ఇటాలియన్ పీచ్ కుకీస్ తయారీకి కావల్సినవి:
మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్ స్పూను;
కోషర్ సాల్ట్ – పావు టీస్పూను; బటర్ – అరకప్పు;
పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు;
వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు;
ఎరుపు, పసుపు ఫుడ్ కలర్ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు).
పీనట్ బటర్ క్రీమ్: బటర్ – పావు కప్పు;
వెనీలా ఎసెన్స్ – అర టీస్పూను; కోషర్ సాల్ట్ – చిటికెడు;
పంచదార పొడి – కప్పు; పీచ్ ప్యూరీ – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానమిలా:
►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు హ్యాండ్ మిక్సర్‌తో కలపాలి. తరువాత క్రీమ్‌ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్ వేసి రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్ చేయాలి.
► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్‌లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్ ఫ్రూట్ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్ రెడీ అయిన తరువాత అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్ హీట్స్ వద్ద పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ∙పీచ్ క్రీమ్‌కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్ సాల్ట్ లనుగిన్నెలో వేసి హ్యాండ్ మిక్సర్‌తో కలపాలి.
► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్‌తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి. ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్ బేక్ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్‌క్రీమ్‌ను వేసి శాండ్‌విచ్‌లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్ పీచ్ కుకీస్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment