How To Make Banana Mysore Pak Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Banana Mysore Pak: అరటిపండుతో నిమిషాల్లో స్వీట్‌ తయారీ.. చేయండిలా

Published Wed, Aug 2 2023 4:43 PM | Last Updated on Wed, Aug 2 2023 5:44 PM

How To Make Banana Mysore Pak Recipe In Telugu - Sakshi

అరటిపండు మైసూర్‌ పాక్‌ తయారికి కావల్సినవి: 
శనగపిండి – కప్పు; నెయ్యి – కప్పు;
ఎర్ర అరటి పండ్లు – రెండు;
చక్కెర – కప్పు.

తయారీ విధానమిలా

  • శనగపిండిని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి.
  • అరటిపండ్లు తొక్కతీసి ప్యూరీలా గ్రైండ్‌ చేయాలి.వేగిన పిండిలో కొద్దిగా నెయ్యి వేసి పేస్టులా కలిపి దించేయాలి.
  • చక్కెరలో కప్పు నీళ్లుపోసి మరిగించాలి.తీగపాకం వచ్చిన తరువాత శనగపిండి పేస్టు, అరటిపండు ప్యూరిని వేసి బాగా కలపాలి.
  • మిశ్రమం చిక్కగా దగ్గరపడినప్పుడు దించేసి, నెయ్యిరాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కట్‌ చేస్తే బనానా పాక్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement