారి రుచి చూస్తే వదలిపెట్టరు
చెర్రీ – చాక్లెట్ బాల్స్ తయారీకి కావల్సినవి: చెర్రీలు – 3 కప్పులు (గింజలు తీసి, శుభ్రం చేసి, గుజ్జులా చేసుకోవాలి), చాక్లెట్ చిప్స్ – అర కప్పు (ఓవెన్లో క్రీమ్‌లా మెల్ట్ చేసుకోవాలి) వాల్ నట్స్ – 1 కప్పు (మెత్తగా పౌడర్ చేసుకోవాలి) జీడిపప్పులు – పావు కప్పు (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి) ఖర్జూరం గుజ్జు – పావు కప్పు (గింజలు తీసి, ముక్కలు చేసి పెట్టుకోవాలి) ఉప్పు – చిటికెడు, దాల్చినచెక్క పొడి – కొద్దిగా, కొబ్బరి పాలు – 100 గ్రాములు కొబ్బరి తురుము – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి), నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో ఖర్జూరం ముక్కలు, 50 గ్రాముల కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో చెర్రీ గుజ్జు, దాల్చినచెక్క పొడి, మిగిలిన కొబ్బరి పాలూ పొసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలో చాక్లెట్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కచ్చాబిచ్చాగా చేసుకున్న జీడిపప్పు ముక్కలు, వాల్నట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నేతిని చేతులకు రాసుకుని.. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. కొబ్బరి తురుముతో లేదా కోకోనట్ బటర్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటాయి. -
ఇలా చేస్తే క్యారట్స్ను పిల్లలు ఇష్టంగా తింటారు..
క్యారట్ డేట్స్ స్వీట్ తయారికి కావల్సినవి: క్యారట్ తురుము – పావు కప్పు ; విత్తనాలు తీసేసిన డేట్స్ – పావు కప్పు; బెల్లం – పావు కప్పు; శనగపిండి – అరకప్పు; బ్రౌన్‌సుగర్ – కప్పు; నెయ్యి – అరకప్పు; నూనె- పావు కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ∙టేబుల్ స్పూను నెయ్యి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో మిగిలిన నెయ్యి, నూనె వేసి ఐదు నిమిషాలు వేడి చేసి పక్కనపెట్టుకోవాలి. బెల్లంలో పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టాలి ∙ క్యారట్,డేట్స్, బెల్లం నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి .గ్రైండ్ చేసి ప్యూరీని ముక్కలు లేకుండా వడగట్టి తీసుకోవాలి. బాణలిలో బ్రౌన్ సుగర్, అరకప్పు నీళ్లుపోసి మరిగించాలి ∙షుగర్ కరిగిన తరువాత క్యారట్ డేట్స్ ప్యూరిని వేసి సన్ననని మంట మీద తిప్పుతూ ఉండాలి . తీగ పాకం వచ్చాక శనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి /నూనెను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి నెయ్యి మొత్తాన్ని మిశ్రమం పీల్చుకుని దగ్గరపడిన తరువాత దించి నెయ్యిరాసిన ప్లేటులో పోసుకోవాలి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకుంటే క్యారట్, డేట్స్ పాక్ రెడీ. ఇలా చేస్తే పిల్లలు క్యారట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. -
కొబ్బరి జీడిపప్పుతో మైసూర్ పాక్.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి: శనగపిండి – కప్పు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు – ముప్పావు కప్పు ; చక్కెర – రెండు కప్పులు ; నెయ్యి – ముప్పావు కప్పు ; యాలకులు – నాలుగు; నీళ్లు – ఒకటి ముప్పావు కప్పులు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడపట్టుకుని, అరకప్పు నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి. తీగపాకం వచ్చిన తరువాత కొబ్బరి తురుము, జీడిపప్పు పలుకులు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి కలపాలి. చివరిగా యాలకులను దంచి వేయాలి ∙ఈ మిశ్రమంలో మిగిలిన నెయ్యిని టేబుల్ స్పూను చొప్పున వేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి మొత్తం వేసిన తరువాత చక్కగా కలిపి, మిశ్రమం గట్టిపడకముందే దించేయాలి. ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి ఆరనివ్వాలి ∙పదినిమిషాల తరువాత ముక్కలుగా కట్ చేస్తే కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ రెడీ. -
లో క్యాలరీస్ కోసం కాలిఫ్లవర్ బ్రెడ్ ట్రై చేయండి
కాలీఫ్లవర్ బాదం బ్రెడ్ తయారీకి కావల్సినవి: కాలీఫ్లవర్ – 1 (వేడి నీళ్లతో బాగా శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) బాదం తురుము – ఒకటింపావు కప్పులు, గుడ్లు – 6 ఆలివ్ నూనె – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా ఓరెగాన్ , బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ చొప్పున తయారీ విధానమిలా.. ముందుగా ఒక పెద్ద బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కాలీఫ్లవర్ తురుము, ఆలివ్ నూనె, బాదం తురుము, ఓరెగాన్ , బేకింగ్ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మేకర్లో వేసుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకునే ముందు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. -
ఈజీ అండ్ ఫాస్ట్‌గా మిల్క్ దాల్ హల్వా
మిల్క్ దాల్ హల్వా తయారీకి కావల్సినవి చిక్కటి పాలు, పుట్నాల పప్పు – 2 కప్పులు చొప్పున పంచదార – 2 కప్పులు (పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు) జీడిపప్పులు –10, నెయ్యి – 5 లేదా 6 టేబుల్ స్పూన్లు ఏలకులు – 2 (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు వేడి చేసుకుని అందులో పుట్నాల పప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ, చిన్న మంట మీద, పాలను ఒక పొంగు రానివ్వాలి. వెంటనే మరోసారి కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు చల్లారాక ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు, పంచదార, ఏలకులు వేసుకుని మరోసారి మెత్తగా చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసుకోవచ్చు. మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని.. ముందు వాడిన పాత్రను ఒకసారి క్లీన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని.. వేడి కాగానే పాలు, పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడే వరకూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా మిలిగిన కాస్త నెయ్యి కూడా వేసుకుని బాగా కలపాలి. అనంతరం నచ్చిన పాత్రకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, ఈ మొత్తం మిశ్రమాన్ని అందులో వేసి చదును చెయ్యాలి. కాసేపటికి ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కోల్‌కతా స్టైల్లో కీమాతో నూడుల్స్ కట్లెట్.. ఈసారి ట్రై చేయండి
కీమా నూడుల్స్ కట్లెట్ తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి) నూడుల్స్ – 1 కప్పు (నీళ్లల్లో ఉడికించి, జల్లెడ గరిటెతో వడకట్టి పక్కన పెట్టుకోవాలి) బంగాళ దుంపలు – 2 (మీడియం సైజ్, మెత్తగా ఉండికించి ముద్దలా చేసుకోవాలి) ఉల్లిపాయ – 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి) క్యారెట్ – 2 టేబుల్ స్పూన్లు (తురుముకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు) క్యాప్సికం –2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠాణీ – 1 టేబుల్ స్పూన్ (నానబెట్టుకోవాలి) కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు ఉప్పు – తగినంత జీలకర్ర పొడి, మసాలా – 1 టీ స్పూన్ చొప్పున నూడుల్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి, నూడుల్స్‌ని ఉడికించకముందు విరిచి.. కారప్పూసలా చేసుకోవాలి) గుడ్లు – 2 (చిన్న బౌల్లో 1 గరిటెడు పాలు, గుడ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి), నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక పెద్ద బౌల్లో ఉడికిన నూడుల్స్, కీమాతో పాటు బంగాళదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు లేదా తురుము, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బఠాణీలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి.. కట్లెట్స్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. అభిరుచిని బట్టి వేయించుకునే ముందే ప్రతి కట్లెట్ని గుడ్డు, పాల మిశ్రమంలో ముంచి, నూడుల్స్ ముక్కల్లో దొర్లించి.. అప్పుడు వేయించుకోవచ్చు. వీటిని టొమాటో సాస్‌తో లేదా కొత్తిమీర చట్నీతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టంట్ ఊతప్పం..ఇలా చేసుకోండి
లంచ్, డిన్నర్లలో వండిన అన్నం కొన్నిసార్లు మిగిలిపోతుంటుంది. అలా మిగిలిన అన్నాన్ని పులిహోర, ఎగ్‌రైస్, వెజ్ రైస్ చేసుకోవడం మామూలే. తరచూ మసాలా రైస్ తినబుద్దికాదు. అందువల్ల మిగిలిపోయిన అన్నాన్నీ మరింత రుచిగా ఇలా కూడా చేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... ఇన్స్టంట్ ఊతప్పం తయారీకి కావల్సినవి: మిగిలిన అన్నం – కప్పు ; బొంబాయి రవ్వ – అరకప్పు ; పెరుగు – కప్పు; క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు – కప్పు; అల్లం తరుగు – టీస్పూను ; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ; జీలకర్ర – టీస్పూను ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె ఊతప్పం వేయించడానికి – తగినంత. తయారీ విధానమిలా.. పెద్దగిన్నెలో రవ్వ, పెరుగు వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అన్నంలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన అన్నాన్ని రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో కప్పు నీళ్లుపోసి కలపాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని వేడెక్కిన పెనంపై నూనె వేసి ఊతప్పంలా వేయాలి. డువైపులా నూనె చల్లుకుంటూ చక్కగా కాల్చుకుంటే ఇన్స్టంట్ ఊతప్పం రెడీ. ∙కూరగాయ ముక్కలను పిండిలో కలపకుండా ఊతప్పం పైన చల్లుకుని కూడా కాల్చుకోవచ్చు. -
24 క్యారెట్స్ బంగారంతో చేసిన ఇడ్లీ.. మన హైదరాబాద్‌లోనే
హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ డిషెస్‌లో మరో కొత్త రకం వంటకం యాడ్ అయ్యింది. అదే గోల్డ్ ఇడ్లీ.. ఈ డిష్ ఇప్పుడు సిటీ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఈ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటి? దీని ధరెంత అన్నది ఈ స్టోరీలో తెలసుకుందాం.. సాధారణంగా ప్లేటు ఇడ్లీ ఎంత ఉంటుంది? మహా అయితే రూ.30-50 వరకు ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో అయితే కనీసం రూ.500 వరకు ఉంటుంది. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.. ఎందుకంటే ఈ ఇడ్లీ ధర ఏకంగా 1200 రూపాయలు. అంత స్పెషల్ ఏముంటుందబ్బా? అదేమైనా బంగారంతో చేశారా ఆని ఆలోచిస్తున్నారా? నిజమే మరి. ఇది బంగారు ఇడ్లీనే. 24 క్యారెట్స్ గోల్డ్ ఇడ్లీ అన్నమాట. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో చాలా కలర్ఫుల్గా గార్నిష్‌తో చేసి సర్వ్ చేస్తారు. ఈ డిఫరెంట్ ఇడ్లీని టేస్ట్ చేయాలంటే మాత్రం బంజారాహిల్స్‌లోని కృష్ణ ఇడ్లీ అండ్ దోస కేఫ్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గోల్డ్ ఇడ్లీనే కాదండోయ్.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మలై ఖోవా గులాబ్ జామున్ వంటి వెరైటీ నోరూరించే వంటలెన్నో ఉన్నాయి. ఇంకెందుకు లేటు ఈసారి బ్రేక్ ఫాస్ట్‌కి బంగారు వంటలను ఓ పట్టు పట్టండి. View this post on Instagram A post shared by Pooja♡ (@foodnlifestyleby_pooja) View this post on Instagram A post shared by Krishna’s Idli and dosa (@krishna_idli_dosa) -
ఈ కెటిల్‌ను.. వండుకున్నాక మడతెయ్యొచ్చు..
గ్రేడ్ సిలికాన్ బాడీతో స్టెయిన్ లెస్ స్టీల్ బాటమ్తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. గ్యాస్ స్టవ్ మీదైనా, ఇండక్షన్ స్టవ్ మీదైనా చక్కగా పని చేస్తుంది. దీని సామర్థ్యం సుమారుగా రెండు లీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఫోల్డ్ చేస్తే చిత్రంలో ఉన్న విధంగా చాలా చిన్నగా మారిపోతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అలాగే.. హీట్ ఇన్సులేషన్ హ్యాండిల్, యాంటీ–స్కాల్డ్ లిడ్‌తో క్యాంపింగ్‌కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో 3 నుంచి 5 నిమిషాలలో ఓట్ మీల్ లేదా కాఫీ లేదా టీ వంటివి తయారు చేసుకోవచ్చు. గుడ్లు, జొన్నకండెలు, చికెన్, మటన్, కూరగాయలు ఇలా వెజ్, నాన్‌వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ కెటిల్ ధర 194 డాలర్లు (రూ.15,972). -
వర్షాకాలంలో వేడివేడిగా టొమాటో రింగ్స్ చేసుకోండి ఇలా
ఓట్స్ టొమాటో రింగ్స్ తయారీకి కావల్సినవి టొమాటోలు – 4 లేదా 5 (గుండ్రంగా కట్ చేసుకుని మధ్యలో గుజ్జు తీసేసి చక్రాల్లా చేసుకోవాలి) ఓట్స్ పౌడర్ – అర కప్పు, శనగపిండి – 1 కప్పు బియ్యప్పిండి, కారం – 1 టేబుల్ స్పూన్ చొప్పున బేకింగ్ సోడా – పావు టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా బ్రెడ్ పౌడర్ – పావు కప్పు (అభిరుచిని బట్టి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో శనగపిండి, ఓట్స్ పౌడర్, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు.. బేకింగ్ సోడా.. వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలచగా చేసుకోవాలి. అందులో టొమాటో ముక్కల్ని బాగా ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇంకాస్త లావుగా కావాలంటే వెంటనే మళ్లీ ఓట్స్ మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి వేయించుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే.. ఈ రింగ్స్ భలే రుచిగా ఉంటాయి. -
రోటీస్‌లో మంచి సైడ్ డిష్ బైగాన్ బార్తా ఇలా చేసుకోండి..
బైగన్ కా బార్తా తయారీకి కావల్సినవి: మీడియం సైజు వంకాయలు – రెండు ; వెల్లుల్లి రెబ్బలు – నాలుగు ; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ; వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ; అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) ; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు ; కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ; ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా.. వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి. ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి. వంకాయ కాలిన తరువాత చల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి. బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్ డిష్. -
టమాటా లేకపోతేనేం.. ఇలా వంటలు చేసుకోండి
చాలామందికి టొమాటో కలపనిదే కూర చేయబుద్ధి కాదు. అయితే ఇటీవల కొద్దికాలం నుంచి సెంచరీ కొట్టినా .. కిందకి దిగనంటోంది టొమాటో. అయినా ఏం పర్వాలేదు, టొమాటో లేకపోయినా కూరలను రుచిగా వండొచ్చని చేసి చూపిస్తోంది ఈ వారం వంటిల్లు.... బైగన్ కా బార్తా తయారీకి కావల్సినవి: మీడియం సైజు వంకాయలు – రెండు వెల్లుల్లి రెబ్బలు – నాలుగు నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు ; అల్లం – అంగుళం ముక్క (సన్నగా తురుముకోవాలి) పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు ; ఉల్లిపాయ తరుగు – అరకప్పు కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా.. ♦ వంకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. ♦ ఇప్పుడు వంకాయలకు కొద్దిగా నూనె రాసి మూడు వైపులా మూడుగాట్లు పెట్టాలి. ఈ చీలిక మధ్యలో వెల్లుల్లి రెబ్బలను లోపలికి పోయేలా పెట్టాలి. ♦ ఇప్పుడు వంకాయను మంటమీద నేరుగా పెట్టి చక్కగా కాల్చుకోవాలి. ♦ వంకాయ కాలిన తరువాతచల్లారనిచ్చి, వెల్లుల్లి రెబ్బలను బయటకు తీసి సన్నగా తరగాలి. వంకాయను మెత్తగా చిదుముకోవాలి. ♦ బాణలిలో నూనెవేసి, కాగిన తరువాత వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ♦ ఇప్పుడు చిదుముకున్న వంకాయ గుజ్జు, ఉడికించి తరిగిన వెల్లుల్లిని వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ♦ కారం, ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ♦ నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లుకుని దించేస్తే బైగాన్ బార్తా రెడీ. రోటీల్లోకి మంచి సైడ్ డిష్. -
నోరూరించే పంజాబ్ వెజ్ వంటకాలు ఇవే! (ఫొటోలు)
-
Kitchen Tips: ఎంత తోమినా జిడ్డు వదలడం లేదా? ఈ చిట్కాలు పాటించండి
మార్కెట్లో దొరికే డిష్‌వాష్ బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధరకాల చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం... వెనిగర్‌లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి. గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తోమితే మురికితో పాటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే జిడ్డు, వాసన వదిలి చక్కగా శుభ్రపడతాయి. -
Misal Pav: ప్రపంచ గుర్తింపు.. భారత్‌లో అత్యంత రుచికరమైన వేగన్ ఫుడ్ ఇదే!
స్నాక్స్ అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ఇంట్లోవారికి, ఆఫీసుల్లో పనిచేసేవారికి, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమందైతే స్నాక్స్ తినకుండా పనిచేయరు. సాయంత్రమైతే చాలు నోరు లాగేస్తుంది.. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. స్నాక్స్‌లో బ్రెడ్‌తో చేసే వంటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వడాపావ్, పావ్ బాజీ, మిసాల్ పావ్. ఇవన్నీ మహారాష్ట్రలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్. మిసల్ పావ్.. మహారాష్ట్రలోని పావ్ ఆధారిత స్ట్రీట్ ఫుడ్స్‌కు చెందిన ప్రముఖ వంటకం మిసల్ పావ్. ఇది రోడ్‌సైడ్ స్టాల్స్, బ్రేక్‌ఫాస్ట్ జాయింట్లు, ఆఫీస్ క్యాంటీన్లలో ఎక్కువగా కనిపిస్తుంది. మాత్ బీన్స్ మొలకలు(అలసంద గింజలు), కొబ్బరి, టమాటా, మసాలా దినుసులతో స్పైసీ కూరలాగా తయారు చేస్తారు. తరువాత దీనిపై సేవ్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి బ్రెడ్‌తో వడ్డిస్తారు. అయితే మిసల్ పావ్లో ఉపయోగించే పదార్థాలు, ప్రదేశాన్ని బట్టి అనేక రకాలు ఉన్నాయి. పుణె మిసల్, ఖండేషి మిసల్, నాసిక్ మిసల్, అహ్మద్‌నగర్ మిసల్ ప్రఖ్యాతిగాంచాయి. 2015లో లండన్‌లోని ఫుడీ హబ్ అవార్డ్స్‌లో మిసల్ పావ్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాఖాహార వంటకంగా పేరు పొందింది. ఈ అవార్డును ఆస్వాద్ రెస్టారెంట్ గెలుచుకుంది. ఈ రెస్టారెంట్‌ను 1986లో బాల్ థాకరే ప్రారంభించారు. ఇది ప్రతిరోజూ 400 ప్లేట్ల కంటే ఎక్కువ మిసాల్ పావ్‌ను అందజేస్తుందని నివేదిక వెల్లడించింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత.. ఈ వంటకం మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మిసల్ పావ్ మళ్లీ మొదటి స్థానం సంపాదించింది. ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని బెస్ట్-రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసాల్ పావ్ 11వ స్థానానికి చేరుకుంది. వీటితోపాటు మరో మూడు వంటకాలు ఆలూ గోబీ, రాజ్మా, గోబీ మంచూరియన్ కూడా టాప్ 25లో నిలిచాయి. ఆలూ గోబీ 20వ స్థానంలో నిలిచింది, రాజ్మా 22వ స్థానంలో నిలిచింది మరియు గోబీ మంచూరియన్ 24వ స్థానంలో నిలిచింది. ఇవేగాక మసాలా వడ 27వ స్థానంలో, భేల్పురి 37వ స్థానంలో, రాజ్మా చావల్ 41వ స్థానంలో నిలిచారు. మొత్తం టాప్ 50లో భారత్ నుంచి ఏడు వెజిటేరియన్ వంటకాలు ఎంపికయ్యాయి. -
అత్యుత్తమ వంటకాల జాబితాలో...షాహీ పనీర్, దాల్, కుర్మా!
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది. టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం! ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) -
ఏడో ప్రపంచ రికార్డు కోసం థీమ్.. ఒకేచోట 500కు పైగా వంటకాలు
సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణ సకినాలు.. ఆంధ్రా ఉలవచారు.. తమిళనాడు చికెన్ చెట్టినాడ్.. కేరళ ఇడియప్పం.. బెంగాలీ రసగుల్లా.. గుజరాతీ దోక్లా.. రాజస్తానీ పాపడ్ కీ సబ్జీ.. ఒకటా రెండా.. దేశంలోని 28 రాష్ట్రాలు.. ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల రుచులు అక్కడ ఘుమఘుమలాడాయి. 500 పైచిలుకు వంటకాలు ప్రదర్శనలో నోరూరించారు. ప్రపంచ రికార్డులో భాగంగా అన్ని రాష్ట్రాల వంటకా లను తయారు చేసి ప్రదర్శించారు. బేగంపేట ఉమానగర్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా విద్యార్థులు శుక్రవారం ఆయా రాష్ట్రాల వంటకాలను ఇండియా మ్యాప్ ఆకృతిపై ప్రదర్శించారు. గతంలో వివిధ అంశాల్లో ఆరు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘ఇండియా ఆన్ థాలి’ పేరిట ఏడో ప్రపంచ రికార్డు కోసం ఈ థీమ్‌ను ఎంచుకుంది. ఆయా రాష్ట్రాల వస్త్ర ధారణలో విద్యార్థులు ఆకట్టుకు న్నారు. -
ఆహా ఏమి రుచి.. తిన్నారు మైమరచి
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ‘జయహో బీసీ మహాసభ’లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారి కోసం నిర్వాహకులు పసందైన వంటకాలతో ఏర్పాటు చేసిన కమ్మని భోజనాలు అదరగొట్టాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కోడిగుడ్లతో పాటు వివిధ రకాల శాఖాహార వంటకాలు, స్వీట్లతో ఆహూతులు సంతృప్తిగా పసందైన భోజనం చేశారు. స్టేడియంలో ఇరువైపులా మూడు భారీ భోజనశాలలతో పాటు కూతవేటు దూరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలోనూ భారీ భోజనశాలను ఏర్పాటు చేయడం, పదుల సంఖ్యలో కౌంటర్లు పెట్టడంతో సభకు వచ్చిన వారంతా ప్రశాంతంగా భోజనాలు ఆరగించారు. వడ్డించిన వంటకాలు: ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, రవ్వ కేసరి, కాఫీ, టీ భోజనం– నాన్‌వెజ్: మటన్ బిర్యానీ, చికెన్ ప్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు–ఎగ్ కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలితో పాటు వెజ్ బిర్యానీ, పనసకాయ ధమ్, పన్నీర్ గ్రీన్‌పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమోటా పప్పు, గోంగూర పచ్చడి, వైట్‌రైస్, సాంబారు, పెరుగుతో పాటు అందరికీ తాపేశ్వరం కాజా, మంచినీటి బాటిళ్లను అందించారు. -
నట్టింటికే నలభీములు!
సాక్షి, హైదరాబాద్: పులిహోర, బగారన్నం, గుత్తి వంకాయ, పూర్ణం బూరెలు, నేతి గారెలు, నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు, మటన్ కీమా ఇలాంటి వంటలు ఇంట్లోనే సులువుగా వండేస్తారు. మరి క్లాసిక్ చికెన్‌కర్రీ, థాయ్ బాసిల్ చికెన్ స్టిర్‌ఫ్రై, ఇటాలియన్ పీనట్ నూడుల్స్ విత్ చికెన్, మెక్సికన్ కార్న్ టోర్టిల్లా, నాచో చిప్స్, గ్రీన్ టొమాటో సల్సా.. ఇలా చిత్రమైన పేర్లతో ఉండే టేస్టీ వంటలు చేయాలంటే ఎలా? ఏముందీ ఓ మంచి చెఫ్ (వంటల నిపుణుడు)ను ఇంటికి పిలిపించుకుంటే సరి. గృహిణికి ఒకరోజు విరామం. ఉద్యోగినికి సెలవును సెలవుగా గడిపే అవకాశం. సరికొత్త వంటలను మన ఇంట్లోనే నచ్చినట్టుగా చేయించుకుని తినే వీలు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శ్రుతిరెడ్డి సరికొత్తగా ‘ఓవైచెఫ్ (ఓన్ యువర్ చెఫ్)’పేరుతో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఏం వండాలి? ఎంత వండాలి? ఆధునిక నలభీములను ఒకచోటికి చేర్చడం, అవసరమైన వారి ఇంటికే వెళ్లి వంట చేసిపెట్టడం కోసం ఆన్లైన్ వేదికగా ‘ఓవైచెఫ్’ను శ్రుతిరెడ్డి ప్రారంభించారు. ఈ తరహా ప్రయోగం మన దేశంలో ఇదే మొదటిసారని అంచనా. రోజూ వంటచేసే గృహిణికి ఒకరోజు విరామం కావాలన్నా.. ఇంట్లో ఏదైనా చిన్న వేడుక జరుపుకొంటున్నా.. చెఫ్‌ను మీ ఇంటికి పిలిపించుకుని వంట చేయించుకోవచ్చు. ఎంతమందికి వండాలో, ఏమేం వండాలో చెబితే చాలు. ‘ఓవైచెఫ్’నుంచి ఆ వంటల్లో స్పెషలిస్టులను మన ఇంటికి పంపుతారు. నార్త్ ఇండియన్, సౌత్ రుచులు, చైనీస్, థాయ్, ఇటాలియన్, అమెరికన్, కాంటినెంటల్ ఇలా అన్నిరకాల వంటకాలు చేసే చెఫ్‌లు అందుబాటులో ఉంటారు. అంతేకాదు.. ప్రత్యేక వంటకాలు చేసేందుకు ఓవెన్లు, బార్బిక్యూల వంటి పరికరాలు లేకున్నా.. అందుబాటులో ఉండే పద్ధతిలోనే వంటలు చేయడానికి ప్రయత్నిస్తారని శ్రుతిరెడ్డి తెలిపారు. కలసి భోజనం చేస్తుండగా ఆలోచనతో.. శ్రుతిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉద్యోగం చేశారు. కొంతకాలం ఓ బొటిక్ నడిపారు. ఆ తర్వాత వర్జీనియా ప్రాంతంలో ‘టామరిండ్ ఇండియన్ కుకింగ్’పేరుతో ఒక రెస్టారెంట్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఈ ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చారు. తర్వాత కరోనా రెండో వేవ్ లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో రోజూ స్వయంగా వండుకుంటూ, అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో.. ఇంటికొచ్చి వంట చేసిపెట్టే చెఫ్‌ల ఆలోచన వచ్చిందని శ్రుతి చెప్పారు. ఆ ఆలోచనకు కార్యరూపమే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రారంభమైన ‘ఓవైచెఫ్’అని వివరించారు. చెఫ్‌లకూ గౌరవం లభించాలి నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని మా తాత వంటేరు సుదర్శన్‌రెడ్డి చెప్తుండేవారు. ఆయన స్ఫూర్తితోనే కొందరు మిత్రుల సహకారంతో.. వినూత్నంగా ‘ఓవై చెఫ్’స్టార్టప్ తెచ్చాను. తినేవారి ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని వండగలిగిన నిపుణులు మావద్ద ఉన్నారు. గంటకు మూడు వందల రూపాయలు మొదలుకొని పన్నెండు వేల వరకు చార్జ్ చేసే టాప్ చెఫ్‌లూ ‘ఓవైచెఫ్’తో అనుసంధానమై ఉన్నారు. ఈ సర్వీస్‌ను మరింతగా విస్తరిస్తాం. వండటం అనే వృత్తికి సమాజంలో గౌరవస్థానం లభించేలా చేయాలనేది నా కోరిక. – శ్రుతిరెడ్డి, ఓవై చెఫ్ వ్యవస్థాపకురాలు -
రికార్డు కొట్టేసిన ‘వంటలక్క’.. 30 నిమిషాల్లో..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై తిరుమంగళానికి చెందిన ఒక మహిళ 30 నిమిషాల్లో 134 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. తనకున్న ప్రత్యేక టాలెంట్‌తో ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ అరగంట వ్యవధిలో 130 రకాల శాఖాహార, మాంసాహార వంటకాలు ఉండటం విశేషం. చిన్నతనం నుంచే వంటలపై ఆసక్తి ఉన్న ఇందిరా రవిచంద్రన్ పాక కళలో కొత్త రికార్డు సృష్టించారు.అతి తక్కువ సమయంలో ఎక్కువ రకాల వంటలు చేసిన ఇందిరా రవిచంద్రన్ పేరును ఇండియా రికార్డ్‌లో నమోదు చేశారు. చాలా రోజుల శిక్షణ తర్వాత, రికార్డు సృష్టించే ప్రయత్నంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షణలో దోస, ఇడ్లీ, ఉతప్పం, ఆమ్లెట్, ఓఫయిల్, వడ, బజ్జీ, ఐస్ క్రీం, పుడ్డింగ్తోపాటు, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, వంటి అనేక రకాల మాంసాహార వంటకాలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల రసాలు, కేకులు కూడా ఉన్నాయి. చదవండి : అలా నటిద్దామనుకున్నాడు.. కనీసం మంచం కూడా దిగలేక పాట్లు! అంతకుముందు ఎవరి పేరుతో ఉందీ రికార్డు కాగా ఇంతకు ముందు, కేరళకు చెందిన 10 ఏళ్ల బాలుడు హాయెన్ ఒక గంటలో 122 వంటకాలను తయారు చేసాడు. తాజాగా రవిచంద్రన్ అధిగమించారు. దీంతో ఆమెపైప్రశంసల వెల్లువ కురుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఆమె రియాలిటీ వంట కార్యక్రమాల్లో కూడా సందడి చేయనున్నారు. అనేక ఛానెల్‌లు ఇప్పుడు ఆమెను వంట కార్యక్రమాలకు జడ్జ్‌గా రమ్మని ఆహ్వానిస్తున్నారట. చదవండి : Kukatpally: కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే.. చదవండి : న్యూలుక్లో అదరగొట్టిన నటి, పెళ్లి ప్రపోజల్‌కు రిప్లై -
గోంగూరతో చికెన్, మటన్.. అద్భుతః అనాల్సిందే
ఆవకాయ తరువాత తెలుగువారు అధికంగా ఇష్టపడే గోంగూరను ఏ కూరలో వేసి వండినారుచి అమోఘంగా ఉంటుంది. ఘాటు మసాలాలతో ఘుమఘుమలాడే మాంసాహారాన్ని పుల్లని గోంగూరతో వండితే అద్భుతః అనాల్సిందే. గోంగూర చికెన్ ఫ్రై కావలసినవి: గోంగూర – రెండు కట్టలు. పెద్ద ఉల్లిపాయ – ఒకటి సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిరపకాయలు – ఐదు, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అరటీస్పూను, గరం మసాలా – అర టీస్పూను, ఆయిల్ – నాలుగు టీస్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను. మ్యారినేషన్ కోసం.. చికెన్ – అరకేజీ, నిమ్మరసం – అర టీస్పూను, కారం – టీ స్పూను, ధనియాల పొడి – అర టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ. ► ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి అరగంటపాటు నానబెట్టాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టి టీ స్పూను ఆయిల్ వేసి గోంగూరను వేసి వేయించి, చల్లారనివ్వాలి. ► తరువాత వేయించిన గోంగూర, పచ్చిమిరపకాయలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ► నానబెట్టిన చికెన్ మిశ్రమాన్ని మూతపెట్టి మీడియం మంట మీద పదినిమిషాలు ఉడకనివ్వాలి. ► మధ్యలో కలుపుతూ చికెన్‌లో వచ్చిన నీళ్లు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి నెయ్యి, మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ► ఇవి వేగాక ఉడికిన చికెన్, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ► ఇప్పుడు గోంగూర పేస్టు వేసి చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే మరికాస్త వేసుకుని, ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్‌ను వేయిస్తే గోంగూర చికెన్‌ఫ్రై రెడీ. గోంగూర మటన్ కర్రీ కావలసినవి: మటన్ – అరకేజి, పసుపు – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, పెద్ద ఉల్లిపాయ – ఒకటి, ఆయిల్ – ఆరు టీ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – మూడు టీ స్పూన్లు, ధనియాల పొడి – టీ స్పూను, జీలకర్ర పొడి – అర టీ స్పూను, పచ్చిమిరపకాయలు – ఐదు, గోంగూర – మీడియం సైజు ఐదు కట్టలు, కొత్తిమీర – చిన్న కట్ట ఒకటి, గరం మసాలా పొడి – టీ స్పూను, షాజీరా – టీ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క. తయారీ: ► మటన్‌ను శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అరకప్పు నీళ్లు పోసి ఒకసారి అన్నీ కలిపి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టి ఆరు టీస్పూన్ల ఆయిల్ వేసి దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ► కొద్దిగా ఉప్పువేసి గోల్డెన్ బ్రౌన్ రంగు మారేంత వరకు వేయించాలి. ► తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచి వాసన వచ్చేంతరకు వేయించాక, పసుపు, పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు ఉడికిన మటన్ వేసి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని గరం మసాలా, తరిగిన కొత్తి మీర వేసి 10 నిమిషాలు ఉడికిస్తే గోంగూర మటన్ కర్రీ రెడీ. గోంగూర పచ్చి రొయ్యల ఇగురు కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజి, గోంగూర – మూడు కట్టలు, పెద్ద ఉల్లిపాయలు – రెండు, ఎండు మిరపకాయలు – పన్నెండు, పచ్చిమిరపకాయలు – మూడు, వెల్లుల్లి తరుగు – రెండు టీ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పసుపు – అర టీస్పూను, ఆయిల్ – నాలుగు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ► ముందుగా గోంగూరను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి దోరగా వేయించి పేస్టులా చేసి పక్కన బెట్టుకోవాలి. ► రెండు పెద్ద ఉల్లిపాయలు, జీలకర్ర, పది ఎండు మిరపకాయలను మిక్సీజార్‌లో వేసి పేస్టు చేసి పెట్టుకోవాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టుకుని నాలుగు టీస్పూన్ల ఆయిల్ వేసి కాగాక ఆవాలు వేయాలి. ► ఆవాలు వేగాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ► ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు వేసి ఐదు నిమిషాలు వేగనిచ్చి, తరువాత కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేయాలి. ► రొయ్యలు వేసిన ఐదు నిమిషాల తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తరువాత గోంగూర పేస్టు వేసి బాగా కలపాలి. ► అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే గోంగూర పచ్చిరొయ్యల ఇగురు రెడీ. -
అత్త 60వ పుట్టినరోజుకు కోడలి సర్ప్రైజ్.. నెటిజన్ల ఫిదా!
సాక్షి, పశ్చిమగోదావరి: అత్తాకోడళ్లు అంటేనే జగడాలకు మారుపేరుగా మారిపోయింది నేటి కాలంలో. టివీ సీరియళ్లలో అత్తాకోడళ్ళ పోరాట సన్నివేశ దృశ్యాలే ముందుగా కళ్ల ముందుకొస్తాయి. చాలా కుటుంబాల్లో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ నిత్యం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే స్థాయికి చేరింది. అయితే అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా తక్కువగా వింటుంటాం. అత్తాకోడళ్లు అనుబంధం బాగుంటే ఆ ఇల్లు ఆనందంగా కళకళలాడుతుంది. కోడలిని కూతురిగా, అత్తను కూడా తల్లిగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం అత్తకోడళ్ళ మధ్య ఉన్న ప్రేమను చాటే ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది జరిగింది ఎక్కడో పరాయి దేశం, పక్క రాష్ట్రంలో కాదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని మెచ్చుకుంటున్నారు. మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. -
దునియాలో ఇలాంటి పెళ్లి చూసుండరు.. ఎందుకంటారా?
అతిథిదేవో భవ అంటారు. సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదులు, భోజనాలు అంటూ వాళ్లకి సపర్యలు చేసి పది కాలాలు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. అయితే, ఈ పెళ్లి మాత్రం రోటీన్‌కు భిన్నంగా జరిగింది. నవదంపతులను మనసారా ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు విందు పెట్టడమే కాదు, వారు తిన్న పాత్రలను వారితోనే కడిగించారు. పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.. కానీ వివరాల్లోకి వెళితే.. ‘రెడిట్’ అనే సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళ పంచుకోవడంతో ఈ పెళ్లి తంతు బయటకొచ్చింది. ‘‘వధువు మా దగ్గర బంధువే. కానీ, వరుడి గురించి నాకు పెద్దగా తెలియదు. వాళ్లు పెళ్లి కోసం బాగానే ఖర్చు పెట్టారు. అందులో భాగంగా ఖరీదైన వేదికను అద్దెకు తీసుకుని, అలంకరణ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వేదికను అద్భుతంగా డెకరేట్ చేయించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు విందు కోసం బఫెట్‌లోని ఫుడ్ కూడా చాలా టేస్టీగానే ఉందని తెలిపింది. ఇక్కడ వరకు అంతా బాగానే నడిచింది .ప్లేటు నిండా ఆహారం పెట్టుకుని ఆరగిస్తున్నాను. అయితే, నా భర్త ఖాళీ ప్లేటుతో నా దగ్గరకు వచ్చాడు. ఏమైందని అడిగితే ఫుడ్ అయిపోయిందని చెప్పాడు. దీంతో నేను వధువు తల్లి వద్దకు వెళ్లి అడగగా అందుకు ఆమె పుడ్ అయిపోయిందని, ఇక రాదని చెప్పడంతో మిగిలిన అతిథులంతా ఆకలితోనే పస్తులున్నారు’’ అని తెలిపింది. ఖర్చు ఎక్కువైంది.. ఏమనుకోకుండా కాస్త ప్లేట్లు.. ‘‘ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. సరే ఉన్నదాంతో సరిపెట్టుకుని విందు చేశాక రిసెప్షన్ చూసేందుకు వెళ్లాం. ఇంతలో ఓ పని మనిషి మా వద్దకు వచ్చి కిచెన్‌లోకి రావాలని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత కుప్పలా పడివున్న ప్లేట్లు, గ్లాసులు చూపించి కడగాలని చెప్పింది. ఒక్కసారిగా షాక్ తగిలి ఏంటని వధువు తల్లిని అడగగా.. పెళ్లి ఖర్చులన్నీ వధువు వెడ్డింగ్ గౌను, వేదిక, విందుకే అయిపోయానని, గిన్నెలు కడిగేందుకు మనుషులను పెట్టుకోలేకపోయామని సాఫీగా ఆమె సమాధానం ఇచ్చింది. ఇక చేసేదేమిలేక నేను, మరో తొమ్మిది మంది అతిథులం పెళ్లిలోని ప్లేట్లు కడిగాల్సి వచ్చింది. పెళ్లి కోసం వచ్చి మొత్తం సమయాన్నంత మేం కిచెన్లోనే గడిపాల్సి వచ్చింది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగగా, ప్రస్తుతం ఆ జంట విడాకులు కూడా తీసేసుకున్నారు. బహుశా అతిథుల అవమానపరిచనందుక ఫలితమేమో ఇది ఏమైనా!’ అని సదరు మహిళ చెప్పుకొచ్చింది. ఇది చదివిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఇది చాలా చేదు అనుభవం. తినేందుకు సరిపడా పుడ్ లేకపోగా.. ప్లేట్లు కడిగించారు. అసలు వాళ్ల పెళ్లి గురించే ఆలోచించారే గానీ.. అతిథులను పట్టించుకోలేదు’’ అని ఒకరు. ‘‘నీ స్థానంలో నేను అక్కడ ఉంటే.. తక్షణమే పెళ్లి నుంచి పరారయ్యేవాడిని’’ అని మరొకరు కామెంట్ చేశారు. -
నూడుల్స్‌తో సమోసా ట్రై చేశారా?
నూడుల్స్ సమోసా కావలసినవి: మైదా పిండి – పావు కిలో, ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు, వాము – అర టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, ఉల్లికాడ ముక్కలుతె పాటు వాము కూడా వేసుకుని, గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ కూడా వేసుకుని కాసేపు వేయించి, బయటికి తీసి ప్లేటులో పరిచినట్లుగా వేసి... కాస్త ఆరనివ్వాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని, అందలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకుని... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పుచ్చకాయ హల్వా కావలసినవి: పుచ్చకాయ జ్యూస్ – 2 కప్పులు(వడకట్టుకుని రసం మాత్రమే తీసుకోవాలి), పంచదార పొడి – రుచికి సరిపడా, మొక్కజొన్న పొడి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ ముక్కలు – అభిరుచిని బట్టి(నేతిలో వేయించినవి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో పుచ్చకాయ రసంలో పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో ఆ మిశ్రమాన్ని వేసుకుని.. చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. బాగా దగ్గర పడే సమయంలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ.. మరింత దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి.. ఒక బౌల్‌కి అడుగు భాగంలో నెయ్యి లేదా నూనె రాసి.. అందులోకి ఆ మిశ్రమాన్ని మొత్తం తీసుకుని, దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు గార్నిష్ చేసుకుని, 2 గంటల తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బనానా ఎగ్ కేక్ కావలసినవి: అరటిపండ్లు – 2(మీడియం సైజ్‌వి తీసుకుని, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 4, పంచదార, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండుద్రాక్ష, జీడిపప్పు – గార్నిష్‌కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని గుడ్లు, పాలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, వేడి చేసి, అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేయించి పక్కకు తియ్యాలి. ఇప్పుడు ఆ పాన్‌లో అరటిపండ్ల ముక్కలు వేసుకుని చిన్న మంట మీద 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పాలు–గుడ్ల మిశ్రమంలో వేసి గరిటెతో అటు ఇటుగా తిప్పి.. పంచదార, ఏలకుల పొడి వేసుకుని మరో సారి అలానే కలపాలి. ఇప్పుడు పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. గుడ్లు–అరటిపండ్ల మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసుకుని.. నేతిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని, చిన్న మంట మీద మూతపెట్టి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే బనానా ఎగ్ కేక్ రెడీ. -
బ్రెడ్ రోల్స్ విరిగిపోకుండా రావాలంటే ఇలా చేయండి..
బ్రెడ్ రోల్స్ కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 10(అంచులు తొలగించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – 1 కప్పు, పనీర్ తురుము – పావు కప్పు, ఉల్లిపాయ – 1(సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 2(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – పావు టీ స్పూన్, వెన్న – 1 టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో వెన్న వేసుకుని, కరిగిన వెంటనే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం పనీర్ తురుమును కూడా వేసి వేయించుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకుని, ఒక నిమిషం పాటు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఒక్కో బ్రెడ్ స్లైస్‌లో వేసుకుని రోల్లా చుట్టుకోవాలి. రోల్ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. బీట్రూట్ పకోడా కావలసినవి:బీట్రూట్ తురుము – అర కప్పు, పచ్చి శనగపప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి), జీలకర్ర – పావు టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – 2(చిన్నగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బీట్ రూట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి శనగపప్పు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని.. పకోడాలు వేసుకోవాలి. వెజిటబుల్ పనియారం కావలసినవి:దోసెల పిండి – 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ గుజ్జు, బీట్రూట్ గుజ్జు – పావు కప్పు చొప్పున, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. దోసెల పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ గుజ్జు, బీట్రూట్ గుజ్జు, పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం– వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని.. పొంగనాల పాన్‌లో అడుగున నూనె రాసుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం పెట్టుకుని, కుక్కర్లో లేదా ఓవెన్లో ఉడికించుకుంటే వెజిటబుల్ పనియారం సిద్ధం. -
మీరు వెజిటేరియన్సా? మీ కోసమే ఈ పన్నీర్ 65 రెసిపీ..
పనీర్ 65 కావలసినవి: పనీర్ ముక్కలు – 15, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు, మైదా – ఒక టీస్పూను, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను, అల్లం పేస్టు – ఒక టీస్పూను, కారం – సరిపడినంత (స్పైసీగా కావాలనుకుంటే టీ స్పూను వేసుకోవచ్చు), పసుపు – అర టీ స్పూను, గరం మసాలా – టీస్పూను, నూనె – సరిపడినంత తయారీ: స్టవ్ మీద కళాయి పెట్టి... వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా... మరో బర్నర్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పనీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్ 65 సిద్ధం. స్వీట్ కార్న్ పాయసం కావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, పిస్తా, కిస్ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి, కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్ – పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్ కార్న్ పాయసం. పాలక్ పరోటా కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట, నిమ్మరసం – 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – కావాల్సినన్ని, నూనె/నెయ్యి – సరిపడా తయారీ: ముందుగా పాలకూర శుభ్రం చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకుని.. ఆ ముద్దకు తడి వస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్ ఉండలులా చేసుకుని.. చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. సేకరణ: సంహిత నిమ్మన -
చపాతీ వెజ్ రోల్స్ చేయడం ఇంత సులువా?
చపాతీ వెజ్ రోల్స్ కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, టమాటో కెచప్ – 1 టీ స్పూన్, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్ వేసి ఉడికించాలి. అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. డేట్స్ హల్వా కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక బౌల్లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రింజాల్ రోల్స్ కావలసినవి: వంకాయలు (బ్రింజాల్) – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్ స్పూన్లు, క్యారెట్ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆలీవ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్రూట్ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా (థిన్ స్లైస్‌లా) కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్ చేసుకుని, టమాటా సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మ -
టమాటతో హల్వా, డిఫరెంట్ రెసిపీ మీకోసం
పనీర్ లాలీపాప్స్ కావలసినవి: పనీర్ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ చొప్పున, ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరాన్ని బట్టి, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో పనీర్ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్ పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటో హల్వా కావలసినవి: పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్ కలర్ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ పకోడా కావలసినవి:మీల్మేకర్ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున, శనగపిండి – పావు కప్పు+3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని సరిపడా నీళ్లతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలుచగా కలుపుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో పకోడాలను దోరగా వేయిస్తే రుచి అదిరిపోతుంది. -
పచ్చి బఠాణీతో ఇన్ని వెరైటీలా?
పచ్చి బఠాణీ... పచ్చ బఠాణీ... ఇంగ్లీషులో పీస్, హిందీలో మటర్.. భాష ఏదైతేనేం.. వంటకాలకు రుచి, వన్నె తీసుకు వస్తుంది. కంటికీ ఇంపుగా ఉంటుంది. ఎందులోనైనా ఇట్టే కలిసిసోతుంది. పచ్చి బఠాణీలతో బోలెడు వంటకాలు. మచ్చుకి ఈ ఆరు వంటలు. ఇవే కాదు.. మీరూ మరిన్ని ప్రయత్నించండి. పీస్‌ఫుల్‌గా వండండి. ఫుల్ మీల్స్ తినండి. పచ్చి బఠాణీ కట్లెట్స్ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పచ్చి బఠాణీలు – అర కప్పు; బొంబాయి రవ్వ – ఒక కప్పు; జీలకర్ర – పావు టీ స్పూను; సోడా – చిటికెడు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి ముద్ద– తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; నూనె – తగినంత; ఉప్పు – తగినంత; ఉడికించిన బంగాళదుంప ముద్ద – అర కప్పు; కొత్తిమీర – తగినంత తయారీ: సగ్గు బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి, నీరంతా ఒంపేసి, సగ్గు బియ్యం మునిగేవరకు మంచి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు వడబోయాలి. బఠాణీలను తగినిన్న నీళ్లలో గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి. బొంబాయి రవ్వలో సగ్గుబియ్యం + బఠాణీ ముద్ద, బంగాళదుంప ముద్ద వేసి బాగా కలిపి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలపాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, తడి వస్త్రం మీద ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్లెట్ సైజులో ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి బాగా కాలాక, తీసేసి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది. పచ్చి బఠాణీ ఖీర్ కావలసినవి: పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి కోవా – అర కప్పు; ఆనప కాయ తురుము – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; పాలు – 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు – గుప్పెడు; ఎండు ద్రాక్ష – 15; ఏలకుల పొడి – చిటికెడు; కర్బూజ గింజలు – టీ స్పూను తయారీ: ∙పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి, ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఆనపకాయ తురుముకి కొద్దిగా పాలు జత చేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ రాగానే దించేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి బఠాణీ ముద్ద వేసి పది నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఆనపకాయ తురుము జత చేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. ఎండాకాలం ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది. పచ్చి బఠాణీ పరోఠా కావలసినవి: గోధుమ పిండి – 3 కప్పులు; పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి మిర్చి ముద్ద – తగినంత; నువ్వులు – అర టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; నెయ్యి – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. గోధుమ పిండికి పచ్చి బఠాణీ ముద్ద జత చేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి. ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి. పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి. పచ్చిబఠాణీ రైస్ కావలసినవి బాస్మతి బియ్యం – 2 కప్పులు; పచ్చి బఠాణీ – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; గరం మసాలా – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీసేయాలి. పచ్చి మిర్చి తరుగు, బంగాళ దుంప ముక్కలు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీయాలి. పసుపు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి. ఉప్పు, ధనియాల పొడి జత చేసి బాగా కలిపాక, పుదీనా ఆకులు జత చేసి మరోమారు కలపాలి. పచ్చి బఠాణీ జత చేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. మూత ఉంచి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉడికించి మూత తీసేయాలి. తగినన్ని నీళ్లు జత చేసి మరిగించాక, కడిగిన బియ్యం వేసి కలియబెట్టి, ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. పచ్చి బఠాణీ టొమాటో కూర కావలసినవి: ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు – కప్పు; టొమాటో గుజ్జు – ఒక కప్పు; కొత్తిమీర – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్ళు – తగినన్ని; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, జీలకర్ర, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. టొమాటో గుజ్జు జత చేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ∙మిరప కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మంట కొద్దిగా తగ్గించి, రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి. నీరు పొంగుతుండగా పచ్చి బఠాణీలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న వాటిని కొన్నిటిని మెత్తగా మెదిపితే చాలు. చపాతీ, రోటీ, పూరీ, అన్నం.. దేనిలోకైనా రుచిగా ఉంటుంది. పచ్చి బఠాణీ మసాలా కర్రీ కావలసినవి: బఠాణీ – ఒకటిన్నర కప్పులు, నూనె – తగినంత; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను తయారీ: స్టౌ మీద ప్రెజర్ పాన్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు బాగా కలియబెట్టాలి. పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి జత చేసి ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించాలి. ఒక కప్పు నీళ్లు జత చేయాలి. బఠాణీలు జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించాలి. చపాతీ, పూరీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది. పచ్చి బఠాణీలు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటం ఎలా.. ఇప్పుడు మార్కెట్లోకి పచ్చి బఠాణీ విరివిగా వస్తున్నాయి. వీటి వంటకాలు కూడా ఈ సీజన్లో ఎక్కువగానే చేసుకుంటారు. రాబోయే నెలల్లో ఇవి రావటం తగ్గిపోతుంది. అన్ సీజన్లో పచ్చి బఠాణీ వాడుకోవాలంటే మార్కెట్లో రంగులు వేసి బఠాణీలు మాత్రమే దొరుకుతాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఏడాది పొడవునా పచ్చి బఠాణీ వాడుకోవటానికి మార్గం లేకపోలేదు. ► పచ్చి బఠాణీ కాయలను తెచ్చి, గింజలు ఒల్చి పక్కన ఉంచుకోవాలి ► స్టౌ మీద పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి ► పచ్చి బఠాణీలను అందులో వేసి అయిదారు నిమిషాలు ఉడికించాలి ► బఠాణీలు పూర్తిగా కాకుండా, సగం సగంగా మాత్రమే ఉడకాలి ► ఉడికించిన బఠాణీలలో నుంచి నీళ్లు ఒంపేసి, ఆ బఠాణీలను చల్లటి ► నీళ్లలో వేసి, బాగా చల్లగా అయ్యేవరకు ఉంచాలి ► బఠాణీలలోని నీళ్లు వడగట్టి, బఠాణీలను పొడి వస్త్రం మీద ► నీడలో ఆరబోయాలి ► తడి పూర్తిగా పోయిన తరవాత, జిప్‌లాక్ కవర్లలో భద్రపరచాలి ► ఈ కవర్లను డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి ► అవసరమనుకున్నప్పుడు తీసి వాడుకోవాలి. -
నోరూరించే ఎగ్ బన్స్ చేసుకోండిలా..
ఎగ్ బన్స్ కావలసినవి: గుడ్లు – 6 బన్స్ – 6, ఉల్లిపాయలు – 3 పచ్చిమిర్చి – 2 చీజ్ తురుము – 2 టీ స్పూన్లు కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ కారం – 1 టీ స్పూన్ మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లు ఉప్పు – తగినంత తయారీ: ముందుగా బన్స్ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్ బౌల్స్‌లో వేసుకుని.. ప్రతి బన్‌లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఆపిల్ కోవా హల్వా కావలసినవి: ఆపిల్స్ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి) బాదం గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు కోవా – అర కప్పు దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ పంచదార – అర కప్పు నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అరటిపండు పునుగులు కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) గోధుమ పిండి – పావు కప్పు బియ్యప్పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు మొక్కజొన్న పిండి – ముప్పావు కప్పు ఉప్పు – తగినంత బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్ చేసుకోవాలి. - సేకరణ: సంహిత నిమ్మన -
పిండివంటలు చేసి నోటిని కరకరలాడిస్తూ..
కొత్త సంవత్సరం.. కొత్త బియ్యం.. కొత్త పిండి.. కొత్త వంటలు.. కొత్త రుచులు.. బియ్యం పిండివంటలు చేసి నోటిని కరకరలాడిస్తూ.. రుచుల శబ్దాలతో దుప్పటి కప్పుకున్న సూర్యుడిని నిద్ర లేపుదాం.. బియ్యప్పిండి వంటకాలను ఆయనకు చూపిస్తూ ఆస్వాదిద్దాం.. పొంగనాలు కావలసినవి బియ్యప్పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; వంట సోడా – చిటికెడు తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్ళు జతచేసి, మరోమారు బాగా కలపాలి (దోసె పిండి కంటే గట్టిగా ఉండాలి) మూతపెట్టి ఐదు నిముషాలు వదిలేయాలి ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంట సోడా దీనికి జత చేసి, మరోసారి బాగా కలపాలి స్టౌమీద పొంగణాల స్టాండ్ పెట్టి, అన్ని గుంటల్లోనూ సమానంగా నూనె వేయాలి తయారు చేసుకున్న పిండిని, గుంటల నిండుగా వేయాలి మూతపెట్టి, మీడియం మంట మీద మూడు నిముషాలు ఉంచాక, తిరగేసి కొద్దిగా నూనె వేసి మళ్ళీ మూత పెట్టాలి మరో రెండు నిముషాల తరవాత పొంగనాలను ప్లేటులోకి తీసుకోవాలి కొబ్బరి, అల్లం చట్నీలతో వేడిగా అందించాలి. వడ కావలసినవి బియ్యప్పిండి – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ ఒక పాత్రలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు, రెండు టీ స్పూన్ల నూనె వేసి, చేతితో బాగా కలపాలి బియ్యం పిండి జత చేస్తూ కలపాలి ∙కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ వడ పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి అర చేతికి కొద్దిగా నూనె పూసుకుని, కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ వడ మాదిరిగా వత్తి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలోకి తగ్గించి ఒత్తి ఉంచుకున్న వడలను నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చే వరకూ రెండువైపులా వేయించి పేపర్ నేప్కిన్ పైకి తీసుకోవాలి ∙సాస్‌తో అందించాలి. చిప్స్ కావలసినవి బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్ళు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు + డీప్ ఫ్రైకి సరిపడా; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; కొత్తి మీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ స్టౌ మీద ఒక వెడల్పాటి పాత్రలో నీళ్ళు మరిగించాలి ఉప్పు, పసుపు, మిరప కారం, జీలకర్ర, నూనె, నువ్వులు, కొత్తిమీర తరుగు ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి స్టౌ ఆపేసి, మరుగుతున్న నీటిలో బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేసి, కలుపుతుండాలి కొద్దిగా చల్లారిన తరవాత పిండిని, ఐదు నిముషాల పాటు చపాతి పిండి మాదిరిగా కలపాలి పిండిని పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి ∙అప్పడాల పీటపై కొద్దిగా బియ్యం పిండి చల్లుతూ పెద్ద చపాతీగా ఒత్తు కోవాలి చాకుతో కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న కాజాలను వేసి, దోరగా వేయించి, ప్లేటులోకి తీసుకోవాలి బాగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. హల్వా కావలసినవి బెల్లం – అర కప్పు; బియ్యప్పిండి – కప్పు; నీళ్ళు – కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; మిఠాయి రంగు – చిటికెడు; నూనె/నెయ్యి – కొద్దిగా తయారీ స్టౌ మీద ఒక గిన్నెలో బెల్లం, నీళ్ళు వేసి బెల్లం కరిగే వరకూ కలపాలి ఏలకుల పొడి జత చేసి, స్టౌ కట్టేయాలి ∙కిందకు దింపేసి, చల్లారనివ్వాలి ’ బెల్లం నీళ్లు చల్లారాక బియ్యప్పిండి జత చేసి ఉండలు లేకుండా కలపాలి కొద్దికొద్దిగా నీళ్ళు జతచేస్తూ, దోసె పిండి కంటే కొద్దిగా పలచగా ఉండేలా చేసుకోవాలి ∙చిటికెడు ఉప్పు జత చేయాలి ఈ మిశ్రమాన్ని రెండు పాత్రల్లోకి సమానంగా తీసుకోవాలి ∙చిన్న గిన్నెలో టీ స్పూను నీటికి చిటికెడు మిఠాయి రంగు జత చేసి, కరిగించి ఒక పాత్రలో ఉన్న పిండికి జత చేయాలి ఒక ప్లేటుకు నూనె కానీ, నేయి కానీ పూయాలి స్టౌ మీద వెడల్పాటి పాత్రలో గ్లాసుడు నీళ్ళు పోసి, మరిగించాలి (పైన ఉంచే మూతను వస్త్రంతో గట్టిగా కట్టాలి) నీళ్ళపై ఒక స్టాండ్ ఉంచి దాని మీద నెయ్యి లేదా నూనె రాసిన ప్లేటును ఉంచాలి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని ఒక లేయర్‌గా సమానంగా పరవాలి వస్త్రం కట్టిన మూతను ఉంచి ఐదు నిముషాలు ఉడికించాలి మూత తీసి రంగు కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని సమానంగా పరవాలి మూత పెట్టేసి, పది నిముషాల పాటు ఉడికించాలి మంట ఆర్పేయాలి పది నిముషాల పాటు చల్లారిన తరవాత చాకుతో అంచులను జాగ్రత్తగా కట్ చేస్తూ, ప్లేటు నుంచి విడదీయాలి కావలసిన ఆకారంలో ముక్కలను కట్ చేసుకోవాలి. దోసె కావలసినవి బియ్యప్పిండి – కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తి మీర తరుగు, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరప కారం ఒక దాని తరువాత ఒకటి వేస్తూ బాగా కలుపుకోవాలి కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ దోసె పిండి మాదిరిగా కలుపుకోవాలి చివరిగా రెండు గ్లాసుల నీళ్ళు జత చేసి, బాగా పలచగా చేసుకోవాలి స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని, పలచగా దోసె వేసి, ఎర్రగా కాలాక నూనె వేసి, రెండో వైపు కూడా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి కొబ్బరి చట్నీతో అందించాలి. చపాతీ కావలసినవి బియ్యప్పిండి – అర కప్పు; గోధుమ పిండి – అర కప్పు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి కలపాలి నీరు జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి చివరగా కొద్దిగా నీరు జత చేసి, బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి పిండిని ఉండలు చేసుకోవాలి అప్పడాల పీటమీద పొడి పిండి జల్లుకుంటూ ఒక్కో చపాతీని ఒత్తుకోవాలి స్టౌ మీద పెనం వేడయ్యాక ఒక్కో చపాతీని, నూనె జత చేస్తూ కాల్చాలి రెండువైపులా బంగారు రంగులోకి వచ్చే వరకూ కాల్చాలి వేడి వేడి కుర్మాతో తింటే రుచిగా ఉంటాయి. -
చికెన్ వెరైటీల్లోనూ హైదరాబాద్ టాప్
సాక్షి, హైదరాబాద్: చికెన్ లవర్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. టిఫిన్.. లంచ్.. స్నాక్స్.. డిన్నర్ సమయం ఏదైనా.. చికెన్ వంటకాలను కుమ్మేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలో చికెన్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉంది.గ్రేటర్ జనానికి సందర్భం ఎదైనా ముక్క లేనిదే ముద్ద దిగడంలేదు. దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానంలో.. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు మూడోస్థానంలో నిలవడం విశేషం. కాగా పోషక విలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉండటం.. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా తర్వారా చికెన్ విక్రయాలు భారీగా పెరిగినా.. మటన్ వినియోగం మాత్రం అంతగా పెరగలేదని నాన్‌వెజ్ మార్కెట్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. చికెన్ వెరైటీల్లోనూ హైదరా‘బాద్షా’.. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నట్లు పలు ఫుడ్ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. దేశంలోని ఇతర నగరాలతో పోలీస్తే ప్రపంచ వ్యాప్తంగా లభించే వివిధ రకాల చికెన్ డిష్‌లు దాదాపు నగరంలోని అన్ని హోటల్స్‌లో లభిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలీస్తే హైదరాబాద్ హోటల్స్‌లో చికెన్‌తో చేసిన దాదాపు ఇరవైకి పైగా వెరైటీలు లభిస్తున్నాయి. దీంతో కూడా నగర జనం వివిధ రకాల చికెన్ వెరైటీల రుచులు ఆస్వాదిస్తున్నారు. వెరైటీ చికెన్ ఆడర్స్లోనూ దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉందని ఫుడ్ డెలివరీ సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఆది నుంచే భోజన ప్రియులు ఉండటంతో ఇక్కడ అందుబాటులో ఉన్న ఫుడ్ వెరైటీలు దేశంలో ఎక్కడా లేవని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్లో నిత్యం 6 లక్షల కిలోలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజువారి చికెన్ వినియోగం 6 లక్షల కిలోలు ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువగా ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. కోవిడ్ అనంతరం గ్రేటర్లో రోజూ 6 లక్షల కిలోల వినియోగం ఉండగా ఢిల్లీలో 5.5 లక్షలు, బెంగళూరులో 5 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుతున్నాయని పౌల్ట్రీ రంగం అంచనా. ఇతర ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఎక్కువగా పౌల్ట్రీ ఫామ్‌లు ఉన్నాయి. ఇతర నగరాలతో గ్రేటర్లో చికెన్ ధరలు కూడా తక్కువే. తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కోళ్ల ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. మటన్ లక్ష కేజీలు మాత్రమే.. గ్రేటర్లో చికెన్ విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నా మటన్ విక్రయాలు మాత్రం అంతగా లేవు. నిత్యం మటన్ విక్రయాలు లక్ష కేజీల దాటడం లేదు. చికెన్‌తో పోలీస్తే మటన్ ధర ఎక్కువగా ఉంది. కేజీ మటన్ ధరలో మూడు కేజీల చికెన్ లభిస్తోంది. ఇతర నాన్‌వెజ్ విషయానికి వస్తే చేపలు, రొయ్యల వినియోగం పెరిగింది. -
పనీర్‌తో ఈ వంటకం ట్రై చేశారా?
పనీర్ టేస్టీ బన్స్ కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించుకుని, ముక్కలు చేసుకోవాలి), పనీర్ తురుము – పావు కప్పు, కారం – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, నువ్వులు – కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ పెట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్ తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్ చూర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అందులో బంగాళదుంప, పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మధ్యలో పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులు పెట్టుకుని.. నూనెలో దోరగా వేయించాలి లేదా.. ఓవెన్లో ఉడికించుకోవచ్చు. బనానా బటర్ బాల్స్ కావలసినవి: బాదం పౌడర్ – 1 కప్పు, అవిసెగింజల పొడి – అర కప్పు, సబ్జా గింజలు – 1 టేబుల్ స్పూన్, అరటి పండు – 1(గుజ్జులా చేసుకోవాలి), పీనట్ బటర్ – అర కప్పు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూన్, బాదం తరుగు, మినీ చాక్లెట్ బిట్స్ – పావు కప్పు చొప్పున, కొబ్బరి తురుము – పావు కప్పు (అభిరుచిని బట్టి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటిపండు గుజ్జు, బాదం పౌడర్, అవిసెగింజల పొడి, సబ్జా గింజలు, వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పీనట్స్ బటర్, వెనీలా ఎక్స్ట్రాక్ట్, బాదం తరుగు వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ బిట్స్, కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు. అభిరుచిని బట్టి.. డేట్స్ తరుగు కూడా కలుపుకుని అదనంగా బటర్ వేసుకుని ముద్దలా చేసుకోవచ్చు. ఆపిల్ – డేట్స్ హల్వా కావలసినవి: ఆపిల్ – 4(స్మాల్ సైజ్), డేట్స్(ఖర్జూరం) – 5(గుజ్జులా చేసుకోవాలి), పంచదార – పావు కప్పు నుంచి అరకప్పు లోపు(అభిరుచిని బట్టి), నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 2, జీడిపప్పు – 10, ఫుడ్ కలర్ – కొద్దిగా(ఆరెంజ్ కలర్, అభిరుచిని బట్టి) తయారీ: ముందుగా ఆపిల్స్ పైతొక్క తొలగించి.. ముక్కలుగా కట్ చేసుకుని గుజ్జులా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. 1 టీ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆపిల్ గుజ్జు వేసుకుని, ఖర్జూరం గుజ్జు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. సరిపడా పంచదార, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉడికించుకోవాలి. మళ్లీ కొద్దిగా నెయ్యి వేసుకుని.. తిప్పాలి. ఏలకులు, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని తిప్పుతూ ఉండాలి. మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని తిప్పుతూ దగ్గర పడగానే ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. (క్రిస్పీ కుకీస్.. ఆనందంగా తింటే బావుంటుందేమో) -
క్రిస్పీ కుకీస్.. ఆనందంగా తింటే బావుంటుందేమో
క్రిస్మస్ పండుగ వస్తోందంటే... స్టార్ వెలుగులు.. ప్రార్థనలు... బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. క్రిస్మస్ ట్రీని అలంకరించడం. శాంతాక్లాజ్ పిల్లలను ఆడించడం... ఎంత హడావుడో... పండగంటే పిల్లలకు ఏదో ఒకటి చేయాలిగా...అందుకే ఈ పండుగకి సరదాగా కుకీస్ చేసి...అందరూ ఆనందంగా తింటే బావుంటుందేమో కదా.. ప్రయత్నించి చూడండి... గోధుమ బిస్కెట్స్ కావలసినవి: గోధుమ పిండి – అర కప్పు; కరిగించిన నెయ్యి/ వెన్న – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; పంచదార/ బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూను. తయారీ: ప్రెజర్ కుకర్ లేదా మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకోవాలి ఒక పొరలాగ ఉప్పు లేదా ఇసుక వేసి, దాని మీద స్టాండు అమర్చాలి ముందుగా కుకర్‌ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి ఒక పాత్రలోకి కరిగించిన నెయ్యి, పంచదార లేదా బెల్లం పొడి, వెనిలా ఎసెన్స్, ఉప్పు తీసుకుని బాగా కలపాలి టగోధుమ పిండి జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి మిశ్రమాన్ని బయటకు తీసి, సమాన పరిమాణంలో ఉండలు చేసి చేతితో గుండ్రంగా అదమాలి (కావాలనుకుంటే ఫోర్క్ సహాయంతో డిజైన్ గీసుకోవచ్చు) అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా వెన్న పూయాలి తయారుచేసి ఉంచుకున్న కుకీలను ఇందులో దూరం దూరంగా ఉంచాలి మంట బాగా తగ్గించి, పదిహేను నిమిషాల తరవాత స్టౌ మీద నుంచి దించేయాలి పది నిమిషాల తరవాత కుకర్ మూత తీయాలి కుకీలను జాగ్రత్తగా బయటకు తీసి, గ్రిల్ వంటి దాని మీద జాగ్రత్తగా ఆరబెట్టాలి పూర్తిగా చల్లారిన తరవాత కుకీలను గాలిచొరని డబ్బాలో భద్రపరచాలి. క్యారట్ ఆపిల్ కుకీస్ కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; అల్లం ముద్ద – టీ స్పూను; జాజి కాయ పొడి – చిటికెడు; బటర్ (ఉప్పు లేనిది) – ముప్పావు కప్పు; పంచదార – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; బ్రౌన్ సుగర్ – పావు కప్పు; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూను; క్యారట్ తురుము – కప్పు; ఆపిల్ తురుము – అర కప్పు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, అల్లం ముద్ద, దాల్చినచెక్క పొడి, జాజి కాయ పొడి వేసి బాగా కలపాలి మరో పాత్రలో బటర్ వేసి మెత్తగా అయ్యేలా గిలకొట్టాలి టపంచదార, బ్రౌన్ సుగర్ జత చేసి మరో రెండు నిమిసాల సేపు గిలకొట్టాలి కోడి గుడ్డు సొన జత చేసి మరో మారు గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్ జత చేసి బాగా కలపాలి చివరగా మైదా పిండి మిశ్రమం జత చేసి నెమ్మదిగా గిలకొడుతూ మిశ్రమం మెత్తగా గట్టిగా వచ్చేలా చేయాలి రబ్బర్ స్పూన్‌తో కలుపుతూ క్యారట్ తురుము, ఆపిల్ తురుము కూడా జత చేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా చేయాలి గుండ్రంగా కట్ చేసి, వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఉంచి సుమారు ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉంచి, దించేయాలి చల్లారిన తరవాత ప్లేట్లోకి తీసుకుని, మరింత చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఆపిల్ కొబ్బరి దాల్చిన చెక్క కుకీస్ కావలసినవి: ఆపిల్స్ – 3 (తొక్క తీసి సన్నగా తురమాలి); బాదం మీల్ – 2 కప్పులు (బాదం పప్పుల తొక్క తీయకుండా మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు; కోడి గుడ్లు – 3 (గిన్నెలో వేసి గిలకొట్టాలి); కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – టీ స్పూను. తయారీ: కుకర్‌ను ముందుగా వేడి చేసి ఉంచుకోవాలి టఆపిల్ తురుమును బ్లెండర్లో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో ఆల్మండ్ మీల్, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి ఆపిల్ గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి టకోడి గుడ్డు సొన కూడా జత చేయాలి కుకీ తయారు చేసుకునే పాత్ర మీద ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరచాలి కుకర్‌లో ఉంచి సన్నని మంట మీద ఇరవై నిమిషాలు ఉంచి దించేయాలి బాగా చల్లారాక బయటకు తీసి ప్లేట్లో ఉంచి ఆరనివ్వాలి టగాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పీనట్ బటర్ ఓట్మీల్ కుకీస్ కావలసినవి: పీనట్ బటర్ – అర కప్పు; బ్రౌన్ సుగర్ – అర కప్పు; ఓట్స్ – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ; కోడి గుడ్డు – 1; బేకింగ్ సోడా – అర టీ స్పూను. తయారీ: చిన్న పాత్రలో పీనట్ బటర్, బ్రౌన్ సుగర్ వేసి బాగా కలపాలి కోడిగుడ్డు సొన జత చేయాలి టఓట్స్, బేకింగ్ సోడా జత చేసి క్రీమీగా అయ్యేవరకు బాగా కలపాలి కుకీస్ తయారు చేసుకునే పాత్రకు కొద్దిగా వెన్న పూయాలి టతయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని సమానంగా సద్దాలి వేడి చేసుకున్న కుకర్‌లో ఉంచి, సన్న మంట మీద పావు గంట తరవాత దించేయాలి చల్లారాక బయటకు తీసి, ప్లేట్లోకి తీసి, బాగా చల్లారాక గాలిచొరని పాత్రలోకి తీసుకుని నిల్వ చేయాలి. తేనె పెరుగు బిస్కెట్స్ కావలసినవి: తేనె – పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – టీ స్పూను; సాదా పెరుగు – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ. తయారీ: ఒకపాత్రలో మైదా పిండి, ఉప్పు, తేనె వేసి బాగా కలపాలి పెరుగు జత చేసి ఫోర్క్‌తో ముద్దలా అయ్యేవరకు కలపాలి వెడల్పాటి గిన్నెలో పిండిని పొడిపొడిగా చల్లాలి టతయారుచేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అర అంగుళం మందంగా వేసి మధ్యకు మడవాలి మరోసారి పొడి పిండి చల్లి మళ్లీ మధ్యకు మడవాలి బిస్కెట్ కటర్‌తో గుండ్రంగా కట్ చేయాలి టవీటిని పాత్రలో ఉంచి ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి మంట బాగా తగ్గించాలి టసుమారు పావు గంట తరవాత స్టౌ ఆపేయాలి అర గంట తరవాత కుకర్ మూత తీసి తయారైన బిస్కెట్లను మరో ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తరవాత, గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. -
58 నిమిషాల్లో46 వంటకాలు..
సాక్షి, చెన్నై : వంట చేయాలంటే కనీసం 30 నిమిషాలు కేటాయించాల్సిందే. ఇక కొన్ని స్పెషల్ వంటకాలకైతే గంటకు పైగా సమయం తీసుకుంటారు. ఆ గంటలో కూడా కేవలం ఒకటి, రెండు రకాల వంటకాలు చేయడమే ఎక్కువ. అలాంటి ఓ చిన్నారి కేవలం 58నిమిషాల్లో 46 రకాల వంటకాలు చేసి యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఎస్ఎన్ లక్ష్మి సాయిశ్రీ వంటలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఎక్కువ. తన తల్లి దగ్గర శిక్షణ తీసుకొని వంటలు చేయడం ప్రారంభించింది. లాక్డౌన్ సమయంలో కొత్త కొత్త వంటకాలు చేయడం మొదలుపెట్టింది. వంటకాలు చేయడం పట్ల చిన్నారికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు..ఈ హాబీతో రికార్డు సృష్టించాలని భావించారు. ఈ మేరకు సాయిశ్రీ తండ్రి ఆన్లైన్లో పరిశోధన చేసి.. కేరళకు చెందిన పదేళ్ల అమ్మాయి శాన్వి సుమారు 30 వంటలు వండినట్లు గుర్తించారు. తన కుమార్తెతో ఆ రికార్డును బద్దలు కొట్టాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా 58 నిమిషాల్లో 46 రకాల వంటలు చేసి యునికో రికార్డు సాధించారు. తాను తమిళనాడులోని విభిన్న సాంప్రదాయ వంటలు వండుతానని, లాక్డౌన్ సమయంలో కుమార్తె తనతోనే వంట గదిలో గడిపేదని, సాయిశ్రీ ఆసక్తిపై తన భర్తతో చర్చించి ప్రపంచ రికార్డ్ కోసం ప్రయత్నించామని సాయిశ్రీ తల్లి కలైమగల్ తెలిపారు. ప్రపంచ రికార్డును సృష్టించిన చిన్నారి సాయిశ్రీని పలువురు అభినందించారు. -
గోబీ మంచూరియా లాగిద్దామా..
క్యాలీ ఫ్లవర్ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులోకి రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్ ఎక్కువగా ఉండే క్యాలీ ఫ్లవర్ ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్ చేయండి. ► పాప్‌కార్న్ క్యాలీఫ్లవర్ కావలసినవి: పంచదార – 4 టీ స్పూన్లు; ఉప్పు – టీ స్పూను; కారం – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉల్లి పొడి – అర టీ స్పూను; వెల్లుల్లి పొడి – అర టీ స్పూను; క్యాలీఫ్లవర్ – చిన్న పువ్వు; కుకింగ్ స్ప్రే – తగినంత; (ఇందులో పదార్థాలు సూపర్ మార్కెట్లలో కాని బేకరీలలో కాని దొరుకుతాయి). తయారీ: ముందుగా అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర వేడి చేసుకోవాలి బేకింగ్ షీట్ మీద అల్యూమినియం ఫాయిల్ వేయాలి ఒక పాత్రలో పంచదార, ఉప్పు, కారం, పసుపు, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి బేకింగ్ షీట్ మీద క్యాలీ ఫ్లవర్ తరుగు పల్చగా పరవాలి కుకింగ్ స్ప్రేను అన్నిటి మీద తేలికగా స్ప్రే చేయాలి కలిపి ఉంచుకున్న మసాలాను వీటి మీద చల్లాలి సుమారు 30 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి వేడివేడిగా అందించాలి. ► ఆలూ గోబీ కావలసినవి: నూనె – టేబుల్ స్పూను; జీలకర్ర – టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; అల్లం తురుము – టీ స్పూను; బంగాళ దుంపలు – 2 (ఉడికించి తొక్క తీసి, పెద్ద పెద్ద; ముక్కలుగా కట్ చేయాలి); పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; క్యాలీఫ్లవర్ – చిన్నది (1); కొత్తిమీర తరుగు – టీ స్పూను. తయారీ: బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి వేయించాలి బంగాళ దుంప ముక్కలు వేసి బాగా కలపాలి పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు, ఆరేడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతుండాలి క్యాలీ ఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి. ► క్యాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు – మూడు కప్పులు; ఆవాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; మెంతులు – అర టేబుల్ స్పూను; నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు; కారం – 100 గ్రా.; నువ్వుపప్పు నూనె – పావు కేజీ; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 10. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి ఉప్పు జత చేసిన నీళ్లు గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగును సుమారు పది నిమిషాలు ఉంచాక, నీళ్లను వడకట్టాలి తడి పూర్తిగా పోయేవరకు క్యాలీఫ్లవర్‌ను నీడలో ఆరబెట్టాలి బాణలిలో నూనె పోసి కాగాక, క్యాలీఫ్లవర్ తరుగు వేసి సన్న మంట మీద సుమారు ఐదు నిమిషాలు వేయించి, నూనె తీసి పక్కన ఉంచాలి (నూనెలోనే ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి) బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి, చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ఆవాలను ఎండబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి పెద్ద పాత్రలో క్యాలీఫ్లవర్ ముక్కలు, పక్కన ఉంచిన నూనె వేసి కలపాలి ఆవ పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, పసుపు, మెత్తగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి నిమ్మరసం వేసి మరోమారు కలపాలి ∙తడి లేని జాడీలో నిల్వ చేసుకోవాలి (ఫ్రిజ్లోఉంచితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది విడిగా ఉంచితే 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది) వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యితో క్యాలీఫ్లవర్ ఆవకాయ అందిస్తే రుచిగా ఉంటుంది. ► ఉల్లిపాయ క్యాలీఫ్లవర్ సూప్ కావలసినవి: రౌండ్ బ్రెడ్ – 1 స్లైసు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు (కరిగించాలి) సూప్ కోసం; ఉల్లి తరుగు – కప్పు; క్యాలీఫ్లవర్ తరుగు – కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2 (సన్నగా తరగాలి); బటర్ లేదా ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – టేబుల్ స్పూను; ఉడికించిన కూరగాయల నీళ్లు (వెజిటబుల్ స్టాక్) – 2 కప్పులు; పాలు – కప్పు (చిక్కటివి); కుంకుమ పువ్వు – చిటికెడు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – 2 టీ స్పూన్లు. బ్రెడ్ బౌల్ తయారీ: బ్రెడ్ పై భాగంలో గుండ్రంగా కట్ చేసి బౌల్ మాదిరి చేసుకోవాలి కరిగించిన బటర్‌ను బ్రెడ్ లోపలి భాగమంతా పూతలా పూయాలి అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసి, బ్రెడ్ బౌల్స్‌ను సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి. సూప్ తయారీ: పాన్‌లో బటర్ లేదా ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్ది సేపు వేయించాలి ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి మైదా పిండి వేసి బాగా కలపాలి ∙వెజిటబుల్ స్టాక్ జత చేసి బాగా కలపాలి పాలలో కలిపిన కుంకుమ పువ్వు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, మరిగాక సన్నని మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచితే సూప్ బాగా చిక్కబడుతుంది సూప్‌ను బ్రెడ్ బౌల్స్‌లో వేసి వేడివేడిగా అందించాలి. (బ్రెడ్ బౌల్స్ అవసరం లేదనుకుంటే, మామూలు పాత్రలో సూప్ సర్వ్ చేసుకోవచ్చు). ► క్యాలీఫ్లవర్ పరాఠా కావలసినవి: క్యాలీఫ్లవర్ – చిన్నది (1); పచ్చి మిర్చి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; గోధుమపిండి – 3 కప్పులు. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి తీసేయాలి తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మెత్తగా ఉడికించాలి పెద్ద పాత్రలో గోధుమ పిండి, ఉడికించిన క్యాలీఫ్లవర్, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి చపాతీలా కలపాలి (అవసరమనుకుంటేనే నీళ్లు జత చేయాలి) పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి ఒక్కో ఉండను పరాఠాలా జాగ్రత్తగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చాలి కుర్మాతో కాని, పెరుగుతో కాని తింటే రుచిగా ఉంటాయి. ► క్యాలీ ఫ్లవర్ 65 కావలసినవి: క్యాలీఫ్లవర్ – 1 (మీడియం సైజుది); కరివేపాకు – 3 రెమ్మలు; మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు; నూనె – వేయించటానికి తగినంత. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, మిరప కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి క్యాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి, చిన్న చిన్న ఫ్లవర్స్‌లా వచ్చేలా విడదీయాలి ఒక పాత్రలో నీళ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి కొద్దిగా వేడయ్యాక, విడదీసిన క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి కొద్దిసేపు ఉడికించి తీసేసి, కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమానికి జత చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసి బాగా వేగాక, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేయాలి ∙అన్నం, చపాతీలలోకి మాత్రమే కాదు, స్నాక్‌లా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ► క్యాలీ ఫ్లవర్ బోండా కావలసినవి: క్యాలీ ఫ్లవర్ – అర కేజీ (చిన్న చిన్న పువ్వులుగా విడదీసుకోవాలి); సెనగ పిండి – పావు కేజీ; బియ్యప్పిండి – 50 గ్రా.; పచ్చి మిర్చి – 7; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు (పిండి కలుపుకోవటానికి); జీలకర్ర – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – వేయించడానికి తగినంత. తయారీ: పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి క్యాలీఫ్లవర్ తరుగును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్లలో శుభ్రంగా కడిగి, మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, కొద్దిగా ఉడికించాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి నూనె జత చేసి మరోమారు ఉండలు లేకుండా బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి మిరప కారం, పచ్చిమిర్చి + జీలకర్ర మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి చివరగా కొత్తిమీర జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, అరగంటసేపు పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి ∙కలిపి ఉంచుకున్న పిండికి బేకింగ్ సోడా జత చేయాలి కొద్దిగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను బొండాల మాదిరిగా పిండిలో ముంచుతూ నూనెలో వేయాలి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి సాస్, కెచప్, చట్నీలతో సర్వ్ చేయాలి.(నూనెలో వేయించినవి తిన్న తరవాత మజ్జిగ తాగితే మంచిది. నూనె పదార్థాలకు మజ్జిగ విరుగుడుగా పనిచేస్తుంది) ►గోబీ మంచూరియా కావలసినవి: క్యాలీఫ్లవర్ – 1; మైదా పిండి – కప్పు; కార్న్ ఫ్లోర్ – కప్పు; పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – టీ స్పూను; వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – కప్పు; ఉడికించిన బఠాణీ – కప్పు; సోయా సాస్ – టీ స్పూను; అజినమోటో – అర టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉల్లికాడల తరుగు – పావు కప్పు. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉడికించాలి మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా చేయాలి పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్ తరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన బఠాణీ, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసి పకోడీల పిండిలా కలపాలి (నీళ్లు పోయకూడదు) బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని చిన్న చిన్న మంచూరియాలుగా వేసి దోరగా వేయించి కిచెన్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి కాడల తరుగు వేసి వేయించాలి తయారైన మంచూరియాలను వేసి అన్నీ కలిసేలా కలుపుతుండాలి చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, తగినన్ని నీళ్లు వేసి పల్చగా పిండి కలిపి, బాణలిలోని మంచూరియాల మీద వేసి కలపాలి సోయాసాస్, అజినమోటో వేసి మరోమారు కలిపి రెండు నిమిషాలలో దింపేసి, టొమాటో సాస్‌తో సర్వ్‌చేయాలి. నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
యూట్యూబ్‌తో సుందర్ పిచాయ్ అనుబంధం
సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టడంలో సీఈఓ సుందర్ పిచాయ్ పాత్ర మరువలేనిది. అయితే ఆయన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. తాజాగా సుందర్ పిచాయ్ తాను ఖాళీ సమయాల్లో ఏ చేస్తుంటాడో ఓ ఈవెంట్లో తెలిపారు. లాక్డౌన్ సమయంలో తన పిల్లలతో కలిసి పనీర్ మఖానీ, పిజాలు తదితర వంటకాలను ఏలా వండాలో యూట్యూబ్‌లో తెలుకున్నానని తెలిపారు. కాగా తాను చిన్న వయస్సులో దూరదర్శన్ చానెల్లో సారే జహాసే లాంటి కార్యక్రమాలను చుసే వాడినని గుర్తుకు తెచ్చుకున్నారు. మరోవైపు తాను చిన్న వయస్సు నుంచే నూతన సాంకేతిక వైపే ఆలోచించే వాడినని చెప్పుకొచ్చారు. దేశంలో నూతన సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కోన్నారు. (చదవండి:సరిలేరు ‘సుందర్’కెవ్వరు..!) -
పాపం కుక్కతో అంట్లు తోమిస్తున్నారు
ఇంట్లో గిన్నెలు తోమేది ఎవరు? ఇదేం ప్రశ్న! మహిళలే కదా అంటారేమో.. లాక్డౌన్లో భార్యలతో పాటు భర్తలు పని చేయక తప్పలేదు. ఈ క్రమంలో ఎందరో భర్తలు మౌనంగా నాలుగు గోడల మధ్య అంట్లు తోమే ఉంటారు. సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మరో ప్రశ్న. పెంపుడు జంతువులు కూడా అంట్లు తోముతాయా? అంటే పై ఫొటో అవుననే చెప్తోంది. అదెలాగంటే.. ఏదైనా తెలివిగా, తొందరగా నేర్చుకునే మూగ జీవాల్లో శునకం ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో అవసరాలకు దాన్ని ఉపయోగిస్తున్నారు. (ఒంటి మీది బట్టల్లేకుండా నిరసన: ఎందుకంటే?) ఈ క్రమంలో వంటగదిలో ఓ శునకం కుర్చీపై కూర్చుని బోళ్లు తోముతున్న ఫొటోను ముకుల్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఎప్పుడూ అది ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక నుంచి ఇంటి పనుల్లో సాయం చేస్తేనే దానికి ఆహారం.." అంటూ పేర్కొన్నాడు. దీనిపై కొందరు జోకులు వేస్తుంటే మరికొందరు మాత్రం మూగజీవాలను వేధిస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. "పాపం దానికి ఆ పని చేయాలని లేదు, కావాలంటే దాని మొహం చూడండి" అంటూ శునకంపై జాలి చూపిస్తున్నారు. (ఈ కుక్కకు అరుదైన ఘనత!) -
ఈ పాన్కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా?
బాదం – బనానా పాన్‌కేక్స్ కావలసినవి: బాదం – పావు కప్పు (నాబెట్టి పైతొక్క తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి), ఆపిల్ గుజ్జు – పావు కప్పు, మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, బియ్యప్పిండి – అర కప్పు చొప్పున, పంచదార – 8 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, చిక్కటి పాలు – 2 కప్పులు, గుడ్లు – 2, అరటిపండ్లు – 4 (రెండింటిని మెత్తగా గుజ్జు చేసుకుని, మరో రెండింటిని గుండ్రటి ముక్కల్లా కట్ చేసుకోవాలి), నూనె – సరిపడా, డ్రైఫ్రూట్స్ – గార్నిష్ కోసం.. తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మొక్కజొన్న పిండి, గోధుమపిండి, బియ్యప్పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, బాదం పేస్ట్, అరటి పండు గుజ్జు, ఆపిల్ గుజ్జు, చిక్కటి పాలు, గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని రొట్టెల పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనంపైన నూనె వేసుకుని, పాన్‌కేక్స్ వేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు అరటిపండు ముక్కలు, డ్రైఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. రైస్ పుడ్డింగ్ కావలసినవి: అరటి పండ్లు – 2 (నచ్చిన షేప్ కట్ చేసుకోవాలి), బెల్లం కోరు – 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, అన్నం – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – ఒక కప్పు, కొబ్బరి పాలు – 1 కప్పులు, చిక్కటి పాలు – 1 కప్పు, పంచదార – 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం – 5(గింజలు తొలగించి పేస్ట్ చేసుకోవాలి), ఆపిల్ – 1 (తొక్క తొలగించి, గుజ్జు చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూన్. ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటి పండ్ల ముక్కలను కూడా అదే నేతిలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో బెల్లం, నీళ్లు, ఏలకుల పొడి వేసుకుని ముదురు పాకం పెట్టుకుని, అందులో అరటిపండు ముక్కలు వేసుకుని, పాకం పట్టించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద బౌల్ తీసుకుని.. స్టవ్ మీద పెట్టుకుని.. చిక్కటి పాలు, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొద్ది సేపటికి అన్నం, ఆపిల్ గుజ్జు, జాజికాయ పొడి, వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ దగ్గర పడేలా చెయ్యాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, ఖర్జూరం పేస్ట్, దాల్చిన చెక్కపొడి వేసుకుని దగ్గర పడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్‌కి తీసుకుని.. దానిపైన పాకం పట్టించిన అరటి ముక్కలు, నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. రొయ్యల పకోడా కావలసినవి: రొయ్యలు – 25 (వ్యర్థాలు తొలగించి, శుభ్రం చేసుకుని, మెత్తగా ఉడికించుకోవాలి), శనగపిండి – పావు కప్పు, బ్రెడ్ పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు చొప్పున, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర – 1 టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, నూనె – సరిపడా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా.. ఒక బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, నిమ్మరసం, అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో నూనె వేడి కాగానే.. ఒక్కో రొయ్యకు శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అభిరుచిని బట్టి రొయ్యలను మిక్సీ పట్టుకుని, ఆ మిశ్రమాన్ని, శనగపిండి మిశ్రమంలో కలిపి కూడా పకోడా వేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
స్వీట్ కార్న్- చికెన్ కట్లెట్ తయారు చేయండిలా..
స్వీట్ కార్న్– చికెన్ కట్లెట్ కావలసినవి: చికెన్ – పావు కిలో(బోన్ లెస్ ముక్కలని మెత్తగా ఉడికించిపెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – 1 కప్పు, బంగాళ దుంప – 1 (ముక్కలు కోసి, మెత్తగా ఉడికించుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, పాలు – 2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో చికెన్, స్వీట్ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, అందులో పసుపు, కారం, జీలకర్రపొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన షేప్‌లో కట్లెట్స్ చేసుకుని.. ఒకసారి పాలలో ముంచి, మొక్కజొన్న పిండి పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము లేదా ఉల్లిపాయ ముక్కలు వంటివి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఆపిల్ కేక్ కావలసినవి: యాపిల్స్ – 6, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మైదా పిండి, బ్రౌన్ సుగర్ – అర కప్పు చొప్పున, బటర్ – పావు కప్పు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, గుడ్లు – 3, పాలు – 1 కప్పు ఆప్రికాట్ జామ్ – పావుకప్పు (మార్కెట్లో లభిస్తుంది) తయారీ: ముందుగా ఆపిల్స్ శుభ్రం చేసుకుని నాలిగింటిని మెత్తగా, గుజ్జులా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బటర్ కరిగించుకుని ఒక పెద్ద బౌల్లో పోసుకుని అందులో బ్రౌన్ సుగర్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, పాలను కొద్దికొద్దిగా వేస్తూ మొత్తం కలపాలి. ఇప్పుడు ఆపిల్ గుజ్జు, ఆప్రికాట్ జామ్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఓవెన్లో పెట్టుకునేందుకు అవసరమైన పాత్రలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండు ఆపిల్స్‌ని అర్థచంద్రాకారంలో ముక్కలు చేసుకుని, వాటిని పైన అలంకరించుకుని 35 నుంచి 40 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు అభిరుచిని బట్టి కేక్‌పైన క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డెకరేట్ చేసుకోవచ్చు. కీరదోస హల్వా కావలసినవి: కీరదోసకాయలు – 4 (పైతొక్కను తొలగించి, తురుములా చేసుకోవాలి), నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, పాలపొడి – 1 కప్పు, పాలు – 2 కప్పులు, పంచదార – 4 టేబుల్ స్పూన్లు(అభిరుచి బట్టి పెంచుకోవచ్చు), గోధుమ రవ్వ – 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, బాదం, పిస్తా – అభిరుచిని బట్టి తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో పాలు, కీరదోస తురుము వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో పాలపొడి, గోధుమ రవ్వ, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ కలపాలి. ఆ మిశ్రమంలో పాల శాతం పూర్తిగా తగ్గి పొడిపొడిలాడుతున్న సమయంలో బాదం, పిస్తా లేదా జీడిపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే ఈ కీరదోస హల్వా చాలా రుచిగా ఉంటుంది. -
పసందైన వంటకాలు మీకోసం
బీట్రూట్ చపాతి కావలసినవి: బీట్రూట్ గుజ్జు – 1 కప్పు, గోధుమ పిండి – 1 కప్పు, అల్లం – వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్ చొప్పున, వాము పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఆలివ్ నూనె – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, నూనె – కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – గార్నిష్‌కి తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్లో గోధుమ పిండి, బీట్రూట్ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆలీవ్ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వాము పొడి కూడా అందులో వేసుకుని, కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డంత పరిమాణంలో ముద్దలు తీసుకుని చపాతి కర్రతో చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్పైన నూనె వేసి దోరగా వేయించుకుని.. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. కార్న్ కబాబ్స్ కావలసినవి: ఉడికించిన స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు+8 టేబుల్ స్పూన్లు, బంగాళదుంపలు – 2 (ముక్కలుగా కోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్, క్యాప్సికం – సగం, అటుకులు – 1 కప్పు (అప్పటికప్పుడు నీళ్లలో తడిపి, గట్టిగా పిండుకోవాలి), శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, కొత్తిమీర తురుము – కొంచెం, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా మిక్సీ బౌల్లో ఉడికించిన ఒకటిన్నర కప్పుల స్వీట్ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,తడిపిన అటుకులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో శనగపిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె, మిగిలిన 5 గరిటెల స్వీట్ కార్న్, కారం, కొత్తిమీర తురుము వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల స్వీట్‌కార్న్ వేసుకుని.. ఒకసారి పైపైన కలిపి, వడల్లా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన స్వీట్ కార్న్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బ్రింజాల్ రోల్స్ కావలసినవి: వంకాయలు – 4 పెద్దవి, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు చొప్పున (గార్నిష్‌కి అదనంగా), కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు (గార్నిష్‌కి అదనంగా), పుదీనా తరుగు – 1 టేబుల్ స్పూన్లు, బీట్ రూట్ తురుము – పావు కప్పు, బియ్యం రవ్వ – ముప్పావు కప్పు(ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి), ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – 4 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, వేరుశనగల పొడి – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండున్నర గరిటెల నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, బీట్రూట్ తురుము, టమాటా ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేరుశనగల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆలివ్ నూనె, నిమ్మరసం వేసుకుని బాగా తిప్పుతూ ఉండాలి. చివరిగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వంకాయలను పొడవుగా (థిన్ స్లైస్‌లా) కట్ చేసుకుని, నూనెలో డీప్ ఫ్రై చేసుకుని, అందులో కొద్ది కొద్దిగా ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకోవాలి. ఊడిపోకుండా సన్నని పుల్ల అడ్డంగా గుచ్చుకుని తీనేటప్పుడు ఆ పుల్లని తొలగించుకోవచ్చు. వీటిని కొత్తిమీర తరుగు, టమాటా ముక్కలతో లేదా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
ముచ్చటగా మూడు స్నాక్స్ మీకోసం..
బనానా–వాల్నట్ మఫిన్స్ కావలసినవి: అరటిపండ్లు – 8, ఖర్జూరం పేస్ట్ – 1 కప్పు, వాల్నట్ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు, బటర్ – అర కప్పు, మైదాపిండి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 4, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా బటర్ కరింగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు అరటిపండ్లను అడ్డంగా అంగుళం పొడవులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని, మిగిలి ఉన్న 6 అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఖర్జూరం పేస్ట్, గుడ్లు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చల్లారిన బటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండి, మొక్కజొన్న పిండి, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాల్నట్స్ పేస్ట్ వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మఫిన్స్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని పెట్టుకుని వాటిపైన అరటిపండు ముక్కలు చిత్రంలో ఉన్న విధంగా పెట్టుకుని, 20 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. పీనట్ పాన్కేక్ కావలసినవి: వేరుశనగలు – ఒకటిన్నర కప్పులు(దోరగా వేయించినవి), పంచదార – 2 కప్పులు, మైదాపిండి – 1 కప్పు, బియ్యప్పిండి – ముప్పావు కప్పు, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత, నెయ్యి – అర టేబుల్ స్పూన్ తయారీ: ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, కొబ్బరిపాలు, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, ఆ మిశ్రమాన్ని ఏడెనిమిది గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పాన్ కేక్స్ సిద్ధం చేసుకునే ముందు పల్లీలు, ఒక కప్పు పంచదార మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో కొబ్బరి తురుమును బాగా వేయించి అందులో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండి మిశ్రమంతో మందంగా దోసెల్లా వేసుకుని, దానిపైన కొద్దిగా పల్లీ–కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని బెల్లం పాకంలో వేసిన ఆపిల్ ముక్కలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. పనీర్ హల్వా కావలసినవి: పనీర్ తురుము – 1 కప్పు, పాలు – 2 కప్పులు (కాచి చల్లార్చినవి), పంచదార – అర కప్పు, సొరకాయ ముక్కలు – 2 కప్పులు (పైతొక్క తొలగించి), బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10 లేదా 15, వేరుశనగలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందు స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక బౌల్ పెట్టుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేరుశనగలు, జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అందులో సొరకాయ తురుము వేసుకుని మూడు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పాలు వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పనీర్ తురుము, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం మొత్తం పొడిపొడిలాడుతున్నట్లుగా మారిన సమయంలో.. చివరిగా అభిరుచిని బట్టి ఏలకుల పొడి కూడా వేసుకుని గరిటెతో బాగా కలిపి స్టవ్ మీద నుంచి ఆ పాన్‌ను దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, వేరుశనగలు వేసుకుని, ఒకసారి అటూ ఇటూ కలిపి.. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. -
రారండోయ్ వంటలు చేద్దాం
ఇరుగమ్మా పొరుగమ్మా రండి. పిన్నిగారూ బామ్మగారూ రండి. చిన్నారి పొన్నారి రారండి. సంక్రాంతి వస్తోంది. సంబరాలు తెస్తోంది. బంధువులు వస్తారు. సందడి చేస్తారు. పొయ్యి వెలిగిద్దాము. సాయం పడదాము. వంటలు చేద్దాము. విందారగిద్దాము. రారండోయ్ వంటలు చేద్దాం... నువ్వుల బొబ్బట్లు కావలసినవి: నువ్వులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; గోధుమ పిండి – అర కప్పు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకులు – 2 తయారీ: ►స్టౌ మీద బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►ఏలకులు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►బెల్లం పొడి జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ►ఒక పాత్రలో మైదాపిండి, గోధుమపిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జతచేస్తూ మెత్తగా చపాతీపిండిలా కలుపుకోవాలి ►రెండు టీ స్పూన్ల నెయ్యి జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి, పది నిమిషాలపాటు పక్కన ఉంచాలి ►పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండ ను చిన్న సైజు పూరీలా ఒత్తి, అందులో నువ్వులు బెల్లం మిశ్రమం ఉంచి, అంచులు మూసేసి, చపాతీలా వత్తాలి ►ఇలా అన్నీ తయారు చేసుకోవాలి ►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, ఒక్కో బొబ్బట్టుకు, నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి ►వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి. దబ్బకాయ పులిహోర కావలసినవి: బియ్యం – అర కేజీ; నూనె – 100 గ్రా.; దబ్బకాయ రసం – అర కప్పు, పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చిమిర్చి – 5 (సన్నగా పొడవుగా తరగాలి); కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; పల్లీలు – 100 గ్రా; జీడిపప్పులు – 10 గ్రా. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ►వేడిగా ఉండగానే అన్నాన్ని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, ఉప్పు పసుపు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు, జీడిపప్పు జత చేసి దోరగా వేయించాలి ►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాక, అన్నం మీద వేసి కలియబెట్టాలి ►దబ్బకాయ రసం వేసి మరోమారు బాగా కలిపి, ఒక గంట సేపు బాగా ఊరిన తరవాత తింటే రుచిగా ఉంటుంది. పాకం గారెలు కావలసినవి: మినప్పప్పు – అర కేజీ; బెల్లం/పంచదార – అర కేజీ; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ►మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి ►స్టౌ మీద నూనె కాగాక, పిండిని గారెల మాదిరిగా వేసుకుని, రెండువైపులా ఎర్రగా కాలిన తరవాత కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ►ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము/పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ►ఏలకుల పొడి, నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ►వేయించి ఉంచుకున్న గారెలను ఈ పాకంలో వేసి సుమారు అరగంట సేపు తరవాత తింటే, రుచిగా ఉంటాయి. నువ్వుల పులగం కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం తురుము – ఒక కప్పు; వేయించిన నువ్వుల పొడి – అర కప్పు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మరుగుతున్న నీళ్లలో వేసి బాగా కలియబెట్టి, నువ్వుల పొడి కూడా జతచేసి మరోమారు కలిపి, మూత ఉంచాలి ►బాగా ఉడికిన తరవాత బెల్లం తురుము జత చేయాలి ►శొంఠి పొడి, ఏలకుల పొడి, నెయ్యి జత చేసి కలియబెట్టాలి ►పైన నెయ్యి, ఎండు కొబ్బరి తురుము వేసి వేడివేడిగా అందించాలి. నువ్వుల పచ్చడి కావలసినవి: నువ్వులు – 100 గ్రా.; చింత పండు – 100 గ్రా.; బెల్లం పొడి – 100 గ్రా.; ఎండు మిర్చి – 50 గ్రా.; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 50 గ్రా.; ఉప్పు – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి ►ఒక గిన్నెలో చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి, ఉడికించి, చల్లారాక మెత్తగా గుజ్జు తీసి పక్కన ఉంచాలి ►వేయించి పెట్టుకున్న మినప్పప్పు మిశ్రమం మిక్సీలో ముందుగా వేసి మెత్తగా చేయాలి ►నువ్వులు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►చింత పండు గుజ్జు, బెల్లం తురుము, ఉప్పు జత చేసి అన్నీ బాగా కలిసేలా మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►వేయించి ఉంచుకున్న ఆవాలు మిశ్రమం జత చేసి బాగా కలపాలి ►గారెలలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
ఇదోరకం కట్టెల పొయ్యి
కొన్ని సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యి మీదే వంట చేసేవారు. అందరికీ ఇంకా బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ పల్లెల్లో కొందరు కట్టెల పొయ్యి మీదే∙వండుతున్నారు. నగరాలలో ఉండేవారు వండుకోవాలనుకుంటే, రెడీ మేడ్ కట్టెల పొయ్యి 800 రూపాయలకు అందుబాటులో ఉంది. నిఖిల్ ఇంజినీర్స్ స్మార్ట్ వుడ్ బర్నింగ్ కుక్ స్టవ్ పేరుతో గూగుల్‌లో వెతికితే ఈ స్టౌ సమాచారం దొరుకుతుంది. ఈ పొయ్యిలో వంటచెరకుగా... కట్టెలు, పిడకలు, ఎండు పుల్లలు, చితుకులు, ఎండుటాకులు... వేటినైనా వాడుకోవచ్చు. పొగ తక్కువ వస్తుంది. ఉపయోగించడం కూడా సులువే. ఈ స్టౌ మీద భారీ వంటలు చేయడానికి అవకాశం లేదు. ఇంట్లో సరదాగా వాడుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తలు: ►స్టవ్‌ను సమతలంగా ఉన్న ప్రదేశం మీద ఉంచాలి ►స్టౌ వెలిగించాక ముట్టుకోకూడదు ►పిల్లలకు దూరంగా ఉంచాలి ►మండేపదార్థాలను దూరంగా ఉంచాలి ►బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రాంతంలో ఉపయోగించాలి ►వర్షం పడే చోటులో ఉంచకూడదు ►స్టౌ శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించకూడదు. -
రొయ్య నంజుకుంటే ఉంటుందీ..
పిస్తా పుడ్డింగ్ కావలసినవి: అవకాడో – 4 లేదా 6 (పైతొక్క తొలగించాలి), పిస్తా – అర కప్పు (నీళ్లలో నాబెట్టినవి), కొబ్బరి నీళ్లు – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూన్, రోజ్ వాటర్ – అర టీ స్పూన్ ఆలివ్ నూనె – అర టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, పాల కూర – ఒకటిన్న కప్పులు తయారీ: ముందుగా మిక్సీ బౌల్లో అవకాడో ముక్కలు, పిస్తా, కొబ్బరినీళ్లు, ఉప్పు, వెనీలా ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఆలివ్ నూనె, నిమ్మరసం వేసుకుని మెత్తగా చేసుకోవాలి. తర్వాత పాలకూర కూడా అందులో వేసుకుని మరో సారి మిక్సీ పట్టుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుని.. సర్వ్ చేసుకునే ముందు దానిపై నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అదిరే రుచి మీ సొంతమవుతుంది. చాక్లెట్ –బీట్రూట్ మఫిన్స్ కావలసినవి: బీట్రూట్ – 2 మీడియం సైజ్ (మెత్తగా ఉడికించుకుని గుజ్జులా చేసుకోవాలి), గుడ్లు – 3, పెరుగు – ముప్పావు కప్పు, శనగపిండి – అర కప్పు, కోకో పౌడర్ – పావు కప్పు, పంచదార పొడి – అర కప్పు పైనే (అభిరుచిని బట్టి), బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, డార్క్ చాక్లెట్ పౌడర్ – అర కప్పు తయారీ: ముందుగా ఒక బౌల్లో బీట్రూట్ గుజ్జు, పెరుగు, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో శనగపిండి, కోకో పౌడర్, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, డార్క్ చాక్లెట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత బీట్ రూట్ మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మఫిన్స్ బౌల్స్‌లో పెట్టుకుని 23 నుంచి 25 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. రొయ్యల పకోడా కావలసినవి: రొయ్యలు – 25 లేదా 30, శనగపిండి – పావు కప్పు, బ్రెడ్ పౌడర్ – 4 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్, మొక్క జొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, నీళ్లు, నూనె – సరిపడా తయారీ: ముందుగా రొయ్యలు బాగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఒక్కో రొయ్యను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
పసందైన రుచుల సమాహారం
కీరదోస పకోడా కావలసినవి: కీరదోస – 1 (గుండ్రంగా కట్ చేసుకోవాలి), శనగపిండి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, బేకింగ్ సోడా – చిటికెడు, మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కారం, జీలకర్ర పొడి, బేకింగ్ సోడా, మసాలా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా కట్ చేసుకున్న ఒక్కో కీరదోస ముక్కను శనగపిండి మిశ్రమంలో కలిపి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పనీర్ బ్రెడ్ బాల్స్ కావలసినవి: బ్రెడ్ పౌడర్ – ఒకటిన్నర కప్పులు, పనీర్ ముద్ద – 1 కప్పు (పనీర్‌ని ముందు మెత్తగా ఉడికించుకోవాలి), మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర గుజ్జు – 1 టేబుల్ స్పూన్, పాలు – ముప్పావు కప్పు పైనే.., జీడిపప్పు గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్, మిరియాల పొడి – కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్లు, కారం – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బ్రెడ్ పౌడర్, పనీర్, మైదా పిండి, కొత్తిమీర గుజ్జు, జీడిపప్పు గుజ్జు, అల్లం పేస్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. రైస్‌బాల్స్ విత్ కోకోనట్ మిల్క్ కావలసినవి: బియ్యప్పిండి – 1 కప్పు+3 టీ స్పూన్లు, చిలగడదుంపల ముద్ద – అర కప్పు(మెత్తగా ఉడికించి చేసుకోవాలి), మైదాపిండి – పావు కప్పు, నీళ్లు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – అర టీ స్పూన్, పంచదార – అర కప్పు, లేత కొబ్బరి గుజ్జు – ఒకటిన్నర కప్పులు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, చిలగడదుంపల ముద్ద, మైదాపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకుని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలోంచి తీస్తూనే చల్లటి వాటర్‌లో వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని.. మరో పాత్ర తీసుకుని అందులో కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, పంచదార, లేత కొబ్బరి గుజ్జు ఒకదాని తర్వాత ఒకటి రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇస్తూ.. గరిటెతో తిప్పుతూనే వేసుకోవాలి. చివరిగా రైస్ బాల్స్ కూడా అందులో వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మన -
ఆతిథ్య రచయిత్రి
దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో తమదైన విలక్షణత ఉంటుంది. ఇక్కడి వంటకాలలో ఎక్కువగా కొబ్బరి, రకరకాల మసాలాలు, పచ్చిమిర్చి, బియ్యం, కరివేపాకు, అల్లం వెల్లుల్లితో వండిన స్థానిక కూరగాయలు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఒరుగులు వంటి ఎండబెట్టిన కరకరలాడే వంటకాలు.. ఎక్కువగా ఉంటాయి. ఒక రాష్ట్రంలోని ఆహారం మరొక రాష్ట్రాన్ని పోలకుండా ఉంటుంది. ఎవరి విలక్షణత వారిది. అంతెందుకు? ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఉత్తరాది ప్రాంతాలకు, దక్షిణాది ప్రాంతాలకు వంటల విషయంలో పూర్తి తేడా ఉంది. మంగళూరు ప్రాంతపు వంటలకి, కొడవ వంటకు, ఉడిపికి ఎంతో తేడా ఉంటుంది. ఇన్ని రకాల వైరుధ్యం గురించి చదివి తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు. విమలా పాటిల్ రచించిన ‘‘ఎ కుక్స్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’’ పుస్తకంలో పండుగ వంటలు, నిత్యం వండుకునే వంటకాల గురించి పూర్తిగా తెలుస్తుంది. దక్షిణాది వంటకాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఇదొక గైడ్లాంటిది. భోజనంలో ఆప్యాయత విమల మంచి రచయిత, ఎడిటర్ కూడా. ప్రముఖ మహిళా పత్రిక ‘ఫెమినా’ను రెండు దశాబ్దాల కాలం పాటు ముందుండి నడిపారు. కళలు, విహారం, సాంఘిక అంశాలు, మహిళా విముక్తి వంటి రకరకాల అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. భారతీయ వస్త్ర పరిశ్రమను, చేనేతలను ప్రచారం చేయడం కోసం ప్రపంచపర్యటన చేశారు. ఇన్నిటికీ విలక్షణంగా వంటలకు సంబంధించి 12 పుస్తకాలు రచించారు. ‘ద వర్కింగ్ ఉమెన్స్ కుక్ బుక్, ఎంటర్‌టెయినింగ్ ఇండియన్ స్టయిల్, రెసిపీస్ ఫర్ ఆల్ అండ్ ఫాబ్యులస్ రెసిపీస్ ఫ్రమ్ ఇండియన్ హోమ్స్... వంటివి కొన్ని పుస్తకాలు.‘ఎ కుక్స్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’ పుస్తకంలో, దక్షిణాది వారి ఆప్యాయత, అభిమానం, ఆదరణల గురించి ప్రస్తావించారు. ‘వెండి పళ్లెం, కంచు కంచం, స్టీల్ కంచం, అరటి ఆకు, విస్తరాకు... ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి స్థితిగతుల మీద ఆధారపడి ఎందులో భోజనం పెట్టినా వారు చూపే ఆప్యాయతలో మాత్రం పేదధనిక తేడాలు ఉండవు... అని రాశారు ఈ పుస్తకంలో. తేలిగ్గా అర్థమయ్యేలా ‘ఎ కుక్స్ టూర్ ఆఫ్ సౌత్ఇండియా’ పుస్తకం స్పయిసీ బ్రింజాల్ కర్రీతో మొదలవుతుంది. తమిళనాడు విభాగం నుంచి, మసాలాలు గ్రైండ్ చేసిన వంటకాలను రుచి చూపించారు. ఈ పుస్తకంలో నూనె కొలతల దగ్గర నుంచి అన్నీ ఎంతో పద్ధతిగా రచించారు విమల. ఇందులో ప్రత్యేకంగా... ఎంతసేపు ఉడికించాలి అనేదానికి బదులుగా, ‘గ్రేవీ చిక్కబడేవరకు’ అని, ‘వంకాయలు సగం వేగేవరకు’ అని ప్రత్యేకంగా వివరించారు. ఇలా రాయడం వల్ల, ఆ వంటకంలో ప్రావీణ్యత సంపాదించడంతో పాటు, ఇతరులకు కూడా వంటకాన్ని తేలికగా వివరించగలుగుతారు.ఈ పుస్తకాన్ని ఆరు విభాగాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, స్నాక్స్, స్వీట్స్. చివరి రెండు రకాలు కేవలం దక్షిణ భారత దేశానికి మాత్రమే చెందినవి కాదు. ఇందులో కొన్ని సరుకులకి (ఇంగ్రెడియంట్స్) ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అనువాద పదాలు కూడా ఇచ్చారు. ఈ పుస్తకం దక్షిణాది భోజనం సంప్రదాయాన్ని పూర్తిగా వివరిస్తోంది. – జయంతి -
ఫార్... ఇన్ కిచెన్
వియత్నాం వంటలోసారిప్రయత్నించి చూస్తారా? థాయ్ వంటకాలకు హాయ్ చెప్పాలని ఉందా? ఇవన్నీ మనవి. అంటే మన ఆసియా ఖండానివి. మరి పొరుగింటి పుల్లకూర రుచి కదా! అందుకే...యూరప్ ఖండపు పొరుగు ఖాద్యాలనూ చూద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రెంచు... బోల్డంత నోరూరించు అంటూ... ఇటాలియన్ డిషెస్‌తో నాల్కను మిటకరిస్తూ... లాలాజల వర్షంతో నోరు చిరపుంజీ కాగా దేశదేశాల వంటల్ని మన ఇంట తయారు చేసుకుని... ఆవురావురుమంటూ తిందాం... బ్రేవు బ్రేవుమందాం. సెసేమ్కోటెడ్ స్వీట్ స్టఫ్డ్ పాన్ కేక్స్ (ఫ్రెంచ్) ఫ్రెంచ్ క్విజైన్ డెజర్ట్స్కి బాగా ప్రసిద్ధి. మనం కూడా ఈ రోజు ఇంటి దగ్గరే ఒక డెజర్ట్ తయారుచేసి ఫ్రెంచ్ రుచిని ఇంటి దగ్గరే ఆస్వాదించుదాం. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – కొద్దిగా; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – కొద్దిగా; పాలు – అర కప్పు; బటర్ – తగినంత; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; తేనె – కొద్దిగా; ఎల్లో బటర్ – కొద్దిగా; వేయించిన నువ్వులు – 25 గ్రా. స్టఫింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – తగినన్ని (కిస్మిస్, జీడి పప్పు); ఎండు ఖర్జూరాలు – ఆరు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఎల్లో బటర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక టే బుల్ స్పూను తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపాక, పిండి మధ్యలో గుంటలాగ చేసి పాలు, గిలకొట్టిన కోడి గుడ్డు, కరిగించిన బటర్ వేసి బాగా కలిపి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక బటర్ వేసి కరిగించాలి ∙కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, ఎండు ఖర్జూరాలు, పంచదార వేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని తడిపోయేవరకు కలుపుతూ ఉడికించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి కరిగించాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుని, పాన్ మీద దోసె మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చాలి ∙బాగా కాలిన తరవాత స్టఫింగ్ మిశ్రమాన్ని దోసె మధ్యలో ఉంచి కర్రతో జాగ్రత్తగా ఒత్తి, మరోమారు కాల్చాలి ∙తయారయిన పాన్ కేక్‌లను కట్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, పంచదార పొడి, తేనెలతో అలంకరించి, చివరగా నువ్వులతో గార్నిష్ చేసి అందించాలి. పాడ్ థాయి నూడుల్స్ ఎట్ హోమ్ థాయి క్విజీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా పాడ్ థాయి నూడుల్స్‌ను తలచుకుంటారు. ఈ వంటకాన్ని సులువుగా తయారు చేసుకుందామా. కావలసినవి: నూడుల్స్ – అర కేజీ; ఉల్లి కాడలు – ఒక కట్ట; పుట్ట గొడుగులు / బేబీ కార్న్ – 100 గ్రా. ; వేయించిన పల్లీలు – 100 గ్రా.; పల్లీ నూనె – 100 మి.లీ.; చిక్కుడు గింజలు – కొద్దిగా; వెల్లుల్లి తరుగు – కొద్దిగా; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పంచదార – టీ స్పూను; సోయా సాస్ – టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; మిరప కారం – అర టీ స్పూను; అజినమోటో – చిటికెడు తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙నీళ్లు మరుగుతుండగా నూడుల్స్ వేసి ఉడికించి దింపేయాలి ∙నీరు ఒంపేసి, నూడుల్స్‌ను ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ∙ఇవి చల్లారేలోగా పచ్చి మిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, బేబీ కార్న్, పుట్ట గొడుగులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక, పచ్చికొబ్బరి తురుము మిశ్రమం ముద్దను వేసి మరోమారు బాగా వేయించి, ఉడికించాలి ∙ఉడికించిన నూడుల్స్‌ను జత చేసి మిశ్రమం అంతా నూడుల్స్‌కు పట్టేవరకు కలపాలి ∙ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి, పంచదార, అజినమోటో, సోయా సాస్, ఉల్లి కాడల తరుగు, చిక్కుడు గింజలు, నిమ్మ రసం జత చేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. ఇండియన్ హోమ్ మేడ్ పిజ్జా (ఇటాలియన్ ఫ్యూజన్) పిల్లలు ఈ రోజుల్లో సాయంత్రం స్నాక్స్‌లా తినడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు. ముందుగా మనం ఇటాలియన్ పిజ్జా తయారీ చూద్దాం. ఇంటి దగ్గరే ఈ పిజ్జాలను తయారుచేసుకోవచ్చు. కావలసినవి... బేస్ కోసం: మైదా పిండి – రెండున్నర కప్పులు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; డ్రై ఈస్ట్ – అర టీ స్పూను; రిఫైన్డ్ ఆయిల్ లేదా ఎల్లో బటర్ – ఒక టీ స్పూను; గోరువెచ్చని నీళ్లు – ఒక కప్పు; మైదా పిండి∙– 3 టే బుల్ స్పూన్లు (అద్దడానికి) టాపింగ్ కోసం: మోజరిల్లా చీజ్ – 150 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు (సన్నగా తరగాలి); కొత్తిమీర – అర కప్పు వెజ్ టాపింగ్స్: సన్నగా తరిగిన పుట్ట గొడుగులు – ఒక కప్పు; బేబీ కార్న్ / ఉడికించిన కూరలు / వేయించిన పనీర్ (వీటిలో ఏదో ఒకటి); నాన్ వెజ్ టాపింగ్స్; బోన్ లెస్ చికెన్ (బ్రాయిల్డ్ లేదా గ్రిల్డ్, ఏదైనా నాన్ వెజ్) సాస్ కోసం: టొమాటో తరుగు – 2 కప్పులు (తొక్క తీసేయాలి); ఆలివ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; పంచదార – కొద్దిగా; నల్ల మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); టొమాటో కెచప్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు –50 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; కార్న్ ఫ్లోర్ – కొద్దిగా (పావు కప్పు నీళ్లలో కలిపితే కార్న్ స్టార్చ్ తయారవుతుంది) సాస్ తయారీ: స్టౌ వెలిగించి, మంటను మీడియంలో ఉంచి, బాణలి పెట్టాలి. ఉల్లి తరుగు జత చేసి వేయించాలి. వెల్లుల్లి తరుగు, నల్ల మిరియాల పొడి, ఎండు మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక టొమాటో తరుగు, ఉప్పు, పం^è దార వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా ఉడికి, నీరంతా పోయేవరకు కలుపుతుండాలి. టొమాటో కెచప్, కార్న్ స్టార్చ్ జత చేసి బాగా కలపాలి. మంట బాగా తగ్గించి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. (టొమాటలో మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త పంచదార జత చేస్తే సరి). బేస్ తయారీ: ∙ఒక చిన్న పాత్రలో గోరువెచ్చని నీటికి ఈస్ట్ జత చేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙వేరొక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙‘పిజ్జా మృదువుగా రావాలంటే పిండిని చాలాసేపు చే తితో బాగా అదమాలి) ∙ఈ మిశ్రమానికి ఈస్ట్ నీటిని జత చేసి మరోమారు కలపాలి ∙పిండిని కలుపుతూ మధ్యమధ్యలో ఆగుతూ సుమారు ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ∙పిండి∙మెత్తగా ఉండాలే కాని, చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ∙చేతికి అంటుతుంటే కొద్దిగా మైదా పిండి జత చేయాలి ∙పిండి బాగా కలిపిన తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి, పిండి సాగేలా అయ్యేవరకు కలపాలి ∙పెద్ద పాత్రకు నూనె పూయాలి ∙మైదా పిండికి కూడా మరి కాస్త నూనె పూసి, పాత్రలో ఉంచి వస్త్రంతో మూసేసి, సుమారు రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండి రెట్టింపు పరిమాణంలోకి అయ్యాక, పిండిని బయటకు తీసి కొద్దిగా పొడి పిండి జత చేసి మళ్లీ చేతితో బాగా కలిపి, పిండిని రెండు సమాన భాగాలుగా చేసి, సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి. నాన్ స్టిక్ పాన్ మీద బేస్ తయారుచేసుకోవాలి: ∙పిండిని చపాతీ కర్రతో ఒత్తి, గుండ్రంగా కట్ చేసుకోవాలి ∙గుండ్రంగా అక్కర్లేని వారు వారికి కావలసిన ఆకారంలో కట్ చేసుకుని, కొద్దిగా పొడి పిండి అద్ది, నూనె పూసిన పిజ్జా పాన్ మీద ఉంచాలి (అంచులు గుండ్రంగా వచ్చేలా కట్ చేసుకోవాలి) ∙గోధుమరంగులోకి వచ్చేవరకు సన్నని మంట మీద ఉంచాలి ∙చివరగా పిజ్జా బేస్‌ను వేరొక ప్లేట్లోకి తీసి, తయారుచేసి ఉంచుకున్న సాస్‌ను పిజ్జా మీద వేసి సమానంగా పరచాలి ∙ముందుగా కట్ చేసి ఉంచుకున్న టాపింగ్స్‌తో అందంగా అలంకరించాలి ∙కొత్తిమీర, చీజ్ తురుము కూడా చల్లాలి ∙ఇప్పుడు పిజ్జాను పాన్ మీద ఉంచి చీజ్ కరిగేవరకు ఉంచి దింపేయాలి ∙ఇలా ఇంటి దగ్గరే పిజ్జా తయారుచేసుకుని అందరూ కలిసి సరదాగా ఆరగించవచ్చు. సతాయ్ హోమ్ స్టైల్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ వంటకాన్ని మనం ఇంటి దగ్గరే తయారుచేసుకుందాం. కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; చీజ్ – 100 గ్రా.; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; ఆవాల ముద్ద – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో సాస్ – ఒక టీ స్పూను; బటర్ – ఒక టీ స్పూను; (వెజిటేరియన్లు పుట్ట గొడుగులు, పనీర్, బేబీ కార్న్‌తో తయారుచేసుకోవచ్చు) తయారీ: ∙ఒక పాత్రలో శుభ్రం చేసిన రొయ్యలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి కలపాలి ∙వీటికి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఆవాల ముద్ద, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఇదే విధంగా వెజిటేరియన్లు కూరముక్కలను ఊరబెట్టుకోవాలి. టూత్ పిక్‌లు తీసుకుని ఊరబెట్టిన ఉల్లి పాయ, క్యాప్సికమ్, టొమాటో, రొయ్యలను వరుసగా గుచ్చాలి ∙సమాంతరంగా ఉండే పాన్ తీసుకుని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక బటర్ వేసి కరిగాక, గుచ్చి ఉంచుకున్న పుల్లలను పాన్ మీద ఉంచి బాగా కాల్చాలి ∙చివరగా చీజ్ తురుము వేసి బాగా కలపాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని వేడివేడిగా తయారుచేసి పెడితే బాగుంటుంది. – డా. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ -
మట్టి పాత్రలే శ్రేయస్కరం
సాక్షి,వీకెండ్: మట్టి నుంచి వచ్చాం.. దాని నుంచే మనుగడ నేర్చుకున్నాం.. దాన్ని మరిచినా భేషుగ్గా బతగ్గలం అనుకున్నాం. కానీ కాలం గిర్రున తిరిగి మళ్లీ మట్టిని వంటింటికి చేర్చుతున్నట్టుంది. కరెంట్ కుక్కర్లు, నాన్‌స్టిక్ ప్యాన్లు, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల ఆర్టిఫిషియల్ రోజులకి గుడ్‌బై చెబుతూ... మట్టి కుండల్లో వంట చేసుకొని ఆహా అంటున్నారు నగరవాసులు. – ఓ మధు మన తాతల కాలమంతా మట్టి చుట్టే తిరిగింది. పంటల నుంచి వంటల దాకా... అంతా అప్పట్లో మట్టిని నమ్ముకునే జీవనం సాగింది. అయితే కాలక్రమంలో మనిషి కొత్త ‘పాత్ర’ల్లోకి మళ్లాడు. దాదాపుగా మట్టి పాత్రల్లో వంట అనేది మరిచిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మట్టికి జీవం వచ్చింది. సహజమైన జీవన విధానం ద్వారా కలిగే లాభాలు అర్థం చేసుకుంటున్న కొందరు ఆధునికులు మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు. వ్యయం తక్కువ.. ఫలితం ఎక్కువ మట్టి పాత్రలనగానే కుండలు తప్ప మరేం గుర్తుకు రావు. కానీ మారుతున్న ఆలోచనా ధోరణులకు అనుగుణంగా మట్టితో చేసిన అన్ని రకాల వంట పాత్రలు నగరంలో దొరుకుతున్నాయి. మట్టితో తయారు చేసిన కుక్కర్లు, కడాయిలు, ప్యాన్లు, జగ్గులు, గ్లాసులు, కప్‌లు.. ఇలా వంటింటి సామాన్లన్నీ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ పాత్రల అమ్మకాలు జోరుగా సాగుతుండడం విశేషం. సిటీలో సహజ పద్ధతులంటే ఖర్చుతో కూడిన వ్యవహారమనే ఆలోచన ముందుగా కలుగుతుంది. అయితే వీటి విషయంలో ఇది సరికాదంటున్నారు గత పదేళ్లుగా మట్టి పాత్రల్లో వంట అలవాటైన నయనతార. సిటీతో పాటు వికారాబాద్, కరీంనగర్, పెనుకొండ.. ఇలా తాను ఏ ఊరెళ్లినా అక్కడ తయారైన మట్టి పాత్రలు సేకరించడం తన హాబీ అంటున్నారామె.. ఇవేవీ ఖరీదైనవి కాదని చెబుతున్నారు. అలాగే వీటిలో చేసే వంట అందించే లాభాలతో పోలిస్తే.. ఆ ఖర్చు అసలు లెక్కలోకి రాదంటున్నారు. ఎన్నో లాభాలు.. మట్టి పాత్రలతో కాలుష్యం ఉత్పన్నం కాదు. మెటల్‌తో పోలిస్తే వీటిలో ఆహారం మెల్లిగా, సమంగా ఉడుకుతుంది. మట్టికి సహజంగా హీలింగ్ ఎనర్జీ ఉంటుంది. మన మూడ్‌ని దానంతట అదే మార్చే గుణం మట్టికి ఉందని పరిశోధనల్లో తేలింది. మనం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు మట్టికి దగ్గరగా చేసే ఏ పనైనా మూడ్‌ని ఇట్టే మార్చేయటం గమనించొచ్చు. అంతెందుకు ఇప్పుడు ప్రకృతి వైద్య విధానాల్లోనూ మట్టి వినియోగం ప్రాధాన్యత తెలిసిందే. మట్టి పాత్రల్లో వంటే కాదు.. అందులో ఆహారం తినడం, కాఫీ తాగడం కూడా రుచిగా, కొత్తగా ఉంటుంది అంటున్నారు ఈ పాత్రలు అలవాటైన వాళ్లు. ఇప్పుడు మార్కెట్లో నల్ల, టెర్రకోట మట్టి పాత్రలు లభిస్తున్నాయి. వీటిలో క్షార గుణం ఉండటం వల్ల ఆహారానికి కొత్త, ఇంపైన రుచి వస్తుందంటారు ఈ పాత్రల తయారీదారులు. వీటిలో పులుసు, పప్పు, మాంసాహారం ఇలా ఏది వండినా రుచి, వాసన రెట్టింపవుతుంది. పైగా నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లే దు. జాగ్రత్తలు.. వీటి వాడకంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే ఈ పాత్రలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్లు వాడకూడదు. నిమ్మకాయ, చింతపండు, వేడి నీళ్లు, కొబ్బరి పీచులతో క్లీన్ చేయాలి. పాత్రలు వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేసినా, ఆదరాబాదరాగా వాడిన పగిలి పోయే ప్రమాదం ఉంది. కమ్మటి రుచి... నాకు పెళ్లై మెట్టింటికి వచ్చినప్పటి నుంచి మట్టి పాత్రల్లోనే వంట చేస్తున్నాను.విదేశాలకు వెళ్లిన, ప్రయాణాలు చేసినా నాదృష్టి మట్టిపాత్రల సేకరణమీదే ఉంటుంది. ఎందుకంటే ఈ పాత్రల్లో వండుకున్న ఏ పదార్థమైనా కమ్మటి రుచి నిస్తుంది. మట్టి పాత్రల్లో వండిన వంట తిన్న వాళ్లకు వేరే పాత్రల్లో వండితే ఆ పదార్థాలు నచ్చడం చాలా కష్టం. – గంజి లీలావతి, సోమాజిగూడ మట్టి.. ది బెస్ట్ మళ్లీ అందరూ పాత పద్ధతికి మళ్లుతున్నారు. దీనిపై ఆసక్తి పెరగడానికి ఆర్గానిక్ లైఫ్‌సై్టల్ కారణం అనిపిస్తోంది. ఇతర వాటితో పోల్చితే మట్టి పాత్రలే బెస్ట్. మట్టి పాత్రల్లో కూర, పాయసం ఇలా ఏది వండినా అందులోని తేమను పాత్ర పీల్చేసుకోవడంతో కావాల్సిన చిక్కదనం దానంతటదే కుదురుకుంటుంది. ఇందులో వండిన వంటకాలను వేరే పాత్రల్లోకి మార్చాల్సిన అవసరం ఉండదు. మట్టిపాత్రల్లో కాచిన పాలు, తోడేసిన పెరుగు, వండిన బిర్యానీ, చేసిన స్వీట్లు కమ్మగా ఉంటాయి. – దుర్గా ప్రసాద్, చెఫ్ -
విందు మెను ఇలా....
హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపనకు వచ్చే రైతులు, దేశ, విదేశీ ప్రతినిధులు, అతిథులకు చక్కటి ఆంధ్ర వంటకాలను సిద్ధం చేశారు. సాధారణ ప్రజలు, రైతులకు కలిపి దాదాపు లక్షన్నర మందికి వంటలు సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్యాకెట్లో ఆహారం అందజేస్తారు. రైతులు ... సాధారణ ప్రజలకు... చక్ర పొంగలి - 75 గ్రాములు పులిహోర - 150 గ్రాములు, దద్దోజనం - 150 గ్రాములు, తాపేశ్వరం కాజా -1 అరటిపండు - 1, మంచినీళ్ల సీసాలు -2 వీఐపీలకు .... చక్రపొంగలి - 100 గ్రాములు పులిహోర - 150 గ్రాములు గారె - 1 , పూర్ణం బూరె - 1 ఫ్రూటీ - 1, మంచినీళ్ల సీసా -1 వీవీఐపీలకు ... వీరికి శంకుస్థాపన జరిగే ప్రాంతంలోనే టెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో లెమన్ జ్యూస్, గ్రీన్‌సలాడ్, మొలకెత్తిన గింజలు, మొక్కజొన్న సలాడ్ ఉంచుతున్నారు. వీటితోపాటు భోజనంలోకి గోంగూర, కొత్త ఆవకాయ, రసం, వంకాయ పచ్చి పులుసు, కొబ్బరి చట్నీ, పచ్చి జామకాయ చట్నీ, కొబ్బరి శనగకారం, కరివేపాకు కారం, మెంతి మజ్జిగ, నేతి బొబ్బట్లు, జిలేబీ, అప్పడాలు, మూడు నాలుగు రకాల ఐస్ క్రీమ్‌లు, రకరకాల కిళ్లీలు ఉంచుతున్నారు. అంతేగాకుండా వీరికి వేదికపైనే పూర్ణం, డ్రైఫ్రూట్స్ కార్న్ సమోసా, ఫ్రూట్ జ్యూస్ అందజేస్తారు. -
ఆల్ ఇన్ 1 కాయ
తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ... వంకాయ. ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. అలాంటి వంకాయతో సాక్షి పాఠకులు వండిన నాలుగు కమ్మని వంటకాలు... ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో! వెన్న వంకాయ కావలసినవి : లేత వంకాయలు - పావుకిలో, పచ్చిమిర్చి - 6, ఉల్లిపాయలు - 2, వెన్న - అరకప్పు, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - 1 రెమ్మ, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, మినప్పప్పు - 1 చెంచా, శనగపప్పు - 1 చెంచా, ఇంగువ - 2 చెంచాలు, చక్కెర - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా తయారీ : ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, మధ్యలో చీరాలి (గుత్తివంకాయకు చేసుకున్నట్టుగా); తర్వాత వాటిని ఐదు నిమిషాల పాటు నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి; ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, పసుపు, చక్కెర వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి; ఈ పేస్ట్‌ను వంకాయల మధ్యలో కూరాలి; స్టౌమీద బాణలి పెట్టి వెన్న వేయాలి; కరిగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేయాలి; వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలి; మాడిపోకుండా కలుపుతూ సన్నని మంటమీద వేయించాలి; వంకాయలు బాగా మగ్గి మెత్తబడిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి. వంకాయ నువ్వుల పులుసు కావలసినవి : వంకాయలు - పావుకిలో, నువ్వులు - 2 చెంచాలు, ఎండుమిర్చి - 4, ఉల్లిపాయ - 1, చింతపండు - నిమ్మకాయ అంత, బెల్లం - కొద్దిగా, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, తాలింపుకోసం - జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు తయారీ : చింతపండును నీటిలో నానబెట్టి పులుసు తీయాలి; వంకాయలకు నూనె రాసి, మంటమీద కాల్చాలి; అవి చల్లారిన తర్వాత తొక్క ఒలిచేసి, గుజ్జులా చేసుకోవాలి; నువ్వులు, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక తాలింపు దినుసులు వేయాలి; చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి, రంగు మారేవరకూ వేయించాలి; తర్వాత చింతపండు పులుసు వేసి మూతపెట్టాలి; పులుసు తిరగబడుతున్నప్పుడు వంకాయగుజ్జు, ఉప్పు, నువ్వులు-మిర్చి పొడి, బెల్లం వేసి ఉడికించాలి; మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. బైగన్ మంచూరియా కావలసినవి : వంకాయలు - పావుకిలో, బ్రెడ్ - 4 స్లైసెస్, మైదా - 2 చెంచాలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా,కారం - 1 చెంచా, పచ్చికొబ్బరి పొడి - 1 చెంచా, ధనియాల పొడి - 1 చెంచా, టొమాటో సాస్ - 2 చెంచాలు, పసుసు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, నూనె - తగినంత తయారీ : బ్రెడ్ స్లైసెస్ను పొడిలా చేసుకోవాలి; వంకాయలను ఉడికించి, మెత్తని గుజ్జులా చేసుకుని, దీనిలో ఉప్పు, కారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మైదా వేసి కలపాలి; ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి; స్టౌమీద మరో బాణలి పెట్టి, కాస్త నూనె వేయాలి; వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి; చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి; వేగిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపొడి, ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి; తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయ బాల్స్, టొమాటో సాస్, కొత్తిమీర వేయాలి; సన్నని మంటమీద ఐదు నిమిషాల పాటు ఉడికించి దించేయాలి; జీడిపప్పు, కొత్తిమీరతో అలంకరించుకుని వడ్డించాలి. వంకాయ ఉల్లి పచ్చడి కావలసినవి : వంకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 3, పచ్చిమిర్చి - 3, చింతపండు - కొద్దిగా, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు, ఛాయ మినప్పప్పు - 2 చెంచాలు, ఇంగువ - అరచెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ : ముందుగా వంకాయలను కాల్చి, తొక్క తీసి, మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జు 2 కప్పులు ఉండేలా చూసుకోవాలి; ఈ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి; తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి; ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయాలి; చిటపటలాడాక ఇంగువ కూడా వేయాలి; ఆపైన రుబ్బి పెట్టుకున్న రెండు మిశ్రమాలూ వేసి బాగా కలపాలి; రెండు నిమిషాల పాటు సన్నని మంటమీద ఉంచి దించేసుకోవాలి; దీనిలో కాసిన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని, నెయ్యితో పాటు అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. మధుమేహ రోగులకు మంచిది! వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది. అలాగే వంకాయ హైబీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి. ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్లు గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. -
తెలంగాణ వంటకాల ఘుమఘుమలు
హైదరబాద్: వీణులకు ఇంపైన పాటలు.. కనుల విందైన అలంకరణే కాదు.. నోరూరించే పసందైన వంటకాలకు కూడా ఎల్బీ స్టేడియం నెలవైంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల గులాబీల గుభాళింపే కాకుండా.. ఘుమ్మని వచ్చే తెలంగాణ వంటల ఘాటు వాసనలు గుబాళిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన పార్టీ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ప్లీనరీకి హాజరైనవారికి చక్కని వంటకాలు సిద్ధం చేయిస్తోంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకమైన ఆహార పదార్ధాలనే సిద్ధం చేస్తున్నారు. -
రీడర్స్ కిచెన్
ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి.ఈ వారం తెలుగువారికి ఎంతో ఇష్టమైన ‘వంకాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి.