మోదీ మెచ్చిన అడవి పండు ఏంటీ అనుకుంటున్నారా!. అదేనండి ఉత్తరాఖండ్‌కి చెందిన కఫాల్ ప్రూట్. ఏంటీ పేరే అలా ఉంది అనుకోకండి. ఎందుకంటే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. సాక్షాత్తు ప్రధాని మోదీ సైతం ఈ పండు ప్రయోజనాలు చూసి ఫిదా అయ్యారంటే.. అది ఎంత విలువైనదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్రూట్ ఎలా ఉంటుంది? దానివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఒకనొక సందర్భంలో ఓ బుట్టడు కఫాల్ పండ్లు పంపడంతో మోదీ తెగ సంబరపడిపోయారు. అంతేగాదు ఉత్తరాఖండ్ సీఎం ధామికి లేఖ రాసి మరీ ఆ పండు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆ లేఖలో మోదీ.. "ఉత్తరాఖండ్ సంస్కృతిలో 'కఫాల్' పాతుకు పోయింది. ఆ ప్రాంత జానపద పాటల్లో కూడా ఆ ప్రస్తావన ఉంది. పెరగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ పండు ప్రజలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే విలువైన పండుగా ఉంది" అని పేర్కొన్నారు. ఆ పండు చూడటానికి కూడా ఆకర్ణగా ఉంటుంది
పండు ఎలా ఉంటుదంటే..
ఉత్తరాఖండ్‌లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ అడవి పండు లబిస్తుంది. భారతదేశంలోని ఇతర ప్రాంత ప్రజలు వేసవిలో మామిడిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిసతఏ..ఉత్తరాఖండ్ ప్రజలు ఈ కఫాల్ పండ్లను ఆస్వాదిస్తారు. వారు పెద్ద మొత్తంలో వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇవి రెండు రోజుల్లోనే పాడైపోతాయి. ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం సాధ్యపడుదు. వాళ్లు వీటిని ఎండబెట్టి కూరల్లో, లేదా పానీయంగా తయారు చేసుకుని ఆస్వాదిస్తుంటారు.
కఫాల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
- విటమిన్ సి, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్ వంటి విటమిన్లకు మూలం.
- ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
- శరీరం అంతటా వాపు, నొప్పిని తగ్గించడంలో ఉపకరించే యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షనాలు కూడా ఉన్నాయి.
- కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- రోగనిరోధక శక్తిన పెంచుతుంది
ఎలా తినొచ్చంటే..
- జామ్‌లు, జెల్లీలు, చట్నీలు, పచ్చళ్లు వంటి రూపంలో ప్రిజర్వ్ చేసుకుని తొనొచ్చు.
- ఇది అత్యంత స్వీట్‌గా ఉంటుంది. కాబట్టి దీన్ని సలాడ్‌లో జోడించొచ్చు. అలాగే ఐస్‌క్రీం, పెరుగు వంటి డెజర్ట్‌లో కూడా ఉపయోగించొచ్చు.
- కూరలుగా కూడా వండుకోవచ్చు. అన్నం తోపాటు తినొచ్చు
- పండ్లను పంచదార, యాలకులు, ఇతర సుగంధ ద్రవ్యాలతో నీటిలో మరిగించి.. 'కఫల్ పన్నా' అనే ప్రత్యేకమైన పానీయాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పానీయం జీర్ణక్రియకు ప్రయోజనకారిగానే కాకుండా కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది.
- కఫల్ మొక్క ఆకులను ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాటిలో యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండటంతో.. తామర, సోరియాసిస్ వంటి వివిధ చర్మ వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడమే గాక కడుపులో మంటను తగ్గించడంలో అద్భత ఔషధంగా పనిచేస్తుందని ఉత్తరాఖండ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment