
ఆరెంజ్ హల్వా తయారీకి కావల్సినవి:
ఆరెంజ్ – 3 (జ్యూస్ తీసుకుని, వడ కట్టుకోవాలి)
మొక్కజొన్న పిండి – అర కప్పు
పంచదార – 1 కప్పు (నీళ్లు పోసుకుని లేతగా పాకం పట్టుకోవాలి)
దాల్చినచెక్క పొడి – చిటికెడు
ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్
నట్స్ తరుగు – కొద్దిగా (గార్నిష్‌కి)
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్‌లో మొక్కజొన్న పిండి తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార పాకంలో నిమ్మరసం, దాల్చినచెక్క వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఆరెంజ్ మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని వేసుకుని, నట్స్ తరుగు జల్లుకుని చల్లారనివ్వాలి. దగ్గర పడిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment