
వేసవి కాలం వచ్చిందంటే చిటారు కొమ్మన కొంచెం పచ్చగా, కొంచెం ఎర్రగా మెరుస్తూ ఊరిస్తూ ఉంటుంది. వగరుగా, వగరుగా, నోటికి పుల్లగా, వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా దీన్ని కాస్త దట్టించామంటే అద్భుతమైన టేస్ట్.. ఆహా ఏమి రుచి అంటూ లొట్ట లేసుకుంటూ తినేయాల్సిందే. ఇంతకీ ఏమిటది. అదేనండీ...తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయే చింత చిగురు. అందుకే చింత చిగురు ఉంటే.. ఆరోగ్యంపై చింత అవసరం లేదు అంటారు పెద్దలు. మరి చింతచిగురుతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వేసవి కాలం వచ్చిందంటే.. దీనికి చాలా డిమాండ్ ఎక్కువ. చాలాసార్లు మటన్ ధరతో పోటీ పడుతూ అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా నిలుస్తుంది. చింత చిగురు, రుచి, లభించేపలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. సాధారణంగాచింత చిగురును పప్పుగా, కూరగా , పచ్చడి రూపంలో ఎక్కువగా ఆరగిస్తారు. కానీ చింత చిగురు, రొయ్యలు, చేపల కాంబినేషనే రుచే వేరు. చిగురుతో చేప, రొయ్య, కోడి కూర చింతచిరుగు దట్టిస్తే ఆహార ప్రియులకు పండగే.
పోషకాల గని
చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది.
చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు
- వేసవికాలంలో చింత చిగురు తినడం చెమటకూడా ఎక్కువ పట్టదట. వేసవిలో వేధించే చెమట పొక్కులనుంచి ఉపశమనం లభిస్తుంది.
చింత చిగురులోని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి.
శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి.
చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందిమలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది.
జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది.
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది.
ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తల్లిపాలను మెరుగుపరుస్తుంది.