
గోధుమ బిస్కట్స్ తయారీకి కావలసినవి:
గోధుమ పిండి– 2 కప్పులు పంచదార పొడి – ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు),
ఉప్పు – కొద్దిగా, కుకింగ్ సోడా – చిటికెడు పుచ్చగింజలు – 1 టీ స్పూన్
సోంపు – 1 టీ స్పూన్ నువ్వులు – 2 టీ స్పూన్లు, నెయ్యి,
నీళ్లు – పావు కప్పు చొప్పున నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు, కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్‌లా చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment