
బనానా మోదక్ తయారికి కావలసినవి:
గోధుమ పిండి – కప్పు; అరటిపండ్లు – రెండు;
బెల్లం – మువు కప్పు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;
అటుకులు – రెండు టేబుల్ స్పూన్లు; సూజీ రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు,
ఉప్పు – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీస్పూను; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.
తయారీ విధానమిలా:
అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి తురుము, అటుకులు, సూజీరవ్వను మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి పేస్టులా గ్రైండ్ చేయాలి ∙ఈ పేస్టుని పెద్దగిన్నెలో వేసి... గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, యాలకుల పొడి అన్ని కలిసిపోయేలా చక్కగా కలపాలి ∙ఇప్పుడు ఈ పిండిని మోదక్‌లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని మరుగుతోన్న నూనెలో వేసి డీప్ ఫ్రైచేయాలి ∙మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు ఫ్రె చేస్తే బనానా మోదక్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment