కజకిస్తాన్‌ ప్రమాదం.. విమానం లోపల ప్రయాణికుడి వీడియో వైరల్‌ | Kazakhstan Plane Crash Tragedy: Passenger Captures Moments Of Horror Before And After, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కజకిస్తాన్‌ ప్రమాదం.. విమానం లోపల ప్రయాణికుడి వీడియో వైరల్‌

Published Thu, Dec 26 2024 7:19 AM | Last Updated on Thu, Dec 26 2024 9:20 AM

Kazakhstan Plane Crash Passenger Captures Moments Before And After

మాస్కో: కజకిస్తాన్‌లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్‌లోని అక్తావ్‌ నగర సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్‌ కాకస్‌ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమం అక్టౌలో కూలిపోయింది.

అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదం నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్‌బైజన్‌ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement