health benefits Bone structure
-
డ్రైఫ్రూట్స్ ఎపుడు, ఎలా తిన్నా మంచిదే.. కానీ!
మంచి ఆరోగ్యం కోసం ఆహారం అనగానే గుర్తొచ్చే ప్రధాన వాటిల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే డ్రైఫ్రూట్స్ వల్ల మంచి శక్తి లభిస్తుంది. రోజూ కాసిన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే డ్రైఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏది? ఉదయమే తినాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? తర్వాత తీసుకోవాలా? రాత్రి తినడం మంచిదా? ఇలాంటి సందేహాలుంటాయి చాలామందికి. డ్రైఫ్రూట్స్‌ని ఎపుడు,ఎలా తిన్నా మంచిదే. కొంతమంది నానబెట్టుకుని కూడా తింటారు. మన ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ని చేర్చుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాస్తవానికి ఎపుడు తీసుకున్నా మంచిదే. అయితే ఉదయం అల్పాహారంగానీ, మధ్యాహ్నం భోజనం తరువాత గానీ, సాయంత్నం చిరుతిండిగా కానీ తీసు కోవచ్చు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అవసరాన్ని బట్టి మితంగా తీసుకోవాలి అనేది గమనించాలి.ఉదయాన్నే పరగడుపున డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది.బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకుంటే మంచిది. పోషకాలతో పాటు, మంచి గ్లోకూడా వస్తుంది. వర్కవుట్కు ముందు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్‌ను పెంచి, ఫిట్నెస్ లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. డ్రైఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక వ్యాయామం తరువాత కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు వాల్‌నట్స్‌ను మితంగా తీసుకుంటే గుండె సమస్యలను నియంత్రించవచ్చు. మధ్యాహ్న ఆకలిని అరికట్టడానిక , శరీరానికి బూస్ట్ అందించడానికి డ్రై ఫ్రూట్స్ సరైన పరిష్కారం. డైటరీ ఫైబర్ ఉంటే ఎండు ద్రాక్ష అంజిర్, ఖర్జూరం తీసుకొంటే మంచిది. రక్తహీనత రాకుండా కాపాడుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.ఈవినింగ్ సాక్స్లాగా వేయించిన జీడిపప్పు తీసుకోవచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తాయి. నిద్రవేళ స్నాక్స్‌కు అద్భుతమైన ఎంపిక డ్రైఫ్రూట్స్. ఎండిన ఆప్రికాట్లు లేదా చెర్రీస్తో పాటు బాదం లేదా వాల్నట్ లాంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు విశ్రాంతినిస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది. -
ప్రధాని మోదీ మెచ్చిన అడవి పండు!
మోదీ మెచ్చిన అడవి పండు ఏంటీ అనుకుంటున్నారా!. అదేనండి ఉత్తరాఖండ్‌కి చెందిన కఫాల్ ప్రూట్. ఏంటీ పేరే అలా ఉంది అనుకోకండి. ఎందుకంటే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. సాక్షాత్తు ప్రధాని మోదీ సైతం ఈ పండు ప్రయోజనాలు చూసి ఫిదా అయ్యారంటే.. అది ఎంత విలువైనదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్రూట్ ఎలా ఉంటుంది? దానివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా! ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఒకనొక సందర్భంలో ఓ బుట్టడు కఫాల్ పండ్లు పంపడంతో మోదీ తెగ సంబరపడిపోయారు. అంతేగాదు ఉత్తరాఖండ్ సీఎం ధామికి లేఖ రాసి మరీ ఆ పండు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆ లేఖలో మోదీ.. "ఉత్తరాఖండ్ సంస్కృతిలో 'కఫాల్' పాతుకు పోయింది. ఆ ప్రాంత జానపద పాటల్లో కూడా ఆ ప్రస్తావన ఉంది. పెరగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పండు ప్రజలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే విలువైన పండుగా ఉంది" అని పేర్కొన్నారు. ఆ పండు చూడటానికి కూడా ఆకర్ణగా ఉంటుంది పండు ఎలా ఉంటుదంటే.. ఉత్తరాఖండ్‌లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ అడవి పండు లబిస్తుంది. భారతదేశంలోని ఇతర ప్రాంత ప్రజలు వేసవిలో మామిడిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిసతఏ..ఉత్తరాఖండ్ ప్రజలు ఈ కఫాల్ పండ్లను ఆస్వాదిస్తారు. వారు పెద్ద మొత్తంలో వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇవి రెండు రోజుల్లోనే పాడైపోతాయి. ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం సాధ్యపడుదు. వాళ్లు వీటిని ఎండబెట్టి కూరల్లో, లేదా పానీయంగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కఫాల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. విటమిన్ సి, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్ వంటి విటమిన్లకు మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరం అంతటా వాపు, నొప్పిని తగ్గించడంలో ఉపకరించే యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ లక్షనాలు కూడా ఉన్నాయి. కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిన పెంచుతుంది ఎలా తినొచ్చంటే.. జామ్‌లు, జెల్లీలు, చట్నీలు, పచ్చళ్లు వంటి రూపంలో ప్రిజర్వ్ చేసుకుని తొనొచ్చు. ఇది అత్యంత స్వీట్‌గా ఉంటుంది. కాబట్టి దీన్ని సలాడ్‌లో జోడించొచ్చు. అలాగే ఐస్‌క్రీం, పెరుగు వంటి డెజర్ట్‌లో కూడా ఉపయోగించొచ్చు. కూరలుగా కూడా వండుకోవచ్చు. అన్నం తోపాటు తినొచ్చు పండ్లను పంచదార, యాలకులు, ఇతర సుగంధ ద్రవ్యాలతో నీటిలో మరిగించి.. 'కఫల్ పన్నా' అనే ప్రత్యేకమైన పానీయాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పానీయం జీర్ణక్రియకు ప్రయోజనకారిగానే కాకుండా కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది. కఫల్ మొక్క ఆకులను ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాటిలో యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండటంతో.. తామర, సోరియాసిస్ వంటి వివిధ చర్మ వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడమే గాక కడుపులో మంటను తగ్గించడంలో అద్భత ఔషధంగా పనిచేస్తుందని ఉత్తరాఖండ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. (చదవండి: గన్నేరు మొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!) -
ఆడపిల్లల్ని ఆడనివ్వండి!
ఎముకల బలానికి... సర్వేక్షణం ఆటలు ఆడడం వల్ల పతకాల సంగతెలా ఉన్నా, ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, టీనేజ్‌కి ముందు వయసు ఆడపిల్లలు, టీనేజ్ తొలినాళ్ళలో ఉన్న ఆడపిల్లలకు ఆటల వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయట! స్వీడన్‌కు చెందిన ఒక అధ్యయనం ఈ సంగతి బయటపెట్టింది. మామూలు ఆటల మొదలు జిమ్నాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ లాంటి కాస్తంత అధిక శ్రమతో కూడిన ఆటలు ఆడడం వల్ల పెరిగే వయసు ఆడపిల్లలకు ఉపయోగం ఉందని ఆ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ఆడపిల్లల ఎముకలు పటిష్ఠంగా మారతాయి. ఎముకల నిర్మాణం, వాటి బలం మెరుగవుతాయి. స్కూలు పిల్లల మీద అధ్యయనం చేసి, ఈ విషయం కనిపెట్టారు. మామూలు కన్నా ఎక్కువ శారీరక శ్రమ ఉండేలా ఆటలు ఆడడం వల్ల అమ్మాయిల్లో అబ్బాయిల కన్నా ఎక్కువగా ఎముకలు బలపడ్డాయి. సర్వసాధారణంగా వారానికి 60 నిమిషాలు స్కూలులో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులో పాల్గొనేవారితో పోలిస్తే, వారానికి 200 నిమిషాల పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారిలో ఈ తేడా చాలా స్పష్టంగా కనపడింది. కాబట్టి, ఎముకలు పెరిగే టీనేజ్ తొలినాళ్ళలో ఆడపిల్లలు గనక స్కూల్లో ఎక్కువ సేపు ఆటల క్లాసుల్లో పాల్గొంటే, ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ముఖ్యంగా, రేపు పెద్దయ్యాక వాళ్ళ ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం తగ్గుతుందని స్వీడన్‌లోని లుంద్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వాళ్ళు ఈ అధ్యయన ఫలితాల్ని ‘ఇంటర్నేషనల్ ఆస్టియో పోరోసిస్ ఫౌండేషన్’ వారి పత్రికలో ప్రచురించారు. అందుకే, మన ఆడపిల్లల్ని ఆడనిద్దాం. మరో సాక్షీ మలిక్లు... పి.వి. సింధులు కావచ్చు. ఒలింపిక్స్‌లో పతకాలు తేవచ్చు. అంత వరకు వెళ్ళకపోయినా, కనీసం జీవితాంతం మన పిల్లలు ఎముక పుష్టితో ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడుపుతారు.